
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేల సిఫారసు అక్కర్లేదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నామని ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతంతో శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దళిత బంధు కోసం ఏర్పాటు చేసే కమిటీల్లో అధికారులే ఉండాలని, టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను నియమించవద్దని, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరగాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు లాంటి అధికారులు నిజాయతీగా పని చేయలేరని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
రేవంత్‌ను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (తెలంగాణ–ఏపీ) గారెత్ విన్ ఒవెన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఒవెన్ పలు అంశాలపై చర్చించారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి
Comments
Please login to add a commentAdd a comment