దర్యాప్తుపై యథాతథస్థితి | MLAs Poaching Case: Telangana High Court Stays Investigation Till Nov 4 | Sakshi
Sakshi News home page

దర్యాప్తుపై యథాతథస్థితి

Published Sun, Oct 30 2022 12:28 AM | Last Updated on Sun, Oct 30 2022 12:28 AM

MLAs Poaching Case: Telangana High Court Stays Investigation Till Nov 4 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో యథాతథస్థితి విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల దర్యా ప్తును నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.  ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా  వేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నమోదైన కేసులో విచా రణను సీబీఐ లేదా సిట్‌తో జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) రామచందర్‌రావు, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జె.ప్రభాకర్‌ హాజరై వాదనలు వినిపించారు. 

26న పంచనామా.. 27న సంతకాలు...
ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘పంచానామా అంతా 26నే సిద్ధం చేసినా... దానిపై అత్యంత కీలకమైన సాకు‡్ష్యల సంతకాలు మాత్రం 27న చేశారు. స్వాధీన ప్రక్రియంతా 26నే పూర్తయినా.. మండల రెవెన్యూ అధికారుల సంతకాలు కూడా 27నే చేశారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశమంతా తమకు ముందుగానే తెలుసని పోలీసులు చెబుతున్నారు. ఆ మేరకు స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసి నిందితు లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడిస్తున్నారు.

ముందస్తు అంతా సిద్ధం చేసుకున్న పోలీ సులు సంతకాలు మాత్రం మరుసటిరోజు ఎందుకు తీసుకున్నారు? ఇది పలు అనుమా­­నాలకు తావిస్తోంది. రాష్ట్ర అధికా­రులు పక్షపాతం, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టకు చేస్తున్నారు. నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటోంది. ప్రజ­లను తప్పుదారి పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రాజకీయ కుట్రలో భాగంగా రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌.. జాతీయ పార్టీ అయిన బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడం కోసం బీజేపీ డబ్బు, కాంట్రాక్టులు ఎరవేసిందని 26న పలు న్యూస్‌ చానళ్లు ప్రచారం చేశాయి. సైబరాబాద్‌ సీపీ కూడా మీడియాకు అక్కడ వివరాలు వెల్లడించారు.

ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు వచ్చారని చెప్పారు. రోహిత్‌రెడ్డి సమాచారం ఇవ్వడం తోనే తాము వచ్చి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిస్వామిలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మొయినాబాద్‌ ఫామ్‌ హౌజ్‌ నుంచి నేరుగా ఎస్కార్ట్‌ వాహనాలతో ప్రగతిభవన్‌కు తరలించారు.

ఇదంతా టీఆర్‌ఎస్‌ నడిపిన రాజకీయ కుట్ర మాత్రమే. అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగుల కిందికి రారని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు సెక్షన్‌ 8 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కట్టుకథ అనడానికి ఇది చాలు. బీజేపీ పరువుతీ­యడానికి, కార్యకర్తలను నిరుత్సాహపరిచి తద్వారా మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని ఈ కుట్రకు పాల్పడింది.

ఆధారాల్లేకుండా బీజేపీ పేరును పదేపదే లాగుతున్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసి మునుగోడు ఎన్నికపై ప్రభావం చూపేలా కుట్ర జరుగుతోంది. పోలీసు అధికారులంతా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు. దీంతో స్వేచ్ఛగా విచారణ చేసే అవకాశం లేదు. అందుకే సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతున్నాం. విచారణ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలన్నదే పిటిషనర్‌ ఉద్దేశం’అని వివరించారు. 

బీజేపీకి పిటిషన్‌ వేసే అర్హతే లేదు..
ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘హోం శాఖ జారీ చేసిన జీవో నంబర్‌ 51 ప్రకారం అసలు ఈ కేసులో బీజేపీకి పిటిషన్‌ వేసే అర్హతే లేదు. బీజేపీ ఇందులో నిందుతుల్లో ఒకరు కాదు.  అవినీతి నిరో ధక చట్టం సెక్షన్‌ 2 ప్రకారం ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారు. చట్టప్రకారం కోరిన దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఓ రాజకీయ పార్టీ విజ్ఞప్తి చేయలేదు’ అని నివేదించా రు.

స్టే ఇచ్చిన అనంతరం పిటిషనర్‌ యథాతథస్థితిని కోరుతూ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయలేదని చెప్పారు. ఈ సమయంలో ప్రభాకర్‌ కల్పించుకుని.. సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కోరడం అంటే.. ప్రస్తుత విచారణను ఆపమని కోరడమే అవుతుందని వెల్లడించారు. ఇదే హైకోర్టులో మరో ధర్మాసనం నిందితులను అరెస్టు చేయమని ఆదేశించిందని ఏఏజీ న్యాయ మూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ దశలో న్యాయమూర్తి విజయసేన్‌రెడ్డి కల్పించుకుని.. క్రైం నంబర్‌ 455/2022లో తాము కలుగజేసుకోవడం లేదన్నారు. దర్యాప్తు ఆపాలని మాత్రమే ఆదేశిస్తున్నామ­న్నారు. ఇది ఏ ఒక్కరికి పక్షపాతంగా ఇస్తుంది కాదని, కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత ఏఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సీఆర్‌ఎల్‌పీ ఆర్‌సీ (క్రిమినల్‌ రివిజన్‌ కేసు) నంబర్‌ 699/2022 ఆర్డర్‌ కాపీని ప్రతివాదులు స్వీకరించిన తర్వాత తాము ఇస్తున్న ఆదేశాల్లో సవరణలు కోరే స్వేచ్ఛ ఇస్తున్నామని చెబుతూ విచారణను నవంబర్‌ 4కు వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement