![Former PCC Chief DSrinivas Critically Ill - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/12/D-Srinivas.jpg.webp?itok=-45eMrUv)
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్/ ఖలీల్‌వాడి: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మ పురి శ్రీనివాస్(డీఎస్) తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయనను కుటుంబసభ్యులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆసుపత్రిలో చేర్చారు.
వైద్య పరీక్షల అనంత రం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని సోమవారం రాత్రి ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment