
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జారిపడ్డారు. దీంతో అతని ఎడమ భుజం వద్ద ఎముక విరిగింది. ఆయన పుట్టిన రోజునాడే ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో పూజ చేసి బయటకు వచ్చే క్రమంలో జారి పడ్డారు. డీఎస్ ఆరోగ్యం బాగానే ఉందని, నాలుగు రోజుల తర్వాత సర్జరీ చేయనున్నట్లు ఈయన తనయుడు ఎంపీ అర్వింద్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. డీఎస్‌తో కలిసిన ఫొటోను షేర్ చేశారు.
చదవండి: (ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’)
Comments
Please login to add a commentAdd a comment