
చంద్రబాబు సహకరించాలి: డీఎస్
మహబూబ్ నగర్: పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న ఏపీ, తెలంగాణ సీఎంలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజాప్రయోజనాలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఈ సందర్భంగా విమర్శించారు.
రైతులకు కరెంట్ ఇవ్వడం, పంటలను కాపాడడం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత కావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. మేనిఫెస్టో పెట్టిన అంశాలన్నీ అమలు కావడం లేదని ఆయన వాపోయారు.