
ముఖ్యమంత్రి రేసులో లేను: డీఎస్
ఐనా.. అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు: డీఎస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అయితే, పార్టీ కార్యకర్తలు.. అభిమానులు మాత్రం తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్న నాయకులకే పదవులు వస్తాయని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైగా గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఐదు జిల్లాలో టీఆర్‌ఎస్ ఉనికి కోల్పోయిందని, అటువంటప్పుడు ఆపార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని డీఎస్ ప్రశ్నించారు.