
డీఎస్‌పై నమ్మకం ఉంది: కేసీఆర్
రాజకీయ, పరిపాలన విషయాల్లో అపార అనుభవమున్న డి.శ్రీనివాస్ తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా ....
హైదరాబాద్: రాజకీయ, పరిపాలన విషయాల్లో అపార అనుభవమున్న డి.శ్రీనివాస్ తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారన్న నమ్మకం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో డీఎస్ సీఎం కేసీఆర్‌ను కలసి తనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్రాష్ట వ్యవహారాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో వ్యవహరించి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఈ సందర్భంగా డీఎస్ పేర్కొన్నారు.