
బీజేపీ తెలంగాణ ఎందుకివ్వలేదు: డీఎస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: ఎన్డీఏ హయంలోనే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఒక్క ప్రాణం కూడా పోయేది కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1200 మంది ప్రాణాత్యాగాలు చేయటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మోడీ అనటం సరికాదన్నారు. ఎన్డీఏ హయంలో మూడు రాష్ట్రాలను విభజించినప్పుడు తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఒక్క ప్రాణం పోయేది కాదన్నారు.