సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్ మున్సిపాలిటీలలోని 141 డివిజన్లు, వార్డులకు మార్చి 30 న ఎన్నికలు జరిగాయి. సోమవా రం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఎవరెవరికి, ఎక్కడెక్కడ ఆధిక్యం వస్తుందో ప్రధాన పార్టీలు ఓ అం చనాకు రాలేకపోతున్నాయి. అయినా, కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు వ్యూహం రూ పొందిస్తున్నాయి. నిజామాబాద్ మేయ ర్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నా మినేషన్ల ఘట్టం ముగియగానే కాపర్తి సుజాతను అభ్యర్థిగా ప్రకటించింది.
పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నగర మే యర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిం చి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు మే యర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఐదుగురు కాంగ్రెస్ మహా మహులు తమ సతీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నారు. ఫలి తాలు వెలువడటమే ఆలస్యం, కౌన్సిల ర్లను క్యాంపులకు తరలించేందుకు సి ద్ధంగా ఉన్నారు. కామారెడ్డి, బోధన్ నుంచి ముగ్గురేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ ఒక్కొక్కరినే చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది.
అందరికీ సవాలే
నిజామాబాద్ నగర మేయర్ పదవి ప్ర ధాన పార్టీలకు సవాల్‌గా మారిం ది. ఇక్కడ 50 డివిజన్లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అప్పటి టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ, వైఎస్‌ఆర్ సీపీ నుంచి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవికి టీఆర్‌ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ సుధాం లక్ష్మి, విశాలినీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెజార్టీపై స్పష్టత లేని టీడీపీ, బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, సోమవారం జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి స్విఫ్ట్ కారు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇక్కడా అంతే
అర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులుండగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేశాయి. చైర్‌పర్సన్ పదవి కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మెరుగైన ఫలితాలు వస్తాయనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు పోటీ పడుతుండటం టీఆర్‌ఎస్‌కు అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్ సతీమణి పుష్పలత, ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా సతీమణి ఏబీ శ్రీదేవి, కంచెట్టి లక్ష్మి, మాజీ వైస్ చైర్‌పర్సన్ పీసీ ఉషారాణి, కాందేశ్ సంగీత మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ విషయానికి వస్తే స్వాతీసింగ్ బబ్లూ ఒక్కరి పేరే వినిపిస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచినవారితోపాటు, ఇతర పార్టీల విజేతలు, స్వతంత్రులను జత చేసుకొని, కాంగ్రెస్ అసంతృప్తివాదులతో కలిసి క్యాంపునకు తరలే ప్రయత్నంలో టీఆర్‌ఎస్ ఉంది. టీడీపీ, బీజేపీ మొత్తం స్థానాలలో పోటీలో కారణంగా చైర్ పర్సన్ పదవిపై ఆ రెండు పార్టీలకు ఆశలు లేనట్టే.
క్యాంపు రాజకీయాలకు సిద్ధం
జనరల్ మహిళకు కేటాయించిన కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా, హోరాహోరీ పోరులో ఏ పార్టీకీ ఆధిక్యం లభిస్తుందన్న స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం పోటాపోటీ క్యాంపు రాజకీయాలకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చైర్‌పర్సన్ పదవికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ వైస్ చైర్‌పర్సన్ కారంగుల శకుంతలారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆర్.శోభాగౌడ్, పిప్పిరి సుష్మ, చాట్ల లక్ష్మి బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్ముల తిరుమల్‌రెడ్డి సతీమణి సుజాత చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు.
ఆశల పల్లకీలో
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇలాకా బోధన్ మున్సిపాలిటీని జనరల్‌కు కేటాయించారు.35 వార్డులలో ప్రధా న పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. మొత్తం 337 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తే ఇక్కడ చైర్మన్ కావాలని ముగ్గురు నేతలు కలలు కంటున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆబిద్‌అలీ, పట్టణాధ్యక్షుడు కేవీ సత్యం, మాజీ కౌన్సి లర్ గుణప్రసాద్ చైర్మన్ కావాలని ఆశపడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి జేఏసీ నాయకుడు శివరాజ్ చైర్మన్‌గిరీపై కన్నేశారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆరేడు స్థా నాలలోనే పోటీకి పరిమితం కావడంతో చైర్మన్ పదవి వైపు చూడటం లేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలను కొనసాగిస్తే, ఆయా పార్టీల నుంచి చైర్మన్ పీఠం ఎక్కాలనుకున్న నేతలు, క్యాంపుల కు కీలకంగా మారాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కౌన్ బనేగా మేయర్!
Published Sun, May 11 2014 1:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement