మేలైన పారిశుధ్య నిర్వహణ
మేలైన పారిశుధ్య నిర్వహణ
Published Sat, Oct 1 2016 11:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ అర్బన్:
వివిధ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను నిజామాబాద్‌లోనూ అమలు చేస్తామని మేయర్ ఆకుల సుజాత తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్‌లలో స్టడీ టూర్‌కు వెళ్లిన కార్పొరేటర్లు అక్కడి పారిశుద్ధ్య కార్యక్రమాలను అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. స్టడీ టూర్ వివరాలను డిప్యూటీ మేయర్ ఫయీమ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సునీత తదితరులతో కలిసి మేయర్ సుజాత్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. న్యూఢిల్లీలోని ఓక్లాలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ బాగుందని, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారని చెప్పారు. పొడి చెత్త నుంచి రోజూ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. విద్యుత్ ప్లాంట్ నుండి వచ్చే బూడిదతో ఇటుకలను తయారు చేస్తున్నారని, మిగతా రా మెటీరియల్‌తో రోడ్లు వేస్తున్నారన్నారు. చండీగఢ్‌లో పార్కులు, నీటి సరఫరా నిర్వహణ బాగుందని, అక్కడి వైద్యశాలలు, స్కూళ్లను మున్సిపాలిటీ వారే నిర్వహిస్తున్నారనిచ ఎప్పారు. అమృత్‌సర్‌లో సానిటేషన్ ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారని, ఆటోమెటిక్ మెషిన్స్‌తో రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను, తడి,పొడిగా వేరు చేయడం, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ ఆదా ప్రక్రియ బాగుందన్నారు.
Advertisement
Advertisement