press
-
పత్రికల హక్కులేమిటో తెలుసా?
ఔషధం చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం తీసుకోక తప్పదు. నిజం కూడా చేదుగా ఉంటుంది. కానీ సమాజ ఆరోగ్యం కోసం భరించక తప్పదు. నిజంలో ఉన్న చేదును విస్మరించి, ఆ నిజం చెప్పడమే తప్పంటే? నిజం చెప్పేవాళ్ల మీద పగబడితే? నిజాలు వినడం చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పాలకులకు, అధికార పీఠాల్లో ఉన్నవాళ్లకు, నిజాలు బయటికి రావొద్దనుకునేవాళ్లకు. కానీ నిజాలు చెప్పడం పత్రికల ముఖ్య కర్తవ్యమనీ, నిజాల మీద మాత్రమే సమాజం పురోగమిస్తుందనీ చాలాసార్లు మరిచిపోతుంటారు. కేసులు వేస్తామని బెదిరిస్తుంటారు. కానీ పత్రికలకు ప్రచురించే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.భారతదేశంలో పత్రికా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం నుండి ఉద్భవించాయి. మే 3 లేదా ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’... పత్రికల స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు గుర్తు చేస్తుంది.సాంకేతిక విప్లవపు పురోగతి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్య మాల ద్వారా లక్షలాది మందికి సమాచార వ్యాప్తిని సులభతరంచేసింది. ఇది ఒక వ్యక్తి పరువునష్టం ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం అది నేరం.ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం; టెక్స్›్ట, ఇమేజ్, కార్టూన్లు, క్యారికేచర్లు లేదా దిష్టిబొమ్మల ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. సాధారణంగా వ్యక్తులను విమర్శించినందుకు వార్తాపత్రికలు, పత్రికా సభ్యు లపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. విమర్శ సదుద్దేశంతో చేసినా, తీవ్రమైన ప్రజాప్రయోజనాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛపత్రికలు, మీడియాకు ఒకే హక్కులు ఉన్నాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి మరియు ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది. ఈ స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, హుందాతనం, నైతికత, లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి సహేతుకమైన ఆంక్షలను కలిగి ఉన్న ఆర్టికల్ 19(2) కింద రాజ్యాంగం ప్రకారం ఈ హక్కుపై విధించగల పరిమితులు మాత్రమే ఉన్నాయి.‘రోమేశ్ థాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం’ (1950) సహా అనేక కేసుల్లోని తీర్పులు ప్రచురణ స్వేచ్ఛ ఎంత అవసరమో, చలామణి స్వేచ్ఛ కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డాయి. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో వార్తాపత్రికలు, వాటి పేజీలు, వాటి సర్క్యులేషన్ నిర్ణయాధికారాన్ని వాటికే వదిలేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే సూత్రాన్ని ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1962) కేసులోనూ సమర్థించింది. రాజ్యాంగం ప్రసాదించిన వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించే చట్టాలను రాష్ట్రాలు చేయలేవని పేర్కొంది. పత్రికల చలామణి హక్కులో చలామణి పరిమాణాన్ని నిర్ణయించే స్వేచ్ఛ కూడా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో రాష్ట్ర భద్రత, ప్రజాభద్రత తదితర అంశాల్లో ఇచ్చిన సహేతుకమైన ఆంక్షలకు విరుద్ధంగా ఉంటేనే ఈ హక్కును పరిమితం చేయవచ్చు.అసమ్మతి హక్కురాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)... వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుతో పాటు ప్రజాదరణ లేని లేదా అసాధారణ అభిప్రాయాలను కలిగి ఉండే హక్కును కూడా కవర్ చేస్తుంది. ఇటువంటి విమర్శలను తగ్గించడానికి సాధారణంగా ఉప యోగించే చట్టాన్ని భారత శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 124–ఎ ప్రకారం రాజద్రోహ చట్టం అంటారు. సాధారణంగా పత్రికలపై రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించి ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినప్పటికీ, ప్రభుత్వ చర్యలపై లేదా దానిసంస్థలపై బలమైన పదజాలంతో వ్యాఖ్యానించడం ప్రభుత్వ నమ్మక ద్రోహంతో సమానం కాదని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ఒక వ్యక్తి వాడిన పదాలు ప్రభుత్వం పట్ల శత్రుత్వానికి, నమ్మకద్రోహానికి, ప్రజా అశాంతికి లేదా హింసకు ఉపయోగించడానికి దారితీయ నంత కాలం, అది రాజద్రోహ చర్య కాదు.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో సమాచారాన్ని వ్యక్తీకరించే, ప్రచురించే, ప్రచారం చేసే హక్కు మాత్రమే కాదు, సమా చారాన్ని స్వీకరించే హక్కు కూడా ఉంటుంది. సమాచార హక్కు చట్టం, 2005 ద్వారా పత్రికలతో సహా భారతీయ పౌరులకు ప్రజా సంస్థల నుండి సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. పత్రికలతో సహా ఏ పౌరుడైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ బడ్జెట్ల వివరాలు, అమలు స్థితి, ఏదైనా ప్రభుత్వ సంస్థకు చేసిన ఫిర్యాదు / దరఖాస్తు స్థితి వంటి సమాచారాన్ని పొందవచ్చు. ఇటువంటి దర ఖాస్తును సాధారణంగా ఆర్టీఐ లేదా ఆర్టీఐ దరఖాస్తుగా సూచిస్తారు. ఎన్నికల అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే ఓటర్ల హక్కు, క్రికెట్ చూసే క్రీడాభిమానుల హక్కు, ప్రాణాలను కాపాడే మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందే హక్కు తదితర అంశాలపై సుప్రీంకోర్టు వివిధ కేసుల ద్వారా చర్చించింది.ఇంటర్వ్యూలు నిర్వహించే హక్కు పత్రికల పరిమిత హక్కు. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి నుండి ఇష్టపూర్వక సమ్మతి ఉంటేనే దీనిని ఉపయోగించవచ్చు. దోషులను లేదా విచారణ ఖైదీలను ఇంటర్వ్యూ చేసే మీడియా హక్కును పరిశీలించిన అనేక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో, పత్రికలకు సంపూర్ణమైన లేదా అపరిమితమైన సమాచార హక్కు లేదనీ, ఖైదీలు సమ్మతి తెలిపితేనే ఇంటర్వ్యూ నిర్వహించవచ్చనీ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘స్టేట్ వర్సెస్ చారులతా జోషి’ (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు, ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.కోర్టు ప్రొసీడింగ్స్ రిపోర్ట్ చేసే హక్కుపాత్రికేయులు కోర్టులో విచారణకు హాజరయ్యే హక్కును కలిగి ఉంటారు. న్యాయస్థానంలో చూసిన, విన్న ప్రొసీడింగ్స్‌ను ప్రచురించే హక్కును కలిగి ఉంటారు. అయితే న్యాయప్రయోజనాల దృష్ట్యా విచారణల ప్రచారాన్ని పరిమితం చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సుప్రీంకోర్టు ‘నరేష్ శ్రీధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ (1967) కేసులో దీనిని మరింత స్పష్టం చేసింది. ‘సహారా రియల్ ఎస్టేట్ వర్సెస్ సెబీ’ (2012) కేసులో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా పత్రికలు ప్రచురించే కథనాలను పరిమిత కాలానికి వాయిదా వేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని పేర్కొంది. ప్రచురణలో దురు ద్దేశం లేనంత కాలం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల శాసన కార్య కలాపాలను నివేదించే హక్కు కూడా పత్రికలకు ఉంది. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రచురణ పరిరక్షణ) చట్టం 1977లోనూ ఈ హక్కుంది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో ప్రకటనలు చేసే హక్కు లేదా వాణిజ్య వాక్ హక్కు కూడా ఉన్నాయి. ‘టాటా ప్రెస్ లిమిటెడ్ వర్సెస్ ఎంటీఎన్ఎల్’ (1995) కేసు విషయంలో ఈ హక్కును సమర్థించారు. ‘హిందుస్థాన్ టైమ్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’(2003) కేసులో ఆదాయాన్ని సృష్టించడంలో ప్రకటనలు పోషించే ముఖ్యమైన పాత్ర, అవి చలామణిపై ప్రత్యక్ష ప్రభావాన్ని ఎలా చూపుతాయో సుప్రీంకోర్టు చర్చించింది. తద్వారా వార్తాపత్రిక లలో ప్రకటనల హక్కును పునరుద్ఘాటించింది. ప్రకటనలను కుదించడం భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేననీ, ఇది వార్తాపత్రి కల సర్క్యులేషన్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందనీ ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో (1962) అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- పి. విజయబాబు -
విదేశీ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఫైర్
విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం లేని పాశ్చాత్య మీడియా విమర్శలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పలు అంశాలుపై మాట్లాడారు. ‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్‌లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్ శాతం కంటే భారత్‌లో ఓటింగ్ శాతం ఎక్కువ...మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్‌లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్ అన్నారు. -
గీతా ప్రెస్‌కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్‌లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్‌లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది. 25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్ఎం పేపర్‌ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు. అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. 1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి. స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగం!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవనాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గీతా ప్రెస్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సమయంలో ఆమె లీలా చిత్ర మందిర్ ఫోటో గ్యాలరీని చూసి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తాతయ్య ఇంట్లో భక్త సూరదాస్తో పాటు బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాగే అక్కడి గ్యాలరీలోని పెయింటింగ్‌లను చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో తన దగ్గర గీతా ప్రెస్‌కు చెందిన ఒక పుస్తకం ఉండేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె ఆరు అంగుళాల వ్యాసం కలిగిన చేతితో రాసిన గీతను లెన్స్ సహాయంతో చదివాక, ఇది ప్రత్యేకమైన కళాఖండమని పేర్కొన్నారు. ఆమె తమిళం, మలయాళంలో ముద్రితమైన శివపురాణం పుస్తకాన్ని కూడా చూశారు. గీతా ప్రెస్ చూశాక తన చిరకాల వాంఛ నెరవేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
‘రామచరిత మాసన’ విక్రయాల జోరు!
ఈనెల 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగిపోయింది. ఈ ప్రభావంతో దేశంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు, ఆడియో, వీడియోలకు మునుపెన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. 50 ఏళ్లలో తొలిసారిగా ‘రామచరిత్‌మానస’కు అమితమైన ఆదరణ లభించిందని ‘రామచరిత్‌మానస’విక్రేతలు చెబుతున్నారు. VIDEO | For the first time in 50 years, Gita Press in UP's Gorakhpur is facing shortage of Ramcharitmanas in its stock amid rise in demand ahead of the Ram Mandir Pran Pratishtha ceremony in Ayodhya on January 22. pic.twitter.com/twZYGgU05c — Press Trust of India (@PTI_News) January 12, 2024 ‘రామచరితమానస’ పుస్తకం విషయానికొస్తే దీనిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ విరివిగా ముద్రిస్తోంది. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా గీతా ప్రెస్‌లో ‘రామచరితమానస’ స్టాక్ తగినంతగా లేని పరిస్థితి ఏర్పడింది. రామచరితమానసకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, గీతా ప్రెస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. VIDEO | "Ever since the date of Ram Lalla's Pran Pratishtha has been announced, the demand for Ramcharitmanas, along with Sundar Kand and Hanuman Chalisa, has increased. In the previous years, we were publishing around 75,000 copies of Ramcharitmanas every month. This year, we… pic.twitter.com/w0jniGjoWl — Press Trust of India (@PTI_News) January 12, 2024 పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు గీతాప్రెస్‌లో ‘రామచరితమానస’ పుస్తకం ప్రింటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. గీతా ప్రెస్ మేనేజర్ లాలమణి త్రిపాఠి మాట్లాడుతూ అయోధ్యలో నూతన రామమందిరం ప్రారంభానికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సుందరాకాండ’, ‘హనుమాన్ చాలీసా’ ‘రామచరితమానస’కు డిమాండ్ మరింతగా పెరిగిందని అన్నారు. గతంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 75 వేల కాపీలు ముద్రితమయ్యేవని, ఇప్పుడు దానిని లక్షకు పెంచినప్పటికీ, స్టాక్ ఉండటం లేదన్నారు. ఇది కూడా చదవండి: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
Winter Parliament Session 2023: పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
న్యూఢిల్లీ: ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023ను ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్(పీఆర్బీ) చట్టం–1867 ప్రకారం పత్రికలను రిజిస్టర్ చేసుకోవాలంటే ఎనిమిదంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునే వారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్ట్ 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. -
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత!
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బైజ్నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా బైజ్నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? गीता प्रेस, गोरखपुर के ट्रस्टी श्री बैजनाथ अग्रवाल जी का निधन अत्यंत दुःखद है। विगत 40 वर्षों से गीता प्रेस के ट्रस्टी के रूप में बैजनाथ जी का जीवन सामाजिक जागरूकता और मानव कल्याण के लिए समर्पित रहा है। उनके निधन से समाज को अपूरणीय क्षति हुई है। प्रभु श्री राम दिवंगत पुण्यात्मा… — Yogi Adityanath (@myogiadityanath) October 28, 2023 -
'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గీతా ప్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశలు కురిపించారు. గీతా ప్రెస్ దేవాలయం కంటే తక్కువేం కాదని అన్నారు. ఈ మేరకు గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాల చర్యలను ఎండగట్టారు. గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. 'కొన్నిసార్లు సన్యాసులు దారి చూపిస్తారు. మరికొన్ని సార్లు గీతా ప్రెస్ లాంటి సంస్థలు మార్గం చూపిస్తాయి' అని మోదీ చెప్పారు. గీతా ప్రెస్ మానవత్వానికి దారి చూపిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీకి గీతా ప్రెస్‌తో మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. గాంధీ నెలవారీ మ్యాగజీన్ 'కల్యాన్'ను ఈ సంస్థకే కేటాయించారని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఆ మ్యాగజీన్‌ను ప్రకటనలు లేకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. గీతా ప్రెస్‌కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని కేటాయిస్తూ కొన్నిరోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పార్టీ భావాజాలానికి చెందిన సంస్థకే కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గీతా ప్రెస్ ఆ బహుమతికి చెందిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను నిరాకరించింది. అనంతరం ప్రధాని మోదీ గీతా ప్రెస్పై మాట్లాడింది ఇదే తొలిసారి. గీతా ప్రెస్ ఎంతో మంచి పుస్తకాలను ముద్రిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉంటాడని అన్నారు. గీతా ప్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశ జ్ఞాన సంపదను పెంచుతోందని కొనియాడారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' విధానాన్ని గీతా ప్రెస్ ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇదీ చదవండి: 'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు.. -
గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి–2021ను ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలియజేసింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. ఈ బహుమతిని 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్‌కు ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్‌ను 1923లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. గీతా ప్రెస్‌కు అవార్డు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. -
మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత శనివారం తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ రాహుల్ విలేకరిపై నిగ్రహం కోల్పోయారు. ఈ మేరకు రాహుల్ మీడియా ప్రసంగంలో..ఒక జర్నలిస్ట్ రాహుల్ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో చేసిన దొంగలందరికీ మోదీ పేరే ఎందుకు ఉంటుంది అనే వ్యాఖ్య గురించి నేరుగా ప్రశ్నించాడు సదరు విలేకరి. దీంతో రాహుల్ ఒక్కసారిగా ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. మీరు నన్ను ఈ ప్రశ్నను పరోక్షంగా అడగాలి ఇలా కాదంటూ మండిపడ్డారు. "మీరు బీజేపీ కోసం పనిచేయాలనుకుంటే మీ ఛాతీపై బ్యాడ్జి పెట్టుకుంటే బావుండేది. అప్పుడూ నేను అందుకు తగ్గట్టుగా సమాధానం ఇస్తాను. నేను భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య వాణిని కాపాడుతూనే ఉంటానని, ఎవ్వరికీ భయపడేది లేదు. గౌతమ్ అదానీ షెల్ కంపెనీలకు రూ. 20 వేల కోట్లు ఎవరకీ వెళ్లాయి అనే సాధరణ ప్రశ్న కారణంగా ప్రధాని మోదీ తనను తాను రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న దాడులు ఇవి. అయినా నేను ఈ అనర్హతలు, జైలు శిక్ష వంటి వాటికి భయపడను. నేను మోదీ కళ్లల్లో భయం చూశాను. అదానీపై నా తదుపరి ప్రసంగానిక ప్రధాని భయపడుతున్నారు." అందువల్లే ఈ అనర్హత వేటు అని రాహుల్ తేల్చి చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా బీజేపీ మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో వెనుకబడిన ఓబీసీ కమ్యూనిటీలను అవమానించారంటూ పునురుద్ఘాటించారు. అయినా ఆయన ఒక్కరే కాదు బీజేపీకి చెందిన ఆరుగురి తోసహా దేశవ్యాప్తంగా 32 మంది నేతలపై అనర్హత వేటు పడిందని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ అన్నారు. అంతేగాదు కర్ణాటక ఎన్నికల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రాహుల్‌ని ఏదో బలిపశువుగా చేసినట్లుగా యత్నిస్తోందంటూ విమర్శించారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన శరద్ పవార్) -
సిబ్బంది కోసం ఎడిటర్ షాకింగ్ నిర్ణయం.. మామూలు త్యాగం కాదంటు ప్రశంసలు!
త్యాగం అనే పేరు సినిమాల్లో ఎక్కువగా ఉంటాం. కానీ అదే త్యాగాన్ని నిజ జీవితంలో ప్రజలు పాటించడం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన సిబ్బంది కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు ఆ స్టోరీ ఏంటంటే! అమెరికా మిచిగాన్‌లోని డెట్రాయిట్ కేంద్రంగా పనిచేసే అతిపెద్ద వార్తా పత్రిక డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్. ఆ సంస్థ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ పీటర్ భాటియా తీసుకున్న గొప్ప నిర్ణయం ప్రస్తుతం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. షాకింగ్ డెసిషన్ వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలానే పీటర్ డిసెంబర్ 23న తమ సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది సాధారణమైన విషయమే కానీ తన రిజైన్ వెనుక ఉన్న నిజం తెలిస్తే ఎవరైనా శభాష్ పీటర్ అని అనాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా పలు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి లేఆఫ్స్ దారిలో వెళుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ అదే దారిని అనుసరించాలని నిర్ణయించుకుంది. ఇది ఆ సంస్థ ఎడిటర్ పీటర్‌కు ఏ మ్రాతం ఇష్టం లేదు. ఉద్యోగుల తొలగింపులు ఇష్టపడని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. స్వయంగా ఆయనే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన రాజీనామకు కారణం ఇదే సంస్థ బడ్జెట్లో తన జీతం ఆదా చేయడం వల్ల కొంతమంది సిబ్బంది వారి ఉద్యోగాలు కోల్పోకుండా ఆపే అవకాశం ఉందని పీటర్ భావించారు. అంతేకాకుండా తనకు ఇతర ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. బలవంతపు తొలగింపుల వల్ల న్యూస్‌రూమ్ ప్రభావితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా డిసెంబర్ 12న తొలగింపు నిర్ణయం సిబ్బందికి తెలిపారు.ఈ లేఆఫ్‌ల కారణంగా ఐదుగురు రిపోర్టర్లు, నలుగురు అసిస్టెంట్ ఎడిటర్లు, ముగ్గురు వెబ్సైట్ ప్రొడ్యూసర్లు, ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఎడిటోరియల్ అసిస్టెంట్ వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అందుకే పీటర్ తన రాజీనామాకు సిద్ధమయ్యారు. అందులోని ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. సృజనాత్మక నాయకుడిగా ఉన్న భాటియా కారణంగా ఫ్రీ ప్రెస్ ప్రస్తుతం గానెట్ నెట్‌వర్క్‌లోని బలమైన ప్రచురణలలో ఒకటిగా పేరు సంపాదించిందని చెప్పాడు. భాటియా భర్తీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అతను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నుంచి తన భర్తీని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు భాటియా స్వయంగా ప్రకటించారు. -
తప్పుడు రాతలు రాసే వారికే ఆ సమస్యలు వస్తాయి: కొమ్మినేని శ్రీనివాసరావు
-
బాంబే సమాచార్.. రెండు శతాబ్దాల పయనం
హైదరాబాద్: మన దేశంలో మొట్టమొదట ప్రారంభమైన పత్రికల్లో ఒకటైన ‘బాంబే సమాచార్’ త్వరలో 200వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 1822లో గుజ రాతీ వారపత్రికగా మొద లైన బాంబే సమాచార్.. 1832లోనే బైవీక్లీ (వారానికి రెండు రోజులు)గా, 1855 నాటికి దినపత్రికగా మారింది. దేశంలో ఆంగ్లేతర పత్రికల్లో బెంగాల్‌కు చెందిన సమాచార్ దర్పణ్ మొదటిది కాగా.. రెండోది ‘బాంబే సమాచార్’ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పత్రికలన్నింటిలో సుదీర్ఘ కాలంగా కొనసాగు తున్నది తమ పత్రికేనని, ప్రపంచవ్యాప్తంగా చూసినా తమ పత్రిక నాలుగో స్థానంలో ఉందని ముంబై సమాచార్ డైరెక్టర్ హొర్ముస్జి ఎన్ కామా తెలిపారు. పాఠకుడు కేంద్రంగా సమాచారం అందించడమే తమ పత్రిక విజయ రహస్యమని చెప్పారు. ఈ సందర్భంగా బాంబే సమాచార్ డైరెక్టర్ హొర్ముస్జి ఎన్ కామాకు ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడు ఎల్.ఆదిమూలం అభినందనలు తెలియ జేశారు. 1933లో వివిధ కారణాలతో మూత పడే దశలో ఉన్న ఈ పత్రికను కామాజీల కుటుంబం టేకోవర్ చేసి నడిపించిందని గుర్తు చేశారు. పత్రికల మనుగడ కష్టతరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబం ‘బాంబే సమాచార్’ను విజయవంతంగా, ఒక మోడల్లా నిలిపి నడిపిస్తోందని ప్రశంసించారు. ఈ పత్రిక ఇంత సుదీర్ఘకాలం విజయవంతంగా నడవడం ఆ పత్రికకే కాకుండా మొత్తం పత్రికా రంగానికే గర్వకారణమన్నారు. -
ఉమెన్ అమెరికా
వైట్ హౌస్‌కు అత్యంత కీలకమైన బడ్జెట్, ప్రెస్ టీమ్‌లను పూర్తిగా మహిళా సారథ్యం కిందికే తెచ్చారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. పేరుకు బైడనే అధ్యక్షుడు అయినప్పటికీ అమెరికాను మున్ముందు నడిపించబోతున్నది మాత్రం మహిళలేనని ఆయన నియామక నిర్ణయాలను బట్టి అర్థం అవుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కి పోలైన ఓట్లలో సగానికి పైగా మహిళలవే! వందేళ్ల క్రితం ఓటు హక్కును సాధించుకున్న అమెరికన్ మహిళ ఆ హక్కును ఒక అస్త్రంలా ఉపయోగించి తనను గెలిపించిందన్న సంగతిని బైడెన్ సరిగానే గుర్తు పెట్టుకున్నారు. అందుకు నిదర్శనమే వైట్ హౌస్‌లోని మూడు ముఖ్య ఆర్థిక బాధ్యతలను మహిళలకే ఆయన అప్పగించడం. ఆర్థికమే కాదు, వైట్ హౌస్‌కు అత్యంత కీలకమైన ప్రెస్ టీమ్‌ను కూడా మొత్తం మహిళలతోనే భర్తీ చేశారు జో బైడెన్. ఈ టీమ్‌తోనే ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేట్ బెడింగ్‌ఫీల్డ్ (ప్రెస్ టీమ్ డైరెక్టర్), జెన్ ప్సాకి (ప్రెస్ సెక్రెటరీ), సైమన్ శాండర్స్ (ఉపాధ్యక్షురాలి ముఖ్య ప్రతినిధి), ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రథమ మహిళ(కమ్యూనికేషన్ డైరెక్టర్ ) నీరా టాండన్ బడ్జెట్ డైరెక్టర్. సెసీలియా రౌజ్ ఎకనమిక్ అడ్వయిజర్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు. జానెట్ ఎలెన్ ట్రెజరీ సెక్రెటరీ. ఈ మూడు విభాగాలూ వైట్ హౌస్‌లో ఉన్న అమెరికా స్ట్రాంగ్ రూమ్‌లోని డబ్బు బీరువాల్లాంటివి. వాటి తాళం చెవులను నీరా, రౌజ్, జానెట్ల చేతికిచ్చారు బైడెన్. ఇక శ్వేత సౌధంలోని ఏడుగురు సభ్యుల ప్రెస్ టీమ్‌లో కూడా అందరూ మహిళలే. ఒక్కొక్కరి కెరీర్ కొండంత. అనుభవం ఆకాశమంత. కేట్ బెడింగ్‌ఫీల్డ్ ప్రెస్ టీమ్ డైరెక్టర్. జెన్ ప్సాకి ప్రెస్ సెక్రెటరీ. సైమన్ శాండర్స్ ఉపాధ్యక్షురాలి ముఖ్య ప్రతినిధి. యాష్లీ ఎటిన్ హ్యారిస్ కమ్యూనికేషన్ డైరెక్టర్. కెరీన్ జీన్ పియరీ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ. ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ కమ్యూనికేషన్ డైరెక్టర్. పిలి తోబర్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్. ఈ ఏడుగురూ బైడెన్ గెలుపులో కీలకపాత్ర వహించిన ప్రచార వ్యూహకర్తలు. కెరీన్ జీన్ పియరీ (ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ), పిలి తోబర్ (డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్), యాష్లీ ఎటిన్(హ్యారిస్ కమ్యూనికేషన్ డైరెక్టర్) కేవలం మహిళ గానే కాక వ్యక్తిగతంగా కూడా ఎవరి విలక్షణతలు వాళ్లకు ఉన్నాయి. బడ్జెట్ డైరెక్టర్ నీరా టాండన్ ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్’కు ఇప్పటి వరకు నామినేట్ అయిన మూడవ మహిళ మాత్రమే. (సెనెట్ ఆమోదం పొందవలసి ఉంది). తొలి ఇండో–అమెరికన్. ఎకనమిక్ అడ్వయిజర్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు సెసీలియా రౌజ్ ఆఫ్రికన్–అమెరికన్. ట్రెజరీ సెక్రెటరీ జానెట్ ఎలెన్ ఆ పదవిలోకి వచ్చిన తొలి మహిళ. ప్రెస్ టీమ్‌లోని కెరీన్ జీన్ పియరీ, పిలి తోమర్ లెస్బియన్ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు. కెరీన్ హైతీ, తోబర్ గటెమలా సంతతి వారు. ఇంతటి ప్రోగ్రెసివ్ టీమ్ అమెరికా చరిత్రలోనే ప్రథమం అని వాల్‌స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. పేరుకు బైడనే అధ్యక్షుడు అయినప్పటికీ అమెరికాను నడిపించబోతున్నది మాత్రం మహిళలే అని అమెరికన్ పత్రికలు కొన్ని రాశాయి. నియామక నిర్ణయం గొప్పదైనప్పుడు ఫలితాలూ గొప్పగానే ఉంటాయి. -
మీడియా తంత్రం–బాబు కుతంత్రం
అసలే చిన్నగా ఉండే గురివింద గింజ ప్రతిపక్ష నేత చంద్రబాబును చూసి మరింత చిన్నబోతోంది. గురివింద నీతి కూడా చంద్రబాబు దుర్నీతి ముందు పనికిరాకుండాపోతోంది. అధికారం కోల్పోగానే ప్రతిపక్ష నేతకు హఠాత్తుగా మీడియా స్వేచ్ఛ గుర్తుకు వచ్చింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ గగ్గోలు మొదలుపెట్టారు. ఆయన రాద్ధాంతం చూస్తేంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీడియా నియంత్రణకు కొత్తగా చట్టం ఏమైనా చేసిందా అనే సందేహం కలుగుతుంది. తీరా చూస్తే కొత్తగా ఎలాంటి చట్టం చేయలేదు... పోనీ చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారో ఓసారి చూస్తే... ఆయన హయాంలో అంతా పత్రికలపై కక్ష సాధింపులు... పాత్రికేయులపై వేధింపులే కనిపిస్తున్నాయి. ఆధారసహితంగా తన ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసిన పత్రికలు, పాత్రికేయుల మీద ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని జారీ చేసిన జీవోలు ఆయన నిజస్వరూపాన్ని నిగ్గు తేలుస్తున్నాయి. మీడియా గొంతు నొక్కుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లేందుకు నానాపాట్లు పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే.. మీడియాపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా ఎలాంటి చట్టమూ రాలేదు. రాజ్యాంగం దేశ ప్రజలు అంద రికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. దానికిందే స్వేచ్ఛగా, నిర్భీతిగా నిజాలు చెప్పేందుకు పత్రి కలు, టీవీ చానళ్లకు రాజ్యాంగపరమైన హక్కు కల్పించింది. కానీ అదే సమయంలో అసత్య వార్తలు, నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఆ మీడియా సంస్థలపై చట్టప రమైన చర్యలు తీసుకునే అవకాశం, అధికారం ప్రభుత్వాలకైనా, ప్రైవేటు వ్యక్తులకైనా, సంస్థల కైనా ఉంటుంది. లేనట్టయితే ఎవరైనా ఇష్టాను సారం అసత్య వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ప్రజల్లో భయాం దోళనలు సృష్టించడం రివాజుగా మారుతుంది. అందుకే ఆ జాగ్రత్త తీసుకున్నారు. ఆ ప్రకారమే తప్పుడు వార్తలు, కథనాల విషయంలో చట్టప రంగా తగిన చర్యలు తీసుకునే అధికారం ప్రభు త్వానికి మొదటి నుంచీ ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కూడా అదే చెబు తోంది. నిరాధార వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినా, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో చంద్ర బాబు ప్రభుత్వంతోసహా అన్ని ప్రభుత్వాలు అను సరించిన విధానమే. అంతేగానీ కొత్తగా ఎలాంటి చట్టం లేదా జీవో తీసుకురాలేదు. అసత్య వార్తలు, కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అంతేగానీ విలేకరుల మీద పోలీసు కేసులు పెడతా మనిగానీ, వేధిస్తామనిగానీ ఎక్కడా చెప్పలేదు. తాము ప్రచురించిన, ప్రసారం చేసిన వార్తలు, కథ నాలు నిజాలేనని న్యాయస్థానంలో ఆధారాలు చూపించి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ పత్రి కలు, చానళ్లపై ఉంటుంది. ఆధారాలు చూపితే న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెబు తుంది. చూపించలేకపోతే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలు ప్రచురించారని, ప్రసారం చేశారని నిర్ధారిస్తుంది. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలే దన్నది సుస్పష్టం. ప్రభుత్వం పూర్తిగా నిబంధన లకు కట్టుబడి, న్యాయసూత్రాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందన్నది ప్రాతికేయ ప్రముఖులు, ప్రజలూ అంగీకరిస్తున్న వాస్తవం. చంద్రబాబూ...! ఎందుకీ గగ్గోలు?! ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భజన మీడియా మాత్రం గగ్గోలు పెట్టి ప్రజలను తప్పు దారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందంటూ అసత్య ఆరోప ణలతో రాద్ధాంతం చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక మీడియా సంస్థలు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులుతీస్తున్నట్లు తప్పుడు గణాం కాలు, గ్రాఫిక్‌లతో తమ పత్రికల్లో పేజీలకు పేజీలు అసత్య కథనాలు వండి వార్చడం... టీవీ చానళ్లలో గంటల తరబడి ప్రసారం చేయడం ఆ మీడియా నైజం. బాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రభు త్వంలో అవినీతి, అరాచకం పెట్రేగిపోతోందని అవాస్తవ కథనాలను రోజూ వండివారుస్తూ పత్రి కలను నింపడం, టీవీ చానళ్లలో రాద్ధాంతం చేయడం కూడా వారికి అలవాటే. గతంలో దివం గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు టీడీపీ అనుకూల మీడియా ఎంతగా విషం కక్కిందో అందరికీ తెలి సిందే. కానీ విజ్ఞులైన ప్రజలు ఆ ప్రభావానికి లోను కాకుండా వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు జైకొట్టి 2009లో రెండోసారి గెలిపించారు. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా మళ్లీ అదే పాట అందుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం నిత్యకృత్యమైంది. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే... పేపర్ లీక్ చేశారంటూ టీడీపీ అను కూల మీడియా అసత్య కథనాన్ని రాసింది. ప్రభుత్వ అధికారుల బదిలీలు సాధారణమేనని తెలిసినా ... ఆర్టీసీ ఎండీ బదిలీపై మరో అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టిం చేందుకు యత్నించింది. ఇక వరదల సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టు లతో అసత్య ప్రచారం చేయడం అందరికీ తెలి సిందే. తిరుమలలో చర్చి కడుతున్నారంటూ టీడీపీ నేతలు మరో అసత్య ప్రచారం తెరపైకి తెచ్చి రాష్ట్రంలో ఉద్రిక్తలు సృష్టించేందుకు కుట్ర పన్నారు. ఇలా టీడీపీ అనుకూల మీడియా బాబు ప్రయో జనాలు నెరవేర్చేందుకు అసత్యాలను ప్రచారం చేస్తోంది. వాటిపై ప్రభుత్వం న్యాయపరంగా వ్యవహరిస్తామంటే బాబు, ఆయన భజన మీడియా గగ్గోలు పెడుతున్నారు. వారికి నిజంగా నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే అంత రాద్ధాంతం అవసరం లేదు. వారు సచ్చీలురైతే ప్రభుత్వ నిర్ణ యాన్ని స్వాగతించేవారు. తమ కథనాలపై ప్రభుత్వం కేసు వేస్తే న్యాయస్థానంలో రుజువులు సమర్పించి నిజాయతీ, నిబద్ధత నిరూపించుకుం టామని ప్రకటించేవారు. కానీ బాబుగానీ, ఆయన అనుకూల మీడియాగానీ ఆ మాటే అనడం లేదెం దుకు అన్నది కీలక ప్రశ్న. అంటే ఆ మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కాబట్టే తమ నిజాయతీని నిరూపించుకునేందుకు సంసిద్ధంగా లేవు. పైగా తాము ఏం రాసినా, ఏం ప్రసారం చేసినా సరే తమను ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదని, కేసులు వేయకూడదని వాదిస్తున్నాయి. అంటే తాము బట్ట కాల్చి మీద వేస్తాం... అంతా మా ఇష్టం అన్నట్లుగా ఉంది వారి తీరు. మరి ఇదేం పత్రికా స్వేచ్ఛో అన్నది వారికే తెలియాలి. పత్రికా స్వేచ్ఛ ముసుగులో అసత్య ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడం, బాబు రాజకీయ ప్రయోజ నాలకు కోసం పని చేయడమే వారి విధానంగా ఉంది. ఈ దుర్నీతిని ప్రభుత్వం సహించాలా...?! ప్రజలు భరించాలా...?! బాబు హయాంలోనే వేధింపులు అధికారం కోల్పోగానే మీడియా స్వేచ్ఛను కాపా డాలి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్ర బాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారన్నది అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం ఇష్టాను సారం చేస్తున్న అవినీతిని ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ పత్రిక, చానళ్లు, సోషల్ మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్‌పై ఏకంగా అయిదు జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం రాద్ధాంతం చేస్తున్న సంఘాలు గానీ, వ్యక్తులుగానీ అప్పుడు నోరు మెదపలేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాబు ఆదేశిం చడం పత్రికా స్వేచ్ఛను ఆయన ఎంతగా హరించా రన్నదానికి నిదర్శనం. అందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో మూడు జీవోలు జారీ అయ్యాయి. అదే విధంగా సాధారణ పరిపా లన(రాజకీయ) కార్యదర్శి పేరుతో మరో రెండు వచ్చాయి. బాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సహాయ, పునరావాస చర్యల్లో యదేచ్ఛగా అవి నీతికి పాల్పడింది. ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధారాలు సేకరించి మరీ కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్లతోసహా గిరిజనుల పరిహారాన్ని ఎలా కొల్లగొట్టారో వెలుగులోకి తీసు కువచ్చింది. ఈ కథనాలపై బాబు సర్కారు కనీసం ఖండన కూడా ఇవ్వలేకపోయింది. కానీ కక్షసాధింపు చర్యలకు మాత్రం పాల్పడింది. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమ నేని భాస్కర్, సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం ఆఫీసుకు పిలిపించి మరీ ‘సాక్షి’పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకు శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ పేరుతో జీవో ఆర్టీ 868 జారీ చేయించారు. అదే విధంగా జగతి పబ్లికేషన్స్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదుకు కాటమనేని భాస్కర్‌కు అను మతించారు. ఈమేరకు అప్పటి సాధారణ పరిపా లన (రాజకీయ ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ పేరుతో జీవో ఆర్టీ 1689 జారీ చేయించారు. అలాగే క్రిమినల్ కేసుల నమోదుకు చెరు కూరి శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి సాధారణ పరిపాలన(రాజకీయ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకారం పేరుతో జీవో ఆర్టీ 2151 జారీ చేయించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై నిఘా పెట్టిన తీరును ఆధారాలతోసహా వెలుగు లోకి తెస్తూ ‘ప్రతిపక్షంపై రియల్ టైం నిఘా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై కూడా అప్పటి ప్రభుత్వం ఖండన ఇవ్వలేదు. కానీ ‘సాక్షి’పై క్రిమినల్ కేసుల నమోదుకు అప్పటి రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఈవోకు అనుమతి చ్చింది. ఈమేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి అనిల్ చంద్ర పుణేఠా పేరుతో జీవో ఆర్టీ 733 జారీ చేయించింది. నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై వేధింపులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పత్రికాల్లో అంతా తనకు అనుకూలంగా రాయాలి... టీవీ చానళ్లలో అంతా తనకు అనుకూలంగానే మాట్లా డాలి అన్న అనధికార శాసనాన్ని అమలు చేశారు. ప్రధానంగా టీవీ చానళ్లు ప్రసారం చేసే చర్చా గోష్టులపై టీడీపీ ప్రభుత్వం అనధికారింగా సెన్సా ర్షిప్ అమలు చేసింది. విలేకరులు నిజాలు చెప్పినా, ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై ఎవరూ మాట్లాడినా సహించేవారు కాదు. ప్రముఖ పాత్రి కేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు దశాబ్దన్నరగా పలు టీవీ చానళ్లలో చర్చా వేదికలు నిర్వహిస్తు న్నారు. ఈ పదేహేనేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... రాష్ట్ర విభజన వంటి సున్నితమైన అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ఏ ప్రభుత్వం లోనూ ఎదురుకాని చేదు అనుభవం బాబు హయాంలో ఆయనకు ఎదురైంది. ఎన్టీవీలో చర్చా వేదికలో కొమ్మినేని శ్రీనివాసరావు వాస్త వాలు మాట్లాడుతుంటే చంద్రబాబు, లోకేశ్ సహిం చలేకపోయారు. తమకు అనుకూలంగా మాట్లా డాలని హుకుం జారీ చేశారు. తాను వాస్తవాలే మాట్లాడతానని ఆయన చెప్పడంతో బాబు సహిం చలేకపోయారు. ఎన్ టీవీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి మరీ కొమ్మినేని శ్రీనివాసరావును ఆ చానల్ నుంచి బయటకువెళ్లిపోయేలా చేశారు. అప్పట్లో దీనిపై ఏ పాత్రికేయ సంఘాలుగానీ మీడియా ప్రముఖులుగానీ కనీసం స్పందించనే లేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మీడియా సమావేశాల్లో ఆయన భజన బృందానికిచెందిన పాత్రికేయులకు తప్ప మరెవరికీ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ప్రభుత్వ నిర్ణయంపై ఎవరైనా ప్రశ్నిస్తే బాబు శివాలెత్తిపోయి వారిపై చిందులు తొక్కి అవమానించిన ఉదంతాలు కోకొల్లలు. ప్రభుత్వం అంటే తన ప్రైవేటు కంపెనీగా ఆయన ప్రవర్తించేవారు. పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో పత్రికలు, టీవీ చానళ్లు ప్రధానభూమిక పోషించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వాసం. చిన్నా, పెద్ద పత్రికలు, అన్ని టీవీ చానళ్లు మనుగడ సాగిం చేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలన్నది ఆయన విధానం. అందుకే పత్రికలకు ఇచ్చే ప్రకటనల టారిఫ్‌ను పెంచుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమా వేశంలో నిర్ణ యించారు. 40ఏళ్ల అనుభజ్జుడినని చెప్పుకునే చంద్రబాబు మీడియాను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప గౌరవించి ఎరుగరు. కానీ జగన్ మోహన్‌రెడ్డి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను ఒకే రీతిలో గౌరవిస్తుండటం అందర్నీ ఆకట్టుకుంటోంది. అది కదా పత్రికా స్వేచ్ఛను గౌరవించడం అంటే అని అంతా ఆయన్ని కొనియాడుతున్నారు. – సాక్షి, అమరావతి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం మీడియా కట్టడికి జగన్ ప్రభుత్వం చట్టమేమీ చేయలేదు... జీవో ఇవ్వలేదు అసత్య కథనాలు వద్దన్నందుకే టీడీపీ అనుకూల మీడియా ఆక్రోశం బాబు ప్రభుత్వంలో మీడియాపై బరితెగించి వేధింపులు నిజాలు చెప్పిన మీడియా సంస్థలపై కక్ష సాధింపులు జీవోలు జారీచేసి మరీ పాత్రికేయుల వేధింపులు పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం -
శక్తివంతమైన సాధనం మీడియా
సాక్షి, తాడేపల్లి/గుంటూరు : రాజ్యాంగంలో నాల్గవ స్తంభంగా పిలిచే మీడియా అత్యంత శక్తివంతమైన సాధనమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మీడియా పదును మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన తాడేపల్లి ప్రెస్‌క్లబ్ కార్యాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ ఏ వార్తైనా వాస్తవంగా ఉంటేనే ప్రజల విశ్వసనీయత పొందుతుందని తెలిపారు. సోషల్ మీడియా ఎంత ఉపయోగిస్తున్నా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత తగ్గలేదన్నారు. పత్రిక నిర్వహణ చాలా కష్టమని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పత్రికా రంగాన్ని కొనసాగిస్తున్నవారికి అభినందనలు తెలిపారు. వ్యవస్థలను రక్షించుకోవాలంటే పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విలేకరులు దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కోవాల్సిన క్లిష్టపరిస్థితులు నేడు నెలకొన్నాయని, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పేది పాత్రికేయులేనన్నారు. వార్తను వార్తగా ఇచ్చే విధంగా తాడేపల్లి ప్రెస్‌క్లబ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విలేకరుల సంక్షేమానికి తాను చేయూతనందిస్తానన్నారు. రాజధానిలో తొలి ప్రెస్‌క్లబ్ తాడేపల్లిలో ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ముందుగా ఆఫీస్ మెయిన్ గేటును జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ వెంకటాచార్యులు ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన ఎమ్మెల్యే ఆర్కే, విలేకరుల చాంబర్‌ను ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, కంప్యూటర్ రూమ్‌ను ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ, ప్రత్యేక రూమును వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గాదె సుబ్బారెడ్డి, కార్యదర్శి టి.నాగేశ్వరరావు, కోశాధికారి టి.శివనాగిరెడ్డి పాల్గొన్నారు. -
వంద శాతం పోలింగ్‌కు కృషి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించి వంద శాతం పోలింగ్ జరిగేలా పత్రికలు కృషి చేయాలని మంత్రి కె.తారకరామారావు సూచించారు. ఆదివారం బేగంపేట క్యాంప్ కార్యాలయంలో ‘ముద్ర’ దిన పత్రికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సమస్యల్ని వెలుగులోకి తెచ్చినప్పుడే పత్రికలకు సార్థకత చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంపాదకుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరరెడ్డి, శ్రీనివాసగౌడ్, ఆప్కాబ్ చైర్మన్ కె.రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పత్రికల సమస్యలు పరిష్కరించండి
న్యూఢిల్లీ: దేశంలో పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీఇరానీకి ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిలా ఉరంకార్ నేతృత్వంలో పలు పెద్ద, చిన్న పత్రికలకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ఇటీవల కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేసింది. న్యూస్‌ప్రింట్ ధరల పెరుగుదల, ప్రకటనలు తగ్గిపోవడం తదితర సమస్యల కారణంగా చిన్న పత్రికలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సానుకూలంగా స్పందించారని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదు
- ముద్రగడ చేపట్టిన పాదయాత్ర జరిగి తీరుతుంది - కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట): లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆగదని తమనాయకుడు ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర జరిగి తీరుతుందని జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, గౌతు స్వామి తదితరులు స్పష్టం చేశారు. శనివారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో కొందరు మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావుతోపాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు ముద్రగడ ఉద్యమాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారు. కాపు కులాన్ని వేరు చేసి ఓట్లు అడిగింది మీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చిన వెంటనే ఆరు నెలల్లోపు కాపు, తెలగ, బలిజ వంటి కులాలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పింది చంద్రబాబు కాదా అన్నారు. కాపు ఓట్లు ద్వారా లబ్ధి పొంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా ఇంత వరకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోవడం చంద్రబాబు విధానం తేటతెల్లమవుతుందన్నారు.ముద్రగడ వెంట ఎవరూ లేరనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోను ఇన్ని వేల మంది పోలీసులతో పోలీస్ పికెట్లు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. ముద్రగడను పాదయాత్రకు పంపించండి...అప్పుడు ముద్రగడ వెంట ఎంత మంది ఉన్నారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ నిరంతరం 144, సెక్షన్ 30 అమలులో పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వాలని కోరారు. ఈ సమావేశంలో తనిశెట్టి వెంకటేశ్వరావు, కొత్తెం బాలకృష్ణ, అడబాల శ్రీను, ఓరుగంటి చక్రం, వాసా రాఘవరావు, ఎస్సీ నాయకుడు మూరా సహదేవుడు, బీసీ నాయకుడు ఎల్లపు తాతారావు, ఓసీ నాయకులు మండపాక చలపతి, గౌతు వెంకటేశ్వరరావు, దాడి నారాయణమూర్తి, ఒన్నెం శ్రీను, సూరత్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యపరంగా భయాందోళన వద్దు
– కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : జిల్లాలో సీజనల్ వ్యాధుల ఉనికి పూర్తిగా అదుపులో ఉందని, ఆరోగ్యపరంగా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోను కావద్దని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలోని ఏజెన్సీ, విలీన, మైదాన మండలాల్లో వ్యాధులు ప్రబలకుండా చేపట్టిన కార్యక్రమాలను, జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆరోగ్య అప్రమత్తత, పారిశుద్ధ్య ఉద్యమాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ గత ఆదివారం వై.రామవరం మండలం బొడ్డగండి గ్రామ పరిధిలోని చాపరాయి ఆవాసంలో అస్వస్థతకు లోనైన 32 మంది ప్రత్యేక వైద్య సేవల ద్వారా కోలుకుంటున్నారన్నారు. బొడ్డగండి పంచాయితీ పరిధిలో మొత్తం 40 జనావాసాలు ఉండగా 27 కొండకు ఒకవైపు, చాపరాయితో సహా మరో 13 ఆవాసాలు కొండకు మరో వైపు ఉన్నాయన్నారు. 13 ఆవాసాల్లో 4 ఆవాసాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుబాటులో ఉండగా, మిగిలిన ఆవాసాలకు చేతిపంపుల నీరు అందుబాటులో ఉందన్నారు. చాపరాయిలో బోర్ల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి నుంచి వచ్చే నీరు పైపుల వాసన వస్తోందని ఆవాస ప్రజలు వాగులోని నీరు తాగుతున్నారని, ఈ నీరు జంతుకళేబరంతో కలుషితం కావడం వల్ల వాంతులు, విరేచనాలకు గురై ప్రాణాపాయ స్థితులు ఎదురయ్యాయన్నారు. చాపరాయి ఆవాసానికి రోడ్డు కనెక్టివిటీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్ల వ్యాధులు సోకిన సమాచారం తెలిసేలోగా 16 మంది దురదృష్టవాశాత్తు మృతి చెందారన్నారు. చాపరాయిలో కొత్తగా డయేరియా, వాంతులు ఎవరికీ సోకలేదని చెప్పారు. డీపీఓ, డీఆర్డీఏ పీడీ, ఎస్డీసీలు గ్రామంలోనే ఉండి ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగిని పంపి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా పిల్లలు రక్తహీనత ఎదుర్కొంటున్నందున పౌష్టికాహారం అందిస్తూ 15 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఏజెన్సీ, విలీన మండలాల్లో ప్రజారోగ్య పర్యవేక్షణకు సరైన రోడ్డు కనెక్టివిటీ, సమాచార వ్యవస్థల లేమి ప్రతి బంధకంగా ఉందని, ఈ వ్యవస్థలను అన్ని ఆవాసాలకు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇందులో భాగంగా 41 కిలోమీటర్ల చాపరాయి చేరే రోడ్డును ఆర్అండ్బీ ద్వారా అభివృద్ధి చేయనున్నామన్నారు. విశాట్, హోమ్ రేడియో వ్యవస్థల ద్వారా సమాచార వ్యవస్థను విస్తరిస్తామన్నారు. చాపరాయి ఉదంతంపై రంపచోడవరం ఐటీడీఏ పీఓతో సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.జితేంద్ర, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. -
హత్యలతో ఏం సాధించలేరు..
జన జీవన స్రవంతిలో కలవండి మావోలకు ఎస్పీ రవిప్రకాష్ హితవు రంపచోడవరం : పోలీస్ ఇన్పార్మర్ల అన్న అనుమానంతో గిరిజనులను హత్య చేస్తున్న మావోయిస్టుల చర్యలు హేయమైనవని ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అమాయక గిరిజనులను హత్య చేయడం ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని జనజీవన స్రవంతిలో కలవాలని హితవు చెప్పారు. చింతూరు మండలం అల్లిగూడెంలో ఆదివారం గిరిజనుడు పుల్లయ్యను పోలీస్ ఇన్‌పార్మర్ పేరుతో హత్య చేయడాన్ని ఖండించారు. మావోలు ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2007లో అల్లిగూడెంలో జరిగిన గొడవలో పుల్లయ్యను మావోయిస్టులు కొట్టారని, అప్పటినుంచి పుల్లయ్య భద్రాచలం వెళ్లి కూలీ పని చేసుకుంటున్నాడని తెలిపారు. బంధువుల ఇంటిలో శుభకార్యానికి రావడంతో మాటు వేసిన మావోయిస్టులు భోజనం చేస్తున్న అతడిని లాక్కుపోయి తుపాకితో కాల్చి చంపారన్నారు. ఇటీవల కాలంలో ఉనికి కోల్పోయిన మావోలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే హత్యలకు తెగబడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగలడంంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. మావోలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకిగా మారారని, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్‌లో ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిపారు. ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాను ఆరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. జనమైత్రి ద్వారా గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నట్టు వివరించారు. గిరిజన యువతకు ఆర్మీ, పోలీస్ రిక్రూట్మెంట్కు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అడ్నాన్ నయింఆస్మీ, సీఐలు గీతారామకృష్ణ, ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. -
పథకం ప్రకారమే కాపుల అణచివేత చర్యలు
పాదయాత్రకు కోర్టు అనుమతి ఉన్నా అడ్డుకున్నారు సుప్రీం కోర్టు నిషేధించినా కోడిపందేలకు ఓకే చెప్పారు ఇదేనా మీ ద్వంద్వ నీతి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆకుల రామకృష్ణ ధ్వజం కొత్తపేట : కాపుల వల్లే తాము అధికారంలోకి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఒక పక్క చెబుతూనే, మరోపక్క పథకం ప్రకారం కాపుల అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం వాడపాలెంలో కాపు నాయకులు పెదపూడి శ్రీనివాస్, బాపిరాజు సోదరుల స్వగృహంలో రామకృష్ణ గురువారం విలేకరులతో మాట్లాడారు. జీఓ నంబరు 30 ద్వారా కాపు విద్యార్థులకు గతంలో ప్రభుత్వం ఉపకార వేతనాలు అమలు చేయడానికి ముద్రగడ పద్మనాభం సాగించిన ఉద్యమమే కారణమన్నారు. తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆ ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు బీసీ హామీ ఇచ్చి గాలికొదిలేసినందునే ముద్రగడ మరలా ఉద్యమం చేపట్టవలసి వచ్చిందన్నారు. తమ డిమాండ్ సాధనకు కాపులు శాంతియుత పాదయాత్ర చేపడితే పోలీసు యంత్రాంగంతో కాపు నాయకులను హౌస్ అరెస్టులు చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని విమర్శించారు. పాదయాత్రకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వం అడ్డుకుందని, కోడి పందేలు నిర్వహించరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అనుమతులు ఇచ్చిందని రామకృష్ణ గుర్తుచేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమో? నియంతృత్వమో?అర్థం కావడం లేదన్నారు. సంక్రాంతి ముసుగులో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాక్షిగా కోడి పందేలు నిర్వహిస్తే లేని అభ్యంతరాలు, నిషేదాజ్ఞలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేపడుతున్న పాదయాత్రకు ఎందుకని ఆకుల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించింది వారా? మేమా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాహక్కులను హరించే అధికారం ఎవరికీ లేదన్నారు. పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు.కమిషన్ నియమించి, కాపులను బీసీల జాబితాలో చేర్చకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. తుని ఘటనతో కాపులకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అదే అంశాన్ని బూచిగా చూపి కాపుల పాదయాత్రను అడ్డుకోవడం ఆయన ద్వంద్వ వైఖరిని బయట పెడుతోందన్నారు. తమకు సహకరించే పార్టీలు, నాయకులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని ,దానికి జగన్ ముద్ర వేయడం తగదని రామకృష్ణ అన్నారు. ఏదేమైనా బీసీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, కాపు నాయకులు సాధనాల సత్యనారాయణ,మట్టా బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఉపాధ్యాయుడిపై శాఖాపర చర్యలు తీసుకోండి
జిల్లా ఉన్నతాధికారులకు పోలీసుల నివేదిక అమలాపురం టౌన్ : అమలాపురంలో ఓ ఇంటిపై రౌడీల దాడి ఘటనతో హత్యాయత్నం, మారణాయుధాల కేసులో నిందితుడిగా ఉన్న పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఆచంట వీరవెంకట సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు పోలీసులు గురువారం నివేదికలు పంపారు. ఇంటి విక్రయంతో అతని పని పూర్తయినా ఇంటిపై రౌడీలు దాడి చేస్తున్నప్పుడు వారితో పాటు ఉండడంతో ఈ కేసులో నిందితుడయ్యారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, డీఈఓ, అమలాపురం డీవైఈవో, ఉప్పలగుప్తం ఎంఈవోలకు వేర్వేరుగా ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్లతో నివేదికలు పంపించారు. ఆ ఉపాధ్యాయుడిపై ఉప్పలగుప్తం ఎంఈవో ఇచ్చే నివేదిక మేరకు తాము డీఈవోకు నివేదిక పంపనున్నానని అమలాపురం డీవైఈవో ఆర్ఎస్ గంగా భవాని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. రౌడీల దౌర్జన్యం దారుణం ఆర్య వైశ్య మహా సభ ప్రతినిధుల బృందం అమలాపురం టౌన్ : ఇటీవల అమలాపురంలో రౌడీలు ఓ ఇంటిపై దాడి చేసి ప్రింటింగ్ ప్రెస్‌ను ధ్వంసం చేయడం దారుణమని.. ఇది పూర్తిగా అనాగరిక చర్య అని ఆల్ ఇండియా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు, ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యంలతో కూడిన వైశ్య నాయకుల బృందం పేర్కొంది. ఘటన ప్రదేశాన్ని ఆ బృందం గురువారం పరిశీలించింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని కాళ్లకూరి బుజ్జి సోదరులను బృందం ప్రతినిధులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. నిందితులను ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల తరపున ఆర్యవైశ్య మహాసభ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారి పల్లపోతు బంగారం, కంతేటి కాశి, అమలాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యెండూరి నాగేశ్వరరావు, కార్యదర్శి నంబూరి మూర్తి, కోశాధికారి వరదా సూరిబాబు, పచ్చిగోళ్ల నాగబాబు, యక్కల కుమార్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధుల బృందం వెంట ఉన్నారు. -
రేపటినుంచి నగదు మార్పిడి రూ.2వేలు మాత్రమే
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రజలకు మరిన్నిఉపశమన చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా పెళ్ళిళ్ల సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రైతులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం ఉదయం ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కొన్ని వెసులు బాట్లను, మరిన్ని మార్పులను వెల్లడించారు. అయితే రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగదు మార్పిడిలో ఈ కొత్త నిబంధన రేపటినుంచి(నవంబరు 18) అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ వర్గాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా కుటుంబాల నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నామన్నారు. గుర్తింపు కార్డు చూపి (సెల్ఫ్ డిక్లరేషన్ల ) రూ.2.5 లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే రైతులు రుణ బీమా ప్రీమియం చెల్లింపుల గడువును 15 రోజుల పెంచారు. ఇందుకోసం ఆయా రైతులు కెవైసీ వివరాలు అందించాలి. పంటరుణాలు పొందిన రైతులు వారానికి 25 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కిసాన్ క్రెడిట్ దారులకూ ఇదే పరిమితి వర్తింస్తుందని తెలిపారు. ఏపీఎంసీ మార్కెట్ లో రిజిస్టర్ అయిన వ్యాపార్లు 50 వేలకు డ్రా చేసుకునే అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (అప్ టూ గ్రూప్ సీ...ఉద్యోగులు) సాలరీ అడ్వాన్స్ కింద 10 వేలకు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రకటించారు. హాస్పిటల్ గురించి ప్రశ్నించినపుడు.. నిర్ణయం తీసుకున్న తరువాత వివరాలు వెల్లడిస్తామని శక్తికాంత్ దాస్ చెప్పారు. మరోవైపు నగదు అందుబాటులో లేనందువల్లే మార్పిడి కుదింపు నిర్ణయం తీసుకన్నారా అని ప్రశ్నించినపుడు ఈ వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రభుత్వం వద్ద నగదు చాలినంత అందుబాటులోఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ సమావేశం ముఖ్యాంశాలు: వివాహ వేడుకలకు రూ.2.5 లక్షల నగదును విత్ డ్రా చేసుకోవచ్చు పంట రుణం కింద మంజూరైన, రైతుల అకౌంట్లకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి రూ.25,000ను రైతులు విత్‌డ్రా చేసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు ఇదే పరిమితి వర్తింపు రైతులంతా కేవైసీ వివరాలు అందించాలి ఆ అకౌంట్లు రైతు పేరు మీదనే ఉండాలి, రుణ పరిమితులకు లోబడి ఉండాలి. రుణ బీమా ప్రీమియం తేదీల గడువు 15 రోజులకు పెంపు నగదు మార్పిడి కింద ఒక్కవ్యక్తి రేపటి నుంచి డ్రా చేసుకునే మొత్తం రూ.4500 నుంచి రూ.2000లకు కుదింపు ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లో రిజిస్ట్ర్ అయిన వారు వారానికి రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు ఏటీఎంలో సాప్ట్ వేర్ మార్పుపై టాస్క్‌ఫోర్స్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు(అప్ టూ గ్రూప్ సీ... ఉద్యోగులు) అడ్వాన్స్ జీతం కింద రూ.10,000 నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం ప్రభుత్వం వద్ద అవసరమైనంత నగదు లభ్యత ఉంది, నగదు ఇబ్బంది లేదు