విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం లేని పాశ్చాత్య మీడియా విమర్శలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పలు అంశాలుపై మాట్లాడారు.
‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్‌లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్ శాతం కంటే భారత్‌లో ఓటింగ్ శాతం ఎక్కువ.
..మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్‌లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment