ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవనాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గీతా ప్రెస్ ప్రాంగణాన్ని సందర్శించారు.
ఈ సమయంలో ఆమె లీలా చిత్ర మందిర్ ఫోటో గ్యాలరీని చూసి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తాతయ్య ఇంట్లో భక్త సూరదాస్‌తో పాటు బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాగే అక్కడి గ్యాలరీలోని పెయింటింగ్‌లను చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
తన చిన్నతనంలో తన దగ్గర గీతా ప్రెస్‌కు చెందిన ఒక పుస్తకం ఉండేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె ఆరు అంగుళాల వ్యాసం కలిగిన చేతితో రాసిన గీతను లెన్స్ సహాయంతో చదివాక, ఇది ప్రత్యేకమైన కళాఖండమని పేర్కొన్నారు. ఆమె తమిళం, మలయాళంలో ముద్రితమైన శివపురాణం పుస్తకాన్ని కూడా చూశారు. గీతా ప్రెస్ చూశాక తన చిరకాల వాంఛ నెరవేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment