Geeta
-
కర్వా చౌత్ వేళ.. భర్త వీపుపై భార్య అమూల్య సందేశం
హల్ద్వానీ: కర్వా చౌత్ వ్రతాన్ని ఉత్తరాది మహిళలు ఆదివారం(అక్టోబర్ 20)న అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇంటింటా కర్వాచౌత్ సందడి కనిపించింది. అయితే హల్ద్వానీ నగరంలో ఈ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆకర్షించింది. ఒక మహిళ తన భర్త వీపుపై గోరింటతో ‘వైద్య కళాశాల ఆస్తి’ అని రాశారు. దీని వెనుక ఆమె ఉద్దేశమేమిటనే విషయానికొస్తే..హల్ద్వానీలోని కుంతీపురం హిమ్మత్‌పూర్ తల్లా నివాసి గీతా మిశ్రా శరీర దాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే కర్వాచౌత్ సందర్భంగా తన భర్త వీపుపై మెహెందీతో ‘మెడికల్ కాలేజీ ఆస్తి’ అని రాసి, తమ సందేశాన్ని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణానంతరం శరీరాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులుకు వినియోగించాలన్నారు. హల్ద్వానీ వైద్య కళాశాలకు మృత శరీరాన్ని అప్పగిస్తే, వైద్య విద్యార్థులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇంతేకాదు.. మరణించ తరువాత కూడా మన శరీరం సదుపయోగం అవుతుందని పేర్కొన్నారు. గీతా మిశ్రా భర్త డాక్టర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ 2013లోనే తమ కుటుంబ సభ్యులంతా దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఇలాగే తాము నేత్రదానం, అవయవదానం మొదలైనవాటిపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దిశగా ఆలోచించేవారు మరిన్ని వివరాల కోసం వారికి సమీపంలోగల మెడికల్ కాలేజీలను సంప్రదించాలని మిశ్రా సూచించారు. ఇది కూడా చదవండి: ‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు -
అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ‘ఉపాధి కల్పనలో భారత్ జీ20 దేశాలలో వెనుకబడి ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి దేశం అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది’ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఫస్ట్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ శనివారం తెలిపారు. 2010–20 మధ్య భారత్ సగటున 6.6 శాతం వృద్ధిని సాధించిందని, అయితే ఉపాధి రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గీత చెప్పారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రైవేట్ పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం, నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడం, ట్యాక్స్ బేస్‌ను విస్తృతం చేయడం అవసరమని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక కీలక దేశంగా ఉండాలనుకుంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. -
గీతా ప్రెస్‌కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్‌లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్‌లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
ప్రపంచ పర్యావరణానికి కొత్త గీతం
ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్‌గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది. 1998లో వరల్డ్ బ్యాంక్‌లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేసింది. అక్కడే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్‌కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు అడ్వైజరీ సర్వీసెస్‌లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్‌గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్‌తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది. ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగం!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవనాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గీతా ప్రెస్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సమయంలో ఆమె లీలా చిత్ర మందిర్ ఫోటో గ్యాలరీని చూసి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తాతయ్య ఇంట్లో భక్త సూరదాస్తో పాటు బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాగే అక్కడి గ్యాలరీలోని పెయింటింగ్‌లను చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో తన దగ్గర గీతా ప్రెస్‌కు చెందిన ఒక పుస్తకం ఉండేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె ఆరు అంగుళాల వ్యాసం కలిగిన చేతితో రాసిన గీతను లెన్స్ సహాయంతో చదివాక, ఇది ప్రత్యేకమైన కళాఖండమని పేర్కొన్నారు. ఆమె తమిళం, మలయాళంలో ముద్రితమైన శివపురాణం పుస్తకాన్ని కూడా చూశారు. గీతా ప్రెస్ చూశాక తన చిరకాల వాంఛ నెరవేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
‘రామచరిత మాసన’ విక్రయాల జోరు!
ఈనెల 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగిపోయింది. ఈ ప్రభావంతో దేశంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు, ఆడియో, వీడియోలకు మునుపెన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. 50 ఏళ్లలో తొలిసారిగా ‘రామచరిత్‌మానస’కు అమితమైన ఆదరణ లభించిందని ‘రామచరిత్‌మానస’విక్రేతలు చెబుతున్నారు. VIDEO | For the first time in 50 years, Gita Press in UP's Gorakhpur is facing shortage of Ramcharitmanas in its stock amid rise in demand ahead of the Ram Mandir Pran Pratishtha ceremony in Ayodhya on January 22. pic.twitter.com/twZYGgU05c — Press Trust of India (@PTI_News) January 12, 2024 ‘రామచరితమానస’ పుస్తకం విషయానికొస్తే దీనిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ విరివిగా ముద్రిస్తోంది. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా గీతా ప్రెస్‌లో ‘రామచరితమానస’ స్టాక్ తగినంతగా లేని పరిస్థితి ఏర్పడింది. రామచరితమానసకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, గీతా ప్రెస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. VIDEO | "Ever since the date of Ram Lalla's Pran Pratishtha has been announced, the demand for Ramcharitmanas, along with Sundar Kand and Hanuman Chalisa, has increased. In the previous years, we were publishing around 75,000 copies of Ramcharitmanas every month. This year, we… pic.twitter.com/w0jniGjoWl — Press Trust of India (@PTI_News) January 12, 2024 పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు గీతాప్రెస్‌లో ‘రామచరితమానస’ పుస్తకం ప్రింటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. గీతా ప్రెస్ మేనేజర్ లాలమణి త్రిపాఠి మాట్లాడుతూ అయోధ్యలో నూతన రామమందిరం ప్రారంభానికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సుందరాకాండ’, ‘హనుమాన్ చాలీసా’ ‘రామచరితమానస’కు డిమాండ్ మరింతగా పెరిగిందని అన్నారు. గతంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 75 వేల కాపీలు ముద్రితమయ్యేవని, ఇప్పుడు దానిని లక్షకు పెంచినప్పటికీ, స్టాక్ ఉండటం లేదన్నారు. ఇది కూడా చదవండి: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత!
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బైజ్నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా బైజ్నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? गीता प्रेस, गोरखपुर के ट्रस्टी श्री बैजनाथ अग्रवाल जी का निधन अत्यंत दुःखद है। विगत 40 वर्षों से गीता प्रेस के ट्रस्टी के रूप में बैजनाथ जी का जीवन सामाजिक जागरूकता और मानव कल्याण के लिए समर्पित रहा है। उनके निधन से समाज को अपूरणीय क्षति हुई है। प्रभु श्री राम दिवंगत पुण्यात्मा… — Yogi Adityanath (@myogiadityanath) October 28, 2023 -
నవీన్ సోదరి గీతా మెహతా కన్నుమూత
భువనేశ్వర్/కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా (80) శనివారం రాత్రి న్యూఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు పరోక్ష సంతాప సూచకంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి నవీన్ ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న దృశ్యాలు ప్రజలు టీవీల్లో వీక్షించారు. గాంధీ కుటుంబంతో స్నేహం.. దివంగత ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌కు ఇద్దరు కుమారులు ప్రేమ్ పట్నాయక్, నవీన్ పట్నాయక్, ఒక కుమార్తె గీతా ఉన్నారు. వీరందరి బాల్యం లండన్‌లో జరిగింది. ప్రేమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా, గతంలోనే మృతిచెందారు. గీతా అంతర్జాతీయ కవయిత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. బిజూ సంతానినికి బాల్యంలో గాంధీ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉండేవి. చివరి చూపు కోసం.. నవీన్ న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ అక్క చివరి చూపు కోసం ఢిల్లీ వచ్చానని ప్రకటించారు. కాగా, నవీన్ ఉండగా ఏనాడూ అతని కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు నవీనే ఢిల్లీ వెళ్లి అక్కని చూసేవారు. గీత మృతిలో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గీతా మెహతా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా రచయిత్రిగా, లఘు చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్‌గా పేరొందారు. ప్రఖ్యాత అమెరికన్ పబ్లిషర్ దివంగత సోనీ మెహతాను 1965లో గీతా మెహతా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో బిజు, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు 1943లో జన్మించిన ఆమె తన విద్యను భారత్‌తో పాటు యూకే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2019లో భర్త సోనీ మెహతా మరణించినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ► కర్మ కోలా, స్నేక్ అండ్ ల్యాడర్స్, ఎ రివర్ సూత్ర, రాజ్ అండ్ ది ఎటర్నల్ గణేషా అనే మూడు పుస్తకాలను రచించారు. ► తన రచనలలో భారత చరిత్ర, సంస్కృతి, మతాన్ని చిత్రీకరించారు. ఈమె రచనలు 13 భాషల్లోకి అనువాదమయ్యాయి. 27 దేశాలలో ప్రచురితమయ్యాయి. యూకే, యూరోపియన్ దేశాలు , యునైటెడ్ స్టేట్స్ కోసం 14 బుల్లి తెర లఘు చిత్రాలను మెహతా నిర్మించి దర్శకత్వం వహించారు. ► 1970లలో నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌కు గీత యుద్ధ ప్రతినిధిగా పని చేశారు. యూఎస్ టీవీ నెట్వర్క్ ఎన్బీసీ కోసం గీతా మెహతా బంగ్లాదేశ్ యుద్ధాన్ని కవర్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంపై డేట్లైన్ బంగ్లాదేశ్ పేరుతో శక్తివంతమైన డాక్యుమెంటరీని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీలో పాకిస్తాన్ సైనికులు చేసిన మారణహోమం, కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసిన విముక్తి యుద్ధాన్ని చిత్రీకరించారు. ప్రముఖుల సంతాపం.. గీతా మెహతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతా మెహతా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె మరణం అత్యంత బాధాకరమన్నారు. గీతా మెహతా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
గీతానా మజాకా! రాత్రంతా కచేరి.. రూ.4 కోట్ల నోట్ల వర్షం! వైరల్ వీడియో
సినిమాకు ప్లస్ అయ్యే పాటను ‘కోటి రూపాయల పాట’ అనడం మనకు తెలుసు. మాటలకే పరిమితమైన ఈ విశేషణాన్ని తన పాటలతో నిజం చేసింది గీతా రబరి. ‘కచ్ కోయిల’గా పేరుగాంచిన గీత కచ్ (గుజరాత్) జిల్లాలోని రాపర్ పట్టణంలో ఒక రాత్రి మొత్తం పాటల కచేరి నిర్వహించింది. భజనల నుంచి జానపదాల వరకు ఎన్నో పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆమె పాటలకు మైమరచిపోయిన ప్రేక్షకులు నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి అలా వచ్చి చేరిన నోట్ల విలువ నాలుగు కోట్ల పై మాటే. గీతపై నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కచ్ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన గీత అయిదవ తరగతి నుంచే భజనలు, జానపదాలు పాడేది. ‘రోమా సేర్మా’ పాటతో జిల్లావ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) -
ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా
సనత్‌నగర్: ఒంటికాలితోనే మహిళల ప్రత్యేక సోలో కేటగిరి సైక్లింగ్ రేస్‌లో శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్ సైకిల్ రైడ్ పూర్తి చేస్తానని పారా అథ్లెట్ గీతా ఎస్.రావు ధీమా వ్యక్తం చేశారు. ఎడమ కాలు పోలియో వ్యాధికి గురైనప్పటికీ ఆమె ఒక కాలుతోనే సైకిల్ తొక్కుతూ ఇప్పటికే డీఎస్ఆర్, ఒలింపిక్ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్ 2022 చాంపియన్‌గా నిలిచారు. సుషేనా హెల్త్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా నిలోఫర్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18,950 కిలోమీటర్ల ఎత్తులో, 3,651 కిలోమీటర్ల పొడవైన ఈ ఐకానిక్ సైకిల్ రైడ్ మార్చి 1న శ్రీనగర్ నుంచి ప్రారంభమై కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్ రేస్‌లో భాగంగా దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు. 12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ రేస్‌కు సుషేనా హెల్త్ ఫౌండేషన్ అధికారిక భాగస్వామిగా ఉందన్నారు. తన రైడ్‌లో భాగంగా ‘తల్లి పాలే ఉత్తమ ఆహారం’ అనే నినాదంతో దేశంలో తల్లి పాలపై అవగాహనను పెంపొందించేందుకు ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ క్రాలేటీ, నియోనాటాలజీ హెచ్ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కలవలపల్లి దుర్గాభవానీ, అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం
నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్ ‘నడక’ గురించి తెలుసుకుంటే ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది. 1700 కిలోమీటర్లు... కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం 54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ ఆర్కిటెక్చర్ వాక్ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె. గీతా బాలకృష్ణన్ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్‌లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్ దారి గురించి మరింత వివరంగా.. ► ప్రయాణంలో గ్రహించిన విషయాలు.. అనుకున్న ప్లాన్ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది. ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు. ► ఈ ‘వాక్’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా? నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్ అసోషియేషన్స్.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కౌన్సిల్స్ నేను చేసే వాక్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది? మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్‌కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు. ► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి? మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్ బెంగాల్ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్లోని ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్‌కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్ అనిపించింది. ► వందల కిలోమీటర్ల వాక్ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా? ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్‌గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్‌లో ఒక సైక్లింగ్ యాక్సిడెంట్లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను. ► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు? గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్ వృత్తి గురించి, బిల్డింగ్ డిజైన్ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్ చేయమని వివరించాను. ► మీరు రన్నర్ అని కూడా విన్నాం. ఈ వాక్‌కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..? 2014లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్ చేశాను. ఇలా లాంగ్ వాక్ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్‌లో ఒక రోజు వాక్ అండ్ రన్, మరో రోజు వాక్. మిక్స్‌డ్‌గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను. ► ఆర్కిటెక్ట్‌గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..? ఈ వాక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్‌కి ఫెలోషిప్స్ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గీతాబోధ
తమ చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు కొందరైతే.. పనిచేస్తోన్న రంగంలో మూలాల వరకు ఉన్న లోటుపాట్లు, అవకాశాలను వ్యక్తిగతంగా శోధించి తెలుసుకుని, వాటిని సరిచేయడానికి, సమాజాభివృద్ధికి తోడ్పడే విధంగా కార్యరూపం దాల్చుతారు. ఈ కోవకు చెందిన వారే 53 ఏళ్ల ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్. కోల్‌కతాకు చెందిన గీతా బాలకృష్ణన్.. ఢిల్లీలోని స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో బీఆర్క్ చదివింది. కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంది. తరువాత వివిధ ఆర్టిటెక్ట్ల దగ్గర ఉద్యోగం చేసింది. కానీ ఆమెకు అక్కడ చేసే పని సంతృప్తినివ్వలేదు. దీంతో ‘నిర్మాణ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు’ పై కోర్సు చేసింది. ఈ కోర్సు చేసేసమయంలో ప్రొఫెసర్ కేఎస్ జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మార్గదర్శకంలో సాంప్రదాయేతర ఆర్కిటెక్ట్ డిజైన్లపై గీతకు మక్కువ ఏర్పడింది. దీంతో పర్యావరణానికి హాని కలగని డిజైన్లు చేస్తూనే..బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఆవాస్ (అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్) పరిచయంతో ఎన్జీవో తరపున సేవాకార్యక్రమాలు నిర్వహించేది. ఇలా చేస్తూనే పట్టణాల్లో నివసిస్తోన్న నిరుపేదలకు ఆవాసం కల్పిస్తున్న మరో సంస్థతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈవిధంగా సామాజిక సేవచేస్తూనే మరోపక్క ఎంతోమంది కలల ఇంటినిర్మాణాలకు ప్లాన్లు రూపొందించేది. ఇథోస్ అనేక ప్రాజెక్టుల్లో పనిచేసిన తరువాత ఆర్కిటెక్చర్ విద్యార్థులకు, నిర్మాణ రంగంలో ఉన్న ఇంజినీరింగ్ వృత్తి నిపుణులకు మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించింది గీత. ఈ గ్యాప్‌కు ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ‘ఇథోస్’ సంస్థను స్థాపించి విద్యార్థులకు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులకు మధ్య వారధిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరువందల కాలేజీల్లోని మూడువేలకుపైగా విద్యార్థులను వివిధ ఆర్టిటెక్ట్ సెమినార్లు నిర్వహించి వారికున్న సందేహాలను నివృత్తి చేసేలా, ఇంజినీరింగ్ పట్ల వృత్తిపరమైన అవగాహన కల్పించేలా వృత్తినిపుణులకు, విద్యార్థులను ముఖాముఖి పరిచయ కార్యక్రమాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ డిగ్రీ అయిన వెంటనే వారి ఆసక్తికి తగిన ఉద్యోగం సులభంగా దొరికే సదుపాయం కల్పిస్తోంది ఇథోస్. 2018లో ఇథోస్.. ఏసీఈడీజీఈ పేరిట ఆన్లైన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా కన్స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ డిజైనింగ్‌లో ఆన్లైన్ మాడ్యూల్స్‌ను అందిస్తోంది. ఆరు రాష్ట్రాలు..1700 కిలోమీటర్లు మానవుని జీవన శైలిపై అతను నివసించే భవన నిర్మాణ ప్రభావం కూడా ఉంటుందని గీత గట్టిగా నమ్ముతోంది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్లు రూపొందించాలని ఆమె చెబుతోంది. అలా చెప్పడం దగ్గరే ఆగిపోకుండా తన ఇథోస్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్‌కతా నుంచి ఢిల్లీవరకు అర్కాజ్ పేరిట 1700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో పర్యటించింది. కాలినడకనే ఆరు రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు, భవన నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న కొంతమందితో మాట్లాడి వారి ఇంటి నిర్మాణం, ఆ ఇంటితో ఉన్న అనుబంధం, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో అడిగి తెలుసుకుంది. ఇంటి నిర్మాణానికి మంచి ప్లానింగ్ ఉంటే జీవితం మరింత సుఖమయమవుతుందని పాదయాత్రలో అనేకమందికి అవగాహన కల్పించింది. వందల కిలోమీటర్ల ప్రయాణంలో తాను తెలుసుకున్న అనేక విషయాలను యువ ఆర్కిటెక్ట్‌లకు తెలియ జెబుతోంది. బాగా స్థిరపడిన వారు వృద్ధాప్యం లో తమ సొంత గ్రామాల్లో జీవించేందుకు వసతి సదుపాయాల డిజైన్లు, నిరుపేదలు కనీస వసతి సదుపాయాల కోసం ఏం కోరుకుంటున్నారో దగ్గరగా చూసిన గీత వారికి తగిన డిజైన్లు ఎలా రూపొందించాలి? ఆ డిజైన్లు నిరుపేదల జీవన శైలిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో కాబోయే ఆర్కిటెక్ట్‌లకు వివరిస్తోంది. చేస్తోన్న పనిలోని లోటుపాట్లు్ల, అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ తరాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తోన్న గీత లాంటి వాళ్లు మరింత మంది ఉంటే నాణ్యమైన వృత్తి నిపుణులుగా మరెందరో ఎదుగుతారు. -
ఇంట్లోనే వ్యాక్సిన్: సింగర్‌పై నెటిజన్ల ఫైర్
గుజరాతీ జానపద గాయని గీతా రాబరి ఇంట్లోనే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉదంతం వివాదాస్పదంగా మారింది. కచ్ జిల్లా మాదాపర్ గ్రామంలో హైల్త్ కేర్ వర్కర్ శనివారం సాయంత్రం ఆమెకు ఇంట్లోనే టీకా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను గాయని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా అధికారుల కంట పడింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న సమయంలో వైద్యసిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి మరీ టీకా ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు టీకా ఇచ్చిన వర్కర్‌కు నోటీసులు పంపారు. ఈ విషయం గురించి కచ్ జిల్లా వైద్యాధికారి భవ్య వర్మ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ కోసం రాబరి స్లాట్ బుక్ చేసుకుందని తెలిపారు. కానీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే టీకా వేయించుకుందని పేర్కొన్నారు. ఎవరి ఆదేశాలతో ఆ వర్కర్ రాబరి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చింది? వంటి తదితర వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ వర్కర్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. కాగా గీతా రాబరి 'నమస్తే ట్రంప్' ఈవెంట్ సందర్భంగా జానపద గీతాలతో జనాలను అలరించింది. ఇదిలా వుంటే ఇటీవలే క్రికెటర్ కుల్దీప్ యాదవ్ కూడా కాన్పూర్‌లోని గెస్ట్ హౌస్‌లో వ్యాక్సిన్ తీసుకున్న అంశం వివాదాస్పదమైంది. ఇది మరువకముందే సింగర్ గీతా రాబరి ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్న వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు అందరూ వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా వేయించుకుంటే ఈవిడ మాత్రం ఇంట్లోనే టీకా పొందడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి: డైరెక్టర్ వివాహం..హాజరైన హీరోలు పునీత్, ధృవసర్జా నా బలం... బలహీనత అదే : ప్రియాంక చోప్రా -
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన ‘గీత’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్‌లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు) సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్‌లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. -
పాటను తన జడపువ్వుగా ధరించి..
‘వక్త్ నే కియా క్యా హసీ సితమ్ హమ్ రహేన హమ్ తుమ్ రహేన హమ్’... కళ కూడా జీవితాల పై ప్రభావితం చూపిస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి. గీతాదత్ ‘కాగజ్ కే ఫూల్’ (1959)లో పాడిన ఆ పాట ఆమె భవిష్యత్తును సూచిస్తోంది. కాలం చూపబోతున్న అందమైన ప్రతీకారాన్ని అది సంకేతపరిచిందా? చెప్పలేము. గీతారాయ్. ఎస్. అదే అసలు పేరు ఆమెది. కాని దర్శకుడు గురుదత్ను వివాహం చేసుకోవడం వల్ల గీతా దత్ అయ్యింది. మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్ కంటే ముందు సురయ్యా, షంషాద్ బేగంల జమానాలో సూపర్‌స్టార్. అప్రమేయంగా పాట పాడటం ఆమెకు వచ్చు. గొంతు సవరించుకోవడం, ఈ శృతి ఎక్కువో తక్కువో అని నసగడం ఆమె ఎరగదు. కోల్‌కతా నుంచి పాటను తన జడపువ్వుగా ధరించి ముంబై చేరుకుంది. ఎన్నో పాటలను సువాసనలుగా వెదజల్లింది. అయితే ఇంకొన్నాళ్లు నిలిచి ఉండకుండా ఎండి తొందరగా రాలిపోయింది. ‘మేరా సుందర్ సప్నా బీత్ గయా’ అనేది ఆమె ‘దో భాయ్’ (1947)లో పాడిన చాలా పెద్ద హిట్ పాట. అందమైన కల గడిచిపోయిందని ఆ పల్లవికి అర్థం. అందమైన కలను కనడం అది తొందరలోనే గడిచిపోవడం గీతాదత్ జీవితంలో కూడా జరిగింది. ఆమె గురుదత్ స్టార్ డైరెక్టర్ కాక మునుపే, చిన్న స్థాయి నటుడిగా ఉండగానే అతణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ సమయానికి ఇండస్ట్రీలో ఆమె అధికురాలు. గురుదత్ ఆమెను నిజంగానే ప్రేమించాడు. వారిది ప్రేమపూర్వక జంటగా ఉంది. అతడు నట–దర్శకుడిగా, ఆమె గాయనిగా ఇండస్ట్రీలో పెద్ద ప్రభావం చూపారు. గీతా దత్ ఓ.పి.నయ్యర్, ఎస్.డి.బర్మన్లతో గొప్ప పాటలు ఇచ్చింది. నయ్యర్ సంగీతంలో గీతా పాడిన ‘బాబూజీ ధీరే చల్నా’ (ఆర్ పార్), ‘ఠండి హవా కాలి ఘటా’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘మేరా నామ్ చిన్‌చిన్‌చు’ (హౌరా బ్రిడ్జ్) ప్రేక్షకులను అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి. గీతా పాడిన ‘చిన్ చిన్ చు’తో హెలెన్ డాన్సింగ్ స్టార్ అయ్యింది. ఇక ఎస్.డి, బర్మన్తో గీతాది తిరుగులేని జోడి. ఆయన కోసం ఆమె పాడిన ‘తద్బీర్ సే బిగ్డీ హుయీ’ (బాజీ), ‘జానే క్యా తూనే కహీ’ (ప్యాసా) యాభై ఏళ్లు గడిచిపోయినా నేటికీ మన్ చాహే గీత్‌లో నిత్యం వినపడుతూనే ఉన్నాయి. గీతా దత్, గురుదత్‌ల పెళ్లి 1953లో జరిగింది. గురుదత్ 1956లో దేవ్ ఆనంద్‌ను పెట్టి ‘సి.ఐ.డి’ తీశాడు. హైదరాబాద్ వచ్చి ఒక తెలుగు అమ్మాయి నచ్చింది అని ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ అమ్మాయే వహీదా రహెమాన్. ఆ తర్వాత వహీదా రహెమాన్ ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ తదితర గురుదత్ సినిమాలలో పని చేసి స్టార్ అయ్యింది. ఆమెను గురుదత్ నటిగా తీర్చిదిద్దాడు. కాని ఆ ప్రయాణంలో ఆమెతో ప్రేమలో పడ్డాడు. గురుదత్ ముందు నుంచి సున్నిత మనస్కుడు. అతడు గీతా దత్తో ప్రేమను నిలబెట్టుకోవడానికి వహిదా రహెమాన్‌తో ప్రేమను కొనసాగించడానికి సతమతమయ్యాడని అంటారు. తన మీద చూపవలసిన ప్రేమ పంపకానికి గురవుతున్నదని భావించిన గీతా దత్ మెల్లగా మద్యం ఇచ్చే మత్తులోకి వెళ్లిపోయింది. గురుదత్ ఆమె పరిస్థితి చూసి కాపురం నిలబెట్టుకోవడానికి ఆమెను హీరోయిన్గా పెట్టి తొలి సినిమాస్కోప్ చిత్రంగా ఒక భారీ సినిమా మొదలెట్టాడు కూడా. అయితే ఆ సినిమా షూటింగ్ కొనసాగలేదు. గురుదత్ గీతాదత్‌కు ముగ్గురు పిల్లలను ఇచ్చి అగమ్యమైన భవిష్యత్తును ఇచ్చి 1964లో మరణించాడు. అతడిది ఆత్మహత్య అని అంటారు. ఆ తర్వాత గీతా దత్ 1972 వరకూ జీవించి మరణించింది. మరణించేనాటికి ఆమె వయసు కేవలం 41. గీతాదత్ది వంకలేని గొంతు. ఇంటి వాకిలికి సుందరంగా అల్లుకున్న సన్నజాజి తీవలా ఉంటుంది. పూసిన పూలు ఆగి ఆగి తెమ్మెరతో పాటు తమ గంధాన్ని పంచినట్టు ఆమె పాటలు స్పందనలు పంచుతూ ఉంటాయి. ‘ఏ లో మై హారీ పియా’ (ఆర్ పార్), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘పియా ఐసో జియా మే సమా గయేరే’ (సాహిబ్ బీవీ ఔర్ గులామ్)... ఎన్ని పాటలని.ఇన్ని పాటలు పాడిన గీతాదత్ కాపురం ఛిద్రమయ్యాక, భర్త చనిపోయాక పాటలు లేక స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేయాల్సి వచ్చింది. కొన్ని అన్నీ మన కళ్ల ముందే జరుగుతుంటాయి. శిఖరం ఏర్పడుతుంది. శిఖరం కరిగి పోతుంది. ఆ ఎగిరి విరిగిపడే లోపు విరజిమ్మే వెలుగులు మాత్రం మనలో నిలిచిపోతాయి. గీతా దత్‌ను తలుచుకోవడం అంటే పుస్తకంలో ఏనాడో దాచుకున్న నెమలీకను తెరచి స్పృశించడమే. ఏ కైసా హై నగ్మా ఏ క్యా దాస్తాహై బతా అయ్ మొహబ్బత్ మేరా దిల్ కహా హై. – సాక్షి ఫ్యామిలీ -
కాలం వెనక్కు వస్తుంది
నిముషం లేటైతేనే పరీక్ష రాయనివ్వరు. కొన్ని సంవత్సరాలు లేటైతే రానిస్తారా! ఇప్పుడీ పనికిపోతున్న ఆడపిల్లలు.. ఏదో ఒక ఉపాధిలో ఉన్న మహిళలు.. మళ్లీ చదువుకోవాలని ఆశపడితే?! ఎప్పుడో చూసిన క్లాసు పుస్తకాలను.. కనులపై మోసిన భవిష్యత్తు కలలను.. కాలం గిర్రున తిరిగి వెనక్కు తెచ్చిస్తుందా? ఇచ్చింది! గీతకు, ప్రమీలకు, కుష్బూకు ఇచ్చింది!! గీత ఒక్కటే ఉంటుంది. ఊరందరికీ ఆమె అక్క. ‘దీదీ’ అని కష్టం చెప్పుకోడానికి వస్తారు. ‘దీదీ’ అని సాయం అడగడానికి వస్తారు. ‘దీదీ’ అని చేతిలో పని అందుకోడానికి వస్తారు. గీత చేతిలో పని అందుకోవడం అంటే ఆమె చేతిలోని బంతిపూల గంపకు.. ఎత్తేటప్పుడు, దించేటప్పుడు.. ఒక చెయ్యి పట్టడం. గీతకు బంతిపూల తోటే ఉంది. పనివాళ్లు లేకుండా ఉంటారా! ఉన్నారు. అయితే తనూ ఒక గంప మొయ్యాలి. అప్పుడే తృప్తి. కొన్ని నెలల క్రితమే తోట పూయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు గీత అరవై వేల పూలను చుట్టుపక్కల మార్కెట్లలో అమ్మింది. తోట ఆమెదే, స్థలం మరొకరిది. ఒడిశాలోని రాయగడ జిల్లా కేంద్రానికి 39 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం నిమల్‌లో ఉంటుంది గీత. ఐక్యరాజ్యసమితి నుంచి ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్ వాళ్లు వచ్చినప్పుడు, వాళ్ల గురించి తెలుసుకుని రాయగడ వెళ్లింది. తనకు చదువూ ఇష్టమే. పూలతోటల పెంపకమూ ఇష్టమే అని చెప్పింది. పూల పెంపకాన్నే పుస్తకాల చదువుగా చేసుకొమ్మని చెప్పారు వాళ్లు. ఎలా పండించాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి.. వీటిల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ చక్కగా పండుతోంది. ప్రస్తుతానికి గీత రాబడి కొద్దిగానే ఉన్నా సొంత కాళ్ల మీద నిలబడిన మహిళగా ఊళ్లో బాగానే గుర్తింపు వచ్చింది. పూల సాగును, పూల వ్యాపారాన్ని పెంచుకునేందుకు గ్రామంలోని యువతులకు ఆమె ఉపాధి కల్పించబోతోంది. తెలిసిన విద్య కనుక వారికి శిక్షణ కూడా ఆమే ఇస్తుంది. గీతకు ఒక అన్న ఉండేవాడు. చిన్నప్పుడు గీతను పనిలోకి పంపించడానికి బడి మాన్పించాడు. ‘నేనొక్కడినే అయితే ఎలాగైనా బతికేవాడిని. నిన్నూ బతికించాలి కనుక నువ్వూ పనికి వెళ్లాలి’ అనేవాడు! ఇప్పుడు గీతే అతడికి డబ్బులు పంపుతోంది. ప్రమీల టీనేజ్‌లో ఉంది. స్థోమత ఉంటే బాగా చదువుకోవలసిన వయసు. ఐదవ తరగతితో ఆమె చదువు ఆగిపోయింది. బంధువుల కలహాలలో తండ్రిని అవతలివైపు వాళ్లు చంపేశారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ప్రమీల కన్నా పెద్దవాళ్లు నలుగురు ఉన్నా, చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. తల్లిని తనే చూసుకోవాలి. తల్లి కష్టపడి, నీరసపడి నాలుగు రాళ్లతో ఇంటికి రావడం చూడలేకపోయింది. వీళ్లది అస్సాం. పనమ్మాయిగా ఐదు వేలు రూపాయలు వస్తాయంటే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లిపోయింది. నెల నెలా తల్లికి మూడు వేలు పంపిస్తోంది. పని చేస్తోంది కానీ, ప్రమీలకు చదువు మీద ఆశ పోలేదు. కనీసం టెన్త్ అయినా పూర్తి చేయాలని ఆమె తపన. ఇంటి యజమానులు బాగా చదువుకున్నవాళ్లు. ఆమెను సెకండ్ ఛాన్స్ ప్రోగ్రామ్‌లో చేర్పించడంతో పాటు, చదువుకునే వెసులుబాటునూ కల్పించారు. ప్రోగ్రామ్ వాళ్లు ఆమెను ఎన్.ఐ.ఒ.ఎస్. (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) లో చేర్పించారు. ప్రస్తుతం ప్రమీల పనిచేస్తూనే టెన్త్ చదువుతోంది. స్టడీ కిట్‌ను కూడా వాళ్లే ఇప్పించారు. ఆ అమ్మాయిలో ఇప్పుడు అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. మునుపటి నిరాసక్తత లేదు. జీవితంలో చదువు అనేది ఒకటి ఉంటుందని పద్దెనిమిదేళ్లకే మర్చిపోయింది ఖుష్బూ కుమారి. స్త్రీ పురుష సమానత్వ సాధనకు, స్త్రీ సాధికారతకు చదువే ముఖ్యం అని ఆమె ఇప్పుడు గ్రహించింది. అంత అమాయకపు ప్రాణానికి ఇవి పెద్ద మాటలు అనుకోనక్కర్లేదు. బిహార్‌లోని గయ జిల్లాలో, దొహారీ గ్రామం ఖుష్బూది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం ఆమెను చదువు మానేయమంది. తల్లి, తండ్రి, తోబుట్టువులు. అందర్లోకి ఖుష్బూ పెద్ద. ఇంటిని పోషించలేక కూతుర్నీ కొన్నాళ్లు పనికి పంపించాడు తండ్రి. సెకండ్ ఛాన్స్ ఎడ్యుకేషన్ టీమ్ ఆ ఊరు వచ్చినప్పుడు ఎవరో చెబితే ఖుష్బూ వెళ్లి వాళ్లను కలిసింది. వాళ్ల స్టడీ ప్రోగ్రాంలో చేరిపోయింది. ఇంటికి వచ్చి మరీ తండ్రికి నచ్చజñ ప్పి ఆ అమ్మాయికి స్టడీ బుక్స్ ఇచ్చి వెళ్లారు యు.ఎన్. వాళ్లు. హిందీ, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్ ఆమె సబ్జెక్టులు. కరోనా ఆమె చదువుకేమీ అంతరాయం కలిగించడం లేదు. కొరియర్లో పాఠాలు వస్తున్నాయి. వారం క్రితమే జూలై 15న ‘యూత్ స్కిల్స్ డే’ రోజు ఐక్యరాజ్యసమితి ‘ఉమెన్ ఇండియా’ విభాగం.. గీత, ప్రమీల, ఖుష్బూలను ‘పట్టుదల గల అమ్మాయిలు’ అని అభినందించింది. చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆడపిల్లను బడి మాన్పించి, పనిలో చేర్పిస్తే కుటుంబానికి ఆమె ఆసరా అవొచ్చు. తిప్పలు పడైనా ఆమెను చదివిస్తే ఆ తర్వాత కుటుంబానికి, సమాజానికి కూడా ఆమె ఇచ్చే ఆసరా ముందు ఇది చాలా స్వల్పం, స్వార్థం అనిపిస్తుంది. సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్ (ఎస్.సి.ఇ.) బడికెళ్లి చదువుకునే భాగ్యం అందరు ఆడపిల్లలకూ ఉండదు. పనికి వెళ్లి పది రూపాయలు సంపాదించుకు రావడమే వారి పుట్టుకకు పరమావధి అన్నట్లు ఉంటుంది. మన దేశంలో పదిహేనేళ్ల వయసు దాటిన ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు పనికి వెళితే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నవారే. వీళ్లను పని నుంచి చదువుకు మళ్లించి, పదిమందికి వీళ్లే పనిచ్చే చదువునూ చెప్పించి జీవితంలో నిలబడేలా చేస్తోంది ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’. ఈ చదువుల శిక్షణను ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ‘యు.ఎన్. ఉమెన్’ 2018 నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా ఇప్పిస్తోంది. చదువుకోవాలని ఆశ ఉండి చదువుకోలేకపోయిన వారికి, ఏదో ఒక పనితో జీవితాన్ని నెట్టుకొస్తూ.. సొంతంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతున్న వారికి ‘సెకండ్ చాన్స్ ఎడ్యుకేషన్’ ఉపయోగకరంగా ఉంటోంది. ఎడ్యుకేషన్ అంటే రెండూ.. పుస్తకాల ఎడ్యుకేషన్, ఉపాధి ఎడ్యుకేషన్. -
ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థిక వేత్తగా భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో రిటైరవుతున్న మౌరిస్ ఓస్ట్‌ఫెల్డ్ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఐఎమ్ఎఫ్ సోమవారం ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. భారత్‌లో పుట్టి, పెరిగిన గీతా... ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వాషింగ్టన్ యూనివర్సిటీల నుంచి ఎమ్ఏ డిగ్రీలు సాధించారు. 2001లో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీ.హెచ్డీ పట్టా పొందారు. 2016లో ఆమె కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. మార్కెట్, ఉదారవాద విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆమెను ఆర్థిక సలహాదారుగా నియమించడాన్ని కొందరు కమ్యూనిస్టు నాయకులు తప్పుపట్టారు. కాగా ఆమె వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు. -
భరతమాత
సరిగ్గా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజు. అప్పుడే పుట్టిన ఒక పసికందు, వాన నీరు నిలిచేందుకు తీసి పెట్టుకున్న ఒక చిన్న గుంతలో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాడు కాదు, వదిలేసి పోయారు. ఆ గుంత సిమెంటు దిమ్మెతో కప్పేసి ఉంది. చెన్నైలోని వలసర్వాకమ్లో ఉండే గీత ఆ పసికందుని చూసి ఉండకపోతే ఏమయ్యేదో! ఎక్కణ్నుంచో అరుపు వినిపిస్తోందని తొంగి చూసింది గీత. ఆ గుంతలో, ఆ సిమెంటు దిమ్మె కింద కొట్టుకుంటున్నాడు ఆ పసికందు. గీత తన చేతిని ఆ గుంత లోపలికి పోనిచ్చి బాబుని బయటకు లాగింది. తల్లితో పంచుకున్న పేగు ఆ మెడను చుట్టుకొని ఇంకా అలాగే ఉంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించింది. బాబు ఇప్పుడు బాగున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తను కాపాడిన బాబుకి గీత ‘సుగంథిరమ్’ (స్వాతంత్య్రం అని.) అని పేరు పెట్టుకుంది. ఆమె సుగంథిరమ్ను బయటకు లాగుతూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఇండియాస్ డాటర్‌కు పెళ్లి సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : గీత గుర్తుందా! ఏడేళ్ల వయసులో ప్రమాదవశాత్తూ పాకిస్తాన్లోకి వెళ్లి 2015లో తిరిగి భారత్‌కు చేరుకున్న మూగ, బధిర గీతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గీతకు వరుడు కావలెను అని ఇటీవల ఫేస్బుక్లో ఇచ్చిన ప్రకటన చూసి ఇప్పటికే20 మంది పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు.వారిలో ఒక రచయిత, పురోహితుడు కూడా ఉన్నారు. గీత తల్లిదండ్రులను వెతకడంలో పాలుపంచుకున్న ఇండోర్‌కు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్ ఫేస్బుక్లో... ఇండియాస్ డాటర్ గీతకు 25 ఏళ్లకు పైగా వయసు గల గుణవంతుడు, అందంగా ఉన్న మూగ అబ్బాయి కావాలని ప్రకటన ఇవ్వగా స్పందన వచ్చింది. అంతేకాదు వరుడిని స్వయం గా గీత ఎంపిక చేసుకుంటుందని కూడా అందులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటామని బయోడేటా పంపిన వారిలో 12 మంది దివ్యాంగులు , ఉండగామిగతా వారు సలక్షణంగా ఉన్నారని జ్ఞానేంద్ర అన్నారు.గీతను మాతృభూమికి రప్పించడంలో కీలకపాత్ర పోషించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పురోహిత్‌కు గీతకు సంబంధం కుదిర్చే పని అప్పగించారు. -
ముఖ్యమంత్రే ఆమె పెళ్లి పెద్ద!
భోపాల్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2015 అక్టోబర్‌లో పాకిస్తాన్ నుంచి స్వదేశం తిరిగొచ్చిన గీత అనే యువతి వివాహాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘనంగా నిర్వహించనున్నారు. సీఎం శివరాజ్ స్వయంగా ఆమెకు సంబంధం చూసి కన్యాదానం చేయున్నట్లు విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం తెలిపారు. విదిశ ఎంపీ అయిన సుష్మా భోపాల్ వెళ్లినప్పుడు తరచుగా గీతను కలిసేవారు. ఈ క్రమంలో ఆమె వివాహ విషయాన్ని ఆమెతో ప్రస్తావించేవారు. గత బుధవారం గీతను సుష్మా మరోసారి కలిసి ఆమె పెళ్లి విషయాలు సీఎం శివరాజ్ చూసుకుంటారని హామీఇచ్చారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శనివారం భోపాల్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ ఆయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్ధతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సుష్మా స్వరాజ్, గీతను తీసుకెళ్లారు. కోవింద్, సీఎం శివరాజ్‌లు గీత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇండోర్‌లో గీత భాగోగులు చేస్తున్న అకాడమీ వారు బీజేపీ నేతలతో గీత(25) పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. సీఎం శివరాజ్ గీతకు సంబంధం చూసి కన్యాదానం చేస్తారని సుష్మాస్వరాజ్ చెప్పారు. మరోవైపు గీత మాట్లాడుతూ.. మరోసారి తాను పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తేలేదని అన్నారు. 'నేను భారతీయురాలిని. మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టాను. అందుకే భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నానని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం గీత హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకుంటోందని ఇండోర్ అకాడమీ అధ్యక్షుడు మురళీధర్ థమణి తెలిపారు. పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన గీత 2003లో దారితప్పి పాకిస్థాన్ చేరుకుంది. లాహార్ రైల్వేస్టేషన్లో పాక్ రేంజర్లు ఆమెను గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్లు పాక్‌లోని ఈధీ ఫౌండేషన్ ఆమె బాధ్యతలు చూసుకుంది. సుష్మాస్వరాజ్ జోక్యంతో ఎట్టకేలకు 2015 అక్టోబర్ 26న గీత భారత్‌కు చేరుకుంది. అప్పటినుంచి గీత తల్లిదండ్రుల కోసం అధికారులు తీవ్రంగా యత్నిస్తున్న ప్రయోజం లేకపోయింది. ఆమె పెళ్లి బాధ్యతలను సీఎం శివరాజ్ చౌహాన్ స్వీకరించారు. -
గీతా తమ కూతురే అన్నజంటకు DNA పరీక్ష
-
ప్రేమించి పెళ్లి చేసుకొని..
ప్రేమించి పెళ్లి చేసుకొని కడదాక తోడుంటానని మాటిచ్చిన భర్త, భార్యపై అనుమానంతో.. అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో మంగళ వారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గీత(32)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గత కొంతకాలంగా ఆమెను వివాహేతర సంబంధం పేరిట హింసిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గీత తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
'గీతా' గానం చిరస్మరణీయం!
ఓ ప్రత్యేకమైన హస్కీ వాయిస్ తో పాటలు పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్. ఆమె మరణించడం ఎంతో విషాదకరం. ఆమె మృతిచెంది 44 సంవత్సరాలయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం అంటూ గాన కోకిల లతామంగేష్కర్ గుర్తు చేసుకున్నారు. జూలై 19న గీతా మరణించిన రోజు కావడంతో ఆమెను ఎంతో మిస్ అయ్యాం అంటూ లతా తన జ్ఞాపకాలను ట్వీట్ లో పంచుకున్నారు. గీతా దత్ ఎంతో మంచి గాయకురాలని, అభిమానుల మనసులో నిలిచిపోయిన 'హమ్ పంఛీ మస్తానే', 'అంకియాన్ భూల్ గయీహై సోనా', 'క్యా బతావూం మొహబ్బత్ హై క్యా' వంటి ఎన్నో యుగళ గీతాలను ఆమెతో కలసి పాడానని గీతా పుణ్యతిథిరోజున లతా మంగేష్కర్ గుర్తుకు తెచ్చుకున్నారు. గీతా లేకుండా 44 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటూ లతా ట్వీట్ చేశారు. 1947 నుంచి దత్ తనకు ఎంతో మంచి స్నేహితురాలని లతా మంగేష్కర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 86 ఏళ్ళున్న మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్.. 1959 లో విడుదలైన చిత్రం 'కాగజ్ కే ఫూల్' లో దత్ పాడిన పాట.. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' లింకు ను తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. గీతా దత్ జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడినవి మాత్రం అభిమానులు ఎన్నటికీ మరువలేనివే. ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. 1930 నవంబర్ లో పుట్టిన గీతా దత్.. 1972 జూలైలో లివర్ సిరోసిస్ తో మరణించారు. -
సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించండి
-
నవదంపతులు గల్లంతు
పీలేరు మండలం నాలేవాండ్లపల్లి వద్ద కాజ్వే దాటుతుండగా వరద నీటిలో నవదంపతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు సదుం మండలం తిమ్మానాయుని పల్లె గ్రామానికి చెందిన సురేష్(26), గీత(18)గా గుర్తించారు. సురేష్ ఆర్మీ ఉద్యోగి. నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. పీలేరులోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టారు. భారీగా వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయమేర్పడింది.