
సరిగ్గా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రోజు. అప్పుడే పుట్టిన ఒక పసికందు, వాన నీరు నిలిచేందుకు తీసి పెట్టుకున్న ఒక చిన్న గుంతలో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాడు కాదు, వదిలేసి పోయారు. ఆ గుంత సిమెంటు దిమ్మెతో కప్పేసి ఉంది. చెన్నైలోని వలసర్‌వాకమ్‌లో ఉండే గీత ఆ పసికందుని చూసి ఉండకపోతే ఏమయ్యేదో! ఎక్కణ్నుంచో అరుపు వినిపిస్తోందని తొంగి చూసింది గీత.
ఆ గుంతలో, ఆ సిమెంటు దిమ్మె కింద కొట్టుకుంటున్నాడు ఆ పసికందు. గీత తన చేతిని ఆ గుంత లోపలికి పోనిచ్చి బాబుని బయటకు లాగింది. తల్లితో పంచుకున్న పేగు ఆ మెడను చుట్టుకొని ఇంకా అలాగే ఉంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించింది. బాబు ఇప్పుడు బాగున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తను కాపాడిన బాబుకి గీత ‘సుగంథిరమ్’ (స్వాతంత్య్రం అని.) అని పేరు పెట్టుకుంది. ఆమె సుగంథిరమ్‌ను బయటకు లాగుతూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment