హల్ద్వానీ: కర్వా చౌత్ వ్రతాన్ని ఉత్తరాది మహిళలు ఆదివారం(అక్టోబర్ 20)న అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ ఇంటింటా కర్వాచౌత్ సందడి కనిపించింది. అయితే హల్ద్వానీ నగరంలో ఈ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆకర్షించింది. ఒక మహిళ తన భర్త వీపుపై గోరింటతో ‘వైద్య కళాశాల ఆస్తి’ అని రాశారు. దీని వెనుక ఆమె ఉద్దేశమేమిటనే విషయానికొస్తే..
హల్ద్వానీలోని కుంతీపురం హిమ్మత్‌పూర్ తల్లా నివాసి గీతా మిశ్రా శరీర దాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే కర్వాచౌత్ సందర్భంగా తన భర్త వీపుపై మెహెందీతో ‘మెడికల్ కాలేజీ ఆస్తి’ అని రాసి, తమ సందేశాన్ని అందరికీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరణానంతరం శరీరాన్ని ఏదైనా ఉపయోగకరమైన పనులుకు వినియోగించాలన్నారు. హల్ద్వానీ వైద్య కళాశాలకు మృత శరీరాన్ని అప్పగిస్తే, వైద్య విద్యార్థులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇంతేకాదు.. మరణించ తరువాత కూడా మన శరీరం సదుపయోగం అవుతుందని పేర్కొన్నారు.
గీతా మిశ్రా భర్త డాక్టర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ 2013లోనే తమ కుటుంబ సభ్యులంతా దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారన్నారు. ఇలాగే తాము నేత్రదానం, అవయవదానం మొదలైనవాటిపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ దిశగా ఆలోచించేవారు మరిన్ని వివరాల కోసం వారికి సమీపంలోగల మెడికల్ కాలేజీలను సంప్రదించాలని మిశ్రా సూచించారు.
ఇది కూడా చదవండి: ‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment