
ఇండియాస్ డాటర్ గీత (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : గీత గుర్తుందా! ఏడేళ్ల వయసులో ప్రమాదవశాత్తూ పాకిస్తాన్‌లోకి వెళ్లి 2015లో తిరిగి భారత్‌కు చేరుకున్న మూగ, బధిర గీతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గీతకు వరుడు కావలెను అని ఇటీవల ఫేస్‌బుక్‌లో ఇచ్చిన ప్రకటన చూసి ఇప్పటికే20 మంది పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు.వారిలో ఒక రచయిత, పురోహితుడు కూడా ఉన్నారు. గీత తల్లిదండ్రులను వెతకడంలో పాలుపంచుకున్న ఇండోర్‌కు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్ ఫేస్‌బుక్‌లో... ఇండియాస్ డాటర్ గీతకు 25 ఏళ్లకు పైగా వయసు గల గుణవంతుడు, అందంగా ఉన్న మూగ అబ్బాయి కావాలని ప్రకటన ఇవ్వగా స్పందన వచ్చింది. అంతేకాదు వరుడిని స్వయం గా గీత ఎంపిక చేసుకుంటుందని కూడా అందులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటామని బయోడేటా పంపిన వారిలో 12 మంది దివ్యాంగులు , ఉండగామిగతా వారు సలక్షణంగా ఉన్నారని జ్ఞానేంద్ర అన్నారు.గీతను మాతృభూమికి రప్పించడంలో కీలకపాత్ర పోషించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పురోహిత్‌కు గీతకు సంబంధం కుదిర్చే పని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment