marriage proposals
-
వరుడు కావలెను.. లైఫ్ లాంగ్ కాదంట.. బిగ్ ఆఫర్ ఇదే..
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. వారి మాటలను పట్టించుకోకుండా కొందరు పెడచెవిన పెడతారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఆమె వయసు 35 ఏండ్లు. ఇప్పటి వరకు డేటింగ్లో మునిగి తేలింది. ఇక, పుణ్య కాలం గడిపోయాక వరుడు కావలెను అని కోరుకుంటోంది. ఈ క్రమంలో తనకు భర్తను వెతికిపెట్టిన వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. వివరాల ప్రకారం.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్(35).. కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తుంది. కానీ ఒంటరిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విరక్తి రావడంతో.. తనకంటూ ఓ తోడు ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో తనకు పది లక్షల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ వేదికగా.. కౌల్సన్ ప్రకటన చేసింది. తనకు భర్తను వెతికి పెడితే 5 వేల డాలర్లు(రూ. 4,10,462) బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. ఇదే సమయంలో కొన్ని కండీషన్స్ కూడా ఆమె పెట్టింది. మీరు వెతికిపెట్టే భర్తతో ఎక్కువ కాలం ఉండలేను. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉండి, ఆ తర్వాత విడాకులు ఇస్తాను అంటూ మెలిక పెట్టి ట్విస్ట్ ఇచ్చింది. అంతే కాకుండా తన డ్రీమ్ బాయ్ ఇలా ఉండాలని చెప్పుకొచ్చింది. వరుడికి ఉండాల్సిన స్పెషల్ లక్షణాలివే.. - 27 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. - ఎత్తు 5 అడుగులపైనే ఉండాలి. - పిల్లలు, జంతువులతో పాటు ఆటలను ప్రేమించాలి. - అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. - ఎత్తుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాననంటే తాను పొడవుగా ఉంటాను కాబట్టి.. అతను కూడా ఎత్తుగా ఉంటేనే మంచిదని తెలిపింది. - హీల్స్ ధరించొద్దని గతంలో డేటింగ్ చేసిన వ్యక్తులు నన్ను అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. - డ్రగ్స్ కూడా తీసుకోవద్దని చెప్పింది. - ఇక ఫైనల్‌గా పెళ్లైన తర్వాత రిజిస్ట్రేషన్ పేపర్‌పై సంతకం చేసిన తర్వాత తనకు పెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి తాను చెప్పిన విధంగానే నగదు బహుమతిని అందిస్తానని కౌల్సన్ ప్రకటించింది. I’m offering a $5,000 referral bonus to anyone who finds me a husband https://t.co/T3ntYQmj5A pic.twitter.com/D6mwMsKRGn — New York Post (@nypost) July 11, 2023 -
యువతులే అతడి టార్గెట్.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్ బ్యాచిలర్..
ధనవంతుడిలా కటింగ్ ఇచ్చాడు ఓ కన్నింగ్ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్ బ్యాచ్‌లర్‌గా కలరింగ్ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్సైట్లను టార్గెట్‌ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ఫ్రొఫైల్ సెట్ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాడు. యువతి టచ్‌లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు. అయితే, తాజాగా విశాల్ మ్యాట్రిమోనీ ప్రోఫైల్ చూసి పెళ్లి విషయమై గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్‌నెస్ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్‌ఫోన్స్ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్‌కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేపించి విశాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్ బ్యాచిలర్ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్ తిన్నారు. -
రెండేళ్లుగా సంబంధాల కోసం ఎదురుచూపు.. ఎంతకీ కుదరకపోవడంతో
ఇచ్చోడ: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఆశాబీ (22) రెండేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ రద్దవుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆషాబీ మనస్తాపంతో దిగాలుగా ఉంటోంది. ఇక తనకు పెళ్లి కాదేమోనని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి అబ్దుల్ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! చదవండి: కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి -
ప్రియుడి నాటకంతో శానిటైజర్ తాగి ప్రియురాలి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు... సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన అలవాల డేవిడ్‌రాజు, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూష(18) సిరిసిల్లలో డిప్లొమా చదువుతోంది. కరోనా కారణంగా క్లాసులు లేకపోవటంతో గతేడాది నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోందని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష అమ్మమ్మ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉండటంతో అక్కడకు వస్తూపోతూ ఉండేది. ఈ క్రమంలో అదే ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న బండి భాస్కర్‌రావు, వెంకటమ్మల కుమారుడు జగదీష్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత జగదీష్ పెళ్లికి నో చెప్పడంతో.. మనస్తాపానికి గురైన ప్రత్యూష ఏప్రిల్‌లో 30న హైదరాబాద్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందింది. దీంతో ప్రియుడు జగదీష్ కారణంగానే ప్రత్యూష మృతి చెందిందని బషిర్‌బాగ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తుంబూరులో నివాసం ఉంటున్న ప్రియుడు జగదీష్ ఇంటి ఎదుట మంగళవారం ప్రత్యూష మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో జగదీష్, తల్లిదండ్రులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి, ధర్నాను విరమింపజేశారు. -
ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రాఘవ్ చదాకు ఓట్ల సంగతేమో కానీ పెళ్లి సంబంధాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రపోజల్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరి ఇవి ఓట్ల రూపంలో ఎంతవరకూ మారతాయో తెలియకపోయినా ఇప్పటివరకూ కనీసం 12 పెళ్లి ప్రతిపాదనలు ముందుకొచ్చాయని ఆయన సోషల్ మీడియా బృందం వెల్లడించింది. వృత్తి రీత్యా సీఏ అయిన 31 సంవత్సరాల రాఘవ్ చదా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఆప్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజూ పలు రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్న క్రమంలో ఆయా సభల ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియా టీం తన ఇన్స్టాగ్రాం, ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. మహిళా ఫాలోయర్ల నుంచి చదాకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని ఆయన సోషల్‌మీడియా బృందం పేర్కొంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోయర్ చదాకు ప్రపోజ్ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చదా తెలివిగా బదులిచ్చారని తెలిపింది. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్‌కు వెళ్లగా అక్కడున్న టీచర్ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చదాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్ మీడియా బృందం పేర్కొంది. ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్ నేత ఇన్‌స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్లో మరో మహిళ చదాను ఉద్దేశించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎరౌండ్ అంటూ ఓ స్టోరీని షేర్ చేశారు. చదాపై బీజేపీ సీనియర్ నేత ఆర్పీ సింగ్ పోటీచేస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యంత పిన్న వయసు కలిగిన పాతికేళ్ల రాకీ తుసీడ్ బరిలో నిలిచారు. చదవండి : మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు.. -
ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. తన మొదటి చిత్రం విడుదలైన తర్వాత వేల సంఖ్యలో పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని వెల్లడించాడు. పాపులర్ టీవీ కార్యక్రమంలో కపిల్ శర్మ షోలో ఈ విషయం చెప్పాడు. ‘కహోనా ప్యార్ హై’ సినిమా విడుదలైన తర్వాత తనకు 30 వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్ వచ్చినట్టు హృతిక్ తెలిపాడు. 2000లో విడుదలైన ‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో వెండితెరకు అతడు పరిచయమయ్యాడు. అదే ఏడాది తన చిన్ననాటి స్నేహితురాలు సుశానే ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరిద్దరూ విడిపోయారు. ‘కహోనా ప్యార్ హై’ సినిమా సూపర్‌హిట్ కావడంతో హృతిక్ రోషన్, అమిషా పటేల్ ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యారు. రాకేశ్ రోషన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా 2000లో అత్యధిక గ్రాస్వసూళ్లు సాధించి, ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. అంతేకాకుండా ఏడాది కాలంలో 92 పురస్కారాలు దక్కించుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. గత 20 ఏళ్లలో బాలీవుడ్లో వచ్చిన సినిమాల్లో బెస్ట్‌గా నిలిచింది. హృతిక్ తాజా చిత్రం ‘వార్’ విడుదలకు సిద్ధమైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
ఇండియాస్ డాటర్‌కు పెళ్లి సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : గీత గుర్తుందా! ఏడేళ్ల వయసులో ప్రమాదవశాత్తూ పాకిస్తాన్లోకి వెళ్లి 2015లో తిరిగి భారత్‌కు చేరుకున్న మూగ, బధిర గీతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గీతకు వరుడు కావలెను అని ఇటీవల ఫేస్బుక్లో ఇచ్చిన ప్రకటన చూసి ఇప్పటికే20 మంది పెళ్లి చేసుకుంటామని ముందుకు వచ్చారు.వారిలో ఒక రచయిత, పురోహితుడు కూడా ఉన్నారు. గీత తల్లిదండ్రులను వెతకడంలో పాలుపంచుకున్న ఇండోర్‌కు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్ ఫేస్బుక్లో... ఇండియాస్ డాటర్ గీతకు 25 ఏళ్లకు పైగా వయసు గల గుణవంతుడు, అందంగా ఉన్న మూగ అబ్బాయి కావాలని ప్రకటన ఇవ్వగా స్పందన వచ్చింది. అంతేకాదు వరుడిని స్వయం గా గీత ఎంపిక చేసుకుంటుందని కూడా అందులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటామని బయోడేటా పంపిన వారిలో 12 మంది దివ్యాంగులు , ఉండగామిగతా వారు సలక్షణంగా ఉన్నారని జ్ఞానేంద్ర అన్నారు.గీతను మాతృభూమికి రప్పించడంలో కీలకపాత్ర పోషించిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పురోహిత్‌కు గీతకు సంబంధం కుదిర్చే పని అప్పగించారు. -
ఒకరికోసం మరొకరు అన్నట్టుగా..
వరుసకు వారు అక్కాచెల్లెళ్లు.. చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు.. ఒకరి సుఖదుఃఖాలను మరొకరు పంచుకుంటూ వచ్చారు. మృత్యువులోనూ వీరి బంధం వీడిపోలేదు. ఒకరికోసం మరొకరు అన్నట్టుగా.. ఇద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లా నేరడిగొండ మండలం బొందిడి గ్రామానికి చెందిన ఆడె కమల్‌సింగ్, భీంసింగ్ అన్నదమ్ములు. వీరి కూతుళ్లు ఆడె అంజుల (18), ఆడె అర్చన (19) అక్కాచెల్లెళ్లు అయినప్పటికీ చిన్ననాటి నుంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు. 7వ తరగతి చదివిన అంజుల ఆ తర్వాత చదువులను కొనసాగించలేదు. అర్చన మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వీరిద్దరు గురువారం ఆత్మహత్యాయత్నం చేయగా, శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. అంజులకు ఆదివారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. తనకు పెళ్లి కొడుకు నచ్చలేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయినా వారు వినకుండా వివాహం నిశ్చయం చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంజుల తన చినాన్న కూతురైన అర్చనను వెంటబెట్టుకొని బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నేరడిగొండ పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల క్రితం వీరిద్దరు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలు మార్గంలో ఆదిలాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఇచ్చోడ, ఆ తర్వాత సిరికొండకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. గురువారం సిరికొండ మండల కేంద్రం సమీపంలో ఇద్దరు యువతులు క్రిమిసంహారక మందు తాగారు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అంజుల మృతి చెందారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రభాస్‌కు 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్!
‘బాహుబలి’సినిమాలతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ సూపర్ స్టార్‌గా మారిపోయారు. ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన ఛరిష్మా ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అతన్ని జాతీయ స్టార్‌గా నేషనల్ మీడియా ఆకాశానికెత్తుతుండగా.. ప్రభాస్ మాత్రం విన్రమంగా తాను అంతటి స్టార్‌ను కాదని అంటున్నాడు. మరోవైపు ప్రభాస్ గురించి, అతని సినీ కెరీర్ గురించి, ఇష్టాయిష్టాల గురించి పలు ఆసక్తికర కథనాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌కు అక్షరాల ఆరువేల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయట. కానీ బాహుబలి ప్రాజెక్టు మీద ఫోకస్ కొనసాగించేందుకు ఈ ప్రతిపాదనలన్నింటినీ డార్లింగ్ వదిలేసుకున్నాడని తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఇక, ‘బాహుబలి-2’ షూటింగ్ సందర్భంగా ఓ సంస్థకు ప్రచారకర్తగా ఉండాలంటూ రూ. 10 కోట్ల ఆఫర్ ప్రభాస్‌కు వచ్చింది. కానీ బాహుబలి నుంచి దృష్టి మళ్లించడం ఇష్టంలేని ప్రభాస్ ఆ ఆఫర్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అంతేకాదు ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో వచ్చిన పలు బాలీవుడ్ ఆఫర్లను సైతం అతను సున్నితంగా తిరస్కరించాడు. అది ఆయన అంకితభావానికి నిదర్శనం. ఇక ప్రభాస్‌కు కొంచెం సిగ్గు ఎక్కువ. ఆడంబరాలకు దూరంగా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తాడు. అతను మంచి ప్రకృతి ప్రేమికుడు. పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు. వృత్తిపట్ల నిబద్ధత ఎక్కువ. బాహుబలి సినిమాలో శివుడి పాత్ర కోసం 82 కిలోల నుంచి 87 కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్.. అదే బాహుబలి కోసం105 కేజీల వరకు బరువు పెరిగాడు. బాహుబలి ప్రాజెక్టు కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. 600 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు.