Los Angeles Eve Tilley Coulson Announced Rs 4 Lakh To Anyone Who Can Search Groom For Wedding - Sakshi
Sakshi News home page

ఆమెకు 35.. వరుడు కావాలంటూ ప్రకటన.. బిగ్‌ ఆఫర్‌ అంటే ఇదేనేమో.. 

Published Thu, Jul 13 2023 9:35 PM | Last Updated on Fri, Jul 14 2023 12:08 PM

Los Angeles Eve Tilley Coulson Announced Search Groom For Wedding - Sakshi

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. వారి మాటలను పట్టించుకోకుండా కొందరు పెడచెవిన పెడతారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఆమె వ‌య‌సు 35 ఏండ్లు. ఇప్పటి వరకు డేటింగ్‌లో మునిగి తేలింది. ఇక, పుణ్య కాలం గడిపోయాక వరుడు కావలెను అని కోరుకుంటోంది. ఈ క్రమంలో తనకు భర్తను వెతికిపెట్టిన వారికి భారీ ఆఫర్‌ ప్రకటించింది. 

వివరాల ప్రకారం.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్స‌న్(35).. కార్పొరేట్ లిటిగేష‌న్ అటార్నీగా ప‌ని చేస్తుంది. కానీ ఒంట‌రిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విర‌క్తి రావ‌డంతో.. త‌న‌కంటూ ఓ తోడు ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో త‌న‌కు ప‌ది ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు ఉన్న టిక్ టాక్ వేదిక‌గా.. కౌల్స‌న్ ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌కు భ‌ర్త‌ను వెతికి పెడితే 5 వేల డాల‌ర్లు(రూ. 4,10,462) బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది.

ఇదే సమయంలో కొన్ని కండీషన్స్‌ కూడా ఆమె పెట్టింది. మీరు వెతికిపెట్టే భ‌ర్త‌తో ఎక్కువ కాలం ఉండ‌లేను. కేవ‌లం 20 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉండి, ఆ త‌ర్వాత విడాకులు ఇస్తాను అంటూ మెలిక పెట్టి ట్విస్ట్‌ ఇచ్చింది. అంతే కాకుండా తన డ్రీమ్‌ బాయ్‌ ఇలా ఉండాలని చెప్పుకొచ్చింది. 

వరుడికి ఉండాల్సిన స్పెషల్‌ లక్షణాలివే..
- 27 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి. 
- ఎత్తు 5 అడుగులపైనే ఉండాలి. 
- పిల్ల‌లు, జంతువుల‌తో పాటు ఆట‌ల‌ను ప్రేమించాలి.
- అర్థం చేసుకునే మ‌న‌స్త‌త్వం ఉండాలి. 
- ఎత్తుకు ఎందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌నంటే తాను పొడ‌వుగా ఉంటాను కాబ‌ట్టి.. అత‌ను కూడా ఎత్తుగా ఉంటేనే మంచిద‌ని తెలిపింది. 
- హీల్స్ ధ‌రించొద్ద‌ని గ‌తంలో డేటింగ్ చేసిన వ్య‌క్తులు న‌న్ను అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు.
- డ్ర‌గ్స్ కూడా తీసుకోవ‌ద్ద‌ని చెప్పింది. 
- ఇక ఫైనల్‌గా పెళ్లైన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్ పేపర్‌పై సంత‌కం చేసిన త‌ర్వాత త‌న‌కు పెళ్లి సంబంధం చూసిన వ్య‌క్తికి తాను చెప్పిన విధంగానే న‌గ‌దు బ‌హుమ‌తిని అందిస్తాన‌ని కౌల్స‌న్ ప్ర‌క‌టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement