లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు ఓటు వేసినందుకు తనకు పెళ్లి చేయాలని కోరాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో, వారి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. యూపీలోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ పర్యటించిన అనంతరం.. బ్రిజ్‌భూషణ్ తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద కారును ఆపారు. ఈ సందర్భంగా అక్కడే పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే.. ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు వచ్చారు.
అయితే, అఖిలేంద్ర ఖరే తనను ఏదైనా అడిగేందుకు వస్తున్నాడని ఎమ్మెల్యే భావించారు. ఇంతలో ఎమ్మెల్యే వద్దకు వచ్చిన అఖిలేంద్ర.. సర్ నా ఓటు మీకే వేశాను. దయచేసి నాకు పెళ్లి చేయండి ప్లీజ్ అని అడిగాడు. దీంతో, ఖంగుతున్న ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్.. నీ వయసెంత అని అడిగాడు.. 44 అని చెప్పడంతో.. మరి ఎలాంటి అమ్మాయి కావాలేంటి? అని ఎదురు ప్రశ్న వేశారు.
దానికి ఖరే బదులిస్తూ.. కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దని సమాధానం ఇవ్వగా.. అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదని, ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పుకొచ్చారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: వయనాడ్‌లో ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
Comments
Please login to add a commentAdd a comment