లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మేయర్ ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను రక్తదానం చేయకపోయినా రక్తం ఇస్తున్నట్టు నటించడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రక్తదానం చేసేందుకు చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, శిబిరంలో పాల్గొనేందుకు మొరదాబాద్ పట్టణ మేయర్ వినోద్ అగర్వాల్ కూడా అక్కడికి వచ్చారు. అయితే, వచ్చిన వ్యక్తి రక్తదానం చేయకుండా ఓవరాక్షన్ చేశారు. అయితే ఆయన రక్తదానం ఇచ్చినట్టు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
Uttarpradesh, Moradabad
BJP mayor Vinod Agarwal did a fake for blood donation on the occasion of the Birthday of PM Narendra Modi.
I am remembering that signature acting if you know. pic.twitter.com/6QhDaNmo0B— Mr.Haque (@faizulhaque95) September 20, 2024
అక్కడ రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసిన బెడ్‌పై పడుకుని రక్తం ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా డాక్టర్‌తో మాట్లాడుతూ.. తాను రక్తం ఇవ్వట్లేదని, కేవలం ఫోటోలు మాత్రమే దిగుతానని చెప్పి ఫోజు ఇచ్చాడు. అనంతరం బెడ్‌పై నుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, రక్తదానం ఇచ్చినట్టు దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాకుండగా.. రక్తదానం చేసి మీ బాధ్యతను నెరవేర్చండి అని రాసుకొచ్చారు. దీంతో మేయర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉంది ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఆయనపై వస్తున్న తీవ్ర విమర్శలకు తాజాగా మేయర్ స్పందించారు. తాను డయాబెటిక్ పేషంట్ అని చెప్పుకొచ్చారు. అందుకే తాను రక్తదానం చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అర్బన్ నక్సల్స్, తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment