ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇంతకు ముందు వారంలో 70 పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్‌మెంట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు.
ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది.
పీటీఐ ఫ్యాక్ట్ చెక్(PTI Fact Check)లో నెట్టింట్ హల్‌చల్ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్‌గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్‌గా ఎడిట్ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment