ఇచ్చోడ: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఆశాబీ (22) రెండేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ రద్దవుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆషాబీ మనస్తాపంతో దిగాలుగా ఉంటోంది.
ఇక తనకు పెళ్లి కాదేమోనని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి అబ్దుల్ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!
చదవండి: కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి
Comments
Please login to add a commentAdd a comment