![Skate Boarder Zheng Haohao Becomes The Youngest Person In Paris Olympics](/styles/webp/s3/article_images/2024/08/9/young.jpg.webp?itok=6CewZ7D8)
యంగ్ టాలెంట్..
స్కేట్ బోర్డర్ 'జెంగ్ హావోహావో'
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్‌లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్‌బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్‌కు పేరు తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment