cancelled issue
-
రెండేళ్లుగా సంబంధాల కోసం ఎదురుచూపు.. ఎంతకీ కుదరకపోవడంతో
ఇచ్చోడ: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఆశాబీ (22) రెండేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ రద్దవుతున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆషాబీ మనస్తాపంతో దిగాలుగా ఉంటోంది. ఇక తనకు పెళ్లి కాదేమోనని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి అబ్దుల్ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! చదవండి: కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి -
బ్యాడ్ న్యూస్: ఒలింపిక్స్ వాయిదా?
టోక్యో: కరోనా వైరస్ కొత్త రూపం జపాన్‌లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కేసులు భారీగా నమోదవుతుండడంతో ఆ దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రస్తుతం తీవ్ర ఆంక్షలు ఆ దేశంలో అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం కొత్త వర్షన్ వెలుగులోకి రావడంతో విదేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాలా దేశాలకు విమాన సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్ రద్దయ్యే అవకాశం ఉంది. లేదా కొన్నాళ్లు వాయిదా వేసేలా ఉందని ఆ దేశంలో చేసిన సర్వే తెలుపుతోంది. దాదాపు 80 శాతం మంది టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలని ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ చేసిన సర్వేలో తేలింది. 35.3శాతం మంది వాయిదా వేయాలని చెప్పారు. వాస్తవానికి 2020 జూలైలో జరగాల్సి ఉండగా 2021కి వాయిదా వేశారు. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలంపిక్స్ రీ షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ క్రీడా సంబరాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. జపాన్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. 2లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదవగా.. 4 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడంతో ఆ దేశంలో తీవ్ర ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఒలంపిక్స్ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. సర్వే చేయగా ఒలంపిక్స్ రద్దుకు ఎక్కువ మంది మొగ్గు చూపగా.. వాయిదా వేయాలని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనా ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగే అవకాశం కనిపించడం లేదు. -
అదో తుగ్లక్ చర్య
పెద్ద నోట్ల రద్దుపై ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల విమర్శ రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపు దానవాయిపేట / కోటగుమ్మం (రాజమహేం ద్రవరం) : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ తుగ్లక్ చర్య అని వర్తక సంఘాలు, వివిధ పార్టీల నేతలు విమర్శించారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల సదస్సు నిర్వహించారు. 86 శాతం నగదును రద్దు చేసే ఆలోచన ఉన్నప్పుడు, తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆవిధంగా ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని చర్య కారణంగా 90 శాతం వ్యాపారం నష్టంలో నడుస్తోందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై దశలవారీగా ఉద్యమించాలని తీర్మానించారు. ఎక్కువ అవినీతి ప్రభుత్వ అధికారులవద్దే జరుగుతోందని ఆరోపించారు. ఆర్బీఐ కూడా అవకతవకలకు పాల్పడుతోందన్నారు. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలు అవినీతి డిపార్ట్మెంట్లుగా మారాయన్నారు. వర్తక రంగంలో వివిధ వర్గాలవారు, పలు రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నప్పటికీ.. వర్తకులకు సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఉద్యమించాలని పలువురు హితవు పలికారు. వర్తకులకు ఏ సమస్య తలెత్తినా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలంటే రాజమహేంద్రవరమే ప్రధాన కేంద్రమని, ఇక్కడి నుంచే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాణిజ్యం అస్తవ్యస్తంగా మారింది పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వర్తక, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారుల నుంచి చిన్న పరిశమ్రల వరకూ మూతపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సామాన్యులను బలి పశువులను చేసింది. – అశోక్‌కుమార్‌జైన్, కన్వీనర్, ఏపీ ఫెడరేష¯ŒS ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వ్యాపారాలు సన్నగిల్లాయి చిల్లర సమస్యతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. షాపుల అద్దెలు, గుమస్తాల జీతాలు ఇవ్వలేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – గ్రంధి బాబ్జీ, కాకినాడ ఛాంబర్ అధ్యక్షుడు అనాలోచిత నిర్ణయం నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పేదల బతుకుల్ని రోడ్డున పడేశారు. పెద్దలు ఒడ్డున పడ్డారు. మా వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. – కాలెపు రామచంద్రరావు, ఛాంబర్ గౌరవ కార్యదర్శి