అదో తుగ్లక్‌ చర్య | notes cancelled issue | Sakshi
Sakshi News home page

అదో తుగ్లక్‌ చర్య

Published Mon, Dec 19 2016 12:19 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM

notes cancelled issue

  • పెద్ద నోట్ల రద్దుపై ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల విమర్శ
  • రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపు
  • దానవాయిపేట / కోటగుమ్మం (రాజమహేం ద్రవరం) :
    పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ తుగ్లక్‌ చర్య అని వర్తక సంఘాలు, వివిధ పార్టీల నేతలు విమర్శించారు. రాజమహేంద్రవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల సదస్సు నిర్వహించారు. 86 శాతం నగదును రద్దు చేసే ఆలోచన ఉన్నప్పుడు, తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆవిధంగా ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని చర్య కారణంగా 90 శాతం వ్యాపారం నష్టంలో నడుస్తోందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై దశలవారీగా ఉద్యమించాలని తీర్మానించారు. ఎక్కువ అవినీతి ప్రభుత్వ అధికారులవద్దే జరుగుతోందని ఆరోపించారు. ఆర్‌బీఐ కూడా అవకతవకలకు పాల్పడుతోందన్నారు. సేల్స్‌ ట్యాక్స్, కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగాలు అవినీతి డిపార్ట్‌మెంట్లుగా మారాయన్నారు. వర్తక రంగంలో వివిధ వర్గాలవారు, పలు రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నప్పటికీ.. వర్తకులకు సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఉద్యమించాలని పలువురు హితవు పలికారు. వర్తకులకు ఏ సమస్య తలెత్తినా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలంటే రాజమహేంద్రవరమే ప్రధాన కేంద్రమని, ఇక్కడి నుంచే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
     
    వాణిజ్యం అస్తవ్యస్తంగా మారింది
    పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వర్తక, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారుల నుంచి చిన్న పరిశమ్రల వరకూ మూతపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల తీరు సామాన్యులను బలి పశువులను చేసింది.
    – అశోక్‌కుమార్‌జైన్, కన్వీనర్, ఏపీ ఫెడరేష¯ŒS ఆఫ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ
    వ్యాపారాలు సన్నగిల్లాయి
    చిల్లర సమస్యతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. షాపుల అద్దెలు, గుమస్తాల జీతాలు ఇవ్వలేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన స్వైపింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
    – గ్రంధి బాబ్జీ, కాకినాడ ఛాంబర్‌ అధ్యక్షుడు
    అనాలోచిత నిర్ణయం
    నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పేదల బతుకుల్ని రోడ్డున పడేశారు. పెద్దలు ఒడ్డున పడ్డారు. మా వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. 
    – కాలెపు రామచంద్రరావు, ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement