
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్‌లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్‌లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు)
సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్‌లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment