basara
-
బాసరలో వసంత పంచమి వేడుకలు
-
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్‌ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్‌తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్‌టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్‌ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
బాసర ఐఐఐటీలో కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య
-
బాసరలో ప్రారంభమైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తొలి విడతలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ చేస్తోంది. ఇక, బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలని మూడుచోట్ల నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం, బాసర, ఆలంపూర్ నుంచి యాత్రలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల్లో స్థానిక బీజేపీ నేతలు, లీడర్లు ఆ మార్గాల్లోనే పాల్గొననున్నారు. సుమారు 18 రోజులు పాటు బీజేపీ నేతల యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక్కో రూట్లో 36 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు. ఇక, బీజేపీ నేతల యాత్ర ప్రారంభం నుంచే ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కమలం పార్టీ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. అయితే, యాత్ర ముగింపు సభను సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీని కూడా ముగింపు సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన ముగింపు సభ కన్నా ముందే ఉండే నేపథ్యంలో యాత్రలు కూడా ముందుగానే ముగించాలనుకుంటున్నట్టు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: పవన్. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్ -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్‌పిలానీ ప్రొఫెసర్ మోహన్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ ఏఐ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
అక్కడ ఎందుకలా చనిపోతున్నారు?
నిర్మల్: విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి. ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. జూన్‌లోనే ఇద్దరు విద్యార్థి నులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం. బలవన్మరణాలు ఎందుకు? ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్లో.. అదీ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక(17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు. ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ–1 చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత జూన్ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయింది. లిఖిత మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం నాగాపూర్‌కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కౌన్సెలింగ్ చేస్తున్నారా.. విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పా ర్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్లతో కూడిన డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది.. నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరుగుతోంది.. అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్‌లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు. ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్‌కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్‌కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.. -
బబ్లూ ఎలా చనిపోయాడో చెప్పాలని తల్లిదండ్రుల డిమాండ్
-
బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబిత ఆరా
-
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్‌కుమార్‌తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
RGUKT బాసర VC ప్రొఫెసర్ వి.వెంకట రమణ మీట్ అండ్ గ్రీట్
-
బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!
భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డికి వివరించారు. కొత్త నమూనాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు. కృష్ణ శిలలతో నిర్మాణం... గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. -
సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు
బాసర (ముథోల్): బాసరలోని జ్ఞాన సరస్వతీదేవిపై భారతీయ నాస్తిక సంఘం రాష్ట్ర శాఖకు చెందిన రేంజర్ల రాజేశ్ అనే గాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం బాసరవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్థానిక రైల్వేస్టేషన్ చౌరస్తాలో బైఠాయించి రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమ్మవారిని వ్యంగ్య పదాలతో దూషించిన రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ తాత్కాలిక లేబర్ సొసైటీ సిబ్బంది సైతం అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం ఎదుట ధర్నా చేశారు. గ్రామస్తులతో కలసి ర్యాలీగా వెళ్లి.. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రాజేశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌పై ఐపీíసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. కాగా, సరస్వతీదేవిని దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. నరేశ్‌ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు కాళేశ్వరం: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే వికారాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన బైరి నరేశ్‌ను మహారాష్ట్ర పోలీసులు ఇదే తరహా కేసులో అరెస్టు చేశారు. అతన్ని గడ్చిరోలి జిల్లా సిరొంచ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతేడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో సిరొంచలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సిరొంచ, అహేరి తాలూకాల్లో అతనిపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను తిడితే వీపులు పగలకొట్టండి ఎంపీ సోయం బాపూరావ్ బోథ్: హిందూ దేవుళ్లను తిట్టినా.. కించపరిచినా వారి వీపులు పగలకొట్టాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దేవుల్‌నాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన జగదాంబదేవి జాతరలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు.. బాసరలో ఉద్రిక్తత
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో గ్రామస్థుల బంద్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదువుల తల్లి సరస్వతిపై రేంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచే స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు,స్కూల్స్ మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రేంజర్ల రాజేశ్ దిష్టిబోమ్మను దగ్దం చేశారు. పోలీసులకు ఫిర్యాదు.. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే బాసర పోలీస్ స్టేషన్లో రేంజర్ల రాజేశ్‌పై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్.. -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్‌ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసరలో చక్రేశ్వరి విగ్రహం గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బాసరలో అరుదైన జైన శిల్పాన్ని గుర్తించారు. ఇది జైన మతంలో ప్రాధాన్యమున్న శాసనదేవత చక్రేశ్వరి విగ్రహం కావటం విశేషం. బాసరలో ఇంద్రతీర్ధంగా పిలుచుకునే కుక్కుటేశ్వరాలయంలో ఈ విగ్రహం ఉంది. సుఖాసనస్థితిలో ఉన్న ఈ చతుర్భుజి విగ్రహం వెనక హస్తాలలో శంఖం, అకుశం ఉండగా.. ముందు కుడి చేయి అభయహస్తంగా, ఎడమచేయి ఫలంతో ఉంది. తలపై కిరీట మకుటం, తల వెనక ప్రభావళి, చెవి కుండలాలు, జైన తీర్థంకరులకు ఉండే త్రివళితాలు, మెడలో కంఠిక, హారం, కాళ్లకు కడియాలు, చేతులకు కంకణాలు ఉన్నాయని, ఇది 9 లేదా 10 శతాబ్దాలకు చెందిన రాష్ట్రకూట శైలి విగ్రహమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. తమ బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దీన్ని గుర్తించారని చెప్పారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపుల కలకలం
-
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్!
బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హాస్టల్ రూం నంబర్ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఆ గదిలోని నూతన వస్తువులైన బెడ్ కార్టులు, ట్యూబ్ లైట్లను పీయూసీ–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు. ఇటీవల డైరెక్టర్ సతీశ్‌కుమార్ హాస్టల్ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకూ సీనియర్ల ర్యాగింగ్ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు. -
బాబ్లీ గేట్ల మూసివేత
బాల్కొండ/బాసర (ముధోల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శనివారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేశారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరదలకు బ్రేకు పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 29న మూసి వేయాలి. పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీకి 0.6 టీఎంసీల నీటిని వదలాలి. అందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి క్రమంగా సాయంత్రం వరకు 14 గేట్లను మూసివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరితే మిగులు జలాలను బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు వదిలితే తప్ప మార్చి 1 వరకు గేట్లను ఎత్తే అవకాశం లేదు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్ నిండుగా ఉండటంతో మళ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 8268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్లద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులతో నిండుగా ఉంది. -
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
బాసర ట్రిపుల్ ఐటీ రెండో జాబితా విడుదల
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో జాబితాను ఆదివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతలో 1,404 మంది విద్యార్థుల జాబితాలో గైర్హాజరైన 125 మందికి సంబంధించిన సీట్ల జాబితాను కళాశాల వెబ్సైట్లో పొందుపర్చారు. ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు రాష్ట్రేతర (గ్లోబల్ సీట్లు), దివ్యాంగులకు కేటాయించిన సీట్లతో పాటు స్పోర్ట్స్, కాప్ కేటగిరీకి చెందిన 95 సీట్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. 125 సీట్లకు సంబంధించి 7న, మిగిలిన కేటగిరీలకు సంబంధించిన 95 సీట్లకు ఈనెల 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మొదటి విడతలో 1,279 మంది విద్యార్థులు ప్రవేశం పొందార -
బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల
బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్ జాబితాను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ విడుదల చేశారు. జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం. మొదటిదశ కౌన్సెలింగ్ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవలే కళాశాల భవనంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే బాయ్స్ హాస్టల్–2లోని ఓ గదిలో శనివారం రాత్రి నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడిపడటంతో గదిలో పడుకున్న విద్యార్థి మెడ భాగంలో గాయాల య్యాయి. వెంటనే ఇతర విద్యార్థులు అధికా రులకు సమాచారం ఇవ్వడంతో వారు వర్సిటీ లోని ఆస్పత్రిలో విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించారు. ఫ్యాన్ తలపై పడి ఉంటే ఘోరం జరిగేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటిని పరిశీలించిన గవర్నర్ తమిళిసై
-
నిర్మల్ జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన
-
బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన విరమించిన విద్యార్థులు
-
మరోసారి ఆందోళన బాటలో బాసర IIIT విద్యార్థులు
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు సఫలం
-
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు విఫలం
-
ఆరో రోజుకు చేరిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన
-
బాసర ట్రిపుల్ ఐటీలో ౩వ రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన
-
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
-
బాసరలో పోటెత్తిన భక్తులు
-
హైదరాబాద్‌లో విషాదం.. విహారయాత్రకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల తరపున విహార యాత్రలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాలు.. స్థానిక సరస్వతి స్కూల్‌కు చెందిన 60 మంది విద్యార్థులు బాసర విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో గోదావరి నది ఒడ్డున తోటివారితో ఆడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఉదయం 5గంటలకు బాసరకు వెళ్లగా...12 గంటలకు మృతి చెందినట్లు పాఠశాల యాజమాన్యం తలిదండ్రులు ఫోన్ చేసి చెప్పింది. అయితే మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యుల వద్ద వదిలి వెళ్లింది. దీంతో విశాల్ మృతదేహంతో స్కూల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సరస్వతి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చదవండి: Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ కాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 సరస్వతి విద్యానికేతన్ తరఫునుంచి గత 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగానే బాసర క్షేత్రానికి తీసుకెళ్లిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. -
ఉప్పొంగుతున్న కృష్ణా, గోదావరి
భైంసా (ముధోల్)/ధరూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం నుంచి నది వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన హరిహర కాటేజ్ నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా నదిలో వరద ప్రవాహం మాత్రం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత బాసర ఆలయం వైపు వెళ్లే మార్గాన్ని సైతం ముంచెత్తింది. ఇదే మార్గంలో ఉన్న హరిహర కాటేజ్ నీట మునిగింది. అందులో ఉన్నవారంతా అప్రమత్తమై స్లాబుల పైకి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పడవల సాయంతో కాటేజ్ వద్దకు చేరుకుని 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతూ మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణ ఆలయానికి తాకింది. రైల్వే వంతెన నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న పొలాలన్నీ నీటమునిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు. జూరాలకు మళ్లీ వరద ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి 1,27,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని 11యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1,60,553 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీలు ఉంది. -
పునః ప్రారంభమైన బాసర శ్రీ జ్ఞ్యాన సరస్వతి ఆలయం
-
తల్లిదండ్రుల కోసం బాసర వచ్చిన ‘గీత’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: ‘డాటర్ ఆఫ్ ఇండియా’.. ‘బజరంగి భాయిజాన్’ గీత గుర్తుందా.. బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అప్పటి విదేశాంగ మంత్రి, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ఈ యువతి మంగళవారం బాసరకు వచ్చింది. తన తల్లిదండ్రులను వెతికే క్రమంలో ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారి సహకారంతో తన కుటుంబ సభ్యుల కోసం బాసరకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్‌లో 15 సంవత్సరాలు ఉంది. (చదవండి: అలసి విశ్రమించిన అలలు) సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చింది గీత. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్‌లో ఉంటున్న గీత తన చిన్నతనంలో తమ సైడ్ ఇడ్లీలు తినే వారని.. ధాన్యం ఎక్కువగా పండిచేవారని సైగలతో తెలిపింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం గీత తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. -
నాగుల పంచమి: కొండచిలువ కలకలం
సాక్షి, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు పొడవాటి కొండచిలువ శనివారం కనిపించింది. ఈ రోజు శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆలయం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. (పులికి చెమటలు పట్టించిన పైథాన్) అదే విధంగా ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా రెండు జంట నాగులు సయ్యాటలాడాయి. ఈ ఘటన చెక్ డ్యాం వద్ద చోటుచేసుకుంది. శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. -
బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం
-
బాసర: రేపటి నుంచి అర్జిత సేవలు బంద్
సాక్షి, బాసర(నిర్మల్): కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, మాల్స్, థియోటర్లు, రెస్టారెంట్లతో పాటు ప్రముఖ దేవాలయాలను కూడా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) వేములవాడ రాజన్న ఆలయం మూసివేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి(శనివారం) నుంచి అర్జిత సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారి చేసింది. (రాజన్న ఆలయం మూసివేత) ఇక రేపటి నుంచి భక్తులు ఆలయాలని రావోద్దని ఆలయ అధికారులు సూచించారు. ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, కుంకుమార్చన వివిధ అర్జిత సేవలు నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఇక ఆలయంలో వేకువ జామునే జరిగే సరస్వతి అమ్మవారి అభిషేకం, హారతి పూజలు యధావిధిగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు. -
బాసర ఆలయంలో పోటెత్తిన భక్తులు
-
కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసిన విద్యార్థులు
సాక్షి, ఆదిలాబాద్: బాసర రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా... అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా తెలుస్తోంది. -
లడ్డూ ప్రసాదంలో పురుగుల ఘటనపై అధికారుల ఆరా
-
బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయస్థాయి అవార్డు
బాసర: బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానంపై బాసర ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు వరించింది. రాజస్తాన్ ఎలేట్స్ టెక్నో ఆధ్వర్యంలో జైపూర్‌లో ఈనెల 24, 25వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్తాన్ ఉన్నత విద్య కమిషన్ కార్యదర్శి అశుతోష్ ఏటిపడేకర్ చేతుల మీదుగా బాసర ట్రిపుల్ ఐటీ అకడమిక్ డీన్ సాయినాథ్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మణిపూర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రులు, ఏఐసీటీఈ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ట్రిపుల్‌ఐటీలో పెరగనున్న సీట్లు!
బాసర(ముథోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2018–19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 500 సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2008లో 2000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల సీట్ల నుంచి వెయ్యి సీట్లకు కుదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పలుసార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో 6వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లు విద్యాభ్యాసం పూర్తి చేసిన వందలాదిమందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం 500 సీట్లు పెరగనుండడంతో గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగనుంది. సీట్ల పెంపు సమాచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసరకు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
అమెరికాలో ‘వసంత పంచమి’
నిర్మల్/బాసర: బాసర క్షేత్రం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది వసంత పంచమి వేడుకలకు ఏర్పాటు చేయటం.. ఇక్కడి నుంచి పూజసామగ్రి.. పూజారులను తరలించే యత్నం చేశారు. ఇప్పటికే పంపిణీ చేసిన కరపత్రం.. ఇక్కడి నుంచి పూజారులను, పూజా సామగ్రిని తరలించేయత్నం వంటి చర్యలన్నీ అధికారిక కార్యక్రమాన్ని తలపిస్తుండగా.. ఆలయ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదనడం చర్చనీయాంశంగా మారింది. బాసర దేవస్థానం పేరిట ఈనెల 20న అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే అక్కడ కరపత్రాలు పంపిణీ చేశారు. పూజాసామగ్రి కూడా దేవస్థానమే అందిస్తోందని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, అమెరికాలో పూజా కార్యక్రమాలకు ఇక్కడి ఆలయం నుంచి విగ్రహాలు, ఎలాంటి పూజాసామగ్రి, అర్చకులు వెళ్లడం లేదని ఈవో సోమయ్య పేర్కొన్నారు. ఆలయ రిటైర్డ్ ఈవో వెనకుండి ఈ కార్యక్ర మాన్ని జరిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కరపత్రంలో అతని పేరు ఇప్పటికీ ఈవోగానే ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులు, ఇద్దరు ఉద్యోగులను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, వారి వీసాలు రద్దు కావటంతో పక్క జిల్లాకు చెందిన అర్చకులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. -
సరస్వతీదేవి సాక్షిగా దోపిడీ పర్వం
నిర్మల్: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ సొమ్మును అక్కడ పని చేసే అధికారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆలయ ఉన్నత స్థాయి అధికారితో పాటు.. అతని తర్వాతి స్థాయి అధికారి ఓ పద్ధతిగా ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పనిమనిషి పేరిట బ్యాంకు ఖాతా తెరిచి ఈ దోపిడీ పర్వాన్ని ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. ఇలా ఇచ్చి.. ఇలా తీసుకుంటారు.. బాసరలో నిత్యపూజలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం వస్తువుల కొనుగోలుతో పాటు అనేక రకాల ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ దేవాదాయ శాఖ బిల్లులు తీసుకుని డబ్బులు చెల్లిస్తుంది. ఇదే విధానం ఇప్పుడు ఇక్కడి అధికారులకు కలిసి వస్తోంది. పూజా సామగ్రి, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాల నుంచి ముందుగా అధిక మొత్తంలో బిల్లులు తీసుకొని, ఆ మేరకు డబ్బులు చెల్లిస్తున్నారు. సదరు దుకాణదారులు తమకు రావాల్సిన అసలైన బిల్లు తీసుకుని, అదనంగా వచ్చిన డబ్బులను తిరిగి అధికారులు సూచించిన బినామీ వ్యక్తి ఖాతాలోకి జమ చేస్తారు. ఇలా సికింద్రాబాద్‌లోని ఓ జనరల్ దుకాణం, మహారాష్ట్రలోని మరో దుకాణం నుంచి ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి. బినామీ ఖాతాల నుంచి వాటాలు.. బినామీ వ్యక్తి ఖాతాల్లోకి నగదు చేరిన వెంటనే వాటాల పంపకాలు జరిగిపోతుంటాయి. ఆలయంలోని పెద్దసారు, చిన్నసారుతో పాటు వివిధ స్థాయిల ఉద్యోగులకూ ఇందులో వాటాలు ఉంటాయి. స్థాయిల వారీగా ఈ పంపకాలు జరుగుతాయి. ఇలా బినామీలను పెట్టుకుని కథంతా నడిపేది ఆలయంలో చిన్నసారే కనుక.. ఆయనకు కాస్త ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్లు సమాచారం. ఈ అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. తమ కుటుంబసభ్యుల ఖాతాల్లో వేసుకుంటారు. సిబ్బంది ఎరియర్సూ వదల్లేదు.. ఆలయం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఎరియర్స్నూ ఆలయ అధికారులు వదిలి పెట్టలేదు. 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.లక్షల్లో ఎరియర్స్ వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఆయా ఏజెన్సీలు అధికారుల బినామీ ఖాతాలో జమ చేయించుకున్నారు. ఎరియర్స్‌కు సంబంధించి డబ్బులో రూ.2 లక్షలను బినామీ వ్యక్తి ఆలయ ఉన్నతాధికారి కోడలి బ్యాంకు అకౌంట్లోకి చేర్చడం గమనార్హం. ఎవరికీ అనుమానం రాకుండా రూ.2 లక్షలు ఒకేసారి వేయకుండా ఐదుసార్లు రూ.40 వేల చొప్పున ఈ ఖాతాలో జమచేసినట్లు సమాచారం. ఇక అదే రోజు ద్వితీయ స్థాయి అధికారి ఎవరికీ అనుమానం రాకుండా తన బినామీకి సంబంధించిన ఏటీఎం కార్డు నుంచే డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి వారి స్థాయికి తగ్గట్లు డబ్బులు ముట్టినట్లు తెలిసింది. చిన్నసారే సూత్రధారి..! ఆలయంలో కొనసాగుతున్న అవినీతి పర్వానికి అక్కడ కొనసాగుతున్న ద్వితీయ స్థాయి అధికారి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలోనే అక్రమాలకు పాల్పడ్డాడన్న కారణంతో సస్పెండ్ చేసి, అనంతరం కొండగట్టుకు డిప్యుటేషన్‌పై పంపించారు. గోదావరి పుష్కరాలపుడు మళ్లీ పైరవీతో బాసరకే చేరుకున్నారు. అప్పుడు మళ్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో ఇలాంటి అధికారిని ఆలయానికి ఎందుకు తీసుకొచ్చారంటూ ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. ఇలా చేతులు మారాయి.. - 24–05–2017న మహారాష్ట్రకు చెందిన దుకాణదారుడి నుంచి బినామీ వ్యక్తి ఖాతా (ఎస్బీఐ 62211311029)లోకి రూ.1,50,000 జమ అయ్యాయి. అదేరోజు బినామీ వ్యక్తి తన ఖాతాలో నుంచి ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి భార్య అకౌంట్ (62240751111)కు రూ.40 వేలు, రూ.20వేల చొప్పున రెండుసార్లు ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే చిన్నసారుకు సంబంధించిన ఓ మహిళ ఖాతా (62031507489)లోకి రూ.30 వేలు జమచేశాడు. - 29–05–2017న ఆలయ అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఎరియర్స్ రూ.1,05,192 లను ఓ కాంట్రాక్టు ఉద్యోగి అకౌంట్ (52170507610)లోకి జమ చేశారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగి అందులో నుంచి వెంటనే బినామీ వ్యక్తికి చెందిన ఖాతా (62211311029)లోకి రూ.40 వేలు, రూ.30 వేల చొప్పున మొత్తం 70వేల రూపాయలు పంపించాడు. - 29–05–2017 రోజునే వాగ్దేవి కో–ఆపరేటివ్ లేబర్ సొసైటీ నుంచి చెక్ (నం.363101) ద్వారా బినామీ వ్యక్తి ఖాతాలోకి రూ.1,83,200 జమ అయ్యాయి. ఈ డబ్బులు ఆలయంలోని 86 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. - ఆలయ సిబ్బంది ఎరియర్స్ 29–05– 2017న బినామీ వ్యక్తి ఖాతాల్లోకి వచ్చిన డబ్బుల్లో నుంచి 30–05–2017న రూ.40వేల చొప్పున ఐదుసార్లు అంటే మొత్తం రూ.2 లక్షలను ఉన్నతాధికారి కోడలి ఖాతా (62495094834)లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 01–06–2017 రోజున బినామీ వ్యక్తి అకౌంట్ నుంచి ఆలయంలోని ఓ చిరు ఉద్యోగి ఖాతా (52170508400)లోకి రూ.10వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. - 06–06–2017 రోజున బినామీ వ్యక్తి ఖాతా నుంచి ద్వితీయ స్థాయి అధికారి భార్య ఖాతా (52170497974)లోకి రూ.26వేలు చేరాయి. ఎంక్వైరీ చేయిస్తాం.. ఆలయంలో అధికారులు బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తాం. ఈ విషయం నిజమని తేలితే ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటాం. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి బినామీలు లేరు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. – సుధాకర్‌రెడ్డి, ఈఓ, బాసర ఆలయం -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
సాక్షి, బాసర: కార్తీక మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యకేత్రంలో 'దక్షిణ గంగా వేద నిత్య హారతి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ హారతి కార్యక్రమం శనివారం ( నవంబర్ 4 ) న మొదలు కానున్నట్టు వేద పండితులు తెలిపారు. మానవ జాతి సుఖ సంతోషాలతో వర్థిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ హారతి ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాటు పలువురు పాల్గొంటారన్నారు. ఈ నిత్య హారతి కార్యక్రమానికి అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు. -
బాసరలో 'దక్షిణ గంగా నిత్య హారతి'
-
వీడిన ‘విగ్రహ’ ముడి
ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం ► అధికారుల సమక్షంలో తనిఖీ ► తీసుకెళ్లింది ఉత్సవ విగ్రహం కాదు నిర్మల్ రూరల్: బాసర సరస్వతమ్మ విగ్రహ లొల్లి ఓ కొలిక్కి వచ్చింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరుదాటించారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ప్రధాన అర్చకుడి అధీనంలో ఉన్నది అమ్మవారి ఉత్స వమూర్తి కాదని, భక్తులు సమర్పించిన చిన్న విగ్రహమేనని అధికారులే తేల్చారు. ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి, రెవెన్యూ, పోలీసుల సమక్షంలో సోమవారం బీరువాలను తెరిచా రు. ఇందులో ప్రధాన అర్చకుడి బీరువాలో భక్తులు కానుకగా ఇచ్చిన కిలోన్నర బరు వున్న అమ్మవారి పంచలోహ విగ్రహం బయ టపడింది. ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్ శర్మలతో పాటు పరిచారకుడు విశ్వజిత్‌లు గత నెల 28న నల్లగొండ జిల్లా దేవరకొండ లోని రెండు పాఠశాలల్లో అక్షరాభ్యాసాలను చేయించారు. ఈ పూజలకు బాసర క్షేత్రం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో ఆలయ అధికా రులు విచారణ చేపట్టారు. ప్రధానార్చకుడు అందుబాటులో లేకపోవడం, విగ్రహం కూడా కనిపించకపోవడంతో ఆలయ అధికా రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండకు వెళ్లిన అర్చకులే విగ్రహాన్ని తీసుకెళ్లారని అనుమానం ఉందన్నారు. ఆలయ స్టోర్‌రూంలోని ప్రధాన అర్చకుడి బీరువాలను సీజ్ చేశారు. ఈ వివాదంలో దేవాదాయశాఖ ప్రధాన అర్చకుడు, సప్తశతి పారాయణధారుడికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాల ‘లెక్క’లేదా.. ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి.. భక్తులు సమర్పించిన విగ్రహాలెన్ని.. అన్న లెక్కలు అధికారుల వద్దే స్పష్టంగా లేనట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకుడి బీరువాలో బయటపడిన విగ్రహం రికార్డుల్లో ఉందా.. అన్న దానిపైనా అధికా రులు స్పష్టత ఇవ్వలేదు. సదరు విగ్రహం గురించి ప్రశ్నిస్తే రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందని ఈవో పేర్కొనడం గమనార్హం. ఆలయంలో ఎన్ని ఉత్సవ మూర్తులు ఉన్నాయి.. ఎన్ని భక్తులు సమర్పించిన విగ్రహాలు ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా, ఈ విగ్రహం తరలింపు విషయంలో విచారణ కొనసాగుతుందని ఆలయ ఈవో చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. కాగా, తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగం గానే కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి చెప్పారు. తాను ఎలాంటి విగ్రహాన్ని దేవర కొండకు తీసుకెళ్లలేదని వివరించారు. బీరువా తనిఖీల్లో.. కేసు విచారణలో భాగంగా దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో సోమవారం ఆలయ ఈవో, బాసర తహసీల్దార్ వెంకటరమణ, ముధోల్ సీఐ రఘుపతి, బాసర ఏఎస్ఐ నర్స య్య తనిఖీలు చేపట్టారు. సీజ్ చేసిన ప్రధాన అర్చకుడి బీరువాలో సరస్వతీ మాత పంచలోహ విగ్రహం బయట పడింది. అది అమ్మవారి ఉత్సవ విగ్రహం కాదని, భక్తులు సమర్పించిన విగ్రహమేనని తేలింది. -
బాసర: బీరువాలోనే అమ్మవారి విగ్రహం!
- పోలీసుల సమక్షంలో బయటికి తీసిన అధికారులు - ఉత్కంఠకు తెర.. ఘటనపై సర్వత్రా విస్మయం నిర్మల్: బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గడిచిన 10 రోజులుగా కనిపించకుండా పోయిన అమ్మవారి ఉత్సవ విగ్రహం.. ఆలయంలోని బీరువాలో ప్రత్యక్షమైంది. సోమవారం పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు బీరువా నుంచి విగ్రహాన్ని, అలంకరణ సామాగ్రిని బయటికి తీయడంతో ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఆలయ ప్రధాన అర్చకుడు, మరో పూజారి కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించారనే ఆరోపణలపై నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగింది? నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శించే బాసర ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కనిపించకుండా పోయాయి. ఆగస్టు 8 తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మరో పూజారితో కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తరలించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఓ పాఠశాలకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పూజలు, అక్షరాభాస్యం చేయించినట్లు వెల్లడైంది. దీంతో ఆ ఇద్దరికీ నోటీసులు జారీ అయ్యాయి. బీరువాలోనే అమ్మవార్లు: పూజారులకు నోటీసులు ఇచ్చి పదిరోజులు గడిచినా, అమ్మవారి విగ్రహం ఎక్కడుందనే దానిపై స్పష్టతరాలేదు. బాసర ఆలయంలోపల రెండు బీరువాలు ఉండగా సోమవారం తహసిల్దార్, పోలీసుల సమక్షంలో ఆలయ అధికారులు వాటిని తెరిచారు. మొదటి బీరువాలోనే వెండి పళ్లెంలో సరస్వతి అమ్మవారి ఉత్సవమూర్తి, అలంకరణ సామగ్రి కనిపించాయి. ఎట్టకేలకు ఆలయంలోని బీరువాలోనే అమ్మవారి విగ్రహం ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విగ్రహం మాయం కేసులో ఆలయ అధికారి ప్రమేయం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. వీరిపై కేసులు నమోదు చేస్తారా, లేదా అన్నది తెలియాల్సిఉంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. అమ్మవారి దర్శనానికి ప్రస్తుతం మూడు గంటల సమయం పడుతోంది. గురుపౌర్ణమి చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులకు దేవాలయ అధికారులు పట్టువస్ర్తాలు సమర్చించనున్నట్లు తెలిపారు. -
బాసరలో యాత్రీకుల యాతన
భైంసా(ముథోల్) : బాసర క్షేత్రానికి భక్తులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. చిన్న పిల్లలతో కుటుంబమంతా రాత్రి సమయంలో రైలు దిగి ఆలయానికి వెళ్లేందుకు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ముందరున్న ఏ వాహనమైన సరే తీసుకుని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి.. అప్పటికే ప్రయాణంలో అంతా అలిసిపోయి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోతారు. పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని పక్కనే ఉన్న ఆలయానికి చేరుకోవాలని యాత్రీకులు తపన పడుతుంటారు. అలాంటి సమయంలో వచ్చే యాత్రీకులకు రైలు దిగగానే ఉచిత బస్సు సౌకర్యం ఉందని, ఆలయంలో వసతి సౌకర్యం ఉందని చెప్పే ఏర్పాట్లు ఉండాలి. రైల్వేస్టేషన్లోనే ఆలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి యాత్రీకులకు తగ్గట్లు అవసరమైతే బస్సును 2 నుంచి 3 ట్రిప్పులు అయినా సరే పంపించే ఏర్పాట్లు చేయాలి. బస్సులో వెళ్లే యాత్రీకులు రైలు దిగగానే అక్కడే సేదదీరేలా వసతి కల్పించాలి. బాసర రైల్వేస్టేషన్లోనే రైలుమార్గం ద్వారా వచ్చే యాత్రీకులకు వసతి గదులను బుక్ చేసుకునేలా ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే వచ్చే వారికి తక్కువ ధరకే ఆలయ వసతి గృహాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం వచ్చిన యాత్రీకులంతా ముందు వసతి కోసం ఆలయ అతిథి గృహాలకు వెళ్లి అక్కడ గదులు లేవని చెప్పగానే ప్రైవేటు లాడ్జీలకు తిరగాల్సి వస్తోంది. ఇలా రాత్రంతా పిల్లాపాపలతో వచ్చే కుటుంబీకులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేకువజామునే స్నానాలు చేసి నిద్ర లేకుండానే పిల్లలకు అక్షరశ్రీకార పూజలు జరిపిస్తున్నారు. దీంతో ఒక్కసారి బాసరకు వచ్చే యాత్రీకులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవంటూ పెదవి విరుస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత బస్సులను నడిపితే రాత్రి సమయంలో వచ్చే యాత్రీకులకు ఇబ్బందులు దూరమవుతాయి. ఆ బస్సులోనే ఆలయ వసతిగృహాల ఖాళీ గదుల వివరాలను తెలిపే ఏర్పాట్లు చేస్తే యాత్రీకులను నేరుగా అక్కడికే వెళ్లగలుగుతారు. క్యాబ్‌లు నడిపితే.. ప్రస్తుతం బాసర రైల్వేస్టేషన్ నుంచి ఆలయం వరకు ప్రైవేటు ఆటోలు నడుపుతున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తగ్గట్లు ప్రభుత్వమే క్యాబ్‌లను అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాబ్‌లలో యాత్రీకులకు నిర్ధిష్టమైన అద్దె చెల్లింపునకు రశీదులు అందుతాయి. ఇప్పుడున్న ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన యాత్రీకుల వద్ద అద్దె డబ్బులను తీసుకుంటున్నారు. క్యాబ్‌లతో బాసర ఆలయానికి కొత్త అందం కూడా వస్తుంది. యాత్రీకులకు సౌకర్యంగా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వాహనాలు నడిపే వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ఉంటుంది. రోడ్డుపైనే పార్కింగ్ బాసర రైల్వేస్టేషన్ వద్ద ఉన్న చౌరస్తాలో ప్రైవేటు ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. భైంసా–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎప్పుడు చూసినా ఇక్కడ చౌరస్తా సర్కిల్లో ప్రయాణికుల కోసం వాహనాలను నిలిపి ఉంచుతారు. ఆలయానికి ప్రతీరోజు వందల సంఖ్యలో యాత్రీకులు వస్తుంటారు. వారిని తీసుకువచ్చే వాహనాల రాకపోకలకు రోడ్లపై నిలిపిన ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. యాత్రీకుల నిరీక్షణ రైల్వేస్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది. యాత్రీకులు రైలు దిగగానే బస్సుల కోసం వేచిచూస్తారు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం జరుగలేదు. కిలోమీటరున్నర దూరంలో బాసర గ్రామంలో ఉన్న బస్టాండ్ ఎవరికీ ఉపయోగపడడంలేదు. రైలు దిగగానే ట్రిపుల్ఐటీకి వెళ్లే విద్యార్థులు భైంసా, మహారాష్ట్రకు వెళ్లేవారు బాసర ఆలయానికి చేరుకునే వారంతా బస్సుల కోసం ప్రధాన రోడ్డుపైకి వస్తుంటారు. వర్షాకాలంలో, వేసవిలో పక్కనే ఉన్న హోటల్ షెడ్లలోకి వెళ్లి బస్సు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చౌరస్తా కూడలిలో అందరికీ ఉపయోగపడేలా బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సిన అత్యవసరం ఉంది. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఇక ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. బాసర రైల్వేస్టేషన్, గ్రామం, భైంసా, నిజామాబాద్‌ల నుంచి నాలుగు వైపులుగా వచ్చే వాహనాలన్నీ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చౌరస్తా మీదుగా వెళ్తాయి. ఈ చౌరస్తా వద్ద ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ముథోల్‌కు చెందిన హోంగార్డు కూడా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాసరకు చెందిన పలువురు యువకులు సైతం ఇలా రోడ్లపై నిలిపి ఉన్న భారీ వాహనాలకు ఢీకొని మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఉచిత బస్సులు నడపాలి దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఆలయం నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి నదికి వెళ్లేలా ఉచిత బస్సులను నడపాలి. అలా చేస్తే ఇబ్బందులు ఉండవు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. - లక్ష్మి, నిర్మల్ వసతి కల్పించాలి రైల్వేస్టేషన్‌కు రాగానే ఉచిత బస్సు వచ్చే వరకు నిరీక్షించేందుకు వసతి సౌకర్యం కల్పించాలి. రైలు ద్వారా ఒకేసారి వందలాది మంది యాత్రీకులు వస్తారు. అందరినీ ఉచిత బస్సు ద్వారానే ఆలయానికి తరలించాలి. - భాస్కర్, మహారాష్ట్ర ఆన్లైన్లో వివరాలుంచాలి ఉచిత బస్సు, ఆలయంలో వసతి వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలి. రైల్వేస్టేషన్లో దిగగానే యాత్రీకులకు ఎక్కడెక్కడ గదులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలి. - సురేశ్, మహారాష్ట్ర -
బాసరలో సినీ హీరో సందడి
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సినీ నటుడు ఆర్యన్ రాజేష్ సోమవారం దర్శించుకున్నారు. తన కూతురు అక్షర శ్రీకారం కోసం ఆలయానికి విచ్చేసిన ఆర్యన్ రాజేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు భక్తులతో కలిసి సాధారణ భక్తులతో పాటే క్యూలైన్లో నిల్చొని అమ్మవారిని దర్శించుకోవడం గమనార్హం. ఏకాదశి శుభ ముహుర్తం కావడంతో అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షర శ్రీకారల కోసం వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. -
బాసరలో బీదర్ ఎంపీ
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకలోని బీదర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ భగవంత్ కూభా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, నిర్మాల్ జిల్లా బీజేపీ ఇంన్ఛార్జి మురళీధర్‌గౌడ్ ఇతర నాయకులు ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర(నిర్మల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం మర్లగడ్డ క్యాంప్‌నకు చెందిన కె. రాధ ట్రిపుల్ ఐటీ నాలుగో సంవత్సరం చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం గమనించిన తోటివారు సిబ్బందికి సమాచారం అందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: వారాంతం కావడంతో నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సెలవు రోజు కావడంతో శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షరాభ్యాసాలు, పత్ర్యేక పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శానానికి దాదాపు 3 గంటలు సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సరస్వతి అమ్మవారి పంచమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రద్దీ దష్ట్యా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. -
బాసరలో నగదు రహిత లావాదేవీలు
- ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నగదు రహిత లావాదేవీలకు నూతన సంవత్సరం ఆరంభం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని కూడా జనవరి ఒకటో తేదీ నుంచే ప్రారంభించనున్నారు. రూ. 1000, రూ.500 నోట్ల రద్దుతో బాసరలోని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్ని విభాగాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని కౌంటర్లలో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. చిల్లర కొరత సైతం ఈ మిషన్ల ఏర్పాటు తో తీరనుంది. కాగా, ఆలయంలో స్వీపర్, ఉద్యోగులు, అర్చకులు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 180 మంది పనిచేస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. 30 నిమిషాలు ఆలస్యమైతే గైర్హాజరుగా నమోదు అవుతుందని ఈఓ తెలిపారు. -
బాసరలో పెరిగిన భక్తుల రద్దీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కార్తీక శుక్రవారం కావడంతో.. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. -
బాసరలో చోరీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సందట్లో సడేమియాలాగా.. భక్తుల రద్దీని అదునుగా చేసుకొని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
శైలిపుత్రిగా సరస్వతీమాత
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు -
బాసరలో భక్తుల సందడి
బాసర : శ్రావణమాసంలో ఆఖరి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదితీరాన శివాలయంలో పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాస స్వీకార, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. -
రసాయనిక శాస్త్రంతో మానవ మనుగడ
పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్ మెహతా ట్రిపుల్ ఐటీలో జాతీయ స్థాయి సదస్సు నూతన ఆవిష్కరణపై చర్చలు బాసర : మానవుని మనుగడ రసాయనిక శాస్త్రంతో ముడి పడి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ మెహతా అన్నారు. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో ‘రసాయనిక, పదార్థ శాస్త్రాల్లో ఇటీవల కాలంలో వస్తున్న పురోగతి’పై జాతీయ స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ శరీరానికే కాకుండా విశ్వవ్యాప్తమైన సృష్టి అంతా రసాయనాలతో నిండి ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో నోటి, దంత క్యాన్సర్, ఎయిడ్స్ తదితర ప్రాణాంతక వ్యాధులపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించిన ఔషధాలు, వాటి పనితీరుపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వ్యాధుల నివారణకు తయారు చేయాల్సిన డ్రాగ్ డిజైనింగ్‌లో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పలువురు రసాయనిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్లు నానో మెటీరియల్, సెమీ కండక్టింగ్, పాలిమర్ మెడిసిన్ మందుల తయారీ గోడప్రతుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ప్రపంచం మెుత్తాన్ని గడగడలాడించిన ఎబోలా, వ్యాధులకు మందు కనిపెట్టారని తెలిపారు. నానోటెక్నాలజీ ద్వారా ఆభరణాలు, పింగళి వస్తువుల తయారీకి ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్‌ఛాన్స్‌లర్ సత్యనారాయణ మాట్లాడుతూ రసాయనిక, భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో గోవర్ధన్‌మెహతా, ఢిల్లీ సీఎస్ఐఆర్టీ ప్రొఫెసర్ జేఎస్ యాదవ్, కళాశాల వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ మెుక్కలు నాటారు. సదస్సులో బాసర ఐఐఐటీ రయసానిక విభాగ అధిపతి రవివారల, శ్రీపాద్, వివిధ జిల్లాల రసాయనిక శాస్త్ర అధ్యాపకులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతమంతా జనసంద్రంగా మారి పోయింది. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. -
బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్
బాసర : కేంద్రప్రభుత్వం, ఎన్ఎస్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, స్వచ్ఛభారత్ సాధన దిశగా కషిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బి.శ్యాంబాబు, ఆఫీసర్ విజయ్‌కుమార్, అనిత, నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
పుష్కర స్నానాలు
-
29న బాసరకు హైకోర్టు జడ్జి
ఆదిలాబాద్ : ఈ నెల 29న హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ చైర్మన్ వి.రామసుబ్రహ్మణ్యం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రాత్రి బాసరకు చేరుకుంటారని, 30న ఉదయం సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ మీదుగా ఉట్నూర్‌కు వెళ్తారని తెలిపారు. గిరిజన హక్కులకు సంబంధించిన నల్సా చట్టంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కుంటాల, పొచ్చర జలపాతాలతోపాటు కడెం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జన్నారం మీదుగా నిజామాబాద్‌కు బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. -
బాసరలో గురుపౌర్ణమి వేడుకలు
జ్ఞాన ప్రదాత.. సరస్వతీ మాత ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వేద పండితులు, కళాకారులు, సాహితీ వేత్తలకు సన్మానం బాసర : సకల జనులకూ జ్ఞానాన్ని అందించే ప్రదాత.. సరస్వతీ మాత అని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అక్షర భ్యాస మండపంలో మంగళవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన ఆలయాలకు చెందిన సుమారు 140 మంది వేద పండితులు, అర్చకులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.5,100 వరకు నగదు పురస్కారాన్ని దేవాదాయ, «దర్మాదాయ ఆధ్వర్యంలో అందజేశారు. అంతకుముందు ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఆర్డీ అరుణకుమారి హాజరై పండితులకు సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువుల సేవలు మరిపోలేనివి గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన వేద పండితులు, అర్చకులు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గురువుల సేవలను ఏ శిష్యుడూ మరచిపోలేరని పేర్కొన్నారు. ముగిసిన యజ్ఞం ఉత్సవాల ప్రారంభం రోజు నుంచి జరుగుతున్న మహాచండీ యాగం మంగళవారం ముగిసింది. పూర్ణాహుతితో వేద పండితులు యజ్ఞాన్ని ముగింపు పలికారు. ముగింపు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డితోపాటు ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య పాల్గొన్నారు. కళాకారులకు సన్మానం గురుపౌర్ణమిని పురస్కరించుకొని సన్మానం పొందిన వారిలో పలువురు ప్రముఖ కళాకారులు ఉన్నారు. 800కు పైగా సినిమాల్లో, సీరియల్స్‌లో వివిధ పాత్రల్లో నటించిన మహంకాళి బాలగంగాధర్ తిలక్, కర్ణాటక సంగీత విద్వాంసులు రామకష్ణ సన్మానం పొందారు. వీరితోపాటు ్రప్రముఖ రచయిత, తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు, ప్రిన్సిపాల్ ఆచార్య పి.కనకయ్య, ఇదే శాఖ సహాయ ఆచార్యులు, తెలంగాణ సాహిత్య పరిశోధకులు డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, బాసరకు చెందిన రిౖటñ ర్ట్ ఉపాధ్యాయుడు నరసింహాచారి, వేదపండితులు నాగేశ్వర శర్మ, నటేశ్వర శర్మ తదితరులను శాలువాతో సత్కరించారు. నగదు పురస్కారాలు అందజేశారు. ఈ ముంగిపు ఉత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అనూషాసాయిబాబా, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, సర్పంచ్ శైలజ సతీశ్వర్‌రావు, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు గెంటెల శ్యాంసుందర్, భూదేవి, ముథోల్ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, డైరెక్టర్ హన్మంతరావు, వైస్ చైర్మన్ రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూకం రామారావు, ముథోల్ సీఐ రఘుపతి, ట్రైనీ ఎస్సై టి.మహేశ్, టీఆర్ఎస్ నాయకులు బాల్గం దేవేందర్, జగ్గం మల్కన్న, బాల మల్కన్న తదితరులు పాల్గొన్నారు. -
వేదఘోషతో పులకరించిన బాసర
బాసర : బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం వేదఘోషతో పుల కరలించింది. గురుపౌర్ణమి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. తొమ్మిది గంటలకు ఆలయం నుంచి ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో వేద వ్యాస ఆలయానికి బయలు దేరారు. వేదవ్యాస ఆలయంలో అర్చకులు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల «మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధన, చండీపారాయణం, తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేద వ్యాస ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి పూజ కార్యక్రమాలు .... ఉదయం 8:30 లకు స్థాపిత దేవత ఆహ్వానం, మహావిద్యాపాయణం, చండీపారాయణం, సరస్వతీ హŸమం, తదితర పూజలను నిర్వహిస్తారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
బాసర: అక్రమంగా రైళ్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో సోమవారం రైల్లో తనిఖీలు చేపడుతున్న పోలీసులకు ఇద్దరి మహిళల వద్ద భారీగా గంజాయి లభ్యమవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అమ్మ కటాక్షం కోసం అక్షర శ్రీకారం!
బాసర(ఆదిలాబాద్ జిల్లా): బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం భక్త జనం సందోహంతో నిండిపోయింది. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ చిన్నారులను తల్లిదండ్రులకు జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో అక్షర శ్రీకారం చేయించారు. ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి సుమారు 3గంటల సమయం పట్టింది. 20 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 876 మంది చిన్నారులకు అక్షర శ్రీకారం జరిపించారు. అమ్మవారి ఆలయానికి సుమారు రూ.4లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర (ఆదిలాబాద్ జిల్లా) : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 25 వేల మంది భక్తులు తరలివచ్చారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు అక్షరాభ్యాసం జరిగింది.