ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో వేంచేసి ఉన్న సరస్వతీ మాత సన్నిధిలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. మొదటిరోజు శైలిపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. శనివారం వేకువజాము నుంచి భక్తులు దర్శనం కోసం క్యూకట్టారు. భైంసాపట్టణానికి చెందిన వ్యాపారవేత్త జి.రమేష్ కుటుంబసభ్యులు అమ్మవారికి రెండు తులాల బంగారు గొలుసును సమర్పించుకున్నారు