navaratri celebrations
-
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
సకల కోరికలు నెరవేర్చే మాత కనకదుర్గమ్మ
-
కోటి 99 లక్షల నోటుతో అమ్మవారి అలంకరణ
-
తిరుమల: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్పెషల్ (ఫొటోలు)
-
విల్లా మేరీ కాలేజీలో నవరాత్రి మినీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
శారదా నవరాత్రి మరియు సరస్వతి పూజ..!
-
ఘనంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
-
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు
-
కాకినాడలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
పది రోజులపాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
నిజామాబాద్ లో నవమాతృకల ప్రతిష్ఠ
-
విశాఖ శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి పూజలు
-
గరుడ వాహనంపై విశ్వపతి
విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. – తిరుమల దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు. – జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్)/బాసర(ముథోల్)/హన్మకొండ కల్చరల్ -
గార్బా డ్యాన్స్‌తో అదరగొట్టిన ఎంపీ సుప్రియా సూలే.. వీడియో వైరల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్‌లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ) కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్‌గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి) -
బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
విశాఖ శారదా పీఠంలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
-
దసరా నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధమైన ఇంద్రకీలాద్రి
-
అన్నపూర్ణగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో నాలుగో రోజు ఆదివారం అన్నపూర్ణదేవిగా శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. లోకకల్యాణార్థం పీఠంలో చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్ భాగవత పారాయణం, వేదపారాయణం, నవావరణ అర్చన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి స్వామీజీల చేతుల మీదుగా ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (నేడు) లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. -
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్‌ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్‌సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్‌సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్‌బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్‌బండ్‌పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్‌రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్‌లో వాటర్‌బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్‌రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ మూద్‌అలీలతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్‌నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి.