దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు | Vijayawada Kanakadurga Appears As Lord Durga Devi On Eighth Day | Sakshi
Sakshi News home page

దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు

Published Sun, Oct 6 2019 12:33 PM | Last Updated on Sun, Oct 6 2019 1:03 PM

Vijayawada Kanakadurga Appears As Lord Durga Devi On Eighth Day - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి చేరుకున్నారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో అమ్మవారి రూపం కన్నులపండువ కలిగిస్తోంది.

మలయప్పస్వామిగా తిరుపతి వెంకన్న
తిరుమల : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. స్వామి రథసారథిగా సూర్యుడు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తున్నాడు. తిరుమల గిరులన గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో, దివారాత్రాల కు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement