kanakadurgamma Temple
-
రేపు విజయవాడకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చి దిద్దుతాం. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగదు. నాలుగంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నాం. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొండచరియలు పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లకు, ర్యాంపు నిర్మించి ఉపయోగంలోకి తెస్తామని తెలిపారు. ‘‘ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పనులు జరుగు తాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మళ్లీ కూల్చటాలు ఉండవు. అభివృద్ధి పనులు అయ్యాక పరిస్థితి బట్టి ఘాట్ రోడ్‌పై నిర్ణయం తీసుకుంటాం. రేపు శంకుస్థాపన తర్వాత 18 నెలల్లోపు పనులు పూర్తవుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
వచ్చే నెల 20వ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 20వ తేదీన ఇంద్రకీలాదికి వెళ్లనున్నారు. ఇక, అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 20న అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మరోవైపు.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగుతున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 22న వేదసభ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. తొలిసారి మహా చండీదేవిగా అమ్మవారు.. ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మీ యాగం
-
ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు
-
ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీశైలంలో ఆన్ లైన్ సేవలని నైన్ అండ్ నైన్ సంస్ధ సహకారంతో చేపట్టామని తెలిపారు. శ్రీశైలంలో విజయవంతం కావడంతో ఇపుడు ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అదే సంస్ధ ఉచితంగా చేపట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు.. పారదర్శత కోసం ఆన్లైన్ సేవలు ఉపయోగపడతాయన్నారు. క్యూ లైన్ నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా చేస్తామన్నారు. రూమ్‌లు, దర్శనాలు, సేవలు, ఈ- హుండీ.. ఇలా అన్నీ ముందుగానే ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తొమ్మిది ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ముందుగా ప్రారంభిస్తున్నామన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయానికి దసరా మహోత్సవాల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలులలో కూడా ఆన్లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటే భక్తులు ఆఫ్ లైన్లో సేవలు కొనసాగుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి) -
దుర్గమ్మ కానుకల లెక్కింపులో వీడని మూస పద్ధతి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం... రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు రాక.. రోజుకు రూ.13.90 లక్షలకు పైగానే హుండీ ఆదాయం... ఇక దసరా, భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ముగిస్తే కానుకల లెక్కింపు మూడు, నాలుగు రోజులు సాగాల్సిందే! రోజుకు వెయ్యి నుంచి 30 వేల పైబడి భక్తులకు పెరిగినా... కానుకల లెక్కింపులో మాత్రం దేవస్థానం ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో అమ్మవారి కానుకలు, మొక్కుబడులు చేతి వాటానికి గురవుతున్నాయి. బయట పడేవి కొన్నే... గడిచిన ఐదేళ్ల కాలంలో పదికి పైగా ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో ఆలయ సిబ్బంది నేరుగా ఉంటే మరి కొన్ని సంఘటనల్లో సేవా సిబ్బంది, అవుట్ సోర్స్ సిబ్బంది ఉంటున్నారు. టీ కప్పులో బంగారం తాడు దాచి దొరికి పోయిన వైనం ఒకటయితే.. హుండీల నుంచి కానుకలను మహా మండపానికి తరలించేందుకు తీసుకెళ్లే ప్లాస్టిక్ సంచులలో బంగారాన్ని దాచి పెట్టి దొరిపోయిన వైనం మరోటి. సేవకు వచ్చి బంగారం, డబ్బు చక్క బెట్టేసిన వైనం ఇంకొకటి.. ఇలా బయట పడిన ఘటనలు కొన్ని.. ఇంక బయట పడని ఘటనలు ఎన్ని ఉన్నాయోననే అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి కానుకలు, మొక్కుబడులు పెరుగుతున్న తరుణంలో ప్రతి వారం లేదా పది రోజులకు ఒక సారి లెక్కింపు జరిగితే ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టవచ్చునని భక్తులు అభిప్రాయపడుతున్నారు. వారం లెక్కింపునకు అడ్డంకులేంటి.. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను ప్రస్తుతం 15 రోజులకు ఒక సారి చేపడుతున్నారు. దీంతో ఆలయంలోని అన్ని హుండీల నుంచి ఒకే సారి కానుకలను లెక్కింపుకు తీయడంతో అవి వంద నుంచి 120కి పైగా మూటలవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కానుకలను లెక్కించడం ఆలయ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంది. లెక్కింపుకు ఆలయ సిబ్బందితో పాటు సేవా సిబ్బందిని అనుమతిస్తారు. దీంతో కానుకల లెక్కింపు ప్రాంతమంతా గందరగోళంగా మారడమే కాకుండా ఎవరు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. సోమవారం కూడా ఇదే జరిగింది. ఆలయ సిబ్బంది గంటల తరబడి నేలపై కూర్చోవడం ఇబ్బందికరమే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆదమరుపుగా ఉన్న తరుణంలో చేతివాటాన్ని ప్రదర్శించి కానుకలను పక్కదారి పట్టించారు. వారంలో ఒక రోజు కానుకల లెక్కింపు క్రమం తప్పకుండా జరిగితే సాయంత్రానికి లెక్కింపు పూర్తవుతుందని ఆలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీని వల్ల బయటి వ్యక్తులను లెక్కింపునకు పిలవాల్సిన అవసరం కూడా ఉండదని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. విరాళాలు.. కానుకలు ఒక విభాగంగా మార్చితే.. దేవస్థానంలో ప్రస్తుతం పరిపాలనా విభాగం, పూజల విభాగం, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలతో పాటు మరి కొన్ని విభాగాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి భక్తులు అందచేసే విరాళాలు, కానుకలను ఒక విభాగంగా చేసి బాధ్యులను అప్పగిస్తే ఫలితాలు బాగుంటాయని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయానికి, అన్నదానం, అభివృద్ధి పనులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. అయితే ఈ విరాళాల సేకరణ ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని గతంలో పలువురు ఈవోలు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. విరాళాల సేకరణతో పాటు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల పర్యవేక్షణ రెండు కలిసి ఒక విభాగం చేసి ఎఈవో స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. (క్లిక్: చిత్తు కాగితాలు ఏరే వారితో స్నేహం.. అనుకోకుండా వచ్చిన అవకాశంతో..) దశాబ్దాలుగా ఇవే పద్ధతులు.. = 15 రోజలకు ఒక సారి లెక్కింపు జరగడం = కానుకలు లెక్కించే ప్రాంతంలోకి వచ్చే సిబ్బందికి మాత్రమే తనిఖీలు ఉండటం = ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు లెక్కింపు జరగడం = సేవా సిబ్బంది పేరిట కొంత మంది సిఫార్సు చేసిన వారిని లెక్కింపులోకి అనుమతించడం = లెక్కింపు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఏదైనా ఘటన జరిగిన సమయంలో అవి ఉపయోగకరంగా లేకపోవడం = కానుకల లెక్కింపులో పాల్గొనే పోలీసు, సెక్యూరిటీ, హోంగార్డులను సైతం తనిఖీలు లేకపోవడం -
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ దంపతులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్ద రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. సీజేఐ వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలిత, ఏపీ, తెలంగాణ హైకోర్టుల రిజిస్ట్రార్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ జె. నివాస్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా తదితరులు ఉన్నారు. -
అన్నపూర్ణగా.. శ్రీమహాలక్ష్మిగా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం దుర్గమ్మ రెండు విశేష అలంకారాల్లో కొలువుదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రీ అన్నపూర్ణాదేవిగా, మధ్యాహ్నం 2 గంటల తరువాత శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సౌకర్యార్థం ఓంకారం వద్ద వీల్ చైర్స్ సదుపాయం, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఉచిత ప్రసాదాలు అందేలా ఏర్పాటు చేశారు. నేడు మూలా నక్షత్రం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం కనకదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా నేడు తెలవారుజామున 3 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు ఎలాంటి టికెట్లు లేకుండా భక్తులందరికీ దర్శనం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. -
స్వర్ణకవచాలంకారంతో కరుణించిన కనకదుర్గ
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మ.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేదపండితులు, అర్చకుల సుప్రభాతసేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తొలిదర్శనం చేసుకున్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశారు. గవర్నర్ దంపతులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలను జరుపుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కా ప్రణాళికతో, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. కోవిడ్ ఉపశమనంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కృష్ణమ్మ చెంత పులకించిపోయారు. అయితే ప్రభుత్వం ఈసారి కూడా నదీస్నానాలకు అనుమతించలేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడే జల్లు స్నానాలు చేసేందుకు 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటుచేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. క్యూలైన్లలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు. ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, సీపీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పల్లకీసేవ, పంచహారతులు భక్తులను పరవశింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరోనా నుంచి ఉపశమనం కలగాలి: గవర్నర్ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు తెలిపారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు, ప్రముఖులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ శివశంకర్ దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నవారిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పి.కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులున్నారు. -
రేపటి నుంచి నవరాత్రి మహోత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి (గురువారం) నుంచి ఈనెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో కనకదుర్గ అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు 10 వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం దర్శనం టిక్కెట్లు ఇస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, తరువాత అన్ని రోజులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనం లభించనుంది. మూలానక్షత్రం రోజు 12వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. 15వ తేదీ విజయదశమి పర్వదినాన సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై దుర్గామల్లేశ్వరులు కృష్ణానదిలో జలవిహారం చేస్తారు. ఊరేగింపులను ఆలయ ప్రాంగణం, పరిసరాలకే పరిమితం చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన కనకదుర్గ అమ్మవారి ఆలయం 5 క్యూలైన్ల ఏర్పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మొత్తం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వినాయకగుడి నుంచి టోల్‌గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు మూడు క్యూలైన్లు, అక్కడి నుంచి అదనంగా ఉచిత దర్శనం లైను ఒకటి, వీఐపీ లైను ఒకటి సిద్ధం చేశారు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దర్శనానంతరం కొండ దిగువన మహామండపం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 13 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, 10 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కొండపైన, దిగువన సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. పున్నమి, భవాని ఘాట్లలో భక్తులు నదిలో స్నానం చేసే అవకాశం ఉన్నందున ఆ మార్గాలను మూసివేశారు. ఉత్సవాలకు 3 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 7 నుంచి శారదాపీఠంలో పెందుర్తి: శరన్నవరాత్రి ఉత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ముస్తాబైంది. ఈ నెల 7న పీఠంలో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 15 వరకు పీఠం అధిష్టాన దేవత శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు రోజుకో అవతారంలో పూజలందుకుంటారు. తొలిరోజు గురువారం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. లోకకల్యాణం కోసం పీఠంలో శ్రీమత్ దేవి భాగవత పారాయణం చేపట్టనున్నారు. ఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. అమ్మవారి అవతారాలు.. ఉత్సవాల్లో అమ్మవారు గురువారం బాలత్రిపుర సుందరిదేవిగా, శుక్రవారం మహేశ్వరిగా, శనివారం వైష్ణవిదేవిగా, ఆదివారం అన్నపూర్ణ దేవిగా, సోమవారం లలితా త్రిపురసుందరిదేవిగా, మంగళవారం మహాసరస్వతిదేవిగా, బుధవారం మహాలక్ష్మిగా, గురువారం మహిషాసుర మర్ధినిగా, శుక్రవారం విజయదుర్గగా దర్శనమిస్తారు. -
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతములు
-
చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఒక దేవాలయం అభివృద్ధి పనుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో ఆలయం అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.70 కోట్లతో దుర్గ గుడివద్ద చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. సీజీఎఫ్ కాదు.. ఖజానా నుంచే రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్న ఆలయం మొదలు పెద్ద దేవాలయాల వరకు ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా సొంత నిధులు (భక్తులిచ్చే కానుకలు)తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిధిలావస్థకు చేరితే జీర్ణోద్ధారణకు దేవదాయ శాఖ సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. అధిక ఆదాయం సమకూరే ఆలయాల నుంచి దేవదాయ శాఖ ఏటా నిర్ణీత మొత్తంలో సేకరించే మొత్తాన్ని సీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు. శిధిలావస్థకు చేరిన ఆలయాల పునఃనిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తుంది. అది కూడా ఇప్పటివరకు గరిష్టంగా రూ.ఐదు కోట్లకు మించి సీజీఎఫ్ నిధులు ఒక ఆలయానికి ఇచ్చిన ఉదంతాలు లేవని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.70 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం దేవదాయ శాఖ చరిత్రలో అపూర్వ ఘటనగా పేర్కొంటున్నారు. చదవండి: (మత విద్వేషాలకు భారీ కుట్ర) నాడు ఆలయాల నిధులు కైంకర్యం.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుండగా దీన్ని మభ్యపెడుతూ దేవదాయ శాఖ నిధులను మళ్లిస్తున్నారంటూ టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దుర్గ గుడి వద్ద అభివృద్ధి కార్యక్రమాల కోసం అమ్మవారి పేరిట ఉన్న బ్యాంకు డిపాజిట్లలో దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆలయం చుట్టు పక్కల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు ప్రక్రియలో స్థానిక టీడీపీ నేతలు భారీగా లబ్ధి పొందగా అమ్మవారి ఆలయ నిధులు పూర్తిగా అడుగంటాయి. శ్రీశైలం దేవాలయం విషయంలోనూ బాబు ఇలాగే వ్యవహరించారు. ఆలయం వద్ద ఉన్న నిధుల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులకు మంజూరు చేసి చివరకు అన్నదానం నిధులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు గత సర్కారు పెద్దలు ప్రయత్నించారు. చదవండి: (మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు) దేవాలయాలపై దాడుల్ని సహించం గుడులను కూలగొట్టినప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ–బీజేపీనే: మంత్రి బొత్స సాక్షి, విజయవాడ: దేవాలయాలపై దాడుల్ని ప్రభుత్వం సహించదని, ఏ ఒక్క మతాన్ని నిర్లక్ష్యం చేయబోమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో తొమ్మిది దేవాలయాల పునఃనిర్మాణం, దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా పట్టించుకోకుండా గత సర్కారు దేవాలయాలను కూలగొట్టిందని బొత్స మండిపడ్డారు. సుమారు రూ.1.79 కోట్లతో దేవాలయాలను పునఃనిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ దుర్గగుడి అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదని, తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ రూ.70 కోట్లు ఇస్తున్నారని చెప్పారు. గతంలో గుడులను కూల్చివేసినప్పుడు టీడీపీ, బీజేపీ కలసి అధికారంలో ఉన్నాయని, జనసేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. నాడు దేవదాయశాఖ మంత్రిగా బీజేపీకి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. రామతీర్థం ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. పుష్కరాల పేరుతో దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిన చంద్రబాబుకు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దేవాలయాలను పునఃనిర్మిస్తామని తాము గతంలోనే చెప్పామని, ప్లైఓవర్ నిర్మాణం కారణంగా కొంత జాప్యం జరిగిందని వివరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సీతమ్మవారి పాదాలను, గోశాలలో గోపాలకృష్ణుడి దేవాలయాలను గత సర్కారు కూలగొట్టిందని, వీటిని పునఃనిర్మిస్తున్నామని చెప్పారు. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా కోటిదీపోత్సవం
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు
సాక్షి, విజయవాడ/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణానది తీరంలో అపర భూకైలాసంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి అంగరంగవైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభకానున్నాయి తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గా దేవిగా ‘అమ్మ’ దర్శనమివ్వనున్నారు. పూర్వం మాధవవర్శ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి కీలాద్రిపై జగజగ్జనిగా అవిర్భవించింది. ఇంద్రుడు జగజ్జనని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిగా భక్తులు పూజలు అందుకుంటోంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా తొలిరోజు పూజ అందుకుంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లును దేవస్ధానం అధికారులు చేస్తున్నారు. శనివారం ఉదయం జరిగే స్నప్నభిషేకం, బాలభోగనివేదన, అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. కోవిడ్ నిబంధనలు తూచాతప్పకుండా పాటిస్తూ రాత్రి 8 గంటలకు దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రతినిత్యం 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిçస్తున్నారు. మూలనక్షత్రం(ఆక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మ«ధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు, అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం హంసవాహనంపై గంగ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారు కృష్ణానదిలో విహరిస్తారు. పట్టువ్రస్తాలు సమర్పించిన సీపీ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు దంపతులు శనివారం అమ్మవారిని పట్టువస్త్రాల ను సమర్పించారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న సీపీ దంపతులను, ఇతర పోలీసు అధికారులను ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. దసరా ఉత్స వాలలో ప్రతి ఏటా నగర పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీపీ, ఇతర పోలీసు అధికారులను అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో పోలీసు అధికారులకు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో వెస్ట్ ఎసీపీ సుధాకర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధానానికి పట్టువస్త్రాలను తీసుకువస్తున్న పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు దంపతులు వన్‌టౌన్ పీఎస్‌లో.. వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రతిరోజూ రౌడీలు, నేరాలు, దర్యాప్తులంటూ బిజీబిజీగా దర్శనమిచ్చే నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయారు. దుర్గమ్మకు పూజలు చేస్తూ యావత్ పోలీసు కుటుంబాలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఆధ్యాత్మిక భావనతో గడిపారు. దుర్గమ్మ దసరా ఉత్సవాల ముందు రోజున పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టుచీర, పసుపు కుంకుమలను సమర్పించడం గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఆ తంతు మరింత వైభవంగా నిర్వహించాలని పోలీసు కమిషనర్ నిర్ణయించి ఆ మేరకు అధికారును ఆదేశించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్త రాజధానిగా నూతన హంగులు సమకూరిన తరుణంలో ఈ విధమైన ఉత్సవానికి తెరలేపడంతో పోలీసు సిబ్బంది సైతం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రతిఏటా వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో దసరా ఉత్సవాలను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దుర్గమ్మ కొలువు తీరి ఉండటంతో అమ్మవారి సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాల్లో పోలీసులు ప్రధాన పాత్ర పోషించడం తదితర కారణాల రీత్యా స్టేషన్ ప్రాంగణంలోనూ కలశాన్ని ఏర్పాటు చేసి నిత్యం భారీగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని అక్కడ ప్రతి ఏటా నిర్వహించే విధంగా రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు నగరంలోని సీఐలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులందరూ సివిల్ డ్రస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత స్థానిక సీఐ వెంకటేశ్వర్లు దంపతులు స్టేషన్లో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మేళతాళాలతో ప్రాంగణంలో ఉన్న రావిచెట్టు వద్ద తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. నేటి అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి మాతర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాపహోరోద్యమే హేలానిర్మిత ధూమ్రలోచన వదే హేచండముండార్ధిని.. నిశ్శేషీకృత రక్తబీజ దనుజే.. నిత్యే.. నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే– నమస్తే అంబికా.. దసరా మహోత్సవాలలో మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి శనివారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా అలంకరిస్తారు. పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు(దుర్గాదేవి) విజయవాటికాపురి లో కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవాలలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనంతో సకల దారిద్రాలు నశించడంతో పాటు శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యప్రదాయ కమని భక్తుల నమ్మకం... –ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) -
10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి
సాక్షి, విజయవాడ: ఈనెల 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి అనుమతిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు, రేపు సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. గంటకు 250 మంది చొప్పున రోజుకు 5వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి,శానిటైజ్ చేసి చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. థర్మల్ స్క్రీనింగ్ లో భక్తులకు టెంపరేచర్ ఎక్కువుగా ఉంటే ఆలయంలోకి అనుమతిలేదని ఆయన స్పష్టం చేశారు. (దుర్గమ్మ దర్శనానికి వేళాయె) కొన్ని రోజులు శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశామని వెల్లడించారు. అంతరాలయ దర్శనం నిలిపివేశామని, ముఖ మండపం ద్వారానే అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికే అమ్మవారి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలకు భక్తులను అనుమతి లేదన్నారు. ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులను అనుమతిలేదని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయంలోకి అనుమతి లేదని తెలిపారు. మహా మండపం ద్వారా దిగువకు పంపించేందుకు సిబ్భందితో ట్రయల్ నిర్వహిస్తునట్లు ఆలయ అధికారులు తెలిపారు. (నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం షురూ) -
రేపటి నుంచే భక్తులకు దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: సుమారు 80 రోజుల తరువాత భక్తులు కనక దుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. 8,9 తేదీల్లో ట్రయిల్ రన్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు అమ్మవారి దర్శనానికి ఆలయ అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. 8, 9 తేదీలలో దేవస్థానం సిబ్బంది, అధికారులు ట్రయిల్ రన్‌గా దర్శనాలు చేసుకుంటారు. 10 తేది ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంటకు 250 మంది చొప్పున రోజుకు 5వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్‌బాబు తెలిపారు. అంతరాలయ దర్శనం బంద్ అంతరాలయ దర్శనం ఎవ్వరికీ ఉండదు. మల్లికార్జున మహా మండపం నుంచి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. బస్సులు, లిఫ్టులు ఉండవు. మెట్ల మార్గంలో పైకి వచ్చి దర్శనం చేసుకుని తిరిగి మెట్ల మార్గంలోనే కిందకు వెళ్లిపోవాలి. రెండు క్యూలైన్లు మాత్రమే ఉంటాయి. రూ.100 టిక్కెట్లు, ఉచిత దర్శనానికి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. ఉచిత దర్శనం చేసుకునే భక్తులు కూడా తప్పని సరిగా ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవాలి. కరెంటు బుకింగ్ ఉంటుంది కాని, అప్పుడు ఉన్న రద్దీని బట్టి మాత్రమే కరెంటు బుకింగ్ ఇస్తారు. వీఐపీలు 24 గంటలు ముందుగా దేవాలయానికి వస్తున్నట్లు ఆలయ ఈఓకు తెలియపరిస్తే వారికి సమయం కేటాయిస్తారు. అదే సమయంలో రావాల్సి ఉంటుంది. చదవండి: మహిళా సర్పంచ్‌కు కలెక్టర్ ప్రశంస జల్లు స్నానాలు... కేశఖండన.... కృష్ణానదిలో స్నానాలు లేవు. దూరందూరంగా జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం కేశఖండన శాల వద్ద భక్తులు భౌతిక దూరం పాటించాలి. ఒకరి తరువాత ఒకరు తలనీలాలు సమర్పించాలి. అక్కడ పూర్తి శానిటైజేషన్ చేస్తారు. . రేపటి నుంచి పలు ఆలయాల్లో దర్శనాలు అమరావతి/మంగళగిరి/గుంటూరు ఈస్ట్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి.మహేశ్వరరెడ్డి, అమరావతి, మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాల ఈవోలు సునీల్‌కుమార్, మండెపూడి పానకాలరావు తెలిపారు. ఆయా ఆలయాల్లో ఈవోలు శనివారం మాట్లాడారు. అమరావతిలో ప్రతి రోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు, మంగళగిరి ఎగువ సన్నిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు దేవాలయ కార్యాలయంలో అందించాలని సూచించారు. అమరేశ్వరాలయంలో మార్కింగ్ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో ఉన్న భక్తులతో పాటు గర్భిణులు, వయోవృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలకు దేవాలయంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తుల కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. టికెట్స్ తీసుకునేటప్పుడు, క్యూలైన్లలో భౌతిక దూరం పాటించాలన్నారు. అమరావతిలో అంత్రాలయ దర్శనం, ఆర్జిత సేవలు, అర్చనలతో పాటు మంత్రపుష్పం, పవిత్రజలం, శేషవస్త్రం, శఠారి, తీర్థం సేవలు తాత్కాలికంగా నిలిపి వేశామని తెలిపారు. లఘు దర్శనం, మహా లఘు దర్శనం మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనానికి రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎగువ, దిగువ సన్నిధులతో పాటు ఘాట్‌రోడ్డుపైన ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలోను భక్తులకు దర్శనం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. చదవండి: పబ్జీ గేమ్‌కి బానిసై.. -
వాళ్లక్కడ నుంచి కదలరు ... వదలరు
దుర్గగుడిలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయి చక్రం తిప్పుతున్నారు. దేవస్థానం గురించి క్షుణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దుర్గగుడికి ఈవోలు మారతారు గానీ.. వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి అంతరాయలంలో సూపరింటెండెంట్‌గా ఒక ఉద్యోగి దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయనకు అమ్మవారి ఆలయంలో తప్పా మరెక్కడా డ్యూటీలు వేయరు. మరో సూపరింటెండెంట్ లడ్డూ తయారీ విభాగంలో సీటు కదలడు. ఇంకో సూపరింటెండెంట్ పరిపాలన విభాగంలో సెటిల్ అయిపోయారు. కేవలం పురుషులే కాదు స్టోర్స్, అకౌంట్స్, అన్నదానంలో పనిచేసే మహిళా జూనియర్ అసిస్టెంట్లు నాలుగైదేళ్లయినా ఆయా విభాగాలను వదలడం లేదు. సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. దేవస్థానం గురించి క్షుణ్ణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడికి ఈవోలు మారతారు గానీ, వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. సూపరింటెండెంట్లదే హవా ! దుర్గగుడి అంతరాలయంలో సూపరింటెండెంట్‌గా ఒక ఉద్యోగి దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయన అమ్మవారి ఆలయం తప్పా మరెక్కడా డ్యూటీలు వేయరు. మరో సూపరింటెండెంట్ లడ్డూ తయారీ విభాగంలో తిష్ట వేశారు. ఇంకొక సూపరింటెండెంట్ పరిపాలన విభాగంలో సెటిల్ అయిపోయారు. సూర్యకుమారి, పద్మ, కోటేశ్వరమ్మ ఈవోలుగా మారిన తరువాత సురేష్ ఈవోగా వచ్చారు. అయినా సరే వీరు ఆయా విభాగాల్ని మాత్రం వదలకుండా వేళ్లాడుతున్నారు. వీరిని వేరే విభాగానికి బదిలీ చేసే పది రోజుల్లో తిరిగి అదే విభాగానికి వచ్చే విధంగా పావులు కదుపుతారని ఇంద్రకీలాద్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక పులిహోర తయారీ విభాగంలో ఒక కేర్‌టేకర్ 2008 నుంచి పాతుకుపోయారు. ఆయన్ను కదిలించే సాహనం ఏ అధికారీ చేయలేదు. దాంతో ఆ విభాగంలో ఆయన హవా పూర్తిస్థాయిలో కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం భూములు విభాగంలో దీర్షకాలంగా సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి అనారోగ్య కారణంగా వేరే విభాగానికి మార్చమని కోరినా ఆయనకు ఆ విభాగం పై పట్టు ఉండటంతో మార్చడం లేదు. దాంతో ఆయన అక్కడే కొనసాగాలి వస్తోంది. మహిళలూ మినహాయింపు కాదు.... ఒకే విభాగం వదలకుండా దీర్ఘకాలం పనిచేయడం కేవలం పురుషులే అనుకుంటే పొరపాటే. స్టోర్స్, అకౌంట్స్, అన్నదానంలో పనిచేసే మహిళా జూనియర్ అసిస్టెంట్ నాలుగైదు ఏళ్ల నుంచి ఆయా విభాగాలను వదలడం లేదు. పరిపాలన విభాగంలో పనిచేసే మరోక మహిళా ఉద్యోగి తీరు అదే విధంగా ఉంది. బదిలీలు అనగానే వీరు మందు జాగ్రత్త పడిపోవడం, తమకు ఎసరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సర్వసాధారణమని తెలిసింది. పైరవీల్లో దిట్టలు దీర్ఘకాలంగా ఆయా విభాగాల్లో పాతుకుపోవడం వెనుక వారు పైరవీల్లో నిష్టాతులు కావడమేనని చెబుతున్నారు. ఈవోతో సఖ్యతగా ఉంటూ తమ విభాగం మార్చకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రస్తుత ఈవో అయినా దేవస్థానం ఉద్యోగులను సమూలంగా మార్పులు చేర్పులు చేసి దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారేమో వేచి చూడాల్సిందే ! -
కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
సకలశుభాల తల్లి కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీ గాజుల ఉత్సవాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సిద్ధమవుతోంది. సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 29వ తేదీన గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేస్తారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందుతాయి. భక్తులు అందించే గాజులను స్వీకరించేందుకు దేవస్థానం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పలువురు భక్తులు అందచేసిన గాజులు దేవస్థానానికి చేరాయి. ఉత్సవానికి మరో 5 రోజులు ఉండటంతో గాజులు మరిన్ని విరాళాలుగా దేవస్థానానికి అందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ప్రాచీనకాలం నుంచి చేస్తున్న పూజ 15, 18వ శతాబ్దంలో అమ్మవారికి గాజుల అలంకారం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది. 15వ శతాబ్దంతో విజయనగర మహారాజు అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించడంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు చెప్పబడుతోంది. కార్తీక మాసంలో రెండో రోజున భగిని హస్త భోజనం అని, యమ ద్వితీయ అని పిలవబడుతుంది. ఆ రోజున తమ్ముళ్లు, అన్నయ్యలు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి.. వారి చేతి భోజనం చేసి చల్లగా ఉండాలని దీవించి పసుపు, కుంకుమ, గాజులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. అమ్మవారి ప్రసాదంగా వితరణ అమ్మవారికి అలంకరించే ఆభరణాల నుంచి పూల వరకు అన్నీ గాజులతోనే తయారు చేసి ముస్తాబు చేయడం ఈ ఉత్సవంలో విశేషం. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులుకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను ధరించడం శుభకరం.. మంగళకరమని భక్తులు భావించి గాజుల కోసం దేవస్థానానికి తరలివస్తారు. దుర్గమ్మకు 10 లక్షల గాజులు విరాళం ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ అలంకరణ కోసం అవసరమైన మట్టి గాజులను బుధవారం భక్తులు విరాళంగా అందజేశారు. శ్రీకనకదుర్గా లలితా పారాయణ బృందానికి చెందిన గ్రంథి శ్రీరామసుబ్రహ్మణ్యం, రాధిక, ఇతర భక్త బృంద సభ్యులు సుమారు పది లక్షల గాజులను దేవస్థానానికి అందించారు. గాజులు, పూజాసామగ్రి, పసుపు, కుంకుమతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం సభ్యులకు ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ సాదరంగా స్వాగతం పలికారు. దాతలు అమ్మవారికి గాజులను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. -
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు
సాక్షి, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి చేరుకున్నారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో అమ్మవారి రూపం కన్నులపండువ కలిగిస్తోంది. మలయప్పస్వామిగా తిరుపతి వెంకన్న తిరుమల : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నారు. స్వామి రథసారథిగా సూర్యుడు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తున్నాడు. తిరుమల గిరులన గోవింద నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో, దివారాత్రాల కు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం . -
కనకదుర్గమ్మ గుడిలో ‘మహర్షి’ టీమ్
సాక్షి, విజయవాడ : సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ ఇటీవల విడుదలై.. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర బృందం శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. హీరో మహేశ్‌బాబు సహ సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకొని.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మహర్షి చిత్రబృందానికి అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మహేష్‌బాబు కనిపించడంతో ఆయనన చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీపడ్డారు. -
‘టీ షర్టులు, ఫ్యాంట్లు వేసుకుని రావొద్దు’
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంగ్ల సంవత్సరాది వేళ దుర్గమ్మ భక్తులందరూ ఇకపై ఫ్యాషన్ దుస్తులను వదిలి, సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి కొత్త సంప్రదాయానికి ఆలయ అధికారులు తెరలేపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఈవో వీ.కోటేశ్వరమ్మ తెలిపారు. అలా వచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా పంచె, లుంగీ ధరించి రావచ్చు. ఇక మహిళలు, యువతులు పంజాబీ డ్రస్సు, టాప్‌పై తప్పని సరిగా చున్నీ ధరించి రావాలని సూచించారు. మహిళలు చీరలు, లంగా వోణీలు ధరించి దర్శనానికి రావచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు టీ షర్టులు, ఫ్యాంట్లు ధరించి ఆలయానికి రావద్దని పేర్కొన్నారు. అలాగే పురుషులు, స్త్రీలు షాట్స్, సీవ్లెస్ టీ షర్టులు ధరించి రావద్దని సూచించారు. మరో వైపు అమ్మవారి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రాని పక్షంలో ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం నిర్వహించే ప్రత్యేక కౌంటర్లో రూ.100కు చీర అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శానానికి సంప్రదాయ దుస్తుల్లోనే అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించగా, ఆర్జిత సేవల్లో గత కొన్ని నెలలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
జగన్మాతకు పుష్పాభిషేకం
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆర్జిత సేవలకు సుగంధ పరిమణాలు వెదజల్లే ఉత్తమజాతి పుష్పాలను ఉపయోగిస్తారు. నిత్యపూజలతో పాటు, చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాలు, దసరా మహోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలలో సైతం అమ్మవారికి పూలు అలంకరిస్తారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు రెండు గులాబీ దండలు, మల్లెమాలతో పాటు, చేమంతులతో తయారుచేసిన చిన్న గజమాల, మల్లెల జడను అలంకరిస్తారు. ఆర్జిత సేవలు జరిగే ఉత్సవమూర్తులను కూడా మల్లె, గులాబీల దండలతో అలంకరిస్తారు. చైత్రమాసంలో కోటి పుష్పార్చన చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం నుంచి విశేషంగా లభించే ఉత్తమజాతి పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి అమ్మవారికి 9 రోజుల పాటు గులాబీ, మల్లె, చామంతి, మందార, లిల్లీ, మరువం, కలువ, కనకాంబరం వంటి 9 రకాల పుష్పాలతో అర్చన జరుగుతుంది. గతంలో ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జరిగేది. పుష్పార్చనకు మరింత ప్రాచుర్యం కల్పించాలనే భావనతో రెండేళ్లుగా రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా వేదిక నిర్మించి అక్కడ ఉత్సవమూర్తికి పూజ నిర్వహిస్తున్నారు. అమ్మవారిని విశేషంగా పూజిస్తే, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఆశ్వయుజ మాసం తొలి తొమ్మిది రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆయా తిథులను బట్టి తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వారు తొమ్మిది అలంకారాలలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారికి గులాబీ, మల్లె, చామంతి, కాగడా పూలను వినియోగిస్తారు. అమ్మవారికి అలంకరణకు అవసరమైన పుష్పాలను విజయవాడ, కడియం, బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుంటారు. దసరా ఉత్సవాలలో తొమ్మిది రోజులు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరిస్తారు. ఇందుకు రోజుకు రూ. లక్ష వరకు దాతలు కానుకగా సమర్పించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తమ పేరిట అమ్మవారి ఆలయ అలంకరణ జరిపించుకునేందుకు సైతం దాతలు ముందుకు వస్తారు. దేశవిదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పుష్పాలతో తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. సాధారణ రోజులలో ప్రతి మంగళవారం 108 తెలుపు, గులాబీ రంగుల కలువలను తెనాలికి చెందిన ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. మల్లెలతో అమ్మవారికి చీర చైత్రమాసంలో జరిగే కోటి పుష్పార్చన రోజులలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెలతో చీరను తయారు చేయించి అలంకరిస్తారు. ఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా మల్లె పూలను తీసుకువస్తారు. కడియం నుంచి విచ్చేసే నిపుణులు ఈ చీరను తయారు చేస్తారు. శాకంభరీదేవి ఉత్సవాలు ఆషాఢ మాసంలో శాకంభరీదేవి ఉత్సవాలలో పూలకు బదులుగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, శుష్క ఫలాల (డ్రైప్రూట్స్) తో విశేషంగా అలంకరిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారితో పాటు ఉత్సవ మూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన కదంబం ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు. విలువైన పండ్లను సైతం వ్యాపారులు స్వచ్ఛందంగా అమ్మవారికి విరాళాలుగా అందచేస్తారు. గిరి ప్రదక్షణతో సర్వ పాపహరణం... భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే దీక్ష విరమణ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. దీక్షల విరమణ చివరి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల వరకు లక్షలాది మంది భవానీలు గిరి ప్రదక్షణ చేస్తుంటారు. ఈ సమయంలో కొండ చుట్టూ ఉన్న అమ్మవారి భక్తులు అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలతో పాటు గిరి ప్రదక్షణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, టీ, కాఫీలతో పాటు పండ్లు, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. – ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడదద