రేపు బెజవాడకు కేటీఆర్‌ | Minister KTR to visits vijayawada tomorrow | Sakshi
Sakshi News home page

రేపు బెజవాడకు కేటీఆర్‌

Published Wed, Jun 20 2018 5:03 PM | Last Updated on Wed, Jun 20 2018 5:04 PM

Minister KTR to visits vijayawada tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కె. తారకరామారావు గురువారం విజయవాడ వెళ్లనున్నారు. కుటుంబంతో కలిసి బెజవాడ వెళ్తున్న ఆయన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పున్నమి ఘాట్ లోని టూరిజం రిసార్ట్స్ లో కేటీఆర్ కుటుంబం బసచేయనుంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా టూరిజం రిసార్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement