
వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: నారా లోకేశ్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసమే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిపించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. లోకేశ్ కోసం చంద్రబాబు కుటుంబం దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేసినట్లు లోకమంతా కోడైకూస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
శనివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 26వ తేదీన విజయవాడ దుర్గగుడిలో, డిసెంబర్ 18వ తేదీన శ్రీకాళహస్తి కాలభైరవ ఆలయంలో మద్యం సమర్పించి జంతువులను బలిచేసి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ వల్ల ఉపయోగం లేదని, ఆ నివేదిక ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment