Tantrik Rituals
-
‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..
మంత్ర తంత్రాల మాటున మహిళలను చెరబట్టిన ‘జిలేబీ బాబా’ పాపం పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడు ఎట్టకేలకు దోషిగా తేలాడు. ఆ వివరాలు.. జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ అమర్‌వీర్. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్‌వీర్ రెండేళ్లు పత్తాలేకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తాంత్రిక విద్యలు తెలుసంటూ నాటకానికి తెరతీశాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్‌నాథ్ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు. ఆత్మలు ఆవహిస్తాయని... మాయమాటలు చెప్పి ఎందరో మహిళలను లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని నమ్మించేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
బంధువులతో కలిసి తల్లిదండ్రులను బలిచ్చిన మైనర్
రాయ్‌పుర్: మంత్రాలు, తాంత్రిక పూజల నెపంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రాణం తీసేందుకు సైతం వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పుర్‌లో వెలుగు చూసింది. మానసికంగా బాధపడుతున్న సోదరుడికి నయమవుతుందని ఓ తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే అతి కిరాతకంగా చంపేశాడు ఓ 17 ఏళ్ల బాలుడు. అందుకు వారి బంధువులు కొందరు బాలుడికి సహకరించటం గమనార్హం. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నందిగావూన్ గ్రామంలో మృతదేహాలను ఆగస్టు 1న స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌గఢ్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ‘ఆగస్టు 1వ తేదీన ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. మృతులు మహేశ్‌పుర్‌కు చెందిన సుక్రు యాదవ్(40), మన్మతి యాదవ్(45)లుగా గుర్తించాం.’ అని వెల్లడించారు ఎస్పీ మీనా. దర్యాప్తులో భాగంగా ఈ హత్యల్లో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను మరో ఏడుగురితో కలిసి తానే హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం నిందితుడి సోదరుడు మానసిక రోగిగా మారాడు. ఆ తర్వాత సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడు మోహన్ యాదవ్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మంత్రాలు చేయటం ద్వారానే అతడు మానసిక రోగిగా మారినట్లు తాంత్రికుడు తెలిపాడు. వారిని హత్య చేస్తే మామూలు మనిషిలా మారతాడని సెలవిచ్చాడు. అలాగే ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుందని నమ్మించాడు. దీంతో బావ నర్సింగ్ యాదవ్, సోదరుడు రాజు రామ్ యాదవ్, భోలే శంకర్ యాదవ్, శంకర్ యాదవ్, ఖగేశ్వర్ యాదవ్, ఐశ్వర్య యాదవ్, దశరథ్ యాదవ్‌లతో కలిసి పథకం రచించాడు నిందితుడు. హత్య చేశాక మృతదేహాలను మహానది నదిలో పడేయాలని ప్రణాళిక వేశారు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం తీసుకుని భగ్వాన్‌పుర్‌కు వెళ్లాడు. అక్కడ ఓ తాడు, టవల్, ప్లాస్టిక్ సింక్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి బాధితులను వాహనంలో ఎక్కించుకున్నారు. సురాజ్‌గఢ్‌లోని మహానది వంతన వద్దకు తీసుకెళ్లి వారిని గొంతు కోసం హత్య చేశారు. ఇదీ చదవండి: HIV: హెచ్ఐవీ పేషెంట్‌తో ప్రేమ.. ప్రాణం మీదకు తెచ్చుకుంది! -
త్రిశూలంతో గుచ్చి.. కళ్లు పొడిచి
రాంచీ: అంతరిక్షం అంతు చూసే ప్రయోగాలు ఓ వైపు.. అంతులేని అజ్ఞానం మరోవైపు. వెరసి నేటికి గ్రామాల్లో మంత్రాలు, చేతబడులు వంటి మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోయాయి. వీటి గురించి సరైన అవగాహన లేక గ్రామాల్లో నేటికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. అనారోగ్యం పాలైన యువతిని ఆస్పత్రికి తీసుకేళ్లే బదులు భూత వైద్యం చేసే జంట దగ్గరకు తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి సదరు దంపతులు ఏకంగా యువతి ప్రాణాలు తీశారు. ఆ వివరాలు.. గర్వా, కొందిరా గ్రామానికి చెందిన రుద్ని దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే బదులు ఓ తాంత్రిక జంటను ఆశ్రయించారు. వారు రుద్ని దేవిని పరీక్షించి ఆమె శరీరంలో దెయ్యం ఉందని చెప్పి.. దాన్ని పారదోలడానికి పూజలు చేయలన్నారు. ఈ క్రమంలో త్రిశూలం తీసుకుని రుద్ని శరీరం మీద గుచ్చడమే కాక ఆమె కళ్లను కూడా పొడిచారు. అప్పటికే అనారోగ్యంతో నీరసించిన రుద్ని ఈ హింసను తట్టుకోలేక మరణించింది. దాంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు రుద్ని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కాల్చేశారు. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రుద్ని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. అనంతరం ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘చేతబడులు, మంత్రాలు వంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ మారుమూల ప్రాంతాలు, గ్రామాల్లో ఉంటున్న జనాల్లో ఇంకా మార్పు రాలేదు. దాంతో ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయ’న్నారు. -
స్వామికి మద్యంతో అభిషేకాలు.. అర్ధరాత్రి తాంత్రిక పూజలు!
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవస్వామి ఆలయం వద్ద తాంత్రిక పూజలు ఆగడం లేదు. అర్ధరాత్రి అమావాస్య రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పూజలు జరుగుతున్నాయి. అసలు ఈ పూజలు బయటి వ్యక్తులు చేస్తున్నారా.. లేక అధికారులే ఆ పూజలను ప్రోత్సహిస్తున్నారా.. అని కూడా పలువురు సందేహిస్తున్నారు. తాంత్రిక పూజలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే ఈ అనుమానాలకు కారణమవుతోంది. గురువారం అర్ధరాత్రి అమావాస్య గడియల్లో భైరవస్వామికి తాంత్రిక పూజ జరిగిందని, అది దేవస్థానం అనుబంధ దేవాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అర్చకుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని బహిర్గతమైంది. ఆ పూజలు ఈవో ఆదేశాల మేరకే జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. భక్తులకు దర్శనం కల్పించకుండా ఆపేసి.. దేవస్థానానికి అనుబంధంగా అడవివరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో భైరవస్వామి ఆలయం ఉంది. అమావాస్య రోజుల్లో భక్తులు భారీగా వస్తున్నారు. కొందరు అనధికార పురోహితులు స్వామికి మద్యంతో అభిషేకాలు, హోమాలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తుండటంపై రెండేళ్లుగా దుమారం రేగుతోంది. దీంతో దేవస్థానం అధికారులు గతేడాది ఆలయం వద్ద నిఘా పెట్టారు. అయినా అమావాస్య రోజుల్లో ఆలయం వద్ద ఇటువంటి పూజలు ఆగడం లేదు. గురువారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయం వద్ద దేవస్థానానికి చెందిన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు అర్చకులు.. మరికొంతమంది ప్రైవేటు అర్చకులతో కలిసి భైరవస్వామికి తాంత్రికపరమైన అభిషేకాలు, హోమం, పూజలు నిర్వహించారు. అప్పటికే అక్కడకు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు గంటల తరబడి దర్శనం కల్పించకుండా చేశారు. భైరవస్వామి చెంత అర్ధరాత్రి తాంత్రిక పూజలు అదేంటని భక్తులు ప్రశ్నిస్తే.. దేవస్థానం ఈవో చెప్పడంతోనే ఈ పూజలు చేస్తున్నామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై ఈవో వివరణ కోరేందుకు శుక్రవారం సాక్షి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. భైరవస్వామి ఆలయం వద్ద జరుగుతున్న తాంత్రిక పూజలను దేవస్థానం అనువంశిక ధర్మకర్త సామాజిక వర్గానికి చెందినవారే ప్రోత్సహిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఐదేళ్లుగా ఈ విధమైన పూజలు జరిపేవారిని దగ్గరుండి ఆలయానికి తీసుకెళ్లిన సందర్భాలు, అలాంటి పూజలు జరిపే తాంత్రికులు ఏకంగా దేవస్థాన కార్యాలయంలోకి కూడా యథేచ్ఛగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కంచరపాలేనికి చెందిన ఓ భక్తుడు వస్తే నవగ్రహ పూజలు జరిపినట్లు అర్చకుడు సంతోష్‌శర్మ చెప్పారు. -
బాలిక గొంతులో 9 సూదులు గుచ్చారు
కోల్‌కతా : ప్రజలను మూఢ నమ్మకాల ప్రభావం నుంచి తప్పించడం అంత తేలిక కాదు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది కోల్‌కతాలో జరిగిన ఈ దారుణం. బాగు చేస్తాడని నమ్మి మాంత్రికుని వద్దకు తీసుకెళ్తే అతడు కాస్తా ఆటవికంగా ఆ బాలిక గొంతులో సూదులు దింపాడు. వివరాల ప్రకారం కోల్‌కతా క్రిష్ణానగర్‌కు చెందిన దంపతులు కొన్ని ఏళ్ల కిందట అపురూప బిస్వాస్(14)ను దత్తత తెచ్చుకున్నారు. అనంతరం వారికి ఒక కుమారుడు కలిగాడు. అయితే మూడేళ్ల క్రితం ఆ అబ్బాయి మరణించాడు. అప్పటి నుంచి అపురూప ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంది. సోదరుడు చనిపోయిన బాధలో మానసిక కృంగుబాటుకు గురైంది. దాంతో తల్లిదండ్రులు అపురూపకు వైద్యం చేయించడం కోసం ఒక తాంత్రికుని వద్దకు తీసుకెళ్లారు. వైద్యంలో భాగంగా అతను బాలిక గొంతులోకి సూదులను గుచ్చాడు. ఇలా దాదాపు 9 సూదులను బాలిక గొంతులోకి దించాడు. దాంతో తీవ్ర రక్తస్రావమవుతుండటంతో వెంటనే బాలికను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బాలిక గొంతు నుంచి సూదులను బయటకు తీశారు. ‘బాలికే తెలియక సూదులను మింగిందేమోనని ముందు అనుకున్నాం. కానీ తర్వాత తాంత్రిక పూజలో భాగంగా ఇలా చేశారని తెలిసింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచాము. బాలిక తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని’ తెలిపారు. -
చెన్నపల్లి కోటలో తాంత్రికపూజలు
-
‘ప్రతిపక్ష నేతపై క్షుద్రపూజలు చేస్తారేమో’
సాక్షి, చెన్నంపల్లి కోట(కర్నూలు) : ఆంధ్రప్రదేశ్‌లో తాంత్రికపూజలు మరోసారి కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలోని చెన్నపల్లి కోట బురుజు వద్ద బుధవారం తాంత్రిక పూజలు జరిగాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగాయని తెలిసింది. కాగా, ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులకు ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కోట బురుజు వద్దకు ఇద్దరు పూజరులను తీసుకొచ్చిన అధికారులు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. కోట బురుజు వద్ద పెద్ద ఎత్తున నిమ్మకాయలు, ఇతర సామగ్రిని స్థానికులు గుర్తించారు. కోటలో తాంత్రికపూజలపై స్పందించిన అధికారులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లు చెప్పారు. కోట మధ్య భాగంలో తవ్వి ఉండటంపై ప్రశ్నించగా.. 13 రోజులుగా కోటలో నిధుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో భారీ రాయి గుండ్లు, గుర్రం ఎముకలు, పూత పోసిన ఇటుకలు మాత్రమే దొరికాయని చెప్పారు. తవ్వకాల్లో భాగంగా కోట వెనుక భాగంలో ఉన్న బావిలోని నీటిని పూర్తిగా బయటకు తీసినట్లు వివరించారు. కోటలో ఉన్న పాతాళగంగ నుంచి సొరంగమార్గం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. తవ్వకాల్లో పురోగతిని సాధించేందుకు హైదరాబాద్ నుంచి అత్యాధునిక పనిముట్లను తెప్పించినట్లు వెల్లడించారు. అయితే, వాటిని ఉపయోగించినా ఎలాంటి ఫలితం దక్కలేదని చెప్పారు. ప్రతిపక్షం ఫైర్.. కోటలో తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కూడా నీళ్లునములుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న విజయవాడ దుర్గాదేవి గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. రేపోమాపో ప్రతిపక్ష నేతపై ప్రభుత్వ పెద్దలు తాంత్రికపూజలు చేస్తారేమో అనిపిస్తుందంటూ భయాందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడినా పాల్పడొచ్చని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వినాశన కాలం దాపురించే ఇలాంటి పనులకు ఒడిగడుతోందని మండిపడ్డారు. తాంత్రికపూజలు చేస్తున్న ప్రభుత్వం పెద్దలు ఉనికి లేకుండా పోతారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. వాళ్లు తానా అంటే వీళ్లు తందానా అంటున్నారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తితో పని చేయడం మానేశారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో తాంత్రికపూజలపై విచారణ జరిపిస్తారని చెప్పారు. తాంత్రికపూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. క్షుద్రపూజలు మూర్ఖత్వ చర్య ‘దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటివరకూ వాస్తు, జోతిష్యాలను ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్షుద్రపూజల వరకూ వెళ్లడం హాస్యాస్పదం. ప్రజల్లోని మూఢ నమ్మకాలను తొలగించాల్సిన ప్రభుత్వాలు.. వాటిని ప్రోత్సహించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఏదో ఆశించి ఓ వ్యక్తిపై క్షుద్రపూజలు చేసి లాభపడినట్లు ఆధారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. క్షుద్రపూజలు నిజమే అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై నెగ్గడానికి రాజకీయ నాయకులు కేవలం క్షుద్రపూజల కోసమే ఖర్చు చేస్తారు. తాంత్రికపూజలు, క్షుద్రపూజలు వంటి వాటిని ప్రభుత్వాలు సమర్ధిస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుంది.’ - టీవీ రావు.. జనవిజ్ఞాన వేదిక -
మంత్రి మాణిక్యాలను బర్తరఫ్ చేయాలి
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాంత్రిక పూజలు ఎవరికోసం చేశారో చెప్పాలని కోరారు. తాంత్రిక పూజల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ప్రధాని నరేంద్ర మోదీ కంట్రోల్ చేస్తున్నారని, మోదీ నియంత పోకడలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయని, మోదీకి అనుకూలంగా లేకపోతే సీబీఐతో దాడులు చేయించటం పరిపాటిగా మారిందన్నారు. -
లోకేష్ సీఎం కావాలనే క్షుద్రపూజలు: అంబటి
సాక్షి, హైదరాబాద్: నారా లోకేశ్‌కు వెంటనే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసమే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిపించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. లోకేశ్ కోసం చంద్రబాబు కుటుంబం దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేసినట్లు లోకమంతా కోడైకూస్తోందన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 26వ తేదీన విజయవాడ దుర్గగుడిలో, డిసెంబర్ 18వ తేదీన శ్రీకాళహస్తి కాలభైరవ ఆలయంలో మద్యం సమర్పించి జంతువులను బలిచేసి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ వల్ల ఉపయోగం లేదని, ఆ నివేదిక ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటుందన్నారు. -
పాలకమండలి నోరు నొక్కిన ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాంత్రిక పూజలపై నమోదైన కేసును మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. అర్థరాత్రి దుర్గగుడిలో అసలు పూజలే జరగలేదని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే నివేదికపై వస్తున్న లీకులపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు చేసిన ఆలయ పాలకమండలి సభ్యులు మౌనం వహిస్తున్నారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకమండలి సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై పాలకమండలి సభ్యులు నోరు మెదపవద్దని ఇప్పటికే చంద్రబాబు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అసలేం జరిగింది.. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఈ ఘటనతో సంబంధముందనే మరో ఆరోపణ మరింత విస్తుపోయేలా చేసింది. అయితే ఈవో సూర్యకుమారి ...ఆలయంలో పూజలు జరగలేదని వివరణ ఇస్తే...పాలకమండలి సభ్యులు మాత్రం తాంత్రిక పూజలు జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి.. రెండు రోజుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పూజలు జరిగాయని తేలితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. సీన్ రివర్స్.. రెండు రోజుల పాటు తాంత్రిక పూజలపై విచారణ చేయాల్సిన కమిటీ ఒక రోజుతోనే విచారణను ముగించింది. అంతేకాదు అర్థరాత్రి ఆలయంలో అసలు పూజలే జరగలేదనే లీకులు ఇచ్చింది. వాస్తవానికి నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదికను ఆదివారం కమిషనర్‌కు సమర్పించాల్సివుంది. అయితే, నివేదికపై ముందుగానే కమిటీ సభ్యులు లీకులు ఇవ్వడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మవారి ముందు అలాంటి పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదని విచారణ కమిటీలోని సభ్యుడు ఒకరు అన్నట్లు తెలిసింది. దీంతో కేసును మూసేసేందుకు కమిటీని ప్రభుత్వం పావుగా వాడుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి పేరు.. మరోవైపు దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై చర్చలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేరును వాడినట్లు సమాచారం. అయితే, ఏ విషయంపై రాష్ట్రపతి పేరును తీసుకువచ్చరన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం చేసింది చిన్న అపచారం కాదు కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్‌ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్‌లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు. -
క్షుద్ర పూజలపై విచారణ జరిపించండి