బాలిక గొంతులో 9 సూదులు గుచ్చారు | Kolkata 9 Needles Inserted Into Girls Throat As Tantrik Ritual | Sakshi
Sakshi News home page

బాలిక గొంతులో 9 సూదులు గుచ్చారు

Published Wed, Aug 1 2018 10:58 AM | Last Updated on Wed, Aug 1 2018 11:20 AM

Kolkata 9 Needles Inserted Into Girls Throat As Tantrik Ritual - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : ప్రజలను మూఢ నమ్మకాల ప్రభావం నుంచి తప్పించడం అంత తేలిక కాదు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది కోల్‌కతాలో జరిగిన ఈ దారుణం. బాగు చేస్తాడని నమ్మి మాంత్రికుని వద్దకు తీసుకెళ్తే అతడు కాస్తా ఆటవికంగా ఆ బాలిక గొంతులో సూదులు దింపాడు. వివరాల ప్రకారం కోల్‌కతా క్రిష్ణానగర్‌కు చెందిన దంపతులు కొన్ని ఏళ్ల కిందట అపురూప బిస్వాస్‌(14)ను దత్తత తెచ్చుకున్నారు. అనంతరం వారికి ఒక కుమారుడు కలిగాడు. అయితే మూడేళ్ల క్రితం ఆ అబ్బాయి మరణించాడు. అప్పటి నుంచి అపురూప ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంది.

సోదరుడు చనిపోయిన బాధలో మానసిక కృంగుబాటుకు గురైంది. దాంతో తల్లిదండ్రులు అపురూపకు వైద్యం చేయించడం కోసం ఒక తాంత్రికుని వద్దకు తీసుకెళ్లారు. వైద్యంలో భాగంగా అతను బాలిక గొంతులోకి సూదులను గుచ్చాడు. ఇలా దాదాపు 9 సూదులను బాలిక గొంతులోకి దించాడు. దాంతో తీవ్ర రక్తస్రావమవుతుండటంతో వెంటనే బాలికను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బాలిక గొంతు నుంచి సూదులను బయటకు తీశారు.

‘బాలికే తెలియక సూదులను మింగిందేమోనని ముందు అనుకున్నాం. కానీ తర్వాత తాంత్రిక పూజలో భాగంగా ఇలా చేశారని తెలిసింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉంది. అబ్జర్వేషన్‌లో ఉంచాము. బాలిక తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్‌ ఇచ్చామని’ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement