Needles
-
షాకింగ్: మహిళల మెదడులో సూదులు
బీజింగ్: ఓ మహిళ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టర్లు ఆమె తలకు సీటీ స్కాన్ చేశారు. రిపోర్టులో ఆమె మెదడులోకి రెండు పొడవైన సూదులు చొచ్చుకెళ్లినట్లు గుర్తించారు. చిత్రం ఏమిటంటే.. అవి తలలోకి ఎలా చొచ్చుకెళ్లాయో ఆమెకి కూడా తెలీదు. దానికి తోడు పుర్రెపై కూడా ఎలాంటి గాయాలు లేవు. దీంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. విచిత్రం ఏంటంటే దీని గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వివరాలు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, ఎందుకైనా మంచిదని.. ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్ సమయంలో ఆమె తలలోకి వెళ్లినవి కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయని వైద్యులు గుర్తించారు. (చదవండి: లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!) దీని గురించి వైద్యులు ఆమెను పలు రకాలుగా ప్రశ్నించారు. ‘గతంలో ఎప్పుడైనా నీకు సర్జరీ జరిగిందా’ అని అడిగారు. ఇందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చింది. పోనీ.. తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పింది. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెదడులో సూదులు ఉండటం ప్రమాదకరమని, వాటిని వెంటనే తొలగించాలని వైద్యులు చెప్పారు. తనకు ఏ రోజు తలకు సంబంధించిన సమస్యలు రాలేదని జుహు చెప్పింది. ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ.. జుహు తలలోకి సూదులు ఎలా వెళ్లాయనేది తమకు తెలీదని, చిన్నప్పటి నుంచి ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. (వైరల్: వందేళ్ల కిందటి శవం నవ్వుతోందా?) అయితే, తాము యాత్రలకు వెళ్లినప్పుడు జుహును పిన్ని ఇంట్లో ఉంచామని, అప్పుడు ఆమె తమ బిడ్డ తలపై రెండు నల్లని గుర్తులు చూశానని తమతో చెప్పిందన్నారు. అవి సాధారణ మచ్చలు కావచ్చని తాము పట్టించుకోలేదని తెలిపారు. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు. -
సూదుల బెడద తప్పించే కాగితం సెన్సర్లు...
రక్తంలోని గ్లూకోజు మోతాదులను గుర్తించేందుకు రోజూ సూదులతో గుచ్చుకుంటున్నారా? మీ కష్టం ఇంకొంత కాలం మాత్రమే. ఎందుకంటే సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు కాగితం సెన్సర్లతోనే ఈ పని కానిచ్చేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సాహికా ఇనాల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో వ్యక్తుల లాలాజలం ఆధారంగానే గ్లూకోజు మోతాదు నిర్ధారణ అవడం ఇంకో విశేషం. సాధారణ ఇంక్ జెట్ ప్రింటర్లో వాడే ఇంక్‌కు విద్యుత్తు ప్రసార సామర్థ్యమున్న ప్లాస్టిక్‌ను కలపడం ద్వారా ఈ కాగితం సెన్సర్ల తయారీ మొదలవుతుంది. ఈ ఇంకుతో కాగితంపై ఎలక్ట్రోడ్లను ముద్రించడం.. దానిపై గ్లూకోజ్ ఆక్సిడేజ్ ఎంజైమ్‌ను ఒక పూతగా పూయడంతో.. ఈ రెండింటిపై నాఫియన్ పాలిమర్ తొడుగు ఒకటి ఏర్పాటు చేయడంతో సెన్సర్ తయారీ పూర్తవుతుంది. ఈ సెన్సర్లపై లాలాజలం చేరినప్పుడు అందులోని గ్లూకోజ్ కాస్తా గ్లూకోజ్ ఆక్సిడేజ్తో చర్య జరుపుతుంది. ఫలితంగా పుట్టిన విద్యుత్ సంకేతాన్ని ఎలక్ట్రోడ్లు గుర్తిస్తాయి. సంకేతపు తీవ్రతను బట్టి శరీరంలోని గ్లూకోజ్ మోతాదును నిర్ధారిస్తారు. ఈ సెన్సర్లను కనీసం నెలరోజులపాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలు, తీగల్లాంటివి లేకుండా చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని.. సెన్సర్లను మరింత సమర్థంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సాహికా ఇనాల్ తెలిపారు. -
బాలిక గొంతులో 9 సూదులు గుచ్చారు
కోల్‌కతా : ప్రజలను మూఢ నమ్మకాల ప్రభావం నుంచి తప్పించడం అంత తేలిక కాదు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది కోల్‌కతాలో జరిగిన ఈ దారుణం. బాగు చేస్తాడని నమ్మి మాంత్రికుని వద్దకు తీసుకెళ్తే అతడు కాస్తా ఆటవికంగా ఆ బాలిక గొంతులో సూదులు దింపాడు. వివరాల ప్రకారం కోల్‌కతా క్రిష్ణానగర్‌కు చెందిన దంపతులు కొన్ని ఏళ్ల కిందట అపురూప బిస్వాస్(14)ను దత్తత తెచ్చుకున్నారు. అనంతరం వారికి ఒక కుమారుడు కలిగాడు. అయితే మూడేళ్ల క్రితం ఆ అబ్బాయి మరణించాడు. అప్పటి నుంచి అపురూప ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంది. సోదరుడు చనిపోయిన బాధలో మానసిక కృంగుబాటుకు గురైంది. దాంతో తల్లిదండ్రులు అపురూపకు వైద్యం చేయించడం కోసం ఒక తాంత్రికుని వద్దకు తీసుకెళ్లారు. వైద్యంలో భాగంగా అతను బాలిక గొంతులోకి సూదులను గుచ్చాడు. ఇలా దాదాపు 9 సూదులను బాలిక గొంతులోకి దించాడు. దాంతో తీవ్ర రక్తస్రావమవుతుండటంతో వెంటనే బాలికను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి బాలిక గొంతు నుంచి సూదులను బయటకు తీశారు. ‘బాలికే తెలియక సూదులను మింగిందేమోనని ముందు అనుకున్నాం. కానీ తర్వాత తాంత్రిక పూజలో భాగంగా ఇలా చేశారని తెలిసింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచాము. బాలిక తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని’ తెలిపారు. -
సూదిమందులోకి బ్యాండేజీ
గాయాలకు బ్యాండేజీ కట్టడం మనం చూశాం.. ఇకపై బ్యాండేజీలను సూదితో గాయంలోకి ఎక్కించనున్నారు! ఎందుకలా? అంటున్నారా! చాలా సింపుల్. ఇది సాధారణ బ్యాండేజీ కంటే చాలా వేగంగా రక్తస్రావాన్ని నిలుపుతుంది. గాయం తొందరగా మానేందుకు సాయపడుతుంది కూడా. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్తరకం బ్యాండేజీలో ఆహారాన్ని చిక్కగా చేసేందుకు వాడే పదార్థం, నానో స్థాయి కణాలు ఉంటాయి. సముద్రపు కలుపు మొక్కల నుంచి సేకరించే కప్ప కరాగీనన్ అనే పదార్థాన్ని నానో స్థాయి సిలికేట్లకు కలిపినప్పుడు రక్తస్రావాన్ని అడ్డుకోగల సామర్థ్యం పెరిగినట్లు వీరు గుర్తించారు. శరీరం లోపల అయ్యే గాయాలకూ ఈ కొత్త సూది మందు బ్యాండేజీలు బాగా ఉపయోగపడతాయని, మందులు నానో స్థాయిలో ఉండటం వల్ల అతితక్కువ మోతాదులతోనే గాయాలు మానేలా చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గిరిరాజ్ లోఖండే తెలిపారు. యుద్ధాల్లో అయ్యే గాయాల ద్వారా నియంత్రించలేని స్థాయిలో రక్తస్రావాలు కావడం.. తద్వారా సైనికులు మరణించడం ఈ కొత్త బ్యాండేజీ ద్వారా తగ్గించవచ్చునని చెబుతున్నారు వీరు. -
సిరంజీపై 1000% లాభం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సిరంజీలు, సూదులు వంటి వైద్య పరికరాలను వేయి శాతానికి పైగా లాభంతో విక్రయిస్తున్నారు. పంపిణీదారుడి మార్జిన్లు మినహాయిస్తే అంతిమంగా భారం మోస్తున్నది వినియోగదారుడే. తయారీదారులు, ఎగుమతిదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సిరంజీలు, సూదుల లాభాల మార్జిన్లపై జాతీయ ఔషధ ధరల నిర్ధారణ సంస్థ(ఎన్పీపీఏ) ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. సూదితో కూడిన 5 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజబుల్ సిరంజీ తయారీ ధర రూ. 2.31. కానీ పంపిణీదారుడికి చేరే సరికి దాని ధర రూ. 13.08 (1251శాతం అధికం) అవుతోంది. సూదిలేని 50 ఎంఎల్ హైపోడెర్మిక్ డిస్పోజిబుల్ సిరంజీ ధర పంపిణీదారుడి వద్దకు వచ్చే సరికి రూ.16.96 కాగా, వినియోగదారుడికి అమ్మే గరిష్ట చిల్లర ధర రూ.97గా(సుమారు 1249 శాతం లాభం) ఉంటోంది. సూదితో కలపి 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధరకంటే 400 శాతం అధిక ధరకు అమ్ముతున్నారు. అలాగే సూది లేని 1 ఎంఎల్ ఇన్సులిన్ సిరంజీని తయారీ ధర కన్నా 287 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. డిస్పోజబుల్ సూదిపై గరిష్ట మార్జిన్ 789 శాతంగా ఉంది. సూదుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్‌నాథ్ స్పందిస్తూ.. ‘అధిక మార్జిన్లు నిజమే. ఆయా కంపెనీల మధ్య అనారోగ్య పోటీయే దీనికి కారణం’ అని అన్నారు. -
కడుపులో 263 నాణేలు!?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి కడుపులో ఈ స్థాయిలో ఇనుప వ్యర్థాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి వ్యర్థాలను తొలగించారు. రేవా జిల్లాలోని మారేమూల గ్రామానికి చెందిన సదరు వ్యక్తి కడుపు నుంచి మొత్తంగా 263 నాణేలను తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని.. వాటి విలువ రూ. 790 ఉంటుందని వైద్యులు తెలిపారు. నాణేలతో పాటు విరిగిపోయిన సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయన్నారు. కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన వైద్యులు అద్భుతం చేశారు. కోటాకు చెందిన వ్యక్తి శరీరం నుంచి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 92 గుండుపిన్నులను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆయన శరీరంలో ఆహార వాహిక, శ్వాసనాళం, ఇతర ముఖ్యమైన భాగాల్లో ఇంకా 60 దాకా గుండుపిన్నులున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 56 ఏళ్ల బద్రిలాల్ రైల్వే ఉద్యోగిగా చేస్తున్నారు. మూడు నెలలుగా ఆయనకు కడపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. షుగర్ పేషేంట్ అయిన ఆ వ్యక్తికి ఇటీవల కాలికి గాయమైంది. స్థానిక ఆస్పత్రిలో ట్రీట్మెంట్కు తీసుకెళ్లగా గుండుపిన్ను గుచ్చుకుని గాయమైందని చెప్పారు. అసలే షుగర్ పేషెంట్ కావడంతో బద్రిలాల్ బాడీని స్కాన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆయన శరీరంలో ఏకంగా వందకి పైగా గుండుపిన్నులున్నట్లు గుర్తించారు. ఆయన సమస్యకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆరు ఆస్పత్రుల వైద్యులు నిరాకరించారు. చివరగా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వారు అతికష్టం మీద చికిత్స నిర్వహించి 92 సూదులు తొలగించారు. ఇంకా అరవైదాకా సూదులను తీయాల్సి ఉందని, ప్రస్తుతం అబ్జర్వేషన్లో పెట్టినట్లు వైద్యులు తెలిపారు. బద్రిలాల్ సమస్య గానీ, ఆయన శరీరంలో గుండుపిన్నులు ఉన్నట్లు కుటుంబభ్యులతో పాటు బాధిత పేషెంట్‌కు తెలియక పోవడం గమనార్హం. గత మూడు నెలల సమయంలో బద్రిలాల్ 30 కిలోల బరువు తగ్గడం, కాలికి అయిన గాయం తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో ఆయన సమస్య వెలుగుచూసింది. మరికొన్ని సర్జరీలు చేసి మిగిలిన సూదులను తొలగించాలని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని తెలిపారు. -
బుజ్జి పిల్లికి ఎంతకష్టం!
బీజింగ్: చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పెంచుకునే పిల్లికి అస్వస్థత కలగటంతో దానిని ఆసుపత్రికి తీసుకెళ్లిన యజమానికి డాక్టర్లు షాకింగ్ విషయం చెప్పారు. పిల్లి అస్వస్థతకు కారణం ఏంటని తెలుసుకునే క్రమంలో డాక్టర్లు దాని ఎక్స్-రేను పరిశీలించగా.. శరీరంలో 43 నీడిల్స్ ఉన్న విషయం గుర్తించారు. సుమారు 4 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి నీడిల్స్‌ను తొలగించారు. పిల్లిని టార్గెట్‌గా చేసుకొని ఎయిర్ రైఫిల్‌తో దాడి చేయడం మూలంగానే దాని బాడీలోకి ఆ నీడిల్స్ వెళ్లాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై జంతుప్రేమికులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం పిల్లి కోలుకుంటోంది. -
ఓ మనిషి ప్రయాణం
క్లాసిక్ కథ మనిషి... పుట్టుక... బలహీనత... వీటి పరస్పర సంబంధాల్ని ఆలోచిస్తూ బలరాం మరింత బలహీనంగా తయారయ్యాడు. బలరాం గురించి ఆ వీధిలో ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చెప్పుకోరు. చెప్పుకోవాల్సిందేమీ లేదు కూడా. ముప్ఫై ఏళ్లు దాటిన మనిషని ఎవరూ అనుకోరు. వయస్సుని అతని విషయంలో అంచనా కూడా వేయలేరు. బలహీనతకి ఎముకలతో ఓ ఆకారం కూర్చి, ఓ పల్చటి పొర కప్పినట్టుంటాడు. రోజూలాగే నిద్రలేచాడు బలరాం, కిటికీలోంచి వచ్చే వెలుగుకి. గదికి ఉన్న ఆ ఒక్క కిటికీ అంటే బలరాంకి చాలా ఇష్టం. అతని సుషుప్తికి, జాగ్రదావస్తకి సరిహద్దు ఆ కిటికీ... కళ్లు తెరవగానే అలమారులో పచ్చ డబ్బా... ఈ రోజు ఇంకొంచం మెరుస్తూ కనపడింది. ఈ మధ్య ప్రతి ఉదయం బలరాంకి అలా అనిపిస్తూనే ఉంది. సాయంత్రానికి మామూలుగానే ఉంటుంది. మామూలంటే ఆ డబ్బాని అలమారులో ఉంచిన రోజు తోచినట్టు. ఆ డబ్బాని చూస్తూ నవ్వాడు. రోజు రోజుకీ బలరాం మనసులో బరువు పెరుగుతోంది. అది సంతోషమో, విచారమో... తెలియని బరువు. చింకి చాపమీంచి లేవకుండా ‘ఇది ఆనందమే...’ అనుకుంటాడు. లేచింతర్వాత సందేహం మామూలే. కాలు తిన్నగా సాగలేదు. చలికి చర్మం బిగుసుకుని, పుండుమీద గట్టిన గూడు నొప్పి... చిరాగ్గా కాలు లాగటం వల్ల పుండు రేగింది. రసి... చీము... నెత్తురు... ‘ఇంక ఇది తగ్గదు...’ సూదులు గుచ్చినట్టు పుండు సలుపు. నెమ్మదిగా లేచాడు. దొడ్లో అక్కడో చితుకు... ఇక్కడో చితుకు... వో కొబ్బరి మట్ట... మరో తాటాకు... కుంటుతూనే ఏరి మంట వేశాడు. ఎండ బాగా వేడెక్కే వరకూ అదే కార్యక్రమం బలరాంకి. కాలు సలుపుకి సవనగా ఉంటుంది. ఆ ఎర్రని మంటల్లో... దూరంగా ఏనాటివో నీలి మంటలు... చిటపట చప్పుళ్లు... కళ్ల ముందు కదుల్తాయి బలరాంకి. అదో వోదార్పు... స్మృతుల అవలోకన... ‘నేను కాబట్టే తల్లి చితి కాల్చుతుంటే గొప్ప పని చేసినవాడిలా మురిసి పోయాను’ మంటలోని తాటాకు కదుపుతూ అనుకున్నాడు. మంట వేడి... కళ్లల్లో నీరు తిరిగింది. నెమ్మదిగా లేచి మళ్లీ గదిలోకి. మామూలే... చూరుమీద అక్కడక్కడ చెదరిన పెంకులు... ఒక్కటే కిటికీ... అలమారు... అలమారులో ఒక్కటే డబ్బా... ఆ డబ్బాని అలా లోపల పెడుతూ గట్టిగా పకాపకా, సినిమాలో వికృత విజయం సాధించినవాడిలా నవ్వాలనిపించింది బలరాంకి ఆ రోజు... కాని మామూలుగా కూడా నవ్వలేకపోయాడు. ముప్ఫై ఏళ్ల జీవితంలో బలరాం ఏ ఒకటి రెండుసార్లో చూశాడు సినిమా... చూసిన ఆ ఒకటి రెండుసార్లు ఆశ్చర్యం తప్ప ఆనందం కలుగలేదు. బలరాం జీవితం సినిమాతో పొసిగే జీవితం కాదు. నెమ్మదిగా చింకిచాప చుడుతుంటే, మూల చిరుగుల బొంత కనిపించింది. ‘అమ్మది...’ బలరాం మనసు అనుకుంటుందా బొంతనెప్పుడు చూసినా. ‘ఇలాగే ఆ చాప పక్కనే బొంత వేసుకుని పడుకునేది అమ్మ’ గుర్తు తెచ్చుకున్నాడు బలరాం. తల్లిని తలుచుకున్నప్పుడల్లా శ్మశానం... మంటలే గుర్తొస్తాయి బలరాంకి. రోజూ పెట్టే రెండు ముద్దల అన్నం... వేసే చింకిగుడ్డల పక్క... ఆ ఆప్యాయపు చూపులు... ఆ గది నాలుగు మూలలా ఉన్నట్టే ఉంటాయి బలరాంకి. కాని అవి బలరాంని చేరుకోవటం లేదు: ఎర్రటి మంటల్లో కాలిపోతున్నాయి. తల్లి తలపులకి, బలరాంకి మధ్య ఎర్రటి మంటలడ్డు. అప్పుడప్పుడు వాటిని దాటుతుంటాడు బలరాం. అప్పుడే తల్లి మాటల్ని మననం చేసుకోగలడు. ‘నలుగురి తర్వాత నాకు మిగిలిన వెర్రి బాబువి... అసలే అంతంతమాత్రం మనిషివి. పట్టుమని పదడుగులేయలేవు. కడుపు నిండా తిండైనా పెట్టలేక పోతున్నాను. నా మూలానే నువ్విలా అయ్యావు. ముందెలా బతుకుతావో వెట్టిబాబువి.’ ఆ ముందు బతుకంటే అర్థం తెలియడం లేదు బలరాంకి ఆనాడు. అంత దూరం ఆలోచించే చైతన్యం లేదు. తల్లి అస్తమానం అన్నం అన్నం అంటే ఆలోచించేవాడు. అన్నం కొంచమే ఎందుకు దొరుకుతోందా అని. తల్లినడిగితే... ‘అదైనా వాళ్ల దయే కదు బాబు... నా వయస్సెంత... నేను చేసే పనెంత?’ అంది. బలరాంకి కూడా నిజమే అనిపించింది. సుదర్శనంగారు నిజంగా ధర్మాత్ముడే. తల్లి ఏ పనీ చేయలేదని తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నందుకు గాను పొమ్మనలేక, పేరుకి రెండు గదులు ఊడ్పించుకుంటూ... మిగిలిందో... మిగిల్చిందో... రెండు కరుళ్లు అన్నం పెడుతున్నా రంటే... దొడ్లో ఇంట్లో తలదాచుకో నిస్తున్నారంటే, తల్లిమీద అభిమానమే. గడచిన రోజుకి గడవబోయే రోజుకి పెద్ద తేడా కనిపించేది కాదు బలరాంకి దైనందిన కార్యక్రమంలో... దొడ్లో తిరగటం... పెంకుల వేపు చూడటం... రాలిన చింతకాయలు తినటం... రోజులో ఎక్కువసేపు కిటికీ దగ్గర కూర్చుని వచ్చేపోయే వాళ్లని చూడటం... ఎన్నో ఆలోచనలొచ్చేవి. కిటికీలోంచి చూస్తూ ఎన్నో కలలు... కాని ఏదీ స్థిరంగా నిలిచి తన సంపూర్ణ స్వరూపాన్ని చూపలేదు.ఈనాడు జీవితం అంతా గుర్తు తెచ్చుకుంటే... అక్కడో రోజు... అక్కడో రోజు... వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రం గుర్తొస్తాయి బలరాంకి. తల్లి కొత్త చొక్కా తొడిగిన రోజు... కొత్తదనం అంటే ఏమిటో తెలిసిన మురిపెం. సుదర్శనంగారి దగ్గర నాలుగక్షరాలు నేర్చుకుంటున్న కొత్తలో సరదా... అలా... వాటిల్లో ఆనాడు... అదోరోజు... కిటికీలోంచి చూస్తుంటే... వెడుతూ వెడుతూ ఆగిపోయింది. మాసిన చిరుగుల చీర... ఎత్తయిన గుండెల్ని పూర్తిగా కప్పలేని జీవితం... అడుక్కునేది. బలరాంని రెండు క్షణాలు అలా చూస్తూ నవ్వింది. అది అందం నవ్విన నవ్వు కాదు. స్త్రీత్వంలోని జాలి, లాలన నవ్విన నవ్వది. ఆడతనం నవ్విన నవ్వది. ఆ రోజు కిటికీలోంచి ఎన్నో రంగులు, ఇదివరకు కనపడనివి ఎన్నెన్నో కనిపించాయి బలరాంకి. సూటిగా సాగి గబుక్కుని విరిగిపోయే బలరాం ఊహలు ఆ రోజు కొద్దిగా మలుపు తిరిగి కొత్త చైతన్యం వేపు చూశాయి... మరి బలరాం జీవితమే మలుపు తిరిగిందేమో... రోజుకి రోజుకి తేడా కనిపించని బలరాంకి ఆ రోజు పెద్ద తేడా కనిపించింది.ఆలోచనో... బాధో... ఏమిటో తెలియని స్థితి... ఆ క్షణాన తెలిసిందొక్కటే బలరాంకి తల్లి చచ్చిపోయిందని... అందరిలాగే తన తల్లి పోతుందనే ఆలోచనెప్పుడూ లేదు బలరాంకి. సుదర్శనంగారు భుజం తట్టేవరకు ఏమీ తెలియలేదు. ఆయన్ని చూడగానే గుండెల్లో... నిశ్శబ్దంలో... ఏడుపు ఒక్కసారిగా పగిలింది. ‘ఊరుకో బలరాం... ఏదోనాడు అందరం అంతే... ఇంకా నయం మూలపడలేదు. కాలు చెయ్యి వంగకుండా దాటిపోయింది. మూల పడితే మందు మాకూ చూడగలిగేవాడివా చెప్పు. ముందు జరగాల్సిందేమిటో చూడు.’ ‘ముందు జరగాల్సిందంటే...’ సుదర్శనంగారు చెప్పేవరకు తోచలేదు బలరాంకి. జీవి రూపు ఏర్పరచుకున్న క్షణం నుంచి ఆ రూపం నశించే వరకూ ముడిపడిన అవసరం... డబ్బు. ఆనాడు అభిమానం అడ్డు రాలేదు. వివరించలేని ఆ స్థితిలో... ఆనాడు అలా అంతమందిని ఎలా అర్థించగలిగానో అనుకుంటాడు బలరాం. ‘మా వాళ్ల తద్దినాలే పెట్టలేక చస్తుంటే... ఊళ్లో వాళ్ల గొడవొకటి’... ఓ ఇంటావిడ పావలా ఇస్తూ అన్నమాట. ‘అడుక్కోటంలో అనేక రకాలు...’ ఇంకో ఇంటావిడ చీదరింపు. ‘మనిషి బతగ్గానే సరా... జీవితం ఏమిటి ఎందుకు అనే ఇంగితం ఉండఖర్లా... అంత గతి లేకపోతే ఏ కార్పొరేషన్ వాళ్లనో బతిమాలితే లాక్కుపోతారుగా’... ఇంకో ఇంటావిడ. వాళ్లందరూ కలిసి ముద్దగా ముఖం మీద విసిరిన అసహ్యం... బాధ కలిగించలేదానాడు. తల్లికి అంత్యక్రియలు చేయాలి. తల్లి పోయిందన్న బాధ కన్నా తల్లికి అంత్యక్రియలు చేయలేకపోతానేమో అన్న బాధ ఎక్కువైంది బలరాంకి. ఆఖరికెలాగైతేనేం... ఆ చితి మంటల్ని చూడగలిగాడు. గర్వంగా ఏడ్చాడు. అందుకనే తల్లి గుర్తొచ్చినప్పుడల్లా అడ్డొస్తాయి, ఆ మంటలు ఆలోచనకి. ఆనాడనుకుంది... తర్వాత బలపడింది. ఈ పచ్చ డబ్బా రూపు...ముందెలా బతుకుతావో వెర్రిబాబువి అన్న తల్లి మాటలకి ‘మామూలుగానే’ అనాలనిపించేది బలరాంకి. ఆ మాటే నిజమైంది. తల్లి ఊడ్చే రెండు గదులు తనే ఊడుస్తున్నాడు... అదే గమనం... అదే జీవనం. బలరాం పోయాడన్న వార్త అందరూ చాలా సహజంగానే విన్నారు, ఒక్క సుదర్శనంగారు తప్ప. వీలున్నవాళ్లు చూటానికి వచ్చారు. ‘అయ్యో పాపం’ అన్నారు. నిశ్చలంగా పడున్న బలరాంని చూస్తూ తనకి ఈ తద్దినం తప్పదనుకున్నారు సుదర్శనంగారు. మరి ఎందుకో తెలియదు కాని నాలుగు వేపులా కలయ చూశాడు. అలమారులో పచ్చ డబ్బా ఆకర్షణీయంగా ఉంది. అందుకున్నారు. బరువుగా ఉంది. మూత తీస్తే... సుదర్శనంగారి కళ్లు చెదిరాయి... ఏదో కాయితం... కళ్లజోడు లేదు. పక్క కుర్రాడెవరో అందుకున్నాడు... ‘‘ఇది ఎవరూ చదవాలని రాయలేదు. నన్ను నేను దాచుకోలేక రాసుకుంటున్నాను. ఎవరో ఒకళ్లు చదవాలన్న ఆశ లేకనూ పోలేదు. నా జీవితం మీ అందరికీ తెలిసున్నదే. శారీరకంగా పూర్తి బలహీనుణ్ని... కష్టపడి ఏ పనిచేసే శక్తి లేనివాణ్ని. చేయాలన్న ఉద్దేశం కలిగినా అమ్మ సాగనివ్వలేదు. మనిషికి మనిషెంత బరువో... మనిషి జీవితం విలువెంతో, అమ్మ పోయిననాడు తెలిసింది. ఆనాడు అమ్మ చితికి నిప్పంటిస్తూ ఎంతో గర్వపడ్డాను, కొడుకును కాబట్టి... నన్నలా తగలేస్తూ ఎవరూ గర్వపడరని తెలుసు.’’ ‘మనిషి బతగ్గానే సరా... జీవితం ఎందుకు, ఏమిటనే ఇంగితం ఉండఖర్లా...’ అన్నారొకరు ఆనాడు. జీవితం ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఏమిటి అన్నదానికీ అంతే. చిన్నప్పుడు అమ్మ ఒకసారి ‘రేపు ఊరు వెడదాం’ అంది. ఏ ఊరో తెలియదు. ప్రయాణం ఎందుకో తెలియదు. కాని ఎంతో సరదా వేసింది ఏదేదో ఉంటుందని. ఆ ప్రయాణం చేయనేలేదు. కాని అది చాలా మురిపించింది. నా జీవితం గురించి ఆలోచిస్తే ఇదీ ప్రయాణమే అనిపిస్తోంది. స్థాన చలనం లేని ప్రయాణం. ఎంతో ఇరుకుగా గడిపిన జీవితంలో చైతన్యానికి తావే లేకపోయింది... ఆ ఒక్కరోజు తప్ప... ఆ ఒక్క చూపు తప్ప... ఎన్నో ఊహలు, కదలికలు నిండిన రంగులు కళ్లముందు నిలిచాయి. ఇంచు మించుగా అమ్మ అప్పుడే పోయింది. నా హీన స్థితికి లోకం విసిరిన అసహ్యపు ముద్ద ఆ రంగుల్ని మళ్లీ కనపడనివ్వలేదు. ఆనాటి నుంచి మిగిలిన ఆలోచన ఇదొక్కటే. సంఘంలో ఆ ఏర్పాటుందని తెలుసు... అనాథ ప్రేతాన్ని లాగేయకపోరు. కాని అదీ ఉద్యోగ ధర్మమే... మళ్లీ అసహ్యం... చీదరింపులు... ఆ స్థితి నాకు కలగకూడదనే ఈ శ్రమపడ్డాను. ఈ పచ్చ డబ్బాలోది అరవై రూపాయలు కాదు, నా రక్తం... ఏనాడూ శ్రమించి ఎరుగని నా బలహీన దేహపు శ్రమ. చావు తరువాత... ఆత్మ... నాకయోమయం. ఆలోచన అంత దూరం సాగినా అర్థం చేసుకుని నిర్ణయించుకోగల శక్తి నాలో లేదు. ఈ ప్రయాణంలో, మనిషి తనంతగా తాను దాటలేని ఆఖరి మజిలీని ‘దాటించే ఈ ఖర్చు’ని. ఎవరి నెత్తిమీదైనా వేసుకుని అసహ్యించుకుంటారేమోనని బాధ.ఈ డబ్బు దానికి వినియోగించండి... ఇలా నాకు నేనుగా... ఈ ఏర్పాటు. బాధో... ఆన -
సూదుల తల...
తిక్క లెక్క ఈ ఫొటో చూస్తే తలపై వెంట్రుకలు కాకుండా, సూదులు మొలిచినట్లుగా లేదూ! సూదులు మొలిచినవి కాదు గానీ, ఉద్దేశపూర్వకంగానే గుచ్చుకున్నవి. ఇతగాడు చైనాలో కాస్మొటిక్ వైద్యుడు. గిన్నిస్ రికార్డు కోసం ఇలా తలపై సూదులు గుచ్చుకుని, తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ఎన్ని సూదులంటారా..? ఎన్నో కాదు, 2,188 సూదులు మాత్రమే. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో రెండేళ్ల కిందట ఈ విన్యాసాన్ని ప్రదర్శించాడు.