సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి కడుపులో ఈ స్థాయిలో ఇనుప వ్యర్థాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి వ్యర్థాలను తొలగించారు.
రేవా జిల్లాలోని మారేమూల గ్రామానికి చెందిన సదరు వ్యక్తి కడుపు నుంచి మొత్తంగా 263 నాణేలను తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని.. వాటి విలువ రూ. 790 ఉంటుందని వైద్యులు తెలిపారు. నాణేలతో పాటు విరిగిపోయిన సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయన్నారు. కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment