iron chains
-
గొలుసుతో చెట్టుకు కట్టేసి
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ అడవుల్లో ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న ఓ మహిళ కనిపించింది. రోజులుగా ఆహారంలేక ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. పశువుల కాపరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ దగ్గర దొరికిన యూఎస్ పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కాయి కుమార్ ఎస్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. సింధుదుర్గ్‌లో సోనుర్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి శనివారం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అక్కడ అతనికి మనిషి మూలుగు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఓ మహిళ కాలికి ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను సావంత్‌వాడీ ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. మహిళ దగ్గర యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు అడ్రస్‌తో ఆధార్ ఉందని, పదేళ్లుగా ఆమె తమిళనాడులో ఉంటోందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళను.. ఇంట్లో గొడవల కారణంగా భర్తే.. 40 రోజుల కిందట అడవిలో వదిలేసి వెళ్లినట్లుగా ఆస్పత్రిలో ఆమె రాసిన వివరాల ఆధారంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. ఆమె వీసా గడువు కూడా ముగిసిందని, విదేశీయుల స్థానిక నమోదు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు ఆమె భర్త, బంధువుల గురించి వించారించేందుకు కొన్ని బృందాలు తమిళనాడు, గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్లాయన్నారు. -
5 కిలోల ఇనుము వెలికితీసిన డాక్టర్లు
సాట్నా : మధ్యప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ ఆసుపత్రి వైద్యలు అరుదైన సర్జరీ నిర్వహించారు. ఓ వ్యక్తి కడుపు నుంచి ఐదు కిలోల ఇనుమును వెలికితీశారు. అందులో 263 కాయిన్లు, షేవింగ్ బ్లేడ్లు, సూదులు, గొలుసు ఉన్నాయి. బాధితుడు మహ్మద్ మసూక్ ఈ నెల 18వ తేదీన విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో వచ్చి చేరినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఎక్స్‌రేతో పాటు పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఇనుము సంబంధిత వస్తువులు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అనంతరం సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ఇనుము సంబంధిత వస్తువులను రోగి మింగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్లు వివరించారు. -
కడుపులో 263 నాణేలు!?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా ఆసుపత్రిలో ఒక యువకుడి కడపులోంచి కేజీ బరువున్న ఇనుప పదార్థాలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి కడుపులో ఈ స్థాయిలో ఇనుప వ్యర్థాలు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు.. మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసి వ్యర్థాలను తొలగించారు. రేవా జిల్లాలోని మారేమూల గ్రామానికి చెందిన సదరు వ్యక్తి కడుపు నుంచి మొత్తంగా 263 నాణేలను తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు. రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలు అందులో ఉన్నాయని.. వాటి విలువ రూ. 790 ఉంటుందని వైద్యులు తెలిపారు. నాణేలతో పాటు విరిగిపోయిన సైకిల్ చైన్ ముక్కలు, సూదులు, గోర్లు.. ఉన్నాయన్నారు. కడుపులో వ్యర్థాలు భారీగా పేరుకుపోవడంతో.. సదరు యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
రిటైరైన ఎస్ఐని గొలుసులతో కట్టేశారు!
రిటైరైన ఓ ఎస్ఐని ఆయన సొంత కుటుంబ సభ్యులు దాదాపు మూడు వారాల పాటు గొలుసులతో కట్టి పారేశారు. ఎట్టకేలకు ఆయనను బెంగళూరు పోలీసులు విడిపించారు. ఉద్యోగం చేసినన్నాళ్లు ఆయన సంపాదించి, మిగుల్చుకున్న సొమ్ము కోసమే కట్టుకున్న భార్య, కన్న కొడుకులు ఈ పని చేశారు. వెంకటేశ్ (60) మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అలాంటి ఆయనను ఆయన భార్య, కన్న కొడుకులు కలిసి మంచానికి ఇనుప గొలుసులతో కట్టి 18 రోజుల పాటు బంధించారు. తన చేతులు, కాళ్లను ఇనుప గొలుసులతో వాళ్లు కట్టేశారని, నోటికి ప్లాస్టర్ అంటించేసి మాట్లాడకుండా చేశారని ఆయన చెప్పారు. ఇంట్లో ఆయన ఏదో హింసకు గురవుతున్నారన్న విషయం వెంకటేశ్ తమ్ముడికి తెలిసి, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు తన అన్నను కలవడానికి వాళ్లు అంగీకరించలేదని, దాంతో తాను కోర్టుకు వెళ్లి సెర్చివారంటు తెచ్చుకున్నానని ఆయన అన్నారు. వెంకటేశ్ కొడుకులిద్దరూ బాగా చదువుకుని, ప్రైవేటు సంస్థల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ కేసులో ఆయన భార్యను, పెద్దకొడుకును పోలీసులు అరెస్టు చేశారు.