రిటైరైన ఓ ఎస్ఐని ఆయన సొంత కుటుంబ సభ్యులు దాదాపు మూడు వారాల పాటు గొలుసులతో కట్టి పారేశారు. ఎట్టకేలకు ఆయనను బెంగళూరు పోలీసులు విడిపించారు. ఉద్యోగం చేసినన్నాళ్లు ఆయన సంపాదించి, మిగుల్చుకున్న సొమ్ము కోసమే కట్టుకున్న భార్య, కన్న కొడుకులు ఈ పని చేశారు. వెంకటేశ్ (60) మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అలాంటి ఆయనను ఆయన భార్య, కన్న కొడుకులు కలిసి మంచానికి ఇనుప గొలుసులతో కట్టి 18 రోజుల పాటు బంధించారు. తన చేతులు, కాళ్లను ఇనుప గొలుసులతో వాళ్లు కట్టేశారని, నోటికి ప్లాస్టర్ అంటించేసి మాట్లాడకుండా చేశారని ఆయన చెప్పారు.
ఇంట్లో ఆయన ఏదో హింసకు గురవుతున్నారన్న విషయం వెంకటేశ్ తమ్ముడికి తెలిసి, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు తన అన్నను కలవడానికి వాళ్లు అంగీకరించలేదని, దాంతో తాను కోర్టుకు వెళ్లి సెర్చివారంటు తెచ్చుకున్నానని ఆయన అన్నారు. వెంకటేశ్ కొడుకులిద్దరూ బాగా చదువుకుని, ప్రైవేటు సంస్థల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ కేసులో ఆయన భార్యను, పెద్దకొడుకును పోలీసులు అరెస్టు చేశారు.
రిటైరైన ఎస్ఐని గొలుసులతో కట్టేశారు!
Published Mon, Sep 1 2014 11:17 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement