retired si
-
బాలికకు లైంగిక వేధింపులు
అన్నానగర్: తిరునిండ్రవూర్ సమీపంలో 9వ తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించిన రిటైర్డ్ ఎస్ఐని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆవడి సమీపం పట్టాభిరామ్ వళ్లలార్నగర్కు చెందిన రామమూర్తి (60) విరుగంబాక్కమ్ పోలీసుస్టేషన్లో ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. మార్చిలో తిరునిండ్రవూర్ ప్రాంతంలో స్నేహితుడిని చూడడానికి ప్రభుత్వ పాఠశాల దారిలో బైకుపై వెళ్లాడు. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను చూశాడు. ఆ బాలికకు రూ.5 వేలు ఇస్తానని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక భయపడి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయురాలికి చెప్పింది. ఉపాధ్యాయురాలు బయటకి వచ్చి చూడగా అప్పటికే రామమూర్తి పరారయ్యాడు. ఆగస్టు 18న పాఠశాలకు వెళ్లి రామమూర్తి ఆ బాలిక వద్ద మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న బాలిక స్నేహితులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తరచూ రామమూర్తి బాలికను ఇబ్బంది పెట్టేవాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. గురువారం తిరునిండ్రవూర్ సమీపంలో ఉన్న బాలిక ఇంటి సమీపానికి వెళ్లిన రామమూర్తి, సైగ మూలంగా బాలికకు లైంగిక వేధింపులు ఇచ్చాడు. దీనిపై తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు రామమూర్తిని పట్టుకుని ఆవడి మహిళా పోలీసుస్టేషన్లో అప్పగించారు. సీఐ శోభారాణి, పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రామమూర్తిని అరెస్టు చేశారు. తరువాత అతన్ని పూందమల్లి కోర్టులో హాజరు పరిచి పుళల్ జైలుకు తరలించారు. -
రిటైర్డ్ ఎస్ఐ భార్య మెడలో చైన్‌స్నాచింగ్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్ వద్ద చైన్ స్నాచింగ్ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ రిటైర్డ్ ఎస్ఐ భార్య మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కొని పారిపోయారు. స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాకాంబరీ దేవీ ఉత్సవాలు జరుగుతుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇదే అదనుగా భావించి దొంగలు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు సిబ్బంది ఉత్సవాల బందోబస్తులో ఉండగానే దొంగల చేతివాటం బయటపడింది. ఈ ఘటనతో మరోసారి సీసీటీవీ డొల్లతనం బయటపడింది. చైన్‌స్నాచర్ల భయంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. -
రోడ్డుప్రమాదంలో రిటైర్డ్ ఎస్ఐ దుర్మరణం
కీసర : రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఎస్.ఐ మృతిచెందిన సంఘటన మంగళవారం కీసర రింగ్‌రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటకు చెందిన రిటైర్డ్ ఎస్.ఐ నర్సింహ్మారావు(62) మంగళవారం యాదాద్రిజిల్లా చికడిమామిడి గ్రామానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా కీసర అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర సీఐ సురేందర్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నర్సింహ్మారావు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్.ఐ పనిచేస్తూ ఇటివలై రిటైరైనట్లు తెలిపారు. -
నడిరోడ్డుపై రిటైర్డు ఎస్సై దారుణహత్య
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ రిటైర్డు పోలీసు అధికారి హత్యకు గురయ్యాడు. ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన గుంజి వెంకటేశ్వర్లు కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన స్వగ్రామం నందిగామకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇతనికి ఆస్తి విషయంలో పినతండ్రి కొడుకులతో తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నందిగామలో రోడ్డుపై మాట్లాడుతుండగా కోపంతో పినతండ్రి కొడుకులు గుంజి శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు కత్తులతో పొడిచారు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్వర్లు మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన నెల క్రితమే నందిగామకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. -
రిటైర్డ్ ఎస్సై ఇంట్లో చోరీ
మార్కాపురం: రిటైర్డ్ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. స్థానిక పవర్ ఆఫీస్ వెనుక భాగంలో నివాసముంటున్న రిటైర్డ్ ఎస్సై షేక్ అజ్మల్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లారు. ఇది గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలతో పాటు రూ. 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన బంధువులు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రిటైరైన ఎస్ఐని గొలుసులతో కట్టేశారు!
రిటైరైన ఓ ఎస్ఐని ఆయన సొంత కుటుంబ సభ్యులు దాదాపు మూడు వారాల పాటు గొలుసులతో కట్టి పారేశారు. ఎట్టకేలకు ఆయనను బెంగళూరు పోలీసులు విడిపించారు. ఉద్యోగం చేసినన్నాళ్లు ఆయన సంపాదించి, మిగుల్చుకున్న సొమ్ము కోసమే కట్టుకున్న భార్య, కన్న కొడుకులు ఈ పని చేశారు. వెంకటేశ్ (60) మూడు దశాబ్దాల పాటు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అలాంటి ఆయనను ఆయన భార్య, కన్న కొడుకులు కలిసి మంచానికి ఇనుప గొలుసులతో కట్టి 18 రోజుల పాటు బంధించారు. తన చేతులు, కాళ్లను ఇనుప గొలుసులతో వాళ్లు కట్టేశారని, నోటికి ప్లాస్టర్ అంటించేసి మాట్లాడకుండా చేశారని ఆయన చెప్పారు. ఇంట్లో ఆయన ఏదో హింసకు గురవుతున్నారన్న విషయం వెంకటేశ్ తమ్ముడికి తెలిసి, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు తన అన్నను కలవడానికి వాళ్లు అంగీకరించలేదని, దాంతో తాను కోర్టుకు వెళ్లి సెర్చివారంటు తెచ్చుకున్నానని ఆయన అన్నారు. వెంకటేశ్ కొడుకులిద్దరూ బాగా చదువుకుని, ప్రైవేటు సంస్థల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ కేసులో ఆయన భార్యను, పెద్దకొడుకును పోలీసులు అరెస్టు చేశారు.