
గాయాలకు బ్యాండేజీ కట్టడం మనం చూశాం.. ఇకపై బ్యాండేజీలను సూదితో గాయంలోకి ఎక్కించనున్నారు! ఎందుకలా? అంటున్నారా! చాలా సింపుల్. ఇది సాధారణ బ్యాండేజీ కంటే చాలా వేగంగా రక్తస్రావాన్ని నిలుపుతుంది. గాయం తొందరగా మానేందుకు సాయపడుతుంది కూడా. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్తరకం బ్యాండేజీలో ఆహారాన్ని చిక్కగా చేసేందుకు వాడే పదార్థం, నానో స్థాయి కణాలు ఉంటాయి. సముద్రపు కలుపు మొక్కల నుంచి సేకరించే కప్ప కరాగీనన్ అనే పదార్థాన్ని నానో స్థాయి సిలికేట్లకు కలిపినప్పుడు రక్తస్రావాన్ని అడ్డుకోగల సామర్థ్యం పెరిగినట్లు వీరు గుర్తించారు.
శరీరం లోపల అయ్యే గాయాలకూ ఈ కొత్త సూది మందు బ్యాండేజీలు బాగా ఉపయోగపడతాయని, మందులు నానో స్థాయిలో ఉండటం వల్ల అతితక్కువ మోతాదులతోనే గాయాలు మానేలా చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గిరిరాజ్ లోఖండే తెలిపారు. యుద్ధాల్లో అయ్యే గాయాల ద్వారా నియంత్రించలేని స్థాయిలో రక్తస్రావాలు కావడం.. తద్వారా సైనికులు మరణించడం ఈ కొత్త బ్యాండేజీ ద్వారా తగ్గించవచ్చునని చెబుతున్నారు వీరు.
Comments
Please login to add a commentAdd a comment