గాయానికి బ్యాండేజీ వేసుకోవడం ఎంత హాయి అనిపిస్తుందో.. తీసేటప్పుడు అంతేస్థాయిలో బాధా ఉంటుంది. చిన్న విషయమే అయినప్పటికీ ఈ నొప్పిని కూడా తగ్గించేలా పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైౖడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సరికొత్త జిగురు ఒకదాన్ని తయారు చేశారు. తడిగా ఉండే వాటికి చాలా గట్టిగా అతుక్కునే ఈ జిగురును తొలగించాలంటే బలం ఉపయోగించాల్సిన పనిలేదు. కేవలం కాస్తంత కాంతిని ప్రసారం చేస్తే చాలు. నొప్పి అన్నది లేకుండా వేరు పడుతుంది.
గాయాలకు వేసే బ్యాండేజి మొదలుకొని తొడుక్కోగల రోబోల వరకూ చాలా రంగాల్లో ఈ జిగురును వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ సూ తెలిపారు. జిగుర్లు దృఢంగా అతుక్కునేందుకు ప్రత్యేకమైన రసాయనిక బంధాలు కారణమవుతూంటాయని.. వీటిని తొలగించాలంటే సాల్వెంట్స్‌ను వాడాల్సి వస్తూంటుందని ఆయన వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము బ్రెడ్ ముక్కల మధ్య జామ్ చందంగా జిగురును వాడామని వివరించారు. ప్రత్యేక తరంగదైర్ఘ్యం ఉన్న అతినీలలోహిత కిరణాలను వాడటం ద్వారా సులువుగా ఈ బంధాలను విడగొట్టవచ్చునని వివరించారు.
బ్యాండేజీకి కొత్త జిగురు...
Published Wed, Dec 19 2018 12:27 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment