separated
-
చదువు ఖర్చులు తల్లిదండ్రుల నుంచి పొందడం కుమార్తెల హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది. విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది. తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది. -
ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..
పుట్టుగానే కవలలు అనుకోని విపత్కర పరిస్థితుల్లో వేరయ్యారు. ఇద్దరు తమకు తెలియకుండానే ఒకే చోట నివశించారు. అయినా ఒకరికొకరు ఎదురవ్వలేదు. అనూహ్యంగా 19 ఏళ్ల తర్వాత ఒక వైరల్ టిక్‌టాక్ వీడియో, టీవీ షోలు వారిద్దరిని ఆశ్చర్యకర రీతీలో కలిపాయి. అచ్చం ఓ సినిమా మాదిరిగా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది. అసలేం జరిగిందంటే..యూరోపియన్ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు అమీ ఖ్విటియా, అనో సార్టానియా. ఈ ఇద్దరూ పుట్టగానే వేరయ్యారు. తెలియకుండానే ఒకే నగరం వేర్వేరుగా నివశించారు. తనకు ఇష్టమైన టీవీ షో 'జార్జియాస్ గాట్ టాలెంట్'లో నిమగ్నమైన అమీకి తన పోలికతో డ్యాన్స్ చేస్తున్న మరొకొ అమ్మాయిని చూసి ఒక్కసారిగా తడబడింది. తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు తెలియదు. మరోవైపు అనోకు నీలిరంగు జుట్టుతో తనలానే ఉండే మరో అమ్మాయికి సంబంధిచిన టిక్‌టాక్ వీడియో ఆమెకు చేరింది. వీడియోలో ఉన్న అమ్మాయి తన కవల అమీ అని నిర్థారించుకుంది. దీంతో ఒకరినొకరు తామెవ్వరో తెలసుకుని షాక్‌కి గురయ్యారు. ఆ ఇద్దరూ కలిసి తాము వీడిపోవడానికి గల కారణాలు కనుగొని దిగ్బ్రాంతి చెందుతారు. ఎందుకు వేరయ్యారంటే.. అజా షోని అనే మహిళ ఈ ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. 2002లో ఆ ఇద్దరికి జన్మనివ్వగానే అజా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో అతడి తండ్రి గోచా గఖారియా దారుణ దుశ్చర్యకు పూనుకున్నడు. ఈ కవలలను వేర్వేరు కుటుంబాలకి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఇద్దరు కవలలు వేర్వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది. ఈ ఘటన జార్జియాను వేధిస్తున్న అతి పెద్ద సమస్య వెలుగెత్తి చూపింది. చాన్నాళ్లుగా ఆస్పత్రులో అపహరణకు గురవ్వుత్ను శిశువుల ఘటనలు ఇంతవరకు పరిష్కృతం కాలేదు. జార్జియన్ ఆసుపత్రుల నుంచి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారిద్దరి గురించి మాత్రమే తెలిసింది. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 వరకు జార్జియాలో ఆ తాలుకా కేసులు చాలా నమోదయ్యాయి. అవన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోవడం భాధకరం. ఈ కవలల గాథ 1972 నాటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'సీతా ఔర్ గీతా'ను తలిపించేలా జరగడం విశేషం. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
బ్రేవ్ గర్ల్..! అడవిలో తప్పిపోయి.. ధైర్యంగా రాత్రంతా చలిలోనే..
దట్టమైన వాషింగ్టన్ అడవుల్లో పదేళ్ల చిన్నారి. ఎక్కలేని కొండలు. క్రూర మృగాల భయం. వీటన్నింటిని మించి వేళ్లు వంకర్లు పోయేంత చలి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను దాటుకుని 24 గంటలపాటు నిలవగలిగింది ఆ చిన్నారి. అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఫ్యామ్లీ గ్యాధరింగ్(కుటుంబ సమ్మేళనం)మీటింగ్‌లో తప్పిపోయిన చిన్నారి ఎలా చివరకు తన కుటుంబాన్ని చేరుకుంది? అడవిలో తాను ఎదుర్కొన్న సవాళ్లేంటో వివరించింది. అలా తప్పిపోయి.. శుంగ్లా మష్వానీ(10) కుటుంబం ఆఫ్గానిస్థాన్‌కు చెందింది. రెండేళ్ల క్రితమే వారు వాషింగ్టన్లో స్థిరపడ్డారు. వేరు వేరు ప్రదేశాల్లో ఉండే 20 మంది కుటుంబ సభ్యులు ఆదివారం రోజున ఫిష్ లేక్ రోడ్డులోని క్యాథడ్రల్ పాస్ ట్రైల్‌హెడ్ వద్ద కలుసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి క్లీ ఈలమ్ నదిపై ఉన్న వంతెన వెంట నడుస్తున్నారు. అప్పుడు శుంగ్లా తప్పిపోయినట్లు గుర్తించి చుట్టుపక్కల వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాత్రంతా అడవిలోనే.. అయితే.. తప్పిపోయిన శుంగ్లాకు ఎంతసేపటికీ వారు నడిచిన వంతెన కనిపించలేదట. వెతికే కొద్ది తనవారికి తాను దూరమైనట్లు గుర్తించిన ఆ చిన్నారి.. ఎంతో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. కొండలను దాటుతూ.. నది వెంటే నడుచుకుంటూ వెళ్లడం సరైన విధానమని గుర్తించినట్లు తెలిపింది. రాత్రి మొత్తం చెట్ల మధ్యే చలిలో గడిపినట్లు వెల్లడించింది. ఏ మాత్రం భయపడలేదని చెబుతోంది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలికను గుర్తించినట్లు తెలిపారు. కుటుంబంతో బాలికను కలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
కుడి ఎడమలు వేరు కాదు...
మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో... అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమని తిరిగి అన్నను శపించాడు. ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలుండిపోయాయి. తరచూ కలహించుకుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు... కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు. చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు. శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. కానీ అన్న వదలకుండా... ‘‘మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు. ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల. అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ... అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు. అదే బద్దెనగారు చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు... కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. -
బ్యాండేజీకి కొత్త జిగురు...
గాయానికి బ్యాండేజీ వేసుకోవడం ఎంత హాయి అనిపిస్తుందో.. తీసేటప్పుడు అంతేస్థాయిలో బాధా ఉంటుంది. చిన్న విషయమే అయినప్పటికీ ఈ నొప్పిని కూడా తగ్గించేలా పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైౖడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సరికొత్త జిగురు ఒకదాన్ని తయారు చేశారు. తడిగా ఉండే వాటికి చాలా గట్టిగా అతుక్కునే ఈ జిగురును తొలగించాలంటే బలం ఉపయోగించాల్సిన పనిలేదు. కేవలం కాస్తంత కాంతిని ప్రసారం చేస్తే చాలు. నొప్పి అన్నది లేకుండా వేరు పడుతుంది. గాయాలకు వేసే బ్యాండేజి మొదలుకొని తొడుక్కోగల రోబోల వరకూ చాలా రంగాల్లో ఈ జిగురును వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ సూ తెలిపారు. జిగుర్లు దృఢంగా అతుక్కునేందుకు ప్రత్యేకమైన రసాయనిక బంధాలు కారణమవుతూంటాయని.. వీటిని తొలగించాలంటే సాల్వెంట్స్‌ను వాడాల్సి వస్తూంటుందని ఆయన వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము బ్రెడ్ ముక్కల మధ్య జామ్ చందంగా జిగురును వాడామని వివరించారు. ప్రత్యేక తరంగదైర్ఘ్యం ఉన్న అతినీలలోహిత కిరణాలను వాడటం ద్వారా సులువుగా ఈ బంధాలను విడగొట్టవచ్చునని వివరించారు. -
వందేళ్ళయినా వీడని బంధం!
చిన్న చిన్న సమస్యలకే కుంటుంబ సంభంధాలు సమసిపోతున్న ఈ రోజుల్లో... ఆ కవలలిద్దరూ ఏకంగా వందేళ్ళయినా కలిసే జీవిస్తున్నారు. కష్టమైనా సుఖమైనా కలిసే పంచుకున్నారు. ప్రేమానుబంధాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. నిండు నూరేళ్ళ జీవితాన్ని హాయిగా, ఆనందంగా జీవించి ఇటీవలే వందేళ్ళ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. కెంటకీ లోని సిమ్సోనియాకు చెందిన మేరీ బెల్లీ రోచ్, మయెబెల్లె పోవెల్ లు ఇటీవలే తమ వందేళ్ళ పుట్టిన రోజు జరుపుకున్నారు. కవలలుగా పుట్టి, చిన్ననాటినుంచీ కలిసే పెరిగారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో టీనేజర్స్ గా ఉన్న వారిద్దరూ అప్పట్లో తమ ముద్దుపేరైన ది వాలెస్ ట్విన్స్ గానే నేటికీ పిలువబడుతున్నారు. అప్పట్లో ఎన్నో ఆర్థిక కష్టాలున్నా... ముర్రే స్టేట్ కాలేజీలో 5 డాలర్ల సెమిస్టర్ ఫీజు కట్టి ఇద్దరూ చదువుకున్నారు. ఒకేలా కనిపించడం కాలేజీ రోజుల్లో వారిద్దరికీ అనేకసార్లు కలసి వచ్చేది. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, క్లాస్ రూంలో ఒకరు నోట్స్ రాస్తుంటే, మరొకరు జిమ్ క్లాస్ కు వెళ్ళేందుకు ఉపయోగపడేది. చదువులోనూ, పనిలోనూ ఒకరికొకరు సహాయపడుతుండేవారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నఆ కవల సోదరీమణులు.. రోజుకు ఒక్క డాలర్ చొప్పున చెల్లించే సిమ్సోనియాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవారు. పెళ్ళీడువచ్చిన తర్వాత ఇద్దరు ప్రాణస్నేహితులను పెళ్ళాడారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఇద్దరు దంపతులూ మోటార్ వాహనంలో యూరప్ లోని 50 రాష్ట్రాలను, 8 దేశాలను చుట్టేశారు. ఇద్దరి భర్తలనూ పోగొట్టుకున్న అనంతరం.. వారిద్దరూ కొంతకాలం డెట్రాయిట్ కు వలస వెళ్ళి అక్కడి వార్ టైం ఫ్యాక్టరీల్లో పనిచేశారు. నాటినుంచీ నేటి వరకూ ఏ సందర్భంలోనూ విడిపోని ఆ కవలలలిద్దరూ ప్రస్తుతం తిరిగి చిన్ననాటి తమ ఇంట్లోనే నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్ళుగానే కాదు... మంచి స్నేహితులుగానూ ఉండే ఇద్దరూ చూసేందుకు పోలికల్లోనే కాదు.. వస్త్రధారణ విషయంలోనూ ఎక్కడా తేడా కనిపించదు. ఏ సమయంలోనైనా మేం కలిసే ఉన్నామని, ఇకముందూ ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్తున్నారు. వందేళ్ళ పుట్టినరోజును జరుపుకున్న ఆ కవలు... ఎందరో అక్కాచెల్లెళ్ళకే కాక, ప్రేమానుబంధాలకూ మారుపేరుగా నిలుస్తున్నారు. -
ముందే విడిపోవడం మంచిది
-
ముందే విడిపోవడం మంచిది
వివాహం, విభేదాలు, విడిపోవడాలు, కోర్టులు కేసులు అంటూ తలనొప్పి తెచ్చుకునే కంటే పెళ్లికి ముందే విడిపోవడం బెటర్ అంటున్నారు నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో ముందు వరుసలో ఉండే నటి త్రిష. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో సమీప కాలంలో కలకలం పుట్టిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. ఆ మధ్య ప్రేమ వదంతులతో ప్రచారాల హోరుకు కేంద్రబిందువుగా మారారు. ఆ తరువాత వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధం అయ్యి విస్మయం కలిగించారు. వివాహ నిశ్చితార్థం జరి గి పెళ్లి పెటాకులు అవ్వడంతో మరోసారి హెడ్లైన్లతో పత్రికలకెక్కారు. తాజాగా వివాహ వ్యవస్థపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ విస్మయానికి గురి చేస్తున్నా రు. అమ్మాయిలకు పెళ్లి అవసరమే అంటూ ఒకసారి, పెళ్లి చేసుకోకుండా చాలామంది జీవిస్తున్నారంటూ మరోసారి, తగిన వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఇంకోసారి ఇలా మార్చి మార్చి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అసలు తన మనస్థత్వం ఏమిటో ఎవరికీ అంతుపట్టని విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏమంటున్నారో చూడండి. వివాహ జీవితం సక్రమంగా అమరాలి. అలా కాని పక్షంలో మనస్పర్థలు, వివాహ రద్దు కోసం కోర్టుల చుట్టూ తిరగడం వేదన కలిగించే విషయం. ప్రస్తుత పరిస్థితిలో వివాహం చేసుకుని కోర్టుల ద్వారా విడిపోవడం కంటే, వివాహానికి ముందే ఇద్దరు కలసి మెలసి తిరిగి సరిపడకపోతే విడిపోవడం మంచిదని భావిస్తున్నాను. వివాహానికి ముందు అబ్బా యి, అమ్మాయి సహజీవనం చేయడం అనేది వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. ఇందువల్ల కుటుంబంతో సమస్యలు తలెత్తకూడదు. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటే జీవితాంతం బాధపడేకంటే ముందే కలిసి మెలిసి తిరిగి విడిపోవడం మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. -
తెలుగు ప్రజలను విడదీయొద్దు
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడదీయ వద్దని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారిణి టి.శకుంతల కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది శనివారం బుట్టాయగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సమైక్యవాదులంతా ఐక్యంగా ఉండి ప్రశాంత వాతావరణంలో నిరసనను తెలపాలన్నారు. తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు వీరాస్వామి మాట్లాడుతూ 57 ఏళ్ల కాలంలో తెలుగు వారంతా ఐక్యంగా ఉండి కలసిమెలసి జీవించారన్నారు. కొందరి స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విడదీస్తే సీమాంధ్ర ప్రజలు సహించరని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై జరుగుతున్న ఉద్యమంలో ప్రజలే నాయకులై ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు ఎస్పీహెచ్వో ఎ.రామారావు, డెప్యూటీ డీఎంహెచ్‌వో నాగేశ్వరరావు, వంశీలాల్ రాథోడ్, డాక్టర్ రసూల్, దీప, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన పెంచుకుని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి.శకుంతల తెలిపారు. జిల్లా వైద్య శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బుట్టాయగూడెం మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించామన్నారు. ఈ నెల 27న పోలవరంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌వో టి.నాగేశ్వరరావు, ఎస్పీహెచ్వో ఎ.రామారావు, వైద్యులు వీరాస్వామి, అనిల్‌కుమార్, సుధీర్ బాబు, హరికృష్ణ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.