Bandages
-
షాకింగ్: ఒంటి నిండా కట్లు.. షార్ట్ మీద వచ్చిన వరుడు
జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్కోర్స్.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్ చేయండి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. పెట్రోల్ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి. బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్ మీద వచ్చాడు’’ అని తెలిపింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. -
ఇదో రకం బ్యాండ్ ఎయిడ్
గాయమైతే కట్టుకునే బ్యాండ్ ఎయిడ్ మీకు తెలుసుగా.. ఫొటోలోని వ్యక్తి వేళ్ల మధ్య ఉన్నది కూడా అలాంటిదే. కాకపోతే ఇది గాయాలను కాకుండా.. నొప్పులను తగ్గిస్తుంది. ఈ పట్టీని శరీరంపై నొప్పి ఉన్న చోట అతికించుకుంటే చాలు.. దీనికి అనుసంధానమై ఉన్న మాత్రల నుంచి నొప్పిని తగ్గించే మం దులు నెమ్మదిగా విడుదలవుతాయి. స్విట్జర్లాండ్‌లోని లూజానే యూనివర్సిటీకి చెందిన సంస్థ ఈపీఎఫ్‌ఎల్ దీన్ని అభివృద్ధి చేసింది. కేవలం 3 మిల్లీమీటర్ల వెడల్పు, రెండు మైక్రాన్ల మందం ఉండే ఈ పట్టీ మెగ్నీషియంతో తయారైంది. వాస్తవానికి ఇందులో ఓ ఎల్రక్టానిక్ సర్క్యూట్ ఉంటుంది. విద్యుదయస్కాంత క్షేత్రంలో కరెం టును పుట్టించడం ద్వారా వేడి పుట్టి.. క్యాప్సూల్‌లో ఉన్న మందు విడుదలవుతుంది. కావాల్సి న సమయానికి, అవసరమైన చోట మాత్రమే మందులు కచి్చతంగా విడుదల చేయడం.. వేర్వేరు మందులను పద్ధతి ప్రకారం అందేలా చేయడం దీని ప్రత్యేకత. ఆపరేషన్ల తర్వాత నొప్పి తగ్గించేందుకు ఇచ్చే మందుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. వీటిని తగ్గించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని పూర్తిస్థాయి లో వాడుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. క్యాప్సూల్స్‌ను ఈ పరికరానికి అనుసంధానించడం.. పరీక్షించడం వంటి పనులు ఇంకా జరగాల్సి ఉంది. -
బ్యాండేజీకి కొత్త జిగురు...
గాయానికి బ్యాండేజీ వేసుకోవడం ఎంత హాయి అనిపిస్తుందో.. తీసేటప్పుడు అంతేస్థాయిలో బాధా ఉంటుంది. చిన్న విషయమే అయినప్పటికీ ఈ నొప్పిని కూడా తగ్గించేలా పాల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైౖడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సరికొత్త జిగురు ఒకదాన్ని తయారు చేశారు. తడిగా ఉండే వాటికి చాలా గట్టిగా అతుక్కునే ఈ జిగురును తొలగించాలంటే బలం ఉపయోగించాల్సిన పనిలేదు. కేవలం కాస్తంత కాంతిని ప్రసారం చేస్తే చాలు. నొప్పి అన్నది లేకుండా వేరు పడుతుంది. గాయాలకు వేసే బ్యాండేజి మొదలుకొని తొడుక్కోగల రోబోల వరకూ చాలా రంగాల్లో ఈ జిగురును వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ సూ తెలిపారు. జిగుర్లు దృఢంగా అతుక్కునేందుకు ప్రత్యేకమైన రసాయనిక బంధాలు కారణమవుతూంటాయని.. వీటిని తొలగించాలంటే సాల్వెంట్స్‌ను వాడాల్సి వస్తూంటుందని ఆయన వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము బ్రెడ్ ముక్కల మధ్య జామ్ చందంగా జిగురును వాడామని వివరించారు. ప్రత్యేక తరంగదైర్ఘ్యం ఉన్న అతినీలలోహిత కిరణాలను వాడటం ద్వారా సులువుగా ఈ బంధాలను విడగొట్టవచ్చునని వివరించారు. -
సూదిమందులోకి బ్యాండేజీ
గాయాలకు బ్యాండేజీ కట్టడం మనం చూశాం.. ఇకపై బ్యాండేజీలను సూదితో గాయంలోకి ఎక్కించనున్నారు! ఎందుకలా? అంటున్నారా! చాలా సింపుల్. ఇది సాధారణ బ్యాండేజీ కంటే చాలా వేగంగా రక్తస్రావాన్ని నిలుపుతుంది. గాయం తొందరగా మానేందుకు సాయపడుతుంది కూడా. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్తరకం బ్యాండేజీలో ఆహారాన్ని చిక్కగా చేసేందుకు వాడే పదార్థం, నానో స్థాయి కణాలు ఉంటాయి. సముద్రపు కలుపు మొక్కల నుంచి సేకరించే కప్ప కరాగీనన్ అనే పదార్థాన్ని నానో స్థాయి సిలికేట్లకు కలిపినప్పుడు రక్తస్రావాన్ని అడ్డుకోగల సామర్థ్యం పెరిగినట్లు వీరు గుర్తించారు. శరీరం లోపల అయ్యే గాయాలకూ ఈ కొత్త సూది మందు బ్యాండేజీలు బాగా ఉపయోగపడతాయని, మందులు నానో స్థాయిలో ఉండటం వల్ల అతితక్కువ మోతాదులతోనే గాయాలు మానేలా చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గిరిరాజ్ లోఖండే తెలిపారు. యుద్ధాల్లో అయ్యే గాయాల ద్వారా నియంత్రించలేని స్థాయిలో రక్తస్రావాలు కావడం.. తద్వారా సైనికులు మరణించడం ఈ కొత్త బ్యాండేజీ ద్వారా తగ్గించవచ్చునని చెబుతున్నారు వీరు. -
గుండె ఝల్లుమంటుంది
పాదాలకు పట్టీలు అందం. పట్టీలున్న పాదాలు ఇంటికే అందం. మరి ఘల్లుమనకుండానే గుండెను ఝల్లుమనిపించే పాదాల ఆభరణాలు ఉంటే... నూలు దారాలు, నార, పూసలను ఉపయోగించి చేత్తో అల్లిన శాండిల్ లేసులు ఇవి. ఈ లేసులను ముందుగా పాదానికి అమర్చుకోవాలి. తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే ఎత్తు మడమలు లేదా సాధారణ చెప్పులు, శాండిల్స్ వేసుకోవాలి. అయితే ధరించే చెప్పులకు ఇతర అలంకరణలు ఉండకూడదు. అప్పుడిక ఆధునికపు హంగులతో మీ కోమలమైన పాదాలు కొత్తగా కనువిందు చేస్తాయి. పెళ్లికూతురు పాదాలంకరణలుగా మార్కెట్లోకి వచ్చిన ఇవి మరికొన్ని మార్పులతో నవతరం అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి.