గుండె ఝల్లుమంటుంది
పాదాలకు పట్టీలు అందం.
పట్టీలున్న పాదాలు ఇంటికే అందం.
మరి ఘల్లుమనకుండానే
గుండెను ఝల్లుమనిపించే
పాదాల ఆభరణాలు ఉంటే...
నూలు దారాలు, నార, పూసలను ఉపయోగించి చేత్తో అల్లిన శాండిల్ లేసులు ఇవి.
ఈ లేసులను ముందుగా పాదానికి అమర్చుకోవాలి. తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే ఎత్తు మడమలు లేదా సాధారణ చెప్పులు, శాండిల్స్ వేసుకోవాలి. అయితే ధరించే చెప్పులకు ఇతర అలంకరణలు ఉండకూడదు.
అప్పుడిక ఆధునికపు హంగులతో మీ కోమలమైన పాదాలు కొత్తగా కనువిందు చేస్తాయి. పెళ్లికూతురు పాదాలంకరణలుగా మార్కెట్లోకి వచ్చిన ఇవి మరికొన్ని మార్పులతో నవతరం అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి.