
సూదుల తల...
తిక్క లెక్క
ఈ ఫొటో చూస్తే తలపై వెంట్రుకలు కాకుండా, సూదులు మొలిచినట్లుగా లేదూ! సూదులు మొలిచినవి కాదు గానీ, ఉద్దేశపూర్వకంగానే గుచ్చుకున్నవి. ఇతగాడు చైనాలో కాస్మొటిక్ వైద్యుడు. గిన్నిస్ రికార్డు కోసం ఇలా తలపై సూదులు గుచ్చుకుని, తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు.
ఎన్ని సూదులంటారా..? ఎన్నో కాదు, 2,188 సూదులు మాత్రమే. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో రెండేళ్ల కిందట ఈ విన్యాసాన్ని ప్రదర్శించాడు.