Istanbul
-
పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ, సాక్షి: పరిశ్రమల అనుమతుల కోసం మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలకు తిరిగే బదులుగా ఉమ్మడిగా ఒకే శాఖ ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ మినిస్ట్రీ ద్వారా అనుమతులు ఇచ్చి పెట్టుబడులకు సులభతరం చేశామని తెలిపారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సుకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు భారత్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ‘‘ పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రధాన సవాళ్లు వస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీలు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అంశాలను సులభతరం చేయాలి. అనుమతులకు సంబంధించి ఒకే మంత్రిత్వ శాఖ ఉండాలి’’ అని అన్నారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు,అనుసరించాల్సిన వ్యూహాలపై ఇస్తాంబుల్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించారు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల ద్వారా సమీకరణకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిపారు. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లు చేసే దిశగా పారిశ్రామికవేత్తలను ఎంపీలు ప్రోత్సహించాలని సదస్సు లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు టార్చ్ బేరర్లుగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ల దిశగా పనిచేయాలని సదస్సు పిలునిచ్చింది. -
Turkish Airlines: విమానం నడుపుతూ పైలట్ మృతి
న్యూయార్క్: సియాటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యంలోనే పైలట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసేలోపే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 204 సియాటెల్‌లో మంగళవారం రాత్రి టేకాఫ్ అయ్యింది. కెప్టెన్‌గా 59 ఏళ్ల ఇల్సిన్ పెహ్లివాన్ విధుల్లో ఉన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే పెహ్లివాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మేరకు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ కెప్టెన్‌ను కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నామన్నారు. కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. సాధారణంగా పైలట్లు ప్రతి 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకోసారి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెహ్లివాన్ మార్చి 8నే అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. -
Istanbul: భారీ అగ్ని ప్రమాదం.. 29 మంది మృతి
టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెసిక్తాస్ డిస్ట్రిక్ట్‌లోని గైరెట్టెప్లోని 16 అంతస్తుల భవనంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పివేశారు. బెసిక్తాస్ జిల్లాలోని గైరెట్టెప్లో అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 29కి చేరిందని నగర గవర్నర్ దావత్ గుల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం 12. 47 నిమిషాలకు భవనంలో మంటలు ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భవనంలోని అంతస్తుల కిటికీల నుంచి భారీగా మంటలు, దటమైన పొగ కమ్ముకున్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. అయితే భవనంలోని మొదటి, రెండో అంతస్తులలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్లు గవర్నర్ దావత్ గుల్ అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి అలీ యోర్లికాయ తెలిపారు. క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. -
వైరల్ వీడియో: సంగీతం అంటే ఈ పిల్లి చెవి కోసుకుంటుంది
-
టర్కీ, సిరియా భూకంపం: 2600 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీ(తుర్కియే), సిరియా భూకంపం విపత్తు స్థితిని ఏర్పరిచింది. భారీ భూకంపం దాటికి 2600 మందిదాకా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 2200కు పైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్లు కూలిపోవడం, అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ప్రజలు ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో రెప్పపాటులో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకంగా.. కేంద్రం చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమని టర్కీ నేషనల్ భూకంప కేంద్రం చీఫ్ రాయిద్ అహ్మద్ రేడియో ద్వారా ప్రకటించారు. టర్కీ, సిరియాలో ఎంతెంత మంది మరణించారనే సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది. సిరియాలో 300 మంది దాకా మృతి చెందినట్లు ఒక అనధికార ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో.. చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ ఝామున రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. ఆపై పావుగంటకు 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తుర్కియే గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం.. తుర్కియేకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం కూడా. భూకంపం ప్రభావంతో.. లెబనాన్, ఈజిప్ట్, సైప్రస్‌లోనూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 Thousands feared dead after a massive 7.8 magnitude #earthquake strikes #Turkey pic.twitter.com/1yLAP22jhI — Narrative Pakistan (@narrativepk_) February 6, 2023 Huge fire raging in the city of Kahramanmaraş, Turkey following the 7.8 MAG earthquake overnight. pic.twitter.com/3PWZ4Tx35N — Citizen Free Press (@CitizenFreePres) February 6, 2023 మృతులు, క్షతగాత్రులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తుర్కియే(పూర్వపు టర్కీ).. తరచూ భూకంపాల భారీన పడుతుంది. 1999లో.. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి 17వేల మంది దుర్మరణం పాలయ్యారు. Rescue teams pulling children from the under the rubble of #collapsed buildings in northwestern #Syria At least 50 people killed, 500+ injured, 140+ buildings destroyed in southern Malatya province as 7.8 #earthquake hits #Türkiye.#deprem #DepremiOldu #Turkey pic.twitter.com/vKnEnG3N2k — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 Another Video- First video is emerging after a M7.8 earthquake in central Turkey.#earthquake in #Şanlıurfa#Turkey #Earthquake pic.twitter.com/mVxNorZ0j0 — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 ఇక 2020 జనవరిలో ఎలజిగ్‌లో 40 మందిని, అదే ఏడాది అయిజీన్ సీప్రాంతంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం 114 మందిని పొట్టబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించకుండా.. అడ్డగోలుగా భవనాలు నిర్మించడమే అందుకు కారణమని అక్కడి నిపుణులు చెప్తున్నారు. Entire buildings collapsed in S. #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour, that also sent shockwaves to Syria, Lebanon, Iraq, Israel, Palestine, Cyprus. We don’t know death toll yet: pic.twitter.com/A7fomc3AXT — Joyce Karam (@Joyce_Karam) February 6, 2023 People are stuck under rubble while sending out live streams or videos requesting help. #earthquake #Turkey pic.twitter.com/SxTzPzFAmn — Nerdy 🅰🅳🅳🅸🅲🆃 (@Nerdy_Addict) February 6, 2023 -
ఇస్తాంబుల్ బాంబ్ బ్లాస్ట్: అనుమానితుడి అరెస్ట్
అంకారా: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధృవీకరించారు. #URGENT Person who left bomb that caused explosion Sunday on Istanbul’s Istiklal Avenue arrested by police, says Interior Minister Suleyman Soylu pic.twitter.com/I08OTC4rPb — ANADOLU AGENCY (@anadoluagency) November 14, 2022 మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారాయన. ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 ఇదీ చదవండి: ఇస్తాంబుల్ పేలుడు.. చెవులు పగిలిపోయేలా సౌండ్ -
ఈసారి ఐపీఎల్ వేలం కొత్త ప్రదేశంలో.. పరిశీలనలో బెంగళూరు కూడా..!
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే మినీ వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. ఐపీఎల్ కొత్త చైర్మన్‌గా ఎన్నికైన అరుణ్ సింగ్ ధుమాల్, కొత్త బ్రాడ్‌కాస్టర్ వయాకామ్‌కు చెందిన ప్రతినిధులు కూడా ఈ విషయంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బీసీసీఐ-ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చర్చల్లో మినీ వేలం నిర్వహించే వేదికను టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌గా ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ముందుగా అనుకున్న వేదిక బెంగళూరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ-ఐపీఎల్ అధికారులంతా ఇస్తాంబుల్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ విషయంపై తుది నిర్ణయం నవంబర్ తొలి వారంలో వెలువడే అవకాశం ఉంది. వేదిక మాట అటుంచితే.. ఐపీఎల్-2023కి సంబంధించి మినీ వేలాన్ని నిర్వహించే తేదీని డిసెంబర్ 16గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆన్యూవల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో మినీ వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూని కూడా సవరించారని సమాచారం. పర్స్ వ్యాల్యూని రూ. 90 నుంచి 95 కోట్లకు పెంచారని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చదవండి: ఐపీఎల్-2023 మినీ వేలానికి ముహూర్తం ఖరారు..! -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ( ఫోటోలు)
-
ఉక్రెయిన్ యుద్ధం.. చర్చల్లో పురోగతి
కీవ్: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. నెలకు పైగా సాగుతున్న యుద్ధానికి తెర దించేందుకు టర్కీ వేదికగా రష్యా, ఉక్రెయిన్ జరుపుతున్న తాజా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కన్పిస్తోంది. ఉక్రెయిన్‌కు విశ్వాసం కల్పించే చర్యల్లో భాగంగా రాజధాని కీవ్, చెహిర్నివ్ నగరాల నుంచి సైన్యాన్ని భారీగా ఉపసంహరిస్తున్నట్టు రష్యా మంగళవారం ప్రకటించింది. వాటినుంచి రష్యా దళాలు వెనుదిరుగుతున్నాయని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. అంతేగాక ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్ బృందం సభ్యుడొకరు వెల్లడించారు! టర్కీ విదేశాంగ మంత్రి మేవ్లట్ కౌసోగ్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. చర్చలు అర్థవంతంగా సాగాయని, పలు అంశాలపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. వీటికి కొనసాగింపుగా త్వరలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు భేటీ అవుతారన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య గతంలో బెలారస్ తదితర చోట్ల జరిగిన నాలుగైదు రౌండ్ల చర్చల్లో పెద్దగా ఏమీ తేలకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాల పై చిలుకు విరామం తర్వాత ఇరు దేశాల బృందాలు తాజాగా మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యాయి. ఇరు దేశాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించాయి. చర్చల నేపథ్యంలో పరస్పర విశ్వాస కల్పన ప్రయత్నాల్లో భాగంగానే సైన్యాన్ని వెనక్కు రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ చెప్పారు. భవిష్యత్తులో ఏవైపూ మొగ్గకుండా తటస్థంగా ఉంటామని, అణ్వస్త్రరహిత దేశంగా కొనసాగుతామని చర్చల్లో ఉక్రెయిన్ ప్రతిపాదించిందని ఫోమిన్ చెప్పారు. బదులుగా ఆ దేశానికి ఇవ్వాల్సిన భద్రతా హామీలపై కూడా ఏకాభిప్రాయం కుదిరేలా కన్పిస్తోందన్నారు. ఆ మేరకు ఒప్పంద రూపకల్పన దిశగా చర్చలు సాగాయని వివరించారు. తటస్థంగా ఉండాలంటే రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, టర్కీ, చైనా, పోలండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమకు భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ బృందం ప్రతిపాదించినట్టు సమాచారం. సదరు హామీ ‘ఒక్కరిపై దాడి, అందరిపైనా దాడి’ అన్న నాటో సూత్రం మాదిరిగా ఉండాలని కోరిందంటున్నారు. 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా ద్వీపకల్పం హోదాపై 15 ఏళ్ల సంప్రదింపుల అవధి ఉండాలని ఉక్రెయిన్ ప్రతిపాదించింది. వీటిపై రష్యా స్పందన తెలియాల్సి ఉంది. అయితే చర్చలు అర్థవంతంగా సాగాయని రష్యా బృందం కూడా సంతృప్తి వెలిబుచ్చింది. ఉక్రెయిన్ ప్రతిపాదనలను సమీక్షించి పుతిన్‌కు నివేదిస్తానని రష్యా బృందంలోని కీలక సభ్యుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. అధ్యక్షుల స్థాయి చర్చలకు ఈ మాత్రం పురోగతి చాలని ఉక్రెయిన్ బృంద సభ్యుడు డేవిడ్ అర్కామియా అన్నారు. చర్చల వేదిక వద్ద పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన రష్యా కుబేరుడు, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ ప్రత్యక్షమయ్యారు! ఇరు దేశాల అంగీకారంతోనే చర్చల్లో ఆయన అనధికారిక మధ్యవర్తిగా ఉన్నారని పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పారు. యథాతథంగా కొనసాగుతున్న దాడులు ఓవైపు చర్చలు జరుగుతుండగా∙పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై రష్యా దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్‌లో 9 అంతస్తుల పాలనా భవనంపై క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇందులో ఏడుగురిదాకా మరణించారని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఉద్యోగులు భవనంలోకి వెళ్లేదాకా ఆగి మరీ దాడికి దిగి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రష్యా దళాలను తమ సైన్యాలు అద్భుతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కీవ్ శివార్లలోని కీలకమైన ఇర్పిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 60కిపైగా మతపరమైన కట్టడాలను రష్యా నేలమట్టం చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. తమకు పూర్తిస్థాయిలో సాయం చేసేందుకు వెనకాడుతున్న పశ్చిమ దేశాలు ఈ విధ్వంసానికి పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమీ సమీపంలోని ట్రోస్టియానెట్స్ నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికుల మృతదేహాలు, కాలిపోయిన రష్యా యుద్ధ ట్యాంకులు నగరంలో పర్యటించిన ఏపీ వార్తా సంస్థ సిబ్బందికి కన్పించాయి. రష్యా, బెలారస్‌ల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ఆర్థిక సేవల సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని అణు వ్యవస్థల భద్రతను సమీక్షించేందుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ ఆ దేశంలో పర్యటించారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక ముందడుగు
ఇస్తాంబుల్: ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు నెల రోజులుగా రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడమనేది అనుకున్నంత సులభం కాదని రష్యా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది. అయినా పట్టువీడకుండా అత్యాధునిక ఆయుధాలను సైతం రష్యా ఉపయోగిస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు మంగళవారం రోజున ఇస్తాంబుల్‌లో జరిగిన ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్, చెర్నీవ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్‌లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు. చదవండి: (రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం) యుద్ధం మొదలై నెలరోజులు దాటిపోయిన వేళ.. ఉక్రెయిన్, రష్యా మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా దీనికి హాజరయ్యారు. తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్, పొలాండ్ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు. -
ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..
పాల్మా(స్పెయిన్): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ఎయిర్ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో బిజీ ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్ ఎమర్జెన్సీ) ఎయిర్ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. (చదవండి: టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట) -
పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత
కొందరికి రైలెక్కడం సరదా, ఇంకొందరికి విమానం ఎక్కడం సరదా. టర్కీకి చెందిన బోజీ అనే ఈ శునకరాజానికి నగర సంచారం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలెక్కడం సరదా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో సంచరించే ప్రయాణికులందరికీ చిరపరిచిత నేస్తం బోజీ. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్ ట్రెయిన్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరగడం ఈ శునకరాజం హాబీ. దీనిని గమనించిన అధికారులు ఇంతకూ ఇదెక్కడకు వెళుతుందో తెలుసుకోవడానికి దీని చెవికి ఒక ట్రాక్ చిప్ అమర్చారు.ఇస్తాంబుల్ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహానాన్నీ పావనం చేస్తోంది. దొరక్కుంటే ఏ బస్సులోనో అడ్జస్టయిపోతుందనుకోండి! మెట్రోస్టేషన్లలోని లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా ఈ జాగిలం మిగిలిన ప్రయాణికులతో కలసి దర్జాగా ఉపయోగించుకోవడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. ఇస్తాంబుల్ జనాలకు పదేళ్లుగా ఈ జాగిలం బాగా అలవాటైపోవడంతో, ఇది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం లేదు. పైగా, ఇది సుఖంగా కూర్చోవడానికి వీలుగా తప్పుకుని మరీ దారి కూడా ఇస్తున్నారు.సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా చేసే మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇష్టపడుతుంది. చదవండి: అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే.. -
'వాడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా'
ఇస్తాంబుల్ : కన్నకొడుకంటే ఇష్టం లేదంటూ ఒక ఫుట్‌బాల్ ఆటగాడు తన కొడుకును అతి కిరాకంగా చంపిన ఘటన టర్కీలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కెవెర్ టోక్టాస్ టర్కీ ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్నాడు. ఏప్రిల్ 23న కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న కారణంగా ఐదేండ్ల కొడుకు ఖాసిమ్‌తో పాటు టోక్టాస్ నార్త్ వెస్ట్రన్ ఫ్రావిన్స్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అయితే ఖాసిమ్‌తో పాటు టోక్టాస్కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి నెగెటివ్ అనే వచ్చింది. అయితే లక్షణాలు బయటపడే అవకాశాలు ఉండొచ్చన్న కారణంతో తండ్రితో పాటే ఖాసీమ్‌ను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఈ మే4న ఖాసిమ్‌కు చికిత్స చేస్తున్న గదిలోకి వెళ్లిన టోక్టాస్.. అతడి ముఖాన్ని దిండుతో నులిమి ఊపిరి ఆడకుండా చంపేశాడు. తర్వాత తనకేం తెలియదన్నట్లు డాక్టర్లకు చెప్పాడు. వైద్యులు బాలుడిని ఐసీయూకు తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. టోక్టాస్ తన కొడుకు కరోనాతో చనిపోయాడని అందరిని నమ్మించి ఖాసీమ్ మృతదేహాన్ని ఖననం చేశాడు. అయితే కొడుకు చనిపోయిన 11 రోజుల తర్వాత పశ్చాత్తాప పడిన టోక్టాస్ పోలీసులకు అసలు నిజం చెప్పాడు. ' నా చిన్న కొడుకు ఖాసిమ్ అంటే అసలు ఇష్టం లేదు. ఈ కారణంతోనే వాడిని చంపేశా. కరోనా నేపథ్యంలో ఆ లక్షణాలతోనే చనిపోయాడని నేనే అందరికి చెప్పా. నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవు'అని టోక్టాస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టోక్టాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సున్నాతో ముగిసింది... కరోనా సోకి బీజేపీ మెర్చా నాయకుడి మృతి -
ఎమర్జెన్సీ: కూన కోసం తల్లడిల్లిన పిల్లి
టర్కీ: తల్లి ప్రేమ మనుషులకే కాదు, సృష్టిలోని అన్ని జీవరాశులకూ సొంతం. పేగు తెంచుకుని పుట్టిన జీవి కోసం తల్లడిల్లని తల్లి ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా ఓ పిల్లి తన కూన అస్వస్థతగా ఉండటం గమనించి ఆసుపత్రికి పరుగెత్తిన ఘటన ఇస్తాంబుల్‌లోని టర్కీలో చోటు చేసుకుంది. వివరాలు.. ఏమైందో ఏమో కానీ హుషారుగా, చెంగుచెంగున దుంకే పిల్లి కూన ఒక్కసారిగా నీరసించడం దాని తల్లి కంట పడింది. కొంతసేపటికి అదే తిరిగి మామూలవుతుందిలే అనుకుంది. కానీ, అలా జరగలేదు. పిల్లికూన మరింత నీరసంగా అనారోగ్యం బారిన పడినట్లు కనిపించింది. (ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు) దీంతో భయాందోళనకు గురైన తల్లికి గుండెలో గుబులు పట్టుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లికూనను నోట కరుచుకుని ఆసుపత్రికి పరుగు పెట్టింది. ఎమర్జెన్సీ అన్న సంకేతాలిస్తూ వైద్యుల ముందు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగింది. దాని బాధను అర్థం చేసుకున్న వైద్యులు వెంటనే దానికి సహాయం చేశారు. దీంతో ఆ కూన తిరిగి ఎప్పటిలాగే ఆరోగ్యవంతురాలైంది. పిల్లి ఆసుపత్రికి వెళ్లి, వైద్యం చేయిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "తల్లి ప్రేమకు అంతు లేదు" అంటూ నెటిజన్లు ఆ మదర్ పిల్లిని మెచ్చుకుంటున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!) Yavrusu biraz haylaz biri, annesi bulduğu yerde kapıp götürüyor pic.twitter.com/GYvBXt3UQz — Merve Özcan (@ozcanmerveee) April 27, 2020 -
టర్కీలో అద్భుతం.. కేవలం 10 రోజుల్లోనే..
ఇస్తాంబుల్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ టర్కీలో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన 93 ఏళ్ల వృద్ధురాలు కోలుకుని ఆశాదీపంగా నిలిచారు. ఇస్తాంబుల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. కేవలం 10 రోజుల్లోనే మహమ్మారి కోరల నుంచి బయటపడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య లక్ష దాటిన విషయం తెలిసిందే. ఇక టర్కీలోనూ ఈ అంటువ్యాధి ప్రబలుతూ ఆందోళనలు రేకెత్తిస్తోంది. మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్న మొదటి పది దేశాల జాబితాలో టర్కీ ఒకటి. ఇప్పటి వరకు అక్కడ వెయ్యికి పైగా కరోనా మరణాలు చోటుచేసుకోగా.. దాదాపు 47 వేల మందికి వైరస్ సోకింది.(కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి) ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం బ్యాట్మన్ సిటీకి చెందిన మహిళా రైతు అలే గుండుజ్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో మార్చి 31న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హైపర్‌టెన్షన్, వయోభారంతో బాధ పడుతున్న గుండుజ్కు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో మరో మారు కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చప్పట్లు కొడుతూ ఆమెను ఇంటికి పంపించారు. మనుమడు వెంటరాగా ఆస్పత్రిని వీడిన గుండుజ్... ‘‘అందరూ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’అంటూ ఇంటికి బయల్దేరారు.(కరోనా: మరణం అంచుల నుంచి వెనక్కి వృద్ధులు!) ఈ విషయం గురించి ఆస్పత్రి చీఫ్ ఫిజీషియన్ జకాయీ కుట్లుబే మాట్లాడుతూ.. ‘‘93 ఏళ్ల మహిళ ఇంటెన్సివ్ కేర్ నుంచి ఆరోగ్యంగా బయటకు నడిచారు. వృద్ధులపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటోందన్న తరుణంలో ఆమె మాలో కొత్త ఆశలు రేకెత్తించారు. దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నా 10 రోజుల్లోనే వైరస్ బారి నుంచి కోలుకున్నారు’’అని హర్షం వ్యక్తం చేశారు. కాగా 15 మిలియన్ మంది జనాభా కలిగి ఉన్న ఇస్తాంబుల్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60 శాతం మంది ఇస్తాంబుల్‌కు చెందినవారే గమనార్హం. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది.. ఆస్పత్రులు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, నర్సుల మానవతా దృక్పథంతో కఠిన శ్రమకోర్చి వేలాది మందిని కాపాడుతున్నారని పేర్కొన్నారు. అయితే గుండుజ్ లాంటి వాళ్లు కోలుకుని తమలో సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంపొందిస్తున్నారన్నారు.(కరోనాతో హాలీవుడ్ నటి మృతి) -
ఇండిగో మరో నిర్వాకం, ప్రయాణికుల గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో మరో నిర్వాకం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు వెళుతున్న ప్రయాణికులకు సంబంధించిన మొత్తం లగేజీని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లపోయింది. తీరా విమానం ఇస్తాంబుల్‌కు చేరుకున్నాక సామానుకోసం బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్న వారికి ఒక కాగితం వెక్కిరించింది. సామాన్లు మొత్తం లోడ్ చేయలేదు, క్షమించండి అన్న ఆ సందేశాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యారు. ఒక్కరు కాదు..ఇద్దరుకాదు..మొత్తం ప్రమాణికుల లగేజీని ఎలా మర్చిపోతారంటూ విస్తుపోయారు. 6ఇ11 విమానంలో ఆదివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఇండిగో తీరుపై ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేగింది. షేమ్ ఆన్ఇండిగో హ్యాష్‌టాగ్ విపరీతంగా ట్రెండవుతోంది. క్షమాపణ నోట్ఫోటోతో పాటు ప్రయాణీకులు తమ భయంకరమైన, అయోమయ పరిస్థితిపై ట్వీటర్ ద్వారా మండిపడుతున్నారు. మా నాన్నకు సుగర్. ఆయనకుఅవసరమైన మందులు అందులో వున్నాయ్..మరికొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్‌కు వెళ్లాలి..వారి పరిస్థితి ఏంటి అంటూ ఒక యూజర్ వాపోయారు. అటు ఈ వ్యవహరంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఐశ్వర్య గడ్కరీ మరో ప్రయాణికురాలు ట్వీట్ చేస్తూ.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న సోదరుడికివ్వాల్సిన మందులు లగేజీలో ఉండిపోయాయనీ, సమయానికి ఆ మందు తీసుకోకపోతే...మళ్లీ ఫిట్స్ వచ్చి అతను చనిపోయే అవకాశం కూడా వుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండిగో స్పందించడం లేదని, తక్షణమే సహాయం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన ఇండిగో తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. ప్రయాణికుల లగేజీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయ్నతిస్తున్నామని ట్వీట్ చేసింది. Just flew in on @IndiGo6E flight 6E 11 from Delhi to Istanbul last evening. We received this piece of paper when we were waiting for our luggage at the belt. The airline did not load the luggage of the ENTIRE FLIGHT. Not a single passenger got their luggage (1/n) #shameonindigo pic.twitter.com/7KF2VT0f2O — Chinmay Dabke (@chinmaydabke) September 16, 2019 @narendramodi urgent help landed frm Delhi to Istanbul by indigo flght 6E-11 my brother is epileptic medication was in luggage it has not boarded if he doesn't get it seizures will start may result in death . Please help indigo is not replying — Aishwarya Gadkari (@AishwaryaGadka5) September 16, 2019 Pls investigate in indigo airlines turkey flight# they do not load luggage to save fuel and send next day by turkish Airlines#customers stranded at Istanbul# unethical way of making money#flight 6E11#happening daily@DGCAIndia pic.twitter.com/ljcXebARYo — Starfish On Feni (@blissOnFeni) September 16, 2019 They are doing this for all 6E11 flights. We went through the same ordeal on 14 Sep and we are yet to hear anything other than we will get back. We are with 11 month old kid with all his clothes, food, medicines with Indigo! Shameful @DGCAIndia this is fraud!! We are stranded! — Varun (@guptavarun13) September 16, 2019 -
ఇస్తాంబుల్‌కు భూకంప ప్రమాదం
అంకార : టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌కు భారీ భూకంపం ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఇటీవల కాలిఫోర్నియాను కుదిపేసిన తీవ్రతకన్నా, అంటే రిక్టర్ స్కేల్‌పై 7.1 శాతం నుంచి 7.4 శాతం వరకు ఉండవచ్చని నిపుణుల అధ్యయనంలో తేలింది. మార్మరా సముద్రం అట్టడుగు భాగంలో భూ పొరల మధ్య ఒత్తిడి బాగా పెరుగుతోందని, దాని పర్యవసానంగా భారీ భూకంపం వచ్చే ప్రమాదం పూర్తిగా ఉందని ‘జీయోసీ’ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ హైడ్రన్ కోప్ హెచ్చరించారు. 1776లో ఇస్తాంబుల్ నగరంలో వచ్చిన 7.5 స్థాయి భూకంపంలో వేలాది మంది మరణించారు. భూ ఉపరితలం పైన సంభవించే భూకంపాలను శాటిలైట్ ఛాయా చిత్రాల ద్వారా అంచనా వేయవచ్చని, సముద్ర గర్భంలో వచ్చే భూకంపాలను ఈ పద్ధతిలో అంచనా వేయలేమని హైడ్రన్ కోప్ తెలిపారు. నీటిలో 800 మీటర్ల లోతున, సముద్రంలో వివిధ భాగాల్లో జరిపిన పరీక్షల్లో భూకంపాలు పొంచి ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. ఎంతకాలంలో ఈ భూకంపాలు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. 1999లో ఇదే నగరంలో 7.1 నుంచి 7.4 మధ్య తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో 17 వేల మంది మరణించారు. -
బేబీ.. ప్రాబ్లమ్ ఏంటమ్మా; ఇదిగో!
జంతువులు కూడా ఒక్కోసారి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. బాధ కలిగినపుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తమకు కూడా తెలుసునన్నట్లు వ్యవహరిస్తాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు తార్కాణంగా నిలిచింది. వారం రోజుల క్రితం ఓ వీధి కుక్క కాలికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అది దగ్గర్లోనే ఉన్న ఫార్మసీలోకి పరిగెత్తింది. చికిత్స చేయాలన్నట్లుగా దీనంగా చూస్తూ అక్కడున్న ఫార్మాసిస్టు బానూ సెంగిజ్ను వేడుకుంది. ఇంకేముంది.. వెంటనే రంగంలోకి దిగిన బాను ప్రేమగా దానిని దగ్గరకు తీసుకుని చికిత్స చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రేమగా చేతిని తాకి తనదైన భాషలో ఆ కుక్క బానుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి బాను మాట్లాడుతూ..‘ కుక్క కాలికి దెబ్బ తాకింది. ఫార్మసీలోకి పరుగెత్తుకొచ్చింది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి బేబీ.. సమస్య ఏంటమ్మా అని అడిగాను. గోముగా తన గాయాన్ని చూపించింది. ఆయింట్మెంట్ రాయగానే నా చేతిని నిమిరి నా వైపు ప్రేమగా చూసింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ‘ మీరు చేసిన పని మా మనస్సును గెలుచుకుంది. మూగజీవాల పట్ల ప్రేమ చూపాల్సిన ఆవశ్యకతను మరోసారి తెలియజేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. İstanbul’da patisi yaralanan sokak köpeği, gittiği eczanede yardım istedi. Yaralı köpeği tedavi eden Eczacı Banu Cengiz, "Yüreklerinde insan sevgisi, hayvan sevgisi, doğan sevgisi olanlar kapısına gelen bu canlıya müdahale ederdi" dedi. pic.twitter.com/rYy7OoWq1j — Vaziyet (@vaziyetcomtr) June 22, 2019 -
సముద్రంలో పడవ మునక.. నలుగురి మృతి
ఇస్తాంబుల్(టర్కీ): టర్కీ సముద్ర తీరంలో పడవ మునిగి నలుగురు శరణార్థులు మృతిచెందారు. మరో 20 మంది గల్లంతయ్యారు. కోస్టుగార్డు సిబ్బంది మరో 38 మందిని రక్షించారు. శరణార్థులు యూరోపియన్ దేశాలకు వెళ్లడానికి ఏజియన్ సముద్ర మార్గం కష్టంగా ఉండటంతో వారు నల్ల సముద్రం ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోస్టుగార్డులు తెలిపారు. వలసదారులను అడ్డుకోవడానికి యూరోపియన్ యూనియన్ టర్కీ దేశం గత మార్చిలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అయినప్పటికీ వలసలు ఆగటం లేదు. -
తండ్రిని చంపాడని..
ఇస్తాంబుల్: తండ్రిని చంపిన ఆగంతకుడు కళ్ల ఎదుటే కనిపించడంతో కసితో రగిలిపోయిన ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఇస్తాంబుల్‌లోని బిగ్చెఫ్ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. రెస్టారెంట్లోకి చొరబడిన దుండగుడు తన తండ్రి మరణానికి కారణమైన వాడిని అందుకు ప్రతీకారంగా చంపేస్తున్నానని చెప్పి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్ చుట్టూ భద్రతాఏర్పాట్లు చేశారు. దుండగుడి కోసం గాలింపులు జరుపుతున్నారు. నూతన సంవత్సర వేడుకల ముందురోజు ఇస్తాంబుల్‌లో మారణహోమం జరిగింది. అందులో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర ఘటన మరవకముందే మరో దారుణం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
ఆ నరహంతకుడి అరెస్ట్
ఇస్తాంబుల్: న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిపి 39 మందిని హతమార్చిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు టర్కీ విదేంశాగ మంత్రి కావ్ సోగ్లే బుధవారం మీడియాకు తెలిపారు. అయితే హంతకుడి వివరాలు మాత్రం తెలుపలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఉగ్రవాది కాల్పులకు ముందు కోన్యా సిటి సెంటర్లోని పరిసర ప్రాంతాల్లో ఒక హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తుంది. అతను నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న ప్రముఖ రియానా హోటల్ లోకి శాంటాక్లాజా వేషధారణలో వచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ౩9 మంది చనిపోయారు. మృతుల్లో లిబియాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, జోర్డాన్, ఇరాక్, ట్యునీషియా, మొరాకో పౌరులతో పాటు ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. మొత్తం 27 మంది విదేశీయులు మరణించారు. ఈ నైట్ క్లబ్ దురాగతం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది మధ్య ఆసియాకు చెందిన కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చినట్లు టర్కీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాది సిరియాలో శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. -
టర్కీ నైట్ క్లబ్బులో దుండగుడి కాల్పులు
► 39 మంది మృతి.. 70 మందికి గాయాలు ► మృతుల్లో ఇద్దరు భారతీయులు ఇస్తాంబుల్: ఉగ్ర దాడులతో అట్టుడుకుతున్న టర్కీలో కొత్త సంవత్సరం కూడా నరమేధంతోనే మొదలైంది. ఇస్తాంబుల్‌లో ఆదివారం న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న ప్రముఖ నైట్ క్లబ్బులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 39 మంది మృతిచెందగా, 70 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు సహా పలువురు విదేశీయులు, టర్కీ పౌరులు ఉన్నారు. అర్ధరాత్రి దాటాక 1.15 గంటలకు శాంటాక్లాజ్ దుస్తుల్లో వచ్చినట్లు భావిస్తున్న ముష్కరుడు బాస్ఫోరస్ నది ఒడ్డున ఉన్న రీనా క్లబ్బు ప్రవేశ మార్గం వద్ద తొలుత ఓ పోలీసును, ఓ పౌరుణ్ని కాల్చి చంపాడు. తర్వాత లోపలికెళ్లి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కాల్పుల సమయంలో క్లబ్బులో 700 మంది ఉన్నారు. ప్రాణభయంతో పలువురు నదిలోకి దూకారు. దాడికి ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. ఇంతవరకు గుర్తించిన 20 మృతదేహాలను బట్టి 15 మంది విదేశీయులు, ఐదుగురు టర్కీ వాసులు చనిపోయినట్లు తేలిందని, గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోం మంత్రి సోయ్లూ చెప్పారు. క్షతగాత్రుల్లో పలువురు అరబ్బులు ఉన్నారని అధికారులు చెప్పారు. ఓవర్‌కోటులో తుపాకీ దాచుకుని వచ్చిన దుండగుడు దురాగతం తర్వాత వేరే దుస్తులు ధరించి పారిపోయాడన్నారు. నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా శాంతి భద్రతల కోసం 17 వేల మంది పోలీసులను మోహరించగా, వారిలో కొందరు శాంటాక్లాజ్ దుస్తుల్లో ఉన్నట్లు మీడియా తెలిపింది. మృతుల్లో ఇద్దరు జోర్డాన్ వాసులు, ఇద్దరు టునీషియన్లు, ఒక ఇజ్రాయెలీ మహిళ, ఒక బెల్జియన్ పౌరుడు ఉన్నారు. దాడి అమానవీయమని రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు గర్హించాయి. దాడి పాశవికమన్న భారత ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపారు. ఈ దారుణంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు భయాందోళనల నడుమ సాగాయి. గత ఏడాది డిసెంబర్ 10న ఇస్తాంబుల్‌లోనే జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 44 మంది చనిపోయారు. తామే ఈ పేలుళ్లకు నిషిద్ధ పీకేకే (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) అనుబంధ సంస్థ కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్స్ ప్రకటించుకుంది. జూన్ లోనూ నగరంలోని ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 47 మంది బలయ్యారు. అల్లర్లు రెచ్చగొట్టడానికే తాజా దాడి చేశారని, ఇలాంటి వాటికి బెదరబోమని దేశాధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డోగాన్ అన్నారు. జూలై నాటి ఆర్మీ తిరుగుబాటు నుంచి ఇంకా కోలుకోని టర్కీ ఉగ్రదాడులతో మరింత సతమతమవుతోంది. తమ సరిహద్దులోని ఐసిస్, కుర్దూ మిలిటెంట్లను తరిమి కొట్టేందుకు టర్కీ ఆర్మీ సిరియాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యం చేసుకుంటున్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ కుమారుడు బలి న్యూఢిల్లీ: ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మృతిచెందారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకరిని రాజ్యసభ మాజీ ఎంపీ, బాడీ బిల్డర్ అక్తర్ హసన్ రిజ్వీ కుమారుడైన అబిస్ రిజ్వీగా, మరొకరిని గుజరాత్ మహిళ ఖుషీ షాగా గుర్తించామని, టర్కీలోని భారత రాయబారి ఇస్తాంబుల్ వెళ్తున్నారని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులు టర్కీ వెళ్లేందుకు వీసా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
'దొరికినవారిని దొరికినట్లు కాల్చేశాడు'
టర్కీ: టర్కీలో జరిగిన కాల్పుల దుర్ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వివరించాడు. ఆ సమయంలో దాడి జరిగిన చోట ఎంతటి భయానక వాతావరణం నెలకొందో, ప్రజల పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందో స్పష్టం చేశాడు. ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా టర్కీలో ఇస్తాంబుల్‌లో గల నైట్ క్లబ్లో ఓ సాయుధుడు చొరబడి దొరికిన వారిని దొరికినట్లే పిట్టల్లా కాల్చి చంపాడు. దాదాపు 35మందిని బలితీసుకోవడమే కాకుండా మరో 40మందినిపైగా తీవ్రంగా గాయపరిచాడు. ఈ భయానక దాడి నుంచి బయటపడిన సెఫా బాయ్ దాస్ అనే ఓ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ తన అనుభవాన్ని చెప్పాడు. 'దాదాపు మేం 500మందిమి నైట్ క్లబ్లో న్యూఇయర్ వేడుకల్లో ఉన్నాం. ఆ సమయంలో అనూహ్యంగా తుపాకీ చప్పుడు వినిపించింది. జనాలంతా భయంతో పరుగులు పెట్టడం ప్రారంభించారు. కానీ, సాయుధుడు మాత్రం ఎంత వీలైతే అంతమందిని చంపేయాలన్నంత కసితో కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భయపడి తమ ఎదుటివారు పరుగులు పెట్టే క్రమంలో కిందపడగా వారిపై నుంచి ఇంకొంతమంది తొక్కుకుంటూ ముందుకురికారు. మేం కూడా పరిగెడుతూ కొంతమందిని తొక్కుకుంటూ వెళ్లి ఓ డోర్ పక్కనే దాక్కున్నాం. ఆ సమయంలో మాకు సమీపంగా మరోసారి కాల్పుల శబ్దం వినిపించింది. అమ్మాయిల కేకల చప్పుల్లే బాగా వినిపించాయి. ఆ సమయంలో నేను నా స్నేహితురాలు తొలుత తప్పించుకున్నాం. కానీ, ఆమె సోదరి అక్కడే స్పృహతప్పి పడిపోవడం చూసి అక్కడికి వెళ్లిన ఆమె కూడా చనిపోయింది. ఆ సమయంలో గట్టిగా కేక వేసినప్పటికీ ఎవరూ వినిపించుకోని పరిస్థితి ఎందుకంటే ఆ సమయంలో వందలమంది భయంతో పెద్దగా కేకలు పెడుతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంకాగానే నేను అందులోకి వెళ్లాను. అలా వెళ్లిన పది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. నాజీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేనేమో' అంటూ ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
కారు బాంబు దాడి: 29 మంది మృతి
-
కారు బాంబు దాడి: 29 మంది మృతి
ఇస్తాంబుల్(టర్కీ): ఇస్తాంబుల్‌లోని ఓ ఫుట్ బాల్ స్టేడియం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 29 మంది మృతిచెందగా, 160 మందికిపైగా గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడితో పాటూ అదే ప్రాంతానికి సమీపలో ఓ ఆత్మాహుతి దాడి జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. బెసిక్టాస్ స్టేడియంలో అభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్‌ను తిలకించి వెళ్లిన రెండు గంటలకే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కుర్దిష్ తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గతకొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారుబాంబు, ఆత్మాహుతి దాడి వెనుక కర్దిష్ తీవ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. -
టర్కీలో తిరుగుబాటు
-
టర్కీలో తిరుగుబాటు
- 265 మంది మృతి - అధ్యక్షుడు ఎర్డోగన్‌పై సైనిక కుట్ర - అణచివేసిన సర్కారు అంకారా : టర్కీలో అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. తిరుగుబాటును ప్రభుత్వ అనుకూల సైన్యం తిప్పికొట్టింది. రాజధాని అంకారాలోనూ, ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోనూ శుక్రవారం రాత్రి కాళరాత్రే అయింది. అంకారాలోని పార్లమెంటు భవనంపై యుద్ధ విమానాలతో బాంబుదాడులు, అధ్యక్షుడి భవనం ముట్టడి, వీధుల్లో యుద్ధట్యాంకుల కవాతు, వారికి వ్యతిరేకంగా ఎర్డోగన్ పిలుపుతో ప్రజల భారీ ప్రదర్శనలు, సైనికులతో తలపడేందుకు ప్రయత్నాలు, వారిపై రెబల్ సైనికుల కాల్పులు.. తిరుగుబాటును అణచివేసేందుకు ప్రభుత్వ అనుకూల సైన్యం సాయుధ చర్యలతో టర్కీ అట్టుడికింది. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతోందో తెలీనిగందరగోళం నెలకొంది. అయితే.. ప్రభుత్వం తెల్లవారేసరికి తిరుగుబాటును అణచివేసింది. హింసలో 104 మంది తిరుగుబాటు సైనికులు సహా మొత్తం 265 మంది చనిపోయారు. మరో 1,440 మంది గాయపడ్డారు. 3,000 మంది రెబల్ సైనికులను నిర్బంధించారు. దేశం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ ప్రకటించగా.. తిరుగుబాటును తిప్పికొట్టామని ఎర్డోగన్ ప్రకటించారు. తిరుగుబాటు కుట్ర ఎర్డోగన్‌కు బద్ధశత్రువు, అమెరికాలో నివసిస్తున్న మతగురువు ఫెతుల్లా గులెన్ పనేనని ప్రభుత్వం ఆరోపించింది. కుట్ర నేపథ్యంలో.. పలువురు సైనిక జనరళ్లతో పాటు టర్కీ అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో ఒకరైన అల్ఫార్స్లాన్ అల్తాన్ను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. మొత్తం 2,700 మంది జడ్జీలను విధుల నుంచి తొలగించింది. అధ్యక్షుడు విహార యాత్రలో ఉండగా ఎనిమిది కోట్ల మంది జనాభా గల టర్కీకి గత 13 ఏళ్లుగా ఎర్డోగన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన టర్కీ ఆధునిక లౌకిక మూలాలను కాలరాస్తున్నారని, నియంతృత్వం దిశగా పయనిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఎర్డోగన్ తనను వ్యతిరేకించే శక్తులను తప్పించి సైన్యంపై నియంత్రణ సాధించారని చెప్తారు. ముస్తఫా కెమాల్ అటాటర్క్ 1923లో టర్కీలో స్థాపించిన లౌకిక రాజ్యానికి రక్షణ కల్పిస్తుంది తామేనని ఆ దేశ సైన్యం విశ్వసిస్తుంటుంది. 1960 నుంచీ సైన్యం మూడుసార్లు నాటి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసింది. 1997లో ఇస్లామిక్ సర్కారును కూలదోసింది. ఈ నేపథ్యంలో.. ఎర్డోగన్ శుక్రవారం సముద్రతీర విహార కేంద్రమైన మార్మారిస్‌లో ఓ రిసార్ట్‌లో ఉండగా ఆర్మీలోని ఒక వర్గం తిరుగుబాటుకు దిగింది. సైనిక దళాల అధిపతి హులుసి అకార్ను బంధించి, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు అంకారా, ఇస్తాంబుల్‌లో ప్రధాన వీధులనుఆధీనంలోకి తీసుకుంది. అటాటర్క్ ఎయిర్‌పోర్టును మూసేసింది. పార్లమెంటు భవనంపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇస్తాంబుల్‌లో యూరప్‌ను ఆసియాతో కలిపే రెండు వంతెనలను మూసివేసి రాకపోకలను నిషేధించింది. దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, నిరవధిక సైనిక కర్ఫ్యూ విధించామని అన్నారు. ట్విటర్, ఫేస్టైమ్లలో ఎర్డోగన్ పిలుపు... ఇది ఒక వర్గం సైనిక కుట్ర అని, సైన్యంలో దిగువ స్థాయి అధికారులు ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారని ఎర్డోగన్ ట్విటర్లో, ఐఫోన్లో ఫేస్‌టైమ్ ద్వారా ఒక టీవీ చానల్లో తెలిపారు. ప్రభుత్వ మద్దతుదారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధుల్లోకి రావాలన్నారు. దీంతో అధికార జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ మద్దతుదారులు వేలమంది జాతీయ పతాకాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సైన్యానికి నిరసన తెలిపారు. అయితే.. చాలా కొద్ది మంది రెబల్ సైనికులకు స్వాగతం పలకటం కూడా కనిపించింది. ఇస్తాంబుల్‌లోని ఒక వంతెన వద్ద రెబల్ సైనికులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సైనికులు కాల్పులు జరపటంతో డజన్ల మంది గాయపడ్డారు. ఇస్తాంబుల్‌లోని టాక్సిమ్ స్క్వేర్‌లోనూ సైనికుల కాల్పుల్లో నిరసనకారులు గాయపడ్డారు. రెండు నగరాల వీధులూ రణరంగాన్ని తలపించాయి. మరోవైపు.. ప్రభుత్వ అనుకూల సైన్యం రెబల్స్‌పై వైమానిక దాడి చేసింది. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన యుద్ధట్యాంకర్లను పేల్చేసింది. అంకారా, ఇస్తాంబుల్ బాంబు పేలుళ్లు, కాల్పులతో అట్టుడికాయి. తెల్లవారేసరికి.. రెబల్ సైన్యం లొంగిపోయింది. చాలా మంది సైనికులు నిరాయుధులుగా లొంగిపోయారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రధాని ఎల్దిరిమ్ ప్రకటించారు. తిరుగుబాటు సైన్యం బంధించిన సైనిక దళాల అధిపతి హులిసిని విడిపించగా.. ఆయనతో పాటు కలిసి ఎల్దిరిమ్ అంకారాలో మీడియాతో మాట్లాడారు. రాత్రి హింసలో 161 మంది ప్రజలు చనిపోయారన్నారు. రెబల్ సైనికులు 104 మంది హతమైన విషయాన్ని ప్రస్తావించలేదు. పార్లమెంటు భవనం ధ్వంసమై కనిపించింది. దేశ సాయుధ దళాలకు తాత్కాలిక చీఫ్‌గా జనరల్ ఉమిత్ దుందార్ను నియమించినట్లు ఎల్దిరిమ్ ప్రకటించారు. గులెన్కు ఆశ్రయమిస్తున్న అమెరికాపై ధ్వజం... మరోవైపు.. గులెన్ ఉగ్రవాద సంస్థ నాయకుడని పరోక్షంగా ఆరోపిస్తూ.. ఆయనకు అమెరికా ఆశ్రయం ఇవ్వటాన్ని టర్కీ ప్రధాని ఎల్దిరిమ్ తప్పుపట్టారు. గులెన్కు వ్యతిరేకంగా టర్కీ వద్ద ఏదైనా సాక్ష్యముంటే తమకు అందించాలని అమెరికా పేర్కొంది. టర్కీ కుట్రలో పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఎనిమిది మంది సైనికాధికారులు శనివారంహెలికాప్టర్లో గ్రీస్ చేరుకుని శరణుకోరారు. తిరుగుబాటు నేపథ్యంలో టర్కీకి వెళ్లాల్సిన చాలా అంతర్జాతీయ విమానాలను శుక్రవారం రాత్రి నుంచి రద్దు చేశారు. శనివారం ఉదయానికి కుట్రను అణచివేయటంతో దేశంలో జనజీవనం మళ్లీ యథాతథస్థితికి చేరుకుంటోంది. అటాటర్క్ విమానాశ్రయాన్ని తెరచి విమాన రాకపోకలను ప్రారంభిస్తున్నారు. టర్కీలో శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని ప్రపంచ నేతలు పిలుపునిచ్చారు. ఎర్డోగన్ సర్కారు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. కుట్ర సూత్రధారి గులెన్: ఎర్డోగన్ అధ్యక్షుడు ఎర్డోగన్ రాత్రికి రాత్రే అంకారా చేరుకుని అటాటర్క్ ఎయిర్‌పోర్టు నుంచి, తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం తమ నియంత్రణలోనే ఉందని, కుట్రను తిప్పికొట్టామన్నన్నారు. అయితే.. ‘కుట్ర ఏ స్థాయిలో ఉన్నాసరే ఈ రోజు రాత్రి వీధులు మన అధీనంలో ఉండాలి. ఏ క్షణంలోనైనా కొత్త తిరుగుబాటు రాజుకోవచ్చు’ అని అన్నారు. తిరుగుబాటు రాజద్రోహమని, కారకులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా నుంచి నడుస్తున్న సమాంతర సర్కారే కుట్ర చేసిందంటూ.. అక్కడున్న గులెన్ను నిందించారు. ఒకనాటి మిత్రుడైన గులెన్ తనను కూలదోయాలని యత్నిస్తున్నట్లు ఎర్డోగన్ ఆరోపిస్తుంటారు. గులెన్ స్పందిస్తూ.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు. 148 మంది భారతీయ బాలలు క్షేమం న్యూఢిల్లీ: వరల్డ్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడానికి టర్కీలోని ట్రాబ్జాన్లో ఉన్న 148 మంది భారతీయ బాలలు, 38 మంది అధికారులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి వారు భారత్‌కు బృందాలుగా బయల్దేరతారని ట్వీట్ చేశారు. ఈ బాలల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అథ్లెట్ దండి జ్యోతికా శ్రీ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతానికి 1,200 కి.మీ దూరంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కాగా, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరుకు చెందిన ఎ.గౌతమ్ రెడ్డి కూడా టర్కీలో చిక్కుకుపోయారు దక్షిణ కొరియాలోని డేగు వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయన న్యూయార్క్ వెళ్తూ మార్గమధ్యంలో ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు. ప్రజాస్వామ్యానికి మద్దతివ్వండి .. భారత్: టర్కీలోని అన్ని పక్షాలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పునకు మద్దతివ్వాలని, రక్తపాతాన్ని నివారించాలని భారత్ కోరింది. భారత ఎంబసీ అంకారా(905303142203), ఇస్తాంబుల్(905305671095)లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. విభిన్న ఆలోచనల ‘సుల్తాన్’ ఇస్తాంబుల్: ఆధునిక టర్కీ చరిత్రలో ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగన్ చాలా ప్రత్యేకం. ఇస్లామిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈయన మిగిలిన నేతలతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తారనే పేరుంది. టర్కీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని.. అభిమానులంటారు. అధ్యక్షుడిగా 2014లో పగ్గాలు చేపట్టిన ఎర్డోగన్ (అభిమానులు సుల్తాన్ అని అంటారు) 2003లో ప్రధానిగా ఉన్నారు. అమెరికా తరహాలో అధ్యక్షుడే సర్వస్వంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈయన ఆలోచన. అయితే లౌకిక వాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారాయని విపక్షాల ఆరోపణ. దీంతో అసంతృప్తిగా ఉన్న కొందరు సైనికులు చేసిన ఈ తిరుగుబాటుతో చిర్రెత్తిన ఎర్డోగన్.. తన వ్యతిరేకులంతా ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. తిరుగుబాటుకు.. ఆర్మీ చీఫ్, నిఘా, తదితర విభాగాలు మద్దతు తెలపలేదు. వీరంతా ప్రభుత్వానికి విధేయులగా ఉండటంతోనే.. ఎర్డోగాన్ తిరుగుబాటును విజయవంతంగా అణిచివేయగలిగారు. సైనిక తిరుగుబాట్ల టర్కీ మార్చి 27, 1960: ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమాల్ అటాటర్క్ ఆలోచనలకు విరుద్ధంగా అప్పటి అధికార పార్టీ వందలాది మసీదులను నిర్మించి అరబిక్‌లో ప్రార్థనలకు అనుమతించింది. అటాటర్క్ రూపొందించిన నిబంధనల సమీక్షకు ఆర్మీ ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది. మార్చి 12, 1971:రాజకీయ సంక్షోభం తలెత్తడంతో మిలటరీ జనరల్ టాగ్మాక్ అల్టిమేటం జారీ చేశారు. రాజ్యాంగ బద్ధమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేవరకు పాలనా బాధ్యతల్ని మిలట్రీ చేపడుతుందన్నారు. సెప్టెంబరు 12, 1980: రాజకీయ అస్థిరతతో 1980, సెప్టెంబరు 12న ఆర్మీ అధికారం చేజిక్కించుకుంది. కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27, 1997: ఇస్లాం ప్రాబల్యం ఎక్కువవుతుండటంతో.. ‘పోస్ట్‌మాడర్న్ కూప్’ పేరుతో ఆర్మీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించింది. ఇస్తాంబుల్ మేయర్‌గా ఉన్న ఎర్డోగన్ ఇస్లామిక్ పద్యాన్ని చదవడంతో ఆర్మీ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. మా షూటింగ్‌కు ఇబ్బంది లేదు: బిర్సా కోల్‌కతా: ఇస్తాంబుల్‌లో సినిమా చిత్రీకరణ చేస్తున్న డెరైక్టర్ బిర్సా దాస్‌గుప్తా.. సైనిక తిరుగుబాటులో తమకు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. పశ్చిమబెంగాల్ ఐటీ మంత్రి బ్రాత్యా బసు సహా ఆ రాష్ట్రానికి చెందిన 35 మంది ఈ సినిమా బృందంలో ఉన్నారు. -
నిర్మానుష్యం... టూరిస్టు నగరం!
ఇస్తాంబుల్ః చారిత్రక టర్కిష్ నగరం ఇస్తాంబుల్... ఇప్పుడో దెయ్యాల దీవిలా కనిపిస్తోంది. టూరిజానికి ఎంతో ప్రసిద్ధి చెంది, ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే నగరం... ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. షాపింగ్ చేసేందుకు సైతం టూరిస్టులు భయపడిపోతున్నారు. ఎప్పుడూ రష్ గా కనిపించే షాపులు... ఖాళీగా కనిపించడమే ఇస్తాంబుల్ అంటే జనం భయపడిపోతున్నారనేందుకు పెద్ద నిదర్శనం. పర్యాటక నగరం ఇస్తాంబుల్ విమానాశ్రయంలో గతవారం ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించడంతో ఇప్పుడా ప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం భయపడిపోతున్నారు. టర్కీలోని అతి పెద్ద నగరం, వందల ఏళ్ళుగా టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఇస్తాంబుల్... ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొనుగోలుదారులతో సందడిచేసే పర్యాటక నిలయం ఖాళీ వీధులతో దర్శనమిస్తోంది. గతవారం అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇస్తాబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా కూడ గుర్తించబడ్డాయి. చారిత్రక మాస్క్ లు, అద్భుతాలను తలపించే సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి తలమానికాలు. అటువంటి ప్రదేశం ఇప్పుడు ఉగ్రదాడుల భయోత్పాతానికి తలవంచాల్సి వస్తోంది. ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు సైతం పర్యాటకులు లేక అల్లాడుతున్నాయి. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటళ్ళకు ఎవరైనా వచ్చినా.. అక్కడి పరిస్థితులే అదనుగా రూమ్స్ ధరలపై బేరాలాడుతున్నారు. ఇస్తాంబుల్ దాడుల ఘటన స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని ఓ టూరిస్ట్ గైడ్ చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్ళుగా తాను అదే వృత్థిలో ఉన్నానని, ప్రసిద్ధ పర్యాటక నగరంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్తున్నాడు. దీనికి తోడు తొమ్మిది రోజుల అంతర్జాతీయ సెలవు ప్రకటించడం.. స్థానికులు సైతం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళడంతో ఇప్పుడదో దెయ్యాల దీవిలా కనిపిస్తోందంటున్నాడు. ఇస్తాంబుల్ లో జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీనే తీవ్రంగా దెబ్బతీసిందని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి వ్యాపారులు సైతం విదేశాలకు తరలిపోతామంటున్నారని చెప్తున్నాడు. అయితే ఇటువంటి ఘటనలు ఇక్కడకు మాత్రమే పరిమితం కాదని, ఇలా ఏ దేశంలోనైనా జరగవచ్చని కొందరు టూరిస్టులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌరులంతా ఏకమై, ప్రభుత్వాల కృషితో ఉగ్రభూతాన్ని అణచివేస్తే తప్పించి ఈ పరిస్థితులు ఏ దేశానికైనా తప్పవని చెప్తున్నారు. -
ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..
టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా ఫోటోలనుబట్టి తెలుస్తోంది. పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో 230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు. ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు. -
ఆత్మాహుతి దాడులు, ఏకే-47తో కాల్పులు!
ఇస్తాంబుల్: ఉగ్రవాదులు టర్కీలో మరోసారి ఆత్మాహుతి దాడులతో పాటు ఏకే-47తో కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాంబుల్ లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. బాంబు పేలుళ్లు జరిపిన అనంతరం కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో దాదాపు 28 మంది మృత్యువాత పడగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం టాక్సీల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దుండగులు కాల్పులకు పాల్పడ్డ అనంతరం ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఏకే-47 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంట్రీ పాయింట్ల వద్ద అనుమానితులను తనిఖీలు చేపట్టినట్లు స్థానిక మంత్రి బెకిర్ బెజ్డాగ్ వెల్లడించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్దకు రాగానే ఓ ఉగ్రవాది ఏ.కే47తో కాల్పులు జరిపి ఆ వెంటనే తనను తాను పేల్చుసుకున్నట్లు తమకు సమాచారం అందిందని మంత్రి వివరించారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తులు ఎంతమంది, ఏ ఉగ్రసంస్థకు చెందిన వారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇస్తాంబుల్‌లో కారు బాంబు పేలుడు
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ కారుబాంబు పేల్చడంతో 11మంది అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు. 36మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం రక్తపు మరకలతో భీతావాహంగా మారింది. ఒక పోలీసు బస్సును లక్ష్యంగా ఎంచుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేకరులకు చెప్పారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తన బాధ్యత ప్రకటించలేదు. -
ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్ పట్టణంలో ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వారాంతాల్లో పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. టర్కీ రాజధాని అంకారాలో గత ఆదివారం కుర్థిష్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్ధులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ దాడికి పాల్పడ్డామని ఉగ్రవాదులు ప్రకటించారు. -
టర్కీలో టెర్రర్ హర్రర్!
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మరోసారి అలజడి సృష్టించారు. ఇద్దరు మహిళా మిలిటెంట్లు టర్కీ పోలీసుల బస్సుపై తుపాకీ కాల్పులు, గ్రనేడ్ దాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడగా.. సత్వరమే స్పందించిన పోలీసులు ఆ ఇద్దరు మహిళా సాయుధులను సంఘటనా స్థలంలోనే కాల్చిచంపేశారు. ఇస్తాంబుల్‌లోని బేరాంపాస జిల్లాలోని పోలీసు స్టేషన్ లక్ష్యంగా మహిళా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్లోకి పోలీసుల బస్సు వెళుతుండగా ఒక మహిళ కాల్పులు జరుపగా, మరొక మహిళ గ్రనేడ్లు విసిరింది. సంఘటనా స్థలం నుంచి పరారైన మహిళా సాయుధులను ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. ఓ బంగ్లాలో దాచుకున్న మహిళా ఉగ్రవాదులు, ప్రత్యేక బలగాల మధ్య దాదాపు గంటపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల నేపథ్యంలో టర్కీలోని కుర్దీష్ ప్రాబల్యమున్న వాయవ్య ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో ఆ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మహానగరితో చారిత్రక బంధం అందాల ఇస్తాంబుల్..
సిటీబ్యూరో: చారిత్రక మహానగరం ఎన్నో అద్భుత కట్టడాలకు పెట్టింది పేరు. ఎంతో ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఇస్లామిక్ వాస్తురీతులు దీని సొంతం. సాఫ్ట్వేర్, వ్యాపార, వాణిజ్యానికి పుట్టినిల్లు. ఓపక్క తన వారసత్వాన్ని కాపాడుకుంటూనే విశ్వనగరి వైపు అడుగులు వేస్తోంది. బల్దియా ఎన్నికల వేళ.. అందరి దృష్టి చారిత్రక కట్టడాల పరిరక్షణ మీదకు మళ్లింది. సిటీలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. విశ్వనగరం వైపు అడుగులేయాలని సిటీజన్లు కోరుతున్నారు. ఈ క్రమంలో చరిత్ర, కట్టడాలు, వారసత్వం అంశాల్లో మన గ్రేటర్‌కు టర్కీ దేశంలో ఇస్తాంబుల్ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రెండు నగరాల చారిత్రక బంధంపై ప్రత్యేక కథనం. చారిత్రక బంధం ఇదీ.. టర్కీలోని ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక బంధాలు ఉండడం విశేషం. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్‌షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నీలోఫర్, దుర్రేషహర్లు కూడా టర్కీకి చెందినవారే. అంటే వందల ఏళ్లుగా ఇస్తాంబుల్‌కు, మన హైదరాబాద్‌తో వైవాహిక బంధాలు కూడా ఉన్నాయి. ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే...? ఇస్తాంబుల్‌లో ప్రధానంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు అక్కడి చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇదే తరహాలో నగరంలో చేపడుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు, మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం సమయంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని సిటీజన్లు కోరుతున్నారు. ఇస్తాంబుల్‌లో అవలంబించిన విధానాలతో ఆయా చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక చారిత్రక మార్కెట్లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. చారిత్రక కట్టడాలలో హోటళ్లు,రెస్టారెంట్లు ఏర్పాటుచేయడంతో వాణిజ్య కార్యకలాపాలు సైతం పెరిగాయి. అంటే ఓ నగరం కీర్తి విదేశీ పర్యాటకుల రాకతో విశ్వవ్యాప్తమవుతుండడంతో చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలను అక్కడి ప్రభుత్వం కాపాడుతోంది. ఇక్కడి ప్రముఖ కట్టడాలివే.. హగియా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్కాపీ ప్యాలెస్, బ్లూమాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇదీ మన హైదరాబాద్ షాన్.. ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌తో అచ్చు గుద్దినట్టు పోలికుండే నగరం హైదరాబాద్. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గోల్కొండ కోట, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మక్కామసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ భవనం, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కు పైగా చారిత్రక కట్టడాలకు మన నగరం నెలవు. అయితే ఇటీవల రహదారుల విస్తరణ,మెట్రో ప్రాజెక్టు,మాస్టర్‌ప్లాన్ పనుల కారణంగా పలు చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. పాతనగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్ కారణంగా సుమారు 69 వరకు ఉన్న అషుర్ఖానాలు, మసీదులు, చిల్లాలకు నష్టం వాటిల్లుతుందన్న అనుమానాలున్నాయి. ఇక డ్రైనేజి నెట్వర్క్ విస్తరణ, రహదారుల విస్తరణ జరిగిన ప్రతిసారీ చారిత్రక కట్టడాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈనేపథ్యంలో నగర మాస్టర్‌ప్లాన్‌లో పాత నగరంలోని చారిత్రక కట్టడాల మనుగడకు నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి ఉంది. ఇక హైటెక్‌సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవా, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి. చారిత్రక కట్టడాల నగరి.. ఇస్తాంబుల్ నగరంలో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను చారిత్రక వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. వీటి పరిరక్షణకు మాస్టర్‌ప్లాన్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. టర్కీలో అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్యప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి కట్టడాలలో కనిస్తాయి. ఎన్నో అద్భుత కళాఖండాలకు ఈ నగరం ముఖ్య కేంద్రం. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కొలువుదీరింది. ఈ నగరం పాతకొత్తల సంగమంగా కనిపిస్తుంది. ఈ నగరం మధ్య నుంచి ప్రవహించే బోస్పరస్ నది ఒడ్డున రెండు భిన్న సంస్కృతులు అభివృద్ధి చెందాయి. -
ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి
-
ఇస్తాంబుల్‌లో భారీ ఆత్మాహుతి దాడి
ఇస్తాంబుల్: ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన టర్కీలోని ఇస్తాంబుల్ నగరంపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇస్తాంబుల్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి జరుగడంతో 10 మంది మృతి చెందారు. 15 మంది గాయపడినట్టు సమాచారం. సెంట్రల్ ఇస్తాంబుల్‌లోని చారిత్రక సుల్తాన్హా మెట్ జిల్లాలోని ఓ కూడలి వద్ద సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు వెంటనే ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు ప్రదేశానికి అంబులెన్సులు తరలించారు. టర్కీలో అత్యంత జనసమ్మర్ద నగరం ఇస్తాంబుల్. ఇక్కడ పర్యాటక ప్రసిద్ధ ప్రాంతంగా పేరొందిన బ్లూ మసీదు, హజియా సోఫియాకు సమీపంలో పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ప్రాంతానికి సమీపంలో చారిత్రక స్మృతిచిహ్నమున్న పార్కు కూడా ఉందని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విమానంలో మొబైల్ ఫోన్ కలకలం
ముంబై: వారం వ్యవధిలోనే ముంబై నుంచి బయల్దేరిన మరో విమానం మార్గమధ్యంలో వెనుదిరిగి వచ్చింది. సోమవారం ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీ ఎయిర్‌లైన్స్ విమానాన్ని మధ్యలో వెనక్కుమళ్లించారు. విమానంలో ఓ మొబైల్ ఫోన్ తెగ మోగుతున్నా.. ఎవరూ దాన్ని ఆన్సర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. సెల్ఫోన్లను కూడా బాంబులకు ట్రిగ్గర్లుగా వాడే అవకాశం ఉండటంతో.. విమానంలో ఎక్కడైనా బాంబు పెట్టారేమోనన్న భయంతో దాన్ని మళ్లీ ముంబై మళ్లించారు. ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేసి క్షుణ్నంగా తనిఖీ చేశారు. విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత టర్కీ విమానం బయల్దేరేందుకు అధికారులు అనుమతిచ్చారు. గతవారం ముంబై-లండన్ విమానంలో ఎలుక కనిపించడంతో వెనుదిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. -
గడ్డం దారుఢ్యం...
తిక్క లెక్క శరీరంలో దారుఢ్యం ఉండేది ఎముకలకు, కండరాలకు మాత్రమే కదా.. అనుకుంటున్నారా..? అయితే, తప్పులో కాలేసినట్లే! ఈ ఫొటోను చూస్తే మీకు విషయం కొంత అర్థమైపోతుంది. తెగబారెడు గడ్డమే ఆధారంగా అందమైన అమ్మాయిని ఉయ్యాల ఊపుతున్న ఈ పెద్దమనిషి పేరు అంటానస్ కోంట్రిమాస్. లిథువేనియా దేశానికి చెందినవాడు. రెండేళ్ల కిందట టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఏర్పాటైన ఒక ప్రదర్శనలో తన గడ్డం దారుఢ్యాన్ని ఇలా ప్రదర్శించాడు. ఇతగాడి గడ్డానికి ఊయ్యాల కట్టుకుని ఊగుతున్న అమ్మాయి బరువు 63.80 కిలోలు. గడ్డంతో ఇంతటి బరువు ఎత్తగల వాళ్లెవరూ ప్రపంచంలోనే లేకపోవడంతో, ఇతగాడి పేరు గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. -
సూదుల తల...
తిక్క లెక్క ఈ ఫొటో చూస్తే తలపై వెంట్రుకలు కాకుండా, సూదులు మొలిచినట్లుగా లేదూ! సూదులు మొలిచినవి కాదు గానీ, ఉద్దేశపూర్వకంగానే గుచ్చుకున్నవి. ఇతగాడు చైనాలో కాస్మొటిక్ వైద్యుడు. గిన్నిస్ రికార్డు కోసం ఇలా తలపై సూదులు గుచ్చుకుని, తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ఎన్ని సూదులంటారా..? ఎన్నో కాదు, 2,188 సూదులు మాత్రమే. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో రెండేళ్ల కిందట ఈ విన్యాసాన్ని ప్రదర్శించాడు. -
యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు
అంకారా : టర్కీలో ఇస్తాంబుల్ నగరంలోని యూఎస్ రాయబారి కార్యాలయంపై సోమవారం తీవ్రవాదుల విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... తీవ్రవాదులపై ఎదురు కాల్పులకు తెగబడింది. దాంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది. కాగా స్థానిక మూడంతస్థుల పోలీస్ స్టేషన్ భవనంపై తీవ్రవాదులు గత రాత్రి బాంబులతో దాడి చేశారు. దాంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని మీడియా పేర్కొంది. -
మాట మరచిన ఊరు
‘‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. నీకు నోరే లే కపోతే నీ కోసం ఊరే మూగబోతుంది’’ అన్నట్టుగా ఆ అన్నా చెల్లెళ్ల కోసం ఊరు ఊరంతా మూగబోయిన వైనమిది. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో నివసించే ముహర్రమ్ మూగ, చెవిటి. ముహర్రమ్ మంచివాడు కావడంతో చుట్టుపక్కలవాళ్లు అతనిని బాగా అభిమానిస్తారు. ఒక రోజు ముహర్రమ్, సోదరితో కలిసి ఒక షాపు మీదుగా వెళుతుంటే... ఆ షాపతను గుడ్‌మార్నింగ్ అంటూ అతడిని విష్ చేశాడు. అదీ సైన్ లాంగ్వేజ్‌లో. ఆ తర్వాత వీళ్లిద్దరూ లోకల్ క్యాబ్ ఎక్కబోతుంటే ఆ డ్రైవర్ కూడా ముహర్రమ్ని సైన్ లాంగ్వేజ్‌లోనే పలకరించాడు. ఈ రెండు సంఘటనలు జరిగిన కాసేపటికే... స్థానికులంతా గుంపుగా వచ్చి ముహర్రమ్తో సంభాషించడం ప్రారంభించారు. అదీ సైన్లాంగ్వేజ్లోనే. అప్పుడు అర్ధమైంది ముహర్రమ్కి... తమ చుట్టుపక్కల వాళ్లంతా తన ‘భాష’ నేర్చుకున్నారని. అదీ తన కోసమేనని. ‘‘నోటిమాట లేదు నొసట... ఎన్నో నోళ్లున్నాయి నా కోసం ఇచట’’ అంటూ ఉప్పొంగిపోయిన ముహర్రమ్ ఆనందం ఆపుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. కొసరంత: మదిని కదిలించే ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని నిశ్శబ్దంగా షూట్ చేశాయి కొన్ని కెమెరాలు. శామ్సంగ్ సంస్థ వినికిడి లోపం ఉన్నవారి కోసం తాము రూపొందించిన వీడియో కాల్ సెంటర్ ప్రమోషన్ ఇది. ఒక యాడ్ ఏజెన్సీ ఈ మొత్తం కథను నడిపింది. మొహర్రమ్కి తెలియకుండా చుట్టుపక్కలవాళ్లకు సైన్ లాంగ్వేజ్ నేర్పి మరీ ఈ ఈ యాడ్ చేసేందుకు నెలలు పట్టింది. గత వారం యూట్యూబ్‌కి ఎక్కిన ఈ వీడియోని లక్షలాదిగా వీక్షకులు చూస్తున్నారని రూపకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారట! -
అందమూ.. బంధమూ!
ఇస్తాంబుల్ ఎంతో ప్రత్యేకం సంస్కృతి, ప్రగతిలో పోలిక అదే బాటలో భాగ్యనగరి పయనం ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఆ నగరాల సొంతం. ఇస్లామిక్ వాస్తురీతులు, కట్టడాలకు ప్రసిద్ధి చెందిన నగరాలవి. ఆధునికత ను సంత రించుకొని... సేవ, వ్యాపార, వాణిజ్య రంగాలతోపాటు అభివృద్ధిలోనూ శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ రెండు నగరాల్లో టర్కీ దేశంలో అతి పెద్దదైన ఇస్తాంబుల్ ఒకటి కాగా.. మరొకటి మన హైదరాబాద్. ఇస్తాంబుల్ తరహాలో గ్రేటర్‌లోని పర్యాటక, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం కేసీఆర్ తరచూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్-హైదరాబాద్ నగరాల చారిత్రక బంధం... అక్కడి విశేషాలపై ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్ షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నిలోఫర్, దుర్రేషహర్ కూడా టర్కీకి చెందినవారే. ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే... ఇస్తాంబుల్‌లో రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వాస్తు, శిల్పం, డిజైన్లు, కళాకృతుల వంటి అంశాలపై ఆసక్తి కలిగిన వారెందరో ఆ నగరాన్ని సందర్శిస్తున్నారు. మార్కెట్లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్యా పెరుగుతోంది. చారిత్రక కట్టడాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటుతో వాణిజ్య కార్యకలాపాలూ పెరిగాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షిం చడం ద్వారా వాణిజ్యం, టూరిజం, రవాణా రంగాల పురోభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో అవసరమని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. ఇదీ విశిష్టత టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్. విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన ఈ సిటీ ఆ దేశ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంపదకు నిలువెత్తు నిదర్శనం. దీని విస్తీర్ణం 5,343 చదరపు కిలోమీటర్లు. జనాభా 1.41 కోట్లు. ప్రపంచంలోనే ఆరోఅతిపెద్ద నగరం. పూర్వకాలంలో ఈ నగరాన్ని కాన్స్టెంట్ నోపుల్ అని పిలిచేవారు. రోమన్, బైజాంటియన్, ఒట్టోమాన్ చక్రవర్తులకు రాజధానిగా నిలిచింది. సిల్క్‌రోడ్, యురోపియన్ నగరాలకు అధునాతన రైలు సౌకర్యం, మధ్య ప్రాచ్య దేశాలతో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు దీని ప్రత్యేకత. 2012లో ఈ నగరాన్ని 11.6 మిలియన్ల విదేశీయులు సందర్శించారు. పర్యాటక పరంగా ప్రపంచంలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ప్రముఖ టర్కిష్ కంపెనీలు, మీడియా సంస్థలకు ఇది కేంద్రం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా మూడోవంతు. ఐదుసార్లు ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. వ్యాపార, వాణిజ్యం ఆలివ్ ఆయిల్, పొగాకు, రవాణా వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కేంద్రాలకు హబ్. ఇస్తాంబుల్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక సంస్థలు ఏటా 41.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాయి. మూడు పోర్టుల ద్వారా విదేశీ వాణిజ్యం సాగుతోంది. ఇందులో హైడాస్పరా, అంబ్రాలీ, జేటిన్బుర్నులు విశ్వవిఖ్యాతి చెందాయి. 1461 నుంచి కొనసాగుతున్న గ్రాండ్ బజార్ లో సంప్రదాయ, ఆధునిక అలంకరణ వస్తువులన్నీ లభ్యమవుతాయి. మహమూత్ పాషా బజార్, ఈజిప్షియన్ బజార్లు ఖ్యాతి పొందాయి. ప్రముఖ కట్టడాలివే.. హయా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్కాపీ ప్యాలెస్, బ్లూ మాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్లు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇస్తాంబుల్‌లో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్య ప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి చారిత్రక కట్టడాల్లో కనిపిస్తాయి. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కనిపిస్తుంది. స్థానిక పాలన ఇస్తాంబుల్ మెట్రో పాలిటన్ మున్సిపాల్టీ ఆధ్వర్యంలో నగర పాలన సాగుతోంది. దీని పరిధిలో 39 జిల్లాలు ఉన్నాయి. కుర్ధులు, గ్రీకులు, టర్కీలు, ఆర్మేనియన్లు, జ్యూస్‌లు ఇక్కడ నివసిస్తున్నారు. వాస్తు శిల్పాలు.. బైజాంటియన్, ఒట్టోమాన్ వాస్తురీతులకు దర్పణంగా నిలుస్తోంది. ఆరో శతాబ్దంలో బైజాంటియన్ చక్రవర్తి జస్టినియన్ నిర్మించిన హయా సోఫియా మసీదు, యేనిక్యామి మసీదు ప్రసిద్ధి చెందాయి. ప్రజా రవాణా నగరంలో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లు ఉన్నాయి. బస్సుల కోసం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం, రైళ్ల కోసం సంప్రదాయ రైల్వే ట్రామ్స్, మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కట్టడాలను పరిరక్షించాలి.. గ్రేటర్లో వారసత్వ కట్టడాలుగా మా సంస్థ అవార్డులు ప్రకటించిన జాబితాలో సుమారు 200 చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ పది కాలాలపాటు పరి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇస్తాంబుల్‌లో మాస్టర్‌ప్లాన్ అమలులో చారిత్రక కట్టడాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నగరంలోనూ అలాంటి చర్యలే చేపట్టాలి. వాటికి నష్టం వాటిల్లకుండానే ఆధునికీకరణ, రహదారులు, ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు ఏర్పాటు చేయాలి. - అనూరాధ రెడ్డి, హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ(ఇన్టాక్) కన్వీనర్ చారిత్రక విలువలను గుర్తించాం.. చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాల విలువను మా ప్రభుత్వం గుర్తించింది. మాస్టర్‌ప్లాన్‌లో వీటి పరిరక్షణకు ప్రత్యేకంగా నిధులు, యంత్రాంగాన్ని కేటాయించింది. వారసత్వ కట్టడాలను వీక్షించేందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇస్తాంబుల్ వస్తుండడం గర్వకారణంగా ఉంది. చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణ దిశగానే అభివృద్ధి గమనం ఉండాలన్నది టర్కీ ప్రభుత్వ లక్ష్యం. - మురాద్ ఓమెర్గ్లో, టర్కీ కాన్సులేట్ అధికారి, హైదరాబాద్ ఇదీ మన హైదరాబాద్... చారిత్రక కట్టడాలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌ను అచ్చు గుద్దినట్లు పోలి ఉండే నగరం హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాదు. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోన్న గ్రేటర్‌లోనూ ఇస్తాంబుల్‌ను పోలిన చారిత్రక కట్టడాలు బోలెడున్నాయి. గోల్కొండకోట, చార్మినార్, ఓయూ, మక్కా మసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కుపైగా చారిత్రక కట్టడాలకు నెలవిది. ఇటీవల రహదారుల విస్తరణ, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్‌ప్లాన్ పనులతో కొన్ని చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటికి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం యత్నిస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి నెలకొంది. పాతనగరంలో చారిత్రక ఆనవాళ్లు బోలెడున్నాయి. ఇక హైటెక్ సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవ, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి. -
1,200 ఏళ్ల ట్యాబ్లెట్!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో మనం చూస్తున్న ‘ట్యాబ్లెట్ కంప్యూటర్’ను వందల ఏళ్ల క్రితమే వాడినట్లు తెలుస్తోంది. ట్యాబ్లెట్ కంప్యూటర్‌కు సమానమైన 1200 ఏళ్లనాటి పురాతన వస్తువు టర్కీ పురావస్తు శాస్త్రవేత్తలకు తవ్వకాల్లో దొరికింది. ఇస్తాంబుల్‌కు సమీపంలోని మెనికపిలో బయల్పడిన ఓడలో ఇది దొరికింది. చెక్కతో రూపొందించిన ఈ వస్తువును నాలుగో శతాబ్దంలో బైజంటైన్ చక్రవర్తి థియోడోసియస్-1 నాటి కాలంలో రూపొందించి ఉంటారని భావిస్తున్నారు. ఆధునిక ట్యాబ్లెట్ ఉన్న ఏడు అంగుళాల పరిమాణంలోనే ఇది ఉండటం గమనార్హం. ఐదు దీర్ఘచతురస్రాకార ప్యానెల్స్‌లో అందంగా ముస్తాబుచేసిన పెట్టెలో దీన్ని అమర్చారు. ఈ ప్యానెల్స్‌లో రాసుకోవడానికి అనువుగా ఉందని, దానిపైన గ్రీక్ లిపి కనిపిస్తోందని ‘డిస్కవరీ న్యూస్’ వెల్లడించింది. -
ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ వాటా విక్రయం
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల విక్రయం పూర్తయినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. టర్కీలోని ఇంస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 40 శాతం వాటాను రూ.1,740 కోట్లకు విక్రయించామని, దీనికి సంబంధించిన మొత్తం అందుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు జీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వాటాను మరో భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ)కి విక్రయించింది. దీంతో జీఎంఆర్‌కి రూ. 1,740 కోట్ల మూలధనం చేతికి రావడమే కాకుండా, రూ.1,412 కోట్ల రుణ భారం తగ్గనుంది. ఈ ఒప్పందం పూర్తి కావడంపై జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎంఆర్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విదేశీ ఆస్తుల విక్రయించడంలో మా సమర్థతో మరోసారి రుజువయ్యిందన్నారు. -
బోటు తిరగడి 10 మంది సైనికులు మృతి
సముద్రంలో సైనికులతో వెళ్తున్న బోటు తిరగబడింది. ఆ ఘటనలో 10 మంది సైనికులు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. ఇస్తాంబుల్ దేశంలోని ఎజియన్ ప్రావెన్స్లో ఈజామీర్ సమీపంలోని సముద్రంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ఆ బోటులో ప్రయాణిస్తున్న పలువురు పౌరులతోపాటు, పడవ నడిపే వారి ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదని తెలిపారు. వారి కోసం అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. మరో ఆరుగురు సైనికులు సముద్రంలోకి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారని వివరించారు. ఆ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. పరిమితికి మించి బోటులోకి ప్రయాణికులు ఎక్కడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ దుర్ఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుందని స్థానిక పత్రిక హూరియత్ మంగళవారం వెల్లడించింది. -
మాలె ఎయిర్‌పోర్టును వదులుకోం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివాదాస్పదమైన మాలె విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు సిద్ధమని జీఎంఆర్ గ్రూపు వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం తిరిగి తమను ఆహ్వానిస్తే విమానాశ్రయ నిర్వహణ చేపడతామని గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు స్పష్టం చేశారు. గురువారమిక్కడ టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాలె విమానాశ్రయం అభివృద్ధి, కొత్త టెర్మినల్ నిర్మాణం విషయంలో జీఎంఆర్ విజయవంతమైంది. రాజకీయ కారణాల వల్లే నిర్వహణ బాధ్యత నుంచి వైదొలిగాం. అక్కడి ప్రభుత్వం నుంచి 1.4 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ దాఖలు చేసిన మధ్యవర్తిత్వ కేసు సింగపూర్ కోర్టులో నడుస్తోంది’ అని చెప్పారు. 50 కోట్ల డాలర్లకుపైగా విలువైన మాలె కాంట్రాక్టును గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టును అకారణంగా రద్దు చేశారంటూ సింగపూర్ కోర్టును జీఎంఆర్ ఆశ్రయించింది. ‘ఇస్తాంబుల్’లో వాటా విక్రయించం.. సబీహ గోక్సెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని మల్లికార్జునరావు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో ఉన్న వాటాను విక్రయించే ఆలోచన ఏదీ లేదని పేర్కొన్నారు. వాటాల నిర్వహణ తమ వ్యూహమని చెప్పారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపుకు 40%, మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు 20 శాతం, మిగిలిన వాటా లిమాక్ హోల్డింగ్స్‌కు ఉంది. రూ.40 వేల కోట్లకుపైగా రుణ భారంతో ఉన్న జీఎంఆర్, అప్పుల ను తగ్గించుకోవడానికి ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉన్న మొత్తం వాటాను విక్రయిస్తున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో చైర్మన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను భారత్‌లోగానీ, ఇతర దేశాల్లోగానీ ఎక్స్చేంజీల్లో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం దేశ, విదేశీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్నామని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టు చేజిక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సమ్మిట్‌లో మై హోమ్ గ్రూపు చైర్మన్ జె.రామేశ్వర్ రావు, వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీని రాజు మాట్లాడారు.