1,200 ఏళ్ల ట్యాబ్లెట్!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో మనం చూస్తున్న ‘ట్యాబ్లెట్ కంప్యూటర్’ను వందల ఏళ్ల క్రితమే వాడినట్లు తెలుస్తోంది. ట్యాబ్లెట్ కంప్యూటర్‌కు సమానమైన 1200 ఏళ్లనాటి పురాతన వస్తువు టర్కీ పురావస్తు శాస్త్రవేత్తలకు తవ్వకాల్లో దొరికింది. ఇస్తాంబుల్‌కు సమీపంలోని మెనికపిలో బయల్పడిన ఓడలో ఇది దొరికింది.
చెక్కతో రూపొందించిన ఈ వస్తువును నాలుగో శతాబ్దంలో బైజంటైన్ చక్రవర్తి థియోడోసియస్-1 నాటి కాలంలో రూపొందించి ఉంటారని భావిస్తున్నారు. ఆధునిక ట్యాబ్లెట్ ఉన్న ఏడు అంగుళాల పరిమాణంలోనే ఇది ఉండటం గమనార్హం. ఐదు దీర్ఘచతురస్రాకార ప్యానెల్స్‌లో అందంగా ముస్తాబుచేసిన పెట్టెలో దీన్ని అమర్చారు. ఈ ప్యానెల్స్‌లో రాసుకోవడానికి అనువుగా ఉందని, దానిపైన గ్రీక్ లిపి కనిపిస్తోందని ‘డిస్కవరీ న్యూస్’ వెల్లడించింది.