ఇస్తాంబుల్ : కన్నకొడుకంటే ఇష్టం లేదంటూ ఒక ఫుట్‌బాల్ ఆటగాడు తన కొడుకును అతి కిరాకంగా చంపిన ఘటన టర్కీలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కెవెర్ టోక్టాస్ టర్కీ ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్నాడు. ఏప్రిల్ 23న కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న కారణంగా ఐదేండ్ల కొడుకు ఖాసిమ్‌తో పాటు టోక్టాస్ నార్త్ వెస్ట్రన్ ఫ్రావిన్స్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. అయితే ఖాసిమ్‌తో పాటు టోక్టాస్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి నెగెటివ్ అనే వచ్చింది. అయితే లక్షణాలు బయటపడే అవకాశాలు ఉండొచ్చన్న కారణంతో తండ్రితో పాటే ఖాసీమ్‌ను కూడా ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఈ మే4న ఖాసిమ్‌కు చికిత్స చేస్తున్న గదిలోకి వెళ్లిన టోక్టాస్.. అతడి ముఖాన్ని దిండుతో నులిమి ఊపిరి ఆడకుండా చంపేశాడు. తర్వాత తనకేం తెలియదన్నట్లు డాక్టర్లకు చెప్పాడు.
వైద్యులు బాలుడిని ఐసీయూకు తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. టోక్టాస్ తన కొడుకు కరోనాతో చనిపోయాడని అందరిని నమ్మించి ఖాసీమ్ మృతదేహాన్ని ఖననం చేశాడు. అయితే కొడుకు చనిపోయిన 11 రోజుల తర్వాత పశ్చాత్తాప పడిన టోక్టాస్ పోలీసులకు అసలు నిజం చెప్పాడు. ' నా చిన్న కొడుకు ఖాసిమ్ అంటే అసలు ఇష్టం లేదు. ఈ కారణంతోనే వాడిని చంపేశా. కరోనా నేపథ్యంలో ఆ లక్షణాలతోనే చనిపోయాడని నేనే అందరికి చెప్పా. నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవు'అని టోక్టాస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టోక్టాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
సున్నాతో ముగిసింది...
కరోనా సోకి బీజేపీ మెర్చా నాయకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment